IPL-6
-
చండీలాపై జీవిత కాల నిషేధం
-
చండీలాపై జీవిత కాల నిషేధం
♦ హికేన్ షాపై ఐదేళ్లు ♦ బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం ముంబై: ఐపీఎల్-6లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆఫ్ స్పిన్నర్ అజిత్ చండీలాపై జీవిత కాల నిషేధం విధించారు. సోమవారం శశాంక్ మనోహర్ నేతృత్వంలోని బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. అలాగే సహచర ఆటగాడిని ఫిక్సింగ్ కోసం సంప్రదించినందుకు ముంబైకి చెందిన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ హికేన్ షాపై ఐదేళ్ల నిషేధం విధించారు. 2013లో జరిగిన ఐపీఎల్ ఎనిమిదో సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన చండీలా మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేసేందుకు డబ్బులు తీసుకోవడంతో పాటు ఉద్దేశపూర్వకంగా పేలవ ప్రదర్శన కనబరచడం, మరో ఆటగాడితో ఫిక్సింగ్ చేయించాలని ప్రయత్నించిన ఆరోపణల్లో దోషిగా తేలడంతో బోర్డు కఠిన చర్య తీసుకుంది. ‘బీసీసీఐ అవినీతి వ్యతిరేక కోడ్‌లోని పలు నిబంధనల ప్రకారం చండీలాపై జీవిత కాల నిషేధం విధించాం. ఇక తను బోర్డుకు సంబంధించిన ఎలాంటి కార్యకలాపాల్లోనూ పాల్గొనడానికి వీల్లేదు. దేశవాళీల్లో సహచర ఆటగాడిని ఫిక్సింగ్ చేయాల్సిందిగా ఒత్తిడి చేసినందుకు హికేన్ షాపై ఐదేళ్ల నిషేధం పడింది. క్రికెట్లో స్వచ్ఛత కోసం మేం పాటుపడుతున్నాం. ఎలాంటి అవినీతి చర్యలకు దిగినా పరిస్థితి సీరియస్‌గా ఉంటుంది’ అని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. మరోవైపు పాక్ అంపైర్ అసద్ రవూఫ్ తనపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలపై స్పందించేందుకు సోమవారం నాటి సమావేశానికి హాజరుకాలేదు. అయితే ఈ విచారణ నిస్పాక్షికంగా జరగడం లేదని, తిరిగి మరో విచారణ అధికారి ఆధ్వర్యంలో మొదటినుంచి జరపాలని లేఖ రాశారు. అయితే కమిటీ దీన్ని తిరస్కరించింది. వచ్చే నెల 9లోగా ఫిక్సింగ్ ఆరోపణలపై రాతపూర్వక సమాధానాన్ని పంపించేందుకు ఆయనకు ఆఖరి అవకాశాన్నిస్తున్నట్టు పేర్కొంది. అదే నెల 12న రవూఫ్‌పై నిర్ణయాన్ని ప్రకటిస్తారు. -
ఆ ఇద్దరూ బెట్టింగ్ చేశారు
గురునాథ్, రాజ్ కుంద్రాలపై ఆధారాలున్నాయి ► శిక్షను ఖరారు చేసేందుకు త్రిసభ్య కమిటీ ► ఆరు వారాల్లో బీసీసీఐ ఎన్నికలు జరగాలి ► చెన్నైని వదులుకుంటేనే శ్రీనివాసన్ పోటీ చేయాలి ► ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌లపై సుప్రీం కోర్టు తుది తీర్పు న్యూఢిల్లీ: ఐపీఎల్-6లో రాజస్తాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రా, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్‌కు పాల్పడ్డారని సుప్రీం కోర్టు నిర్ధారించింది. ఈ ఇద్దరికీ విధించాల్సిన శిక్షను నిర్ణయించేందుకు ముగ్గురు మాజీ న్యాయమూర్తులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఇద్దరితో పాటు చెన్నై, రాజస్తాన్ జట్ల భవితవ్యాన్ని కూడా ఈ కమిటీ ఆరు నెలల్లో నిర్ణయించాలని ఆదేశించింది. జస్టిస్ టీఎస్ ఠాకూర్, ఎఫ్ఎంఐ ఖలీఫుల్లాలతో కూడిన బెంచ్ 138 పేజీల తమ తుది తీర్పును దాదాపు గంటన్నర పాటు చదివి వినిపించింది. తీర్పులోని ముఖ్యాంశాలు ⇒ గురునాథ్, కుంద్రాలకు శిక్షను ఖరారు చేసేందుకు మాజీ చీఫ్ జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు. ఇందులో మాజీ జడ్జిలు అశోక్ భాను, ఆర్.వి.రవీంద్రన్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ముందుగా ఈ ఇద్దరితో పాటు జట్లకు నోటీసులు ఇచ్చి ఆరు నెలల్లోగా నివేదికను కోర్టుకు అందించాలి. ⇒ బీసీసీఐ రాజ్యాంగంలో ఎలాంటి మార్పులు తీసుకోవాలో కూడా కమిటీ సూచిస్తుంది. గతంలో ముద్గల్ కమిటీ తనకు ముందుగా నోటీసులు ఇవ్వలేదనే కుంద్రా వాదన పస లేనిది. ⇒ ఐపీఎల్లో ఫ్రాంచైజీ కొనుగోలు కోసం బీసీసీఐ 6.2.4 నిబంధనకు సవరణ చేయడం దారుణం. దీని ద్వారా పర స్పర విరుద్ధ ప్రయోజనాల ఘర్షణ చోటుచేసుకుంది. ఈ కేసులో ఇదే పెద్ద విలన్.. ఈ నిబంధనకు స్వస్తి పలకాలి. ⇒ ఆరు వారాల్లో బీసీసీఐ ఏజీఎం జరుపుకోవచ్చు. అవసరమైతే ఎన్నికలూ నిర్వహించుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ యజమానిగా వ్యాపార ప్రయోజనాలు ఉన్నంత వరకు ఎన్.శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు. చెన్నైని వదులుకుంటే ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. సీఎస్కే యజమానిగా ఉండాలా? బీసీసీఐ అధ్యక్షుడిగానా ఏదో ఒకటి శ్రీని నిర్ణయించుకోవాలి. ఇతర బోర్డు అధికారులు కూడా ఐపీఎల్లో వాణిజ్య ప్రయోజనాలున్నంత వరకు ఎన్నికలకు దూరంగా ఉండాలి. ⇒ గురునాథ్‌ను కాపాడేందుకు శ్రీనివాసన్ ప్రయత్నించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ⇒ ఓ బుకీతో సంబంధాలు కలిగిన ఐపీఎల్ సీవోవో సుందర్ రామన్‌పై కూడా త్రిసభ్య కమిటీ విచారణ జరుగుతుంది. దోషిగా తేలితే శిక్ష పడుతుంది. బోర్డు ప్రైవేట్ సంస్థ కాదు ఈ కేసు తీర్పు సందర్భంగా బీసీసీఐ తీరును సుప్రీం కోర్టు ప్రశ్నించింది. కోట్లాది మంది భారతీయులకు క్రికెట్‌పై ఉన్న ఆసక్తిని, మమకారాన్ని సొమ్ము చేసుకుంటూ కార్యకలాపాలు నడుపుతున్నప్పుడు ఇది ప్రైవేట్ సంస్థ ఎలా అవుతుందని నిలదీసింది. బోర్డు కార్యకలాపాలన్నీ ప్రజలకు సంబంధించినవేనని, తమ అధికారాలను సవాల్ చేసే అధికారం ప్రభుత్వాలకు లేదని బోర్డు వాదించడం అర్థరహితమని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం ఇస్తున్న భారతరత్న, పద్మ అవార్డులను బీసీసీఐ సూచనల మేరకు క్రికెటర్లకు ఇస్తున్నారని న్యాయస్తానం గుర్తు చేసింది. ఈ మొత్తం కేసులో విచారణ చేపట్టి నివేదిక అందించిన ముద్గల్... కోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు అన్ని క్రీడాసంఘాలకు వర్తిస్తాయని అభిప్రాయపడ్డారు. నిర్ణయం ఆయనదే సుప్రీం కోర్టు తీర్పుపై బీసీసీఐ ఆచితూచి వ్యవహరిస్తోంది. కోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని ఆరు వారాల్లోపు ఎన్నికలకు వెళతామని ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీనివాసన్‌కు క్లీన్ చీట్ ఇవ్వడంపై బోర్డు వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే చెన్నై జట్టును వదులుకోవడమా? లేక బోర్డు పదవిని వదులుకోవడమా? అనే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది ఆయనే అని బోర్డు పెద్దల్లో ఒకరు వ్యాఖ్యానించారు. ప్రతి అంశంలోనూ న్యాయసలహా తీసుకున్నాకే నిర్ణయాలు తీసుకోవాలని బోర్డు పెద్దలు భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై శ్రీనివాసన్ స్పందించేందుకు నిరాకరించారు. అయితే ఆయన ప్రత్యర్థి వర్గాలు మాత్రం... తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని సంబరాలు చేసుకున్నాయి. -
చండీలాకు మరో వారం గడువు
ముంబై: ఐపీఎల్-6లో స్పాట్‌ఫిక్సింగ్‌కు పాల్పడిన రాజస్థాన్ రాయల్స్ మాజీ ఆటగాడు అజిత్ చండీలా తన వివరణ ఇచ్చేందుకు బీసీసీఐ ఈ నెల 12 వరకు గడువిచ్చింది. జైలు నుంచి బెయిలుపై విడుదలైన చండీలా బుధవారం బోర్డు క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యాడు. ఈ సందర్భంగా తాను లిఖితపూర్వక వివరణ ఇచ్చేందుకు మరింత గడువు కావాలన్న చండీలా విన్నపాన్ని ఎన్.శ్రీనివాసన్ నేతృత్వంలోని క్రమశిక్షణ కమిటీ మన్నించింది. గత ఏడాది ఐపీఎల్లో చండీలాతోపాటు భారత టెస్టు క్రికెటర్ శ్రీశాంత్, అంకిత్ చవాన్, అమిత్‌సింగ్, సిద్ధార్థ్ త్రివేదిలు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు రవి సవాని నేతృత్వంలోని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం నిర్ధారించిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీశాంత్, చవాన్లపై జీవితకాల నిషేధం, త్రివేదిపై ఏడాది, అమిత్‌సింగ్‌పై ఐదేళ్లపాటు నిషేధం విధించిన బీసీసీఐ.. చండీలాపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే తాను నిర్దోషినని, ఎటువంటి తప్పూ చేయలేదని, తనకు అండగా నిలిచే వారెవరూ లేరని చండీలా వాపోయాడు. బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సివుందన్నాడు. -
ఫిక్సింగ్ ఉదంతాన్నిమర్చిపోతున్నాం: ద్రవిడ్
జైపూర్: ఐపీఎల్-6లో బయటపడ్డ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతాన్ని తాము ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. జట్టు సమష్టిగా ముందుకు సాగుతోందని చెప్పాడు. ‘గత సీజన్ దుష్ర్పభావం మాపై లేదు. వాటన్నింటిని పక్కనబెట్టాం. క్రమశిక్షణ చర్యలు కూడా పరిష్కారమయ్యాయి. ఇప్పుడు మా జట్టులో 15 మంది ఆటగాళ్లు, సహాయక సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడే ఫిక్సింగ్ ఎపిసోడ్‌పై చర్చించుకున్నాం. ఇక దాన్ని పక్కనబెట్టి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. ఓ జట్టుగా మా అభిమానులకు ఆనందాన్ని కలిగించాలి. ఇందుకోసం మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాం’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టయిన రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
యువీ... అదే జోరు
బెంగళూరు: ఐపీఎల్-6 అనంతరం తొలిసారి బ్యాట్ పట్టిన డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తన పూర్వపు ఫామ్‌ను అందుకున్నాడు. చాలా రోజుల తర్వాత మైదానంలో అసలు సిసలైన ఆటతీరు చూపుతూ బౌండరీల వర్షం కురిపించాడు. తన ఫామ్‌కు ఎలాంటి ఢోకా లేదంటూ ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ (89 బంతుల్లో 123; 8 ఫోర్లు; 7 సిక్స్) సెంచరీతో అదరగొట్టాడు. దీంతో చిన్నస్వామి స్టేడియంలో వెస్టిండీస్ ‘ఎ’ జట్టుతో జరిగిన తొలి అనధికార వన్డేలో భారత్ ‘ఎ’ జట్టు 77 పరుగుల తేడాతో నెగ్గింది. యువీ విజృంభణకు యూసుఫ్ పఠాన్ (32 బంతుల్లో 70 నాటౌట్; 4 ఫోర్లు; 6 సిక్స్‌లు) తుఫాన్ ఆటతీరు తోడవ్వడంతో భారత్ నిర్ణీత 42 ఓవర్లలో నాలుగు వికెట్లకు 312 పరుగులు సాధించింది. మన్దీప్ సింగ్ (78 బంతుల్లో 67; 7 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 39.1 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటయ్యింది. దేవ్‌నారాయణ్ (63 బంతుల్లో 57; 6 ఫోర్లు; 1 సిక్స్), నర్స్ (50 బంతుల్లో 57; 6 ఫోర్లు; 2 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. నర్వల్, వినయ్, రాహుల్ శర్మ, యూసుఫ్‌లకు తలా రెండేసి వికెట్లు దక్కాయి. మైదానం అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో మ్యాచ్ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో మ్యాచ్‌ను 42 ఓవర్లకు కుదించారు. రెండో వన్డే ఇదే వేదికపై మంగళవారం జరుగుతుంది. యువీ, పఠాన్ దూకుడు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ రెండో ఓవర్లోనే ఫామ్‌లో ఉన్న ఉన్ముక్త్ చంద్ (1) వికెట్‌ను కోల్పోయింది. కొద్ది సేపటికే మరో ఓపెనర్ రాబిన్ ఉతప్ప (37 బంతుల్లో 23; 2 ఫోర్లు) కూడా రస్సెల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఈ దశలో మన్దీప్ సింగ్, యువీ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. ఎనిమిది ఓవర్లపాటు నిదానంగా ఆడిన ఈ జోడి ఆ తర్వాత జూలు విది ల్చింది. యువీ ఆచితూచి ఆడినా మన్దీప్ మాత్రం వేగంగా ఆడుతూ 57 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అటు యువీ పూర్తి ఫిట్‌గా కనిపించడమే కాకుండా క్రీజు మధ్య వేగంగా పరిగెత్తుతూ పరుగులు సాధించాడు. ఐపీఎల్-6లో పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొని సీనియర్ జట్టులో చోటు కోల్పోగా ఫ్రాన్స్‌లో తీసుకున్న కఠిన శిక్షణ వృథా కాలేదు. మన్దీప్ అవుట్ కాగానే బాధ్యతను చేతుల్లోకి తీసుకున్నాడు. వీరిద్దరి మధ్య మూడో వికెట్‌కు 100 పరుగులు జత చేరాయి. తొలి బౌండరీ కోసం 39 బంతులు ఆడిన యువీ 61 బంతుల్లో అర్ధ సెంచరీ చేయగా ఆ తర్వాత 19 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు. మిల్లర్ వేసిన 35వ ఓవర్లో వరుసగా 6, 4, 6, 6తో 23 పరుగులు సాధించాడు. ఇదే ఊపులో 37వ ఓవర్లో యూసుఫ్ పఠాన్ 6, 4, 4, 6, 6తో విరుచుకుపడడంతో 28 పరుగులు వచ్చాయి. ఆ తర్వాతి ఓవర్ యువీ వంతు.. ఇందులో తను 6, 4, 4, 6, 4 పరుగులు రాబట్టడంతో కేవలం 4 ఓవర్లలోనే 85 పరుగులు సమకూరాయి. ఇదే ఓవర్లో యువరాజ్ 80 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు. 40వ ఓవర్లో బోనర్ వేసిన ఫుల్ టాస్ బంతికి యువీ క్యాచ్ అవుటయ్యాడు. ఈ జోడి ఐదో వికెట్‌కు 55 బంతుల్లోనే 125 పరుగులు సాధించింది. చివరి ఓవర్లో పఠాన్ మూడు సిక్స్‌లు బాదడంతో భారత్ ‘ఎ’ స్కోరు 300 పరుగులు దాటింది. భారీ లక్ష్యమైనప్పటికీ విండీస్ ‘ఎ’ బెదరకుండా బ్యాటింగ్ ఆరంభించింది. తొలి మూడు ఓవర్లలో పరుగులన్నీ ఫోర్ల ద్వారానే రాబట్టింది. నాలుగో ఓవర్లో బోనర్ (15 బంతుల్లో 16; 4 ఫోర్లు) వికెట్‌ను వినయ్ పడగొట్టాడు. ఆ తర్వాత వేగంగా ఆడేందుకు ప్రయత్నించి పరుగులు రాబట్టినా వికెట్లు కూడా కోల్పోవడంతో విండీస్ చిక్కుల్లో పడింది. మిడిలార్డర్లో దేవ్‌నారాయణ్, చివర్లో నర్స్ శాయశక్తులా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. స్కోరు వివరాలు భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) కమ్మిన్స్ (బి) రస్సెల్ 23; చంద్ (సి) థామస్ (బి) కమ్మిన్స్ 1; మన్దీప్ సింగ్ (బి) మిల్లర్ 67; యువరాజ్ (సి) బీటన్ (బి) బోనర్ 123; యూసుఫ్ నాటౌట్ 70; నమన్ ఓజా నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (42 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 312 వికెట్ల పతనం: 1-8; 2-47; 3-147; 4-272. బౌలింగ్: కమ్మిన్స్ 9-1-50-1; బీటన్ 8-0-72-0; రస్సెల్ 4-0-17-0; మిల్లర్ 9-0-62-1; నర్స్ 6-0-58-0; దేవ్‌నారాయణ్ 4-0-20-0; బోనర్ 2-0-30-1. విండీస్ ‘ఎ’ ఇన్నింగ్స్: బోనర్ (సి) నమన్ ఓజా (బి) వినయ్ 16; పావెల్ (సి) నర్వల్ (బి) వినయ్ 17; ఎడ్వర్డ్స్ (సి) నమన్ ఓజా (బి) నర్వల్ 19; దేవ్‌నారాయణ్ (బి) మన్దీప్ (బి) రాహుల్ 57; ఫ్లెచర్ (సి) ఉన్ముక్త్ (బి) యూసుఫ్ 29; థామస్ ఎల్బీడబ్ల్యు (బి) యూసుఫ్ 10; రస్సెల్ (రనౌట్) 1; నర్స్ (సి) నమన్ ఓజా (బి) నర్వల్ 57; మిల్లర్ (సి అండ్ బి) రాహుల్ 2; బీటన్ హిట్ వికెట్ (బి) ఉన్ముక్త్ 15; కమ్మిన్స్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (39.1 ఓవర్లలో ఆలౌట్) 235 వికెట్ల పతనం: 1-24; 2-47; 3-58; 4-112; 5-139; 6-140; 7-176; 8-181; 9-205; 10-235. బౌలింగ్: ఉనాద్కట్ 6-0-41-1; నర్వల్ .1-0-28-2; వినయ్ 7-0-42-2; రాహుల్ 9-0-57-2; యూసుఫ్ 7-0-47-2; యువరాజ్ 4-0-17-0. -
అభిమానులు మోసపోయారు
ముంబై: అంతర్జాతీయంగా శాఖోపశాఖలుగా విస్తరించిన ఐపీఎల్-6 బెట్టింగ్ ఉదంతం వల్ల క్రికెట్‌ను విపరీతంగా ఇష్టపడే అభిమానులు మోసపోయారని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. బెట్టింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జైపూరి బ్రదర్స్ పవన్, సంజయ్‌లు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ సాధన జదేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ యాక్టర్ విందూ సింగ్, పాక్ అంపైర్ అసద్ రవూఫ్‌లతో కలిసి జైపూరి బ్రదర్స్ బెట్టింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. గాంబ్లింగ్ నిరోధక చట్టం ప్రకారం తమ క్లయింట్ చేసిన నేరానికి బెయిల్ ఇచ్చే అర్హత ఉందని సీనియర్ న్యాయవాది అమిత్ దేశాయ్... బ్రదర్స్‌లో ఒకరి తరఫున వాదించారు. అయితే దీనిపై స్పందించిన జస్టిస్ జదేవ్... ‘బెయిలబుల్ నేరమే అయినప్పటికీ దాని వల్ల సాధారణ ప్రజలు చాలా మంది మోసపోయారు’ అని అన్నారు.