IPL fixing
-
ఫిక్సింగ్ ఆరోపణల ప్రభావంపై ధోనీ
సాక్షి, చెన్నై : ఐపీఎల్ ఫిక్సింగ్ ఆరోపణలు చెన్నై సూపర్ కింగ్స్ పై ప్రభావం చూపబోవని టీమిండియా స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ పేర్కొన్నాడు. సుమారు రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ టీం తిరిగి ఐపీఎల్లో ఆడబోతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎస్కే తరపున చెన్నైలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ధోనీ ప్రసంగించాడు. ‘‘సీఎస్కే జట్టులో తప్ప మరో ఫ్రాంఛైజీకి ఆడాలనే ఆలోచన నాకు ఎన్నడూ రాలేదు. చెన్నై నాకు మరో ఇల్లు. ఇక్కడి అభిమానులు నన్ను ఎంతగానో ఆదరించారు. ఈ ఐపీఎల్ సీజన్లో సత్తా చాటి తీరతాం. ఫిక్సింగ్ ఆరోపణలు మా బ్రాండ్‌పై ఎలాంటి ప్రభావం చూపించవు’’ అని ధోనీ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తున్న యువ ఆటగాళ్లు ఉన్నారని.. ఒకవేళ వేలంలో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు చేజారితే కుర్రాళ్లతోనే ముందుకు వెళ్లేందుకు సిద్ధమని ధోనీ తెలిపాడు. కాగా, ఐపీఎల్ ఫిక్సింగ్ కుంభకోణంలో లోథా కమిటీ నివేదిక ఆధారంగా చెన్నై సూపర్ కింగ్స్‌తోపాటు, రాజస్థాన్ రాయల్స్ లపై రెండేళ్ల పాటు బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. రజనీతో ధోనీ భేటీ...? చెన్నై పర్యటనలో భాగంగా ఎంఎస్‌ధోనీ.. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాత్రి 9గంటలకు పోయెస్ గార్డెన్‌లోని రజనీ ఇంటికి ధోనీ వెళ్లనున్నాడన్న వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. వీరిద్దరు సమావేశం కావటం ఖాయమనే మీడియా కథనాలు చెబుతున్నాయి. రజనీ రాజకీయ అరంగ్రేటం నేపథ్యంలో ధోనీ ఆయనకు అభినందనలు తెలియజేసే అవకాశం ఉందని ఆయా కథనాల సారాంశం. -
గతేడాది రాహుల్, ప్రియాంకలను కలిశా: మోదీ
న్యూఢిల్లీ : ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ నుంచి మరో బుల్లెట్ వెలువడింది. ఎవరెవరు తనను కలిసింది, ఎక్కడ సమావేశమైంది తదితర విషయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్న లలిత్ మోదీ తాజాగా మరో కీలక విషయం వెల్లడించారు. తాను బీజేపీ నేతలను మాత్రమే కలవలేదని, కాంగ్రెస్ అగ్రనేతలతోనూ టచ్‌లో ఉన్నానని లలిత్ తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె-అల్లుడు ప్రియాంక రాబర్ట్వాధ్రాలను తాను కలుసుకున్నానని లలిత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తో కూడా తాను భేటీ అయ్యానని లలిత్ తెలిపారు. గత ఏడాది లండన్‌లో ఆ ముగ్గురితో సమావేశం అయ్యానని తెలిపిన లలిత్ ఆ సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు కేంద్రంలో అధికారంలో ఉందని గుర్తు చేశారు. ఆనాటి సమావేశం గురించి ఆ ముగ్గురు వ్యక్తులు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. తాను వారిని రెస్టారెంట్ లో కలుసుకున్నప్పుడు గాంధీ కుటుంబీకులతో పాటు టిమ్మీ సర్నా ఉన్నాడని, అతడితో తన కాంటాక్ట్ నంబర్ ఉందన్నాడు. అతడికి కాల్ చేస్తే నేను ఏ విధంగా స్పందించానన్నది తెలుస్తుందని రెండో ట్వీట్ లలో మోదీ పేర్కొన్నాడు. కాగా లలిత్ మోదీకి వీసా పత్రాలకు సాయం చేశారని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలు తమ పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. 1/3 Happy to meet the Gandhi Family http://t.co/43iiC6mL9w in London. I had run into Robert and Priyanka separately pic.twitter.com/JTnaE6eX1A — Lalit Kumar Modi (@LalitKModi) June 25, 2015 2/3 in a resturant - they were with Timmy Sarna. He has my no. They can call me. Will tell them what I feel about pic.twitter.com/uz4SBMayXS — Lalit Kumar Modi (@LalitKModi) June 25, 2015 3/3 them exactly. Will mince no words. Will make no deal. But tell them witch hunt will now make them realize I was -
ఐపీఎల్ కౌన్సిలే చర్య తీసుకుంటుంది
ముద్గల్ కమిటీ నివేదికలో తేడాలున్నాయి కోర్టుకు తెలిపిన బీసీసీఐ న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫిక్సింగ్పై సుప్రీం కోర్టుకు సమర్పించిన ముద్గల్ కమిటీ నివేదికలో తేడాలున్నాయని సుప్రీం కోర్టుకు బీసీసీఐ తెలిపింది. ఈ కమిటీ నివేదికపై బోర్డు తమ స్పందనను గురువారం తెలిపింది. త్రిసభ్య కమిటీ త మ నివేదికను రెండు భాగాలుగా కోర్టుకు సమర్పించింది. రిటైర్డ్ జస్టిస్ ముద్గల్, అడిషినల్ సొలిసిటర్ జనరల్ నాగేశ్వర్ రావు ‘వాల్యూమ్ వన్’ పేరిట ఓ నివేదిక ఇవ్వగా.. అస్సాం క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఉపాధ్యక్షుడు, ఐపీఎల్ పాలకమండలి సభ్యుడు నీలయ్ దత్తా అనుబంధ నివేదిక ఇచ్చారు. అయితే బెట్టింగ్‌లో గురునాథ్ పాత్ర స్పష్టంగా ఉందని, ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలిందని కాబట్టి కోర్టు ఆయనపై తదుపరి చర్యలు తీసుకోవాలని ముద్గల్ నివేదిక సూచించింది. కానీ గురునాథ్, చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ రూల్స్‌ను అతిక్రమించినట్టు తేలితే వారిపై చర్య తీసుకోవాల్సింది కూడా లీగ్ పాలక మండలేనని దత్తా తన నివేదికలో పేర్కొన్నారు. దీనికి బోర్డు మద్దతిస్తూ ఇదే విషయాన్ని కోర్టుకు తెలిపింది. ‘ఐపీఎల్ ఫ్రాంచైజీ ఒప్పందం క్లాజు 11.3ని చెన్నై జట్టు అతిక్రమించిన విషయంపై ఈ రెండు నివేదికలు విభేదిస్తున్నాయి. ముద్గల్ నివేదిక చెన్నై జట్టును దోషిగా తేలిస్తే... దత్తా రిపోర్ట్ మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది. గురునాథ్ ఆ జట్టుకు యజమాని అని ఎక్కడా పేర్కొనలేదు. కాబట్టి ఫ్రాంచైజీ ఒప్పందం ప్రకారం అతడిని యజమానిగా చెప్పుకునే అర్హత లేదని దత్తా తన నివేదికలో స్పష్టం చేశారు’ అని బీసీసీఐ కోర్టుకు తెలిపింది.