చెరువులో శవమైతేలిన ఇంటర్ విద్యార్థి
కాణిపాకం(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా ఐరాల మండలం పందిగొట్టూరు గ్రామానికి చెందిన రాజేష్(19) అనే ఇంటర్ విద్యార్థి అనుమానాస్పదస్థితిలో శనివారం ఉదయం చెరువులో శవమై తేలాడు. ఆర్ఎంపీ వైద్యునిగా పనిచేస్తున్న రాజేంద్ర కుమారుడైన రాజేష్ రెండు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు.
ఈ మేరకు ఐరాల పోలీస్ స్టేషన్లో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం పందిగొట్టూరు శివారులోని చెరువులో రాజేష్ శవం తేలడంతో చూసిన స్థానికులు కుటుంబసభ్యులకు తెలియజేశారు. కుటుంబసభ్యులు సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. రాజేష్ మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.