Iritabul bowel syndrome
-
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
అది ఐబీఎస్ కావచ్చు! నా వయసు 36 ఏళ్లు. నేను చాలా ఏళ్లుగా ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నాను. ఆరు నెలల నుంచి మందులు వాడుతున్నాను. అయినా కడుపునొప్పి తగ్గడం లేదు. దీనికి తోడు మలబద్ధకం, తలనొప్పి సమస్యలు కూడా ఉన్నాయి. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. – శ్రీరామ్, తిరుపతి మీరు ఎండోస్కోపీ చేయించారా లేదా అన్న విషయం తెలపలేదు. ఇక రెండో అంశం... మలబద్ధకం పాటు కడుపునొప్పి ఉంటోందని రాశారు. మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే మీ సమస్య ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) కావచ్చని అనిపిస్తోంది. ఆ వ్యాధితో బాధపడుతున్నప్పుడు మీరు పేర్కొన్న లక్షణాలు కనిపిస్తాయి. మంచి ఆహారపు అలవాట్లు లేకపోవడం, యాంగై్జటీ, ఒత్తిడి వల్ల ఇది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. మీ సమస్య అదుపులోకి వస్తుంది. – డాక్టర్ భవానీరాజు, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ చిన్నవయసులోనేమోకాళ్ల నొప్పులు ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 27 ఏళ్లు. గత కొద్ది నెలలుగా నాకు రెండు మోకాళ్లలోనూ తీవ్రమైన నొప్పి వస్తోంది. ముఖ్యంగా మెట్లు ఎక్కుతున్నప్పుడు ఈ నొప్పి మరీ ఎక్కువగా బాధిస్తోంది. చాలా రకాల మందులు వాడాను. ఇప్పటికీ వాడుతూనే ఉన్నాను. ఇంత చిన్న వయసులోనే ఇలా కావడం నాకు ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల మున్ముందు శాశ్వతంగా సమస్య వస్తుందా? శాశ్వతమైన సమస్యకు దారితీస్తుందేమోనని భయంగా ఉంది. నాకు తగిన పరిష్కారం చూపండి. – శిరీష్, గుంటూరు మీరు చెప్పిన అంశాలను పరిశీలిస్తే... మీకు మోకాలి చిప్ప ముందు భాగంలో ఉండే పటెల్లా అనే ఎముకపై ఒత్తిడి పడుతున్నట్లుగా అనిపిస్తోంది. చాలామంది యువకుల్లో కనిపించే సాధారణమైన సమస్య ఇది. కొందరిలో కొన్ని నెలల నుంచి కొన్నేళ్ల వరకు ఉంటుంది. ఏవైనా బరువులు ఎత్తినప్పుడు మోకాలి చిప్పపై పడే అదనపు భారం వల్ల ఈ సమస్య వస్తుంటుంది. లేదా అతిగా మెట్లు ఎక్కుతుండటం, ఎప్పుడూ బాసిపట్లు (స్వాటింగ్) వేసుకొని కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇది తాత్కాలికమైన సమస్య. కాబట్టి అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. – డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ హోమియో కౌన్సెలింగ్ ఆటిజమ్ తగ్గుతుందా? మా అబ్బాయి వయసు ఐదేళ్లు. గత ఎనిమిది నెలలుగా అకారణంగా ఏడ్వటం, ఎప్పుడూ ఒంటరిగా ఉండటం, ఇతరులతో కలవలేకపోవడం, గంటల కొద్దీ స్తబ్ధంగా ఉండటం చేస్తున్నాడు. గట్టిగా అరవడం, నవ్వడం కూడా చేస్తున్నాడు. డాక్టర్‌ను సంప్రదిస్తే ఆటిజమ్ అని చెప్పారు. దీనికి హోమియోలో ఏదైనా శాశ్వత పరిష్కారం ఉందా? – నందకిశోర్, గుంటూరు ఆటిజమ్ ఉన్నవారికి కొన్ని అంశాల్లో ఎదుగుదల అస్తవ్యస్తమవుతుంది. ఇలాంటి పిల్లల్లో గమనించాల్సిన అంశాలు... ∙ఇతరులతో కలవలేకపోవడం, ఒంటరిగా ఆడుకోవడం, ఒంటరిగానే ఎక్కు సమయం గడపడం. ∙భావవ్యక్తీకరణ లోపం: మాటలు రావడం ఆలస్యం కావచ్చు ∙ప్రవర్తన లోపాలు: చేసిందే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. ఒకే రకమైన వస్తువులను సేకరించడం, చేతులు–కాళ్లు అదేపనిగా ఆడించడం వంటివి చేస్తారు. మరీ చిన్న వయసు పిల్లల్లో దీన్ని ఈ కింది లక్షణాలతో గుర్తించవచ్చు ∙అకారణంగా ఏడవటం ∙తల్లి దగ్గరకు తీసుకున్నా గుర్తించకపోవడం ∙పరిచితమైన వ్యక్తులను చూడగానే పలకరింపు నవ్వు కూడా నవ్వకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక కాస్త పెద్ద వయసులో ఉన్నవారిలో అయితే... మిగతా పిల్లలతో కలవలేకపోవడం ∙పిలిస్తే పలకకపోవడం ∙మనుషుల కంటే బొమ్మలు, వస్తువుల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపడం ∙కళ్లలో కళ్లు పెట్టి చూడకపోవడం, చేతులు–కాళ్లు లేదా వేళ్లు అసహజంగా ఒకే తీరులో కదిలిస్తూ ఉండటం ∙మానసిక ఎదుగుదల లోపించడం లేదా ఉండాల్సిన దాని కంటే ఎక్కువ చురుకుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆటిజమ్ సమస్యతో బాధపడేవారందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. ఆటిజమ్‌కు కారణాలు ఇవీ అని చెప్పడం కష్టం. అందుకే దీనికి సంబంధించి రకరకాల సిద్ధాంతాలు, భావనలు విస్తృతంగా ఉన్నాయి. కొందరిలో మెదడులో లోపాలుంటాయి. మెదడు ఎదుగుదలకు తోడ్పడే కొన్ని జన్యువులు, క్రోమోజోముల వంటివి కూడా కారణం కావచ్చని భావిస్తున్నారు. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి ఏవైనా వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడ్డా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యతో బాధపడే అందరిలోనూ ఒకేలాంటి తీవ్రత ఉండదు. దీనిని నివారించడానికి పిల్లలకు మంచి పోషకాహారం ఇవ్వాలి. తల్లిదండ్రులు పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టకుండా ఎక్కువ సమయం వారితో గడపాలి.హోమియోలో ఈ సమస్యకు మంచి చికిత్స అందుబాటులో ఉంది, పిల్లల వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకొని కాన్స్స్టిట్యూషనల్ చికిత్స ద్వారా రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధి తీవ్రతను క్రమక్రమంగా తగ్గిస్తూ... పూర్తిగా నయం చేయవచ్చు. – డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీనియర్ డాక్టర్, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ తలకు దెబ్బ తగిలినా కోలుకోవడం అసాధ్యమేమీ కాదు... న్యూరో కౌన్సెలింగ్ మా స్నేహితుడి వయసు 21. ఆర్నెల్ల క్రితం బైక్ యాక్సిడెంట్లో తలకు గాయమై, రక్తస్రావం అయింది. ఇప్పటికీ పూర్తిగా కోలుకున్నట్లు కనిపించడం లేదు. క్లోజ్ ఫ్రెండ్స్ అయిన మా పేర్లు కూడా తప్పుగా చెబుతున్నాడు. ఇంజనీరింగ్ మూడో ఏడాది చదువుతూ... ఎమ్సెట్ క్లాస్ మిస్సవుతున్నానంటాడు. వాడు మామూలుగా అవుతాడా? చదువు పూర్తిచేయగలడా? తలకు దెబ్బతగిలిన వారు కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? దయచేసి తెలపండి. – మహేశ్‌కుమార్, హనుమకొండ మన మెదడు సున్నితమైన అనేక రసాయనిక చర్యల వల్ల పనిచేస్తుంటుంది. మెదడులోని రసాయనాలను న్యూరోట్రాన్స్మీటర్లు అంటారు. రసాయన సంకేతాలుగా పనిచేసే ఇవి మెదడులోని ప్రాథమిక కణాలైన న్యూరాన్ల మధ్య సమాచారాన్ని మార్పిడి చేస్తుంటాయి. ఇది ఆ వ్యక్తి ఆలోచనలు, ప్రవర్తనలను మార్చి వేస్తుంది. మెదడులోని రసాయనాల సమతూకం సరికావడానికి కొన్ని వారాల నుంచి కొన్నిసార్లు నెలల తరబడి సమయం పడుతుంది. ఈ విధంగా సరిచేసుకునేందుకు మెదడుకు ఉండే సామర్థ్యం వ్యక్తిని బట్టి మారుతుంటుంది. ప్రమాదానికి గురైన ఒక వ్యక్తి కోలుకోవడం అన్నది గాయం తీవ్రతపైన కూడా ఆధారపడి ఉంటుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ స్నేహితుడి తలకు పెద్ద గాయమే అయినట్లుంది. మెదడుకు దెబ్బ తగిలిన వ్యక్తులు తిరిగి సాధారణ సామర్థ్యంతో పనిచేయడం సాధ్యం కాదని అపోహపడుతుంటారు. కానీ మీరు నిరాశచెందనవసరం లేదు. తలకు తీవ్ర గాయం అయినప్పుడు కోలుకోవడం విషయంలో ఆసక్తికరమైన, ఆశాజనకమైన మరో అంశం సహజంగా కోలుకునేందుకు సంబంధించి, మెదడుకు ఉన్న సామర్థ్యం. ఇందుకోసం మెదడు కొత్త న్యూరాన్లను తయారు చేసుకోగలదని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడైంది. ఈ ప్రక్రియ ఏ మేరకు, ఎంత వేగంగా జరుగుతుందన్నది ఇంకా స్పష్టంగా వెల్లడికానప్పటికీ, మెదడు గాయపడ్డ వ్యక్తి పునరావాస అవకాశాలు మాత్రం మెరుగుపడతాయన్నది సుస్పష్టం. ఈ కోలుకునే ప్రక్రియ మీద వ్యక్తి వయసు ప్రభావం ఉంటుందా... అని అడిగితే ఉంటుందనే చెప్పాలి. వయసు పెరుగుతున్న కొద్దీ మెదడు కోలుకునే శక్తి తగ్గుతుంది. కానీ మీ ఫ్రెండ్‌ది చిన్న వయసే కాబట్టి అతడు కోలుకొని చదువు కొనసాగించేందుకు మంచి అవకాశాలే ఉన్నాయి. – డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం, సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
అది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ కావచ్చు
నా వయసు 30 ఏళ్లు. గత ఐదేళ్లుగా విరేచనాలు, మలబద్దకం... ఈ రెండు సమస్యలతో బాధపడుతున్నాను. ఏ టైమ్‌లో విరేచనం అవుతుందో తెలియక బయటకు ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాను. ప్రయాణాలు చేయలేకపోతున్నాను. ఎన్నో మందులు వాడాను. హోమియోలో దీనికి చికిత్స ఉందా? - చైతన్య ప్రసాద్, వరంగల్ మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. పెద్ద పేగుల్లోని అసాధారణ కదలికల వల్ల మల విసర్జనలో తీవ్ర ఇబ్బందులు కలగజేసే వ్యాధి ఇది. ఈ సమస్యకు జీర్ణ వ్యవస్థలోని అసలు లోపమే కారణం. జీర్ణవ్యవస్థ ఇన్ఫెక్షన్లకు గురైన వారిలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య వచ్చిన వారికి ఎన్ని పరీక్షలు చేసినా ఫలితాలు చాలా సాధారణంగానే ఉంటాయి. కానీ వ్యాధి తాలూకు బాధలు మాత్రం కనిపిస్తూనే ఉంటాయి. వరసపెట్టి విపరీతమైన విరేచనాలు, లేదంటే అసలు కొంతకాలం విరేచనం కాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇంతటి ఇబ్బంది అనుభవిస్తున్నా పరీక్షల్లో మాత్రం పేగుల్లో ఎలాంటి తేడా కనిపించదు. ఈ వ్యాధి వచ్చిన వారిలో ఎప్పుడు విరేచనాలు మొదలవుతాయో ఊహించలేని పరిస్థితి. దాంతో దూరప్రయాణాలు చేయలేరు. ఐబీఎస్ వ్యాధిగ్రస్తులు శక్తిహీనులవుతారు. ఫలితంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి, నిరంతరం ఏదో ఒక వ్యాధికి గురయ్యే పరిస్థితి వస్తుంది. ఇది రోజువారీ కార్యకలాపాలకు చాలావరకు అంతరాయం కలిగిస్తుంది. కారణాలు : మానసిక ఒత్తిడి, ఆందోళన సరైన సమయంలో భోజనం చేయకపోవడం మద్యం, పొగతాగడం వంటి దురలవాట్లు ఎక్కువ కాలం కొనసాగుతూ ఉండటం చికాకు, కోపం. లక్షణాలు : మలబద్దకం / విరేచనాలు తరచూ కడుపునొప్పి రావడం కడుపు ఉబ్బరం విరేచనంలో జిగురు పడటం భోజనం చేయగానే టాయిలెట్‌కు వెళ్లాల్సి రావడం. చికిత్స : మానసిక ఒత్తిడిని తగ్గించి, పేగుల్లోని అసాధారణ కదలికలను నియంత్రించే ఔషధాలను ఇస్తారు. ఈ సమస్యకు నక్స్‌వామికా, ఆర్సినిక్ ఆల్బ్, అర్జెంటికమ్ నైట్రికమ్, లైకోపోడియం, పల్సటిల్లా వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. హోమియోలో వ్యక్తి రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి మందులు నిర్ణయిస్తారు. అవి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తాయి. -డాక్టర్ మురళీ కె .అంకత్ రెడ్డి,ఎండి (హోమియో) స్టార్ హోమియోపతి,హైదరాబాద్ -
చిన్నవయసులోనే బట్టతల..?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 26. నాకు తరచు కడుపులోనొప్పి, ఉబ్బరం ఉంటుంది. వీటితోబాటు పులితేన్పులు, ఛాతీలో మంట, తలనొప్పి, కండరాల నొప్పి వంటి ఇతర సమస్యలతో కూడా బాధపడుతున్నాను. దయచేసి నా సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. -బి. ఈశ్వర ప్రసాద్, హైదరాబాద్ తరచు విరేచనాలు లేదంటే మలబద్ధకం, కడుపునొప్పి, కడుపుబ్బరం. మలవిసర్జనలో మార్పులు... అంటే నీళ్ల విరేచనాలు లేదా మలం లో చీము పడడం వంటి లక్షణాలుంటే దానిని ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటారు. రక్తహీనత, కుటుంబ చరిత్రలో గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారిలోనూ, 50 సంవత్సరాలు పైబడిన వారు బరువు తగ్గడం, మలంలో రక్తం పడటం, కడుపునొప్పి, మలవిసర్జన తర్వాత కూడా మళ్లీ వెళ్లాలనిపించడం, వికారం, వాంతులు కావడం వంటి లక్షణాలు ఉన్నవారు సిగ్మాయిడో స్కోపీ, కొలనోస్కోపీ, సీటీస్కాన్, రక్తపరీక్షలు, లాక్లోజ్ ఇన్ టాలరెన్స్ టెస్ట్ వంటి పరీక్షలు చేయించుకోవాలి. కారణాలు: మానసిక ఒత్తిడి, గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల నూనె పదార్థాలు, మసాలాలు, కొవ్వు పదార్థాలు, కలుషిత నీరు, ఆహారం వంటివి ఐబీఎస్‌కు ప్రేరేపకాలు. కొన్ని రకాల యాంటీబయాటిక్స్ మేలు చేసే బ్యాక్టీరియాకు హాని చేయడం వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఎవరిలో ఎక్కువ..? ఈ సమస్యను వయస్సుతో సంబంధం లేకుండా అందరిలోనూ గమనించవచ్చు. ముఖ్యంగా స్త్రీలలో, యుక్తవయస్సు ఉన్నవారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు: వేళకు భోజనం చేయడం, సరిపడా నీరు తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి జాగ్రత్తల ద్వారా వ్యాధిని కొంతవరకు నయం చేయవచ్చు. గోధుమ పొట్టు, మొక్కజొన్న పొట్టు, తౌడు వంటి పదార్థాలు తీసుకుంటే ఈ లక్షణాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీటిని తీసుకోకపోవడం మంచిది. హోమియో చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం విధానంతో ఇబీఎస్కు గల మూలకారణాన్ని గుర్తించి, రోగి మానసిక, శారీరక, వ్యాధి లక్షణాలను కూడా పరిగణనలోకి తీసుకుని చికిత్స ఇవ్వడం జరుగుతుంది. అంతే కాకుండా పేగుల్లోని క్రమరాహిత్యాన్ని సరి చేసి, మళ్లీ ఈ వ్యాధి తిరగబెట్టకుండా సంపూర్ణంగా నయం చేయొచ్చు. జెనెటిక్ కౌన్సెలింగ్ మా కుటుంబంలో చాలామందికి క్యాన్సర్ వచ్చింది. మా అమ్మకూ, మా అక్కకు రొమ్ము క్యాన్సర్ వచ్చింది. మా పిన్ని (మా అమ్మవాళ్ల చెల్లెలు) ఒవేరియన్తో బాధపడింది. నాకు కూడా క్యాన్సర్ వస్తుందేమోనని ఆందోళనగా ఉంది. నాకు క్యాన్సర్ రిస్క్ ఉందేమో దయచేసి చెప్పండి. - రమాదేవి, కొండాపూర్ దాదాపు 10 నుంచి 15 శాతం సందర్భాల్లో క్యాన్సర్ కుటుంబాల్లో కనిపిస్తుంటుంది. ఈ పరిస్థితుల్లో పిల్లలకి క్యాన్సర్ కారక జన్యుమార్పులు సంక్రమించే అవకాశం 50 శాతం. 55 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే, దగ్గర బంధువులకు (అక్కచెల్లెళ్లు) రొమ్ము లేక ఒవేరియన్ క్యాన్సర్ ఉండటం వంటివి క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్ కింద పరిగణించవచ్చు. అలాగే బీఆర్సీయే 1 లేదా బీఆర్సీయే 2 జన్యువులు మార్పునకు (మ్యూటేషన్‌కు) గురైనప్పుడు కూడా క్యాన్సర్ వంశపారంపర్యంగా వచ్చేందుకు అవకాశం ఉంది. ఆ జన్యు మార్పులు రొమ్ము లేదా ఒవేరియన్ క్యాన్సర్‌ను కలగజేస్తాయి. కుటుంబంలో ఆ సమస్య వస్తుందా లేదా అని నిర్ధారణగా తెలియడానికి ఆ రెండు జన్యువుల అధ్యయనం చేయాలి. ఈ పరీక్ష కోసం దాదాపు రూ. 20,000 ఖర్చవుతాయి. ఒకసారి ఈ పరీక్షలో ఆ జన్యువులు క్యాన్సర్‌ను కలిగించేలా మ్యూటేషన్ గురయ్యాయని తెలుసుకుంటే... దాన్ని బట్టి ఆ కుటుంబ సభ్యులకు రిస్క్ ఉన్నదీ లేనిదీ చెప్పవచ్చు. నా వయసు 34. నేను, నా భార్య ఇద్దరమూ దగ్గరి బంధువులం. మాది మేనరికపు వివాహం. మాకు ఒక కొడుకు పుట్టి, రెండేళ్ల వయసులో చనిపోయాడు. అతడి ఎదుగుదల కూడా తక్కువే. ఇప్పుడు మేం సంతానం కోసం ప్లాన్ చేసుకుంటున్నాం. మాకు ఎలాంటి లోపం కలగకుండా పిల్లలు పుట్టడానికి ఏం చేయాలో చెప్పండి. - జీవన్, రైల్వేకోడూరు దంపతులిద్దరూ దగ్గరి సంబంధం ఉన్నవారైతే పిల్లలకు జన్యుపరమైన లోపాలు, పుట్టుకతోనే వచ్చే ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. సాధారణంగా దూరపు సంబంధాలు చేసుకున్నప్పుడు దంపతుల్లో ఒకే అంశానికి ఒకరి జన్యువుల్లో లోపాలు ఉన్నా మరొకరి ఆరోగ్యకరమైన జన్యువులు దాన్ని భర్తీ చేస్తాయి. కానీ దగ్గరి సంబంధాలు ఉన్న వారు పెళ్లి చేసుకున్నప్పుడు, ఇద్దరి జన్యువుల్లోనూ లోపాలు ఉండటం వల్ల అది పిల్లల్లో జన్యుపరమైన లోపాలకు దారితీస్తుంది. ఫలితంగా పుట్టుకతో వచ్చే లోపాలు రావచ్చు. ఇక ఈ తరహా రిస్క్ ప్రతి సంతానంలోనూ 25 శాతం ఎక్కువే. ఇలాంటి లోపాలు గర్భస్థ శిశువులోనే కనుగొనడానికి అవసరమైన పరీక్షల కోసం ముందుగానే మెడికల్ జెనెటిసిస్ట్ లేదా జెనెటిక్ కన్సల్టెంట్‌ను సంప్రదించండి. డర్మటాలజీ కౌన్సెలింగ్ నాకు గత నాలుగు నెలల నుంచి వేళ్ల చివర్లలో గోళ్ల వద్ద తెల్లటి మచ్చలు వస్తున్నాయి. మోచేతుల భాగంలో తెల్లటి ప్యాచ్‌లు ఏర్పడుతున్నాయి. ఇవి ఒళ్లంతా విస్తరిస్తాయేమోనని ఆందోళనగా ఉంది. సలహా చెప్పండి. - ఉత్తమ్‌కుమార్, నాగోలు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీకు విటిలిగో (బొల్లి) తొలి దశలో ఉన్నట్లు అనిపిస్తోంది. ముందుగా దీనికి కార్టికోస్టెరాయిడ్ క్రీమును రోజుకు రెండుసార్లు మచ్చలపై ఒక నెల రోజుల పాటు రాయాలి. ఆ తర్వాత మరో నెల పాటు ట్యాక్రోలిమస్ 0.3% క్రీమ్‌ను మరో నెల పాటు రాయాలి. ఆ తర్వాత స్వాభావిక చర్మరంగు ఉన్న కణాలు ఆ ప్రాంతంలో పెరుగుతాయి. ఇలా రాస్తూ ఉన్న తర్వాత కొత్త మచ్చలు రాకుండా ఉండటం, ఉన్న మచ్చల సైజు పెరగకుండా ఉండటం జరిగితే... అప్పుడు విటిలిగో అదుపులో ఉన్నట్లుగా భావించాలి. అప్పుడు ఫొటో థెరపీ వంటి చికిత్సలతో తెల్లబారిన మచ్చల రంగును క్రమంగా మార్చుకుంటూ పోవాల్సి ఉంటుంది. ఒకసారి విటిలిగో అదుపులో వచ్చాక స్ప్లిట్ స్కిన్ గ్రాఫ్టింగ్, పంచ్ గ్రాఫ్టింగ్ వంటి శస్త్రచికిత్స ప్రక్రియలూ అనుసరించవచ్చు. మీరు వెంటనే దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను కలవండి. నా వయసు 26 ఏళ్లు. నాకు విపరీతంగా జుట్టు రాలిపోతోంది. నా హెయిర్‌లైన్ వెనక్కుపోతోంది. మాడు మీద కూడా వెంట్రుకలు బాగా పలచబారిపోయాయి. ఇంత చిన్న వయసులోనే నాకు బట్టతల వచ్చేస్తున్నట్లు అనిపిస్తోంది. దయచేసి నా జుట్టు రాలిపోకుండా తగిన సలహా ఇవ్వండి. - సురేశ్, విశాఖపట్నం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు యాండ్రోజెనిక్ అలోపేషియా అనే కండిషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. బహుశా మీకు ఇది వారసత్వంగా వస్తున్నట్లుగా అనిపిస్తోంది. దీని వల్ల మీకు బట్టతల రాబోతోందని అర్థమవుతోంది. బహుశా మీరు అలొపేషియాలోని మొదటి నుంచి మూడో దశలో ఉన్నట్లుగా అనిపిస్తోంది. మీరు బయోటిన్‌తో పాటు.. సా పాల్మెట్టో, మినాక్సిడిల్ 5 శాతం ఉన్న లోషన్లను తలపై అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నాలుగు, ఐదు దశల్లో పై మందులకు తోడుగా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ వంటివి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఇవేవీ పనిచేయకపోతే మీకు జుట్టు పుష్కలంగా ఉన్న ప్రాంతం నుంచి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియను అనుసరించడం ఒక ప్రత్యామ్నాయం. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి.