irrigation system
-
Yadadri Temple: గుట్ట కష్టాలకు ముగింపు ఎప్పుడు?
యాదాద్రి దేవాలయాన్ని వేలాది సంవత్సరాలు మన్నే విధంగా నిర్మించామని ప్రభుత్వం చెబుతున్న మాటలు నీటిమూటలని తేలి పోయింది. ఈదురుగాలులూ, వర్షాలకు ఆలయ సముదాయ నిర్మాణంలోని డొల్లతనం బయటపడుతోంది. గతంలో వీచిన గాలులకు ప్రధానాలయ విమాన గోపురంపై ఉన్న సుదర్శన చక్రం ఒరిగిపోయింది. ఇటీవల కురి సిన వర్షాలకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దక్షిణ దిశలో స్టోన్ ఫ్లోరింగ్ కుంగింది. ఇప్పటికే ప్రధాన ఆలయంతో పాటు ప్రసాద కాంప్లెక్స్, క్యూ కాంప్లెక్స్ ప్రాంతాల్లో లీకేజీలు ఏర్పడ్డాయి. దక్షిణ రాజగోపురం ప్రాంతంలో కృష్ణశిల స్టోన్ ఫ్లోరింగ్‌కు పగుళ్లు వచ్చి కుంగింది. అష్టభుజి మండపంలో వర్షపునీరు లీకేజీతో డంగు సున్నం బయటకు వస్తోంది. ఇవన్నీ చూస్తుంటే నిర్మాణం ఎంత ‘గొప్ప’గా చేశారో అర్థమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదేళ్లలో దాదాపు 25 సార్లకు పైగా యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చి, వ్యక్తి గత శ్రద్ధ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ప్రణాళికా లోపం, నమూనాలు, డిజైన్లలో లోపాలు, అధికారుల బాధ్యతా రాహిత్యం, కాంట్రాక్టర్ల కక్కుర్తి, సమన్వయ లోపం వంటివి ప్రస్తుత పరిస్థితికి కారణా లుగా చెప్పవచ్చు. ‘అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రం’ అంటూ రాష్ట్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ఆలయ పునర్నిర్మాణం చేపట్టింది. ఈ సందర్భంగా తరతరా లుగా వస్తున్న ‘యాదగిరిగుట్ట’ పేరును సైతం ‘యాదాద్రి’గా మార్చేసింది. గుట్ట పునర్నిర్మాణానికి ఏకంగా రూ 1,300 కోట్లు వెచ్చించింది. ఈ డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరేనా? ఆలయ నిర్మాణంలో నీటిపారుదల వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల కొండపైనా, కింద కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రధాన ఆలయం శిల్పాల పనుల నుంచి కొండ దిగువన నిర్మా ణాల వరకు 14 మంది కాంట్రాక్టర్లు పనిచేశారు. ప్రభుత్వ పరంగా ఉన్న స్థానిక ఇంజనీర్లను కాదని కాంట్రాక్టు సంస్థలకు చెందిన సైట్ ఇంజనీర్లతోనే పను లన్నీ చేపట్టారు. గుట్ట చుట్టూ నిర్మాణాలు చేస్తున్న ప్పుడు స్థానిక ఇంజనీర్లను సంప్రదించకుండానే పనులు చేశారు. వర్షాలు కురిసినప్పుడు ఎటునుంచి వరద వస్తుంది... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది గుర్తించకపోవడంతో రోడ్లు ఎక్కడికక్కడ కోతకు గురవుతున్నాయి. గత మే నెలలో కురిసిన వర్షానికి ఆలయం చిత్తడిగా మారింది. ప్రధాన ఆలయంలో పంచతల రాజగోపురం నుంచి.. ధ్వజస్తంభం వరకు వాన నీరు చేరింది. మొదటి నుంచీ ఆలయ పునర్నిర్మాణ తీరుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. శిల్పాలు చెక్కే సమ యంలో దేవాలయ స్తంభాలపై మసీదు, పీర్లు, చర్చి, ఇందిరాగాంధీ, మహాత్మా గాంధీ, కేసీఆర్ చిత్రాలు (రిలీఫ్ ఫిగర్స్) చెక్కారు. అంతటితో ఆగలేదు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల లోగోలను కూడా చెక్కారు. దీంతో విశ్వహిందూ పరిషత్ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది. ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేయడంతో ఆ రిలీఫ్స్ను తొలగించారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ‘కాశీ అనేది పవిత్ర పుణ్యక్షేత్రం... అక్కడ రాజకీయాలు లేకుండా హిందువుల మనోభావాలు గౌరవించే స్థాయిలో నిర్మాణాలు చేపట్టాలి. కానీ... నట్లు, బోల్టు లతో ఆలయం నిర్మించి తప్పు చేశారు. వర్షం పడితే ఆలయ గోపురం కూలింది, అది అరిష్టం’ అని ప్రధాని మోదీని ఉద్దేశించి ఆరోపించారు. మరి యాదాద్రిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి ఏమంటారు? నిజానికి కాశీలో నిర్మిం చిన ఆలయంలో ఎటువంటి అపశ్రుతులు దొర్ల లేదనే విషయం గమనించాలి. ఇతరులను విమర్శించే ముందు తాను చేసిన పనిని సమీక్షించుకోవాల్సిందిగా కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం. పగుడాకుల బాలస్వామి వ్యాసకర్త ప్రచార ప్రముఖ్, విశ్వహిందూ పరిషత్, తెలంగాణ ‘ మొబైల్: 99129 75753 -
విశాఖలో ప్రతిష్టాత్మక ఐసీఐడీ కాంగ్రెస్
సాక్షి, అమరావతి: అంతర్జాతీయంగా అత్యంత ప్రతిష్టాత్మక ఐసీఐడీ(ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్) 25వ కాంగ్రెస్ నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుంది. వచ్చే ఏడాది నవంబర్ 6 నుంచి 13 వరకూ విశాఖపట్నంలో ఐసీఐడీ 25వ కాంగ్రెస్‌తో పాటు, ఆ సంస్థ 75వ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఐఈసీ) సమావేశం నిర్వహించనుంది. ప్రపంచవ్యాప్తంగా 78 దేశాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. ప్రపంచానికి జలభద్రత చేకూర్చడం, తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటల సాగుకు దోహదం చేసే అత్యాధునిక నీటి పారుదల విధానాలపై సమావేశంలో చర్చిస్తారు. అత్యాధునిక నీటి పారుదల విధానాలను ఈ సమావేశాల్లో ప్రదర్శిస్తారు. వాటిని అందిపుచ్చుకుని.. నీటి వనరులను మరింత సమర్థంగా ఉపయోగించుకుని.. అత్యధిక విస్తీర్ణంలో ఆయకట్టుకు నీరందించి, రాష్ట్రాన్ని సుభిక్షం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి 10 వరకూ ఐసీఐడీ 24వ కాంగ్రెస్, 74వ ఐఈసీ సమావేశాలు ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో జరగనున్నాయి. జల వనరుల సంరక్షణ.. తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటల సాగు విధానాలపై అధ్యయనం చేసి, వాటి ఫలితాలను ప్రపంచానికి అందించడమే లక్ష్యంగా 1950, జూన్ 24న సిమ్లా వేదికగా ఐసీఐడీ ఆవిర్భవించింది. ఐసీఐడీ తొలి కాంగ్రెస్‌ను 1951, జనవరి 11–16 వరకూ ఢిల్లీలో నిర్వహించారు. 1953, జూన్‌లో బెంగళూరు వేదికగా నాలుగో సమావేశాన్ని నిర్వహించారు. ఐసీఐడీ ఆరో కాంగ్రెస్‌ను దేశంలో చివరగా ఢిల్లీలో 1966, జనవరి 4–13 వరకూ నిర్వహించారు. ఆ సంస్థ 23వ కాంగ్రెస్‌ను మెక్సికో దేశ రాజధాని మెక్సికో సిటీలో 2017, అక్టోబర్ 8 నుంచి 14 వరకూ నిర్వహించారు. ఐసీఐడీ 24వ కాంగ్రెస్‌ను నిర్వహించే బాధ్యతను ఆస్ట్రేలియా దక్కించుకోగా, 25వ కాంగ్రెస్ నిర్వహణ బాధ్యతలను భారత్ చేజిక్కించుకుంది. ఆ సదస్సును విశాఖలో నిర్వహించాలని ఐసీఐడీ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ కె.యల్లారెడ్డి చేసిన ప్రతిపాదనను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదించారు. రాష్ట్రాన్ని మరింత సస్యశ్యామలం చేసే దిశగా.. ఐసీఐడీ 25వ కాంగ్రెస్‌కు విశాఖపట్నాన్ని వేదికగా చేసుకోవడం నీటి పారుదల రంగానికి సీఎం వైఎస్ జగన్ ఇస్తున్న ప్రాధాన్యతకు దక్కిన గౌరవంగా సాగు నీటిరంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు. సదస్సు నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో శతాబ్దాల కిందట నిర్మించిన చెరువులను సంరక్షించుకుని, ఆయకట్టుకు నీళ్లందించడం దగ్గర్నుంచి.. చిన్న, మధ్య, భారీ ప్రాజెక్టుల కింద కోటి ఎకరాల ఆయకట్టుకు నీరందించడం, సూక్ష్మ నీటిపారుదల విధానాలను అందిపుచ్చుకుని.. తక్కువ నీటితో అత్యధిక విస్తీర్ణంలో పంటలు సాగుచేస్తుండటాన్ని ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది. ప్రపంచ వ్యాప్తంగా 78 దేశాలకు చెందిన ప్రతినిధులు, మేధావులు ప్రతిపాదించే అత్యా«ధునిక నీటి పారుదల విధానాలను పరిశీలించి.. వాటిని అమలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
‘స్మార్ట్’గా మొక్కలకు చుక్కలు
సాక్షి, హైదరాబాద్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరో అడుగు ముందుకేసింది. దేశంలో మరెక్కడా లేనివిధంగా క్లౌడ్ బేస్డ్ సెంట్రల్ ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా ఎయిర్‌పోర్టులోని గార్డెన్లు, ఇతర అవసరాలకు నీటిని పొదుపుగా వినియోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ‘ఇరిగేషన్ మేనేజ్మెంట్, మానిటరింగ్ సాఫ్ట్వేర్’పరిజ్ఞానంతో పని చేసే ఈ నీటిపారుదల వ్యవస్థ ద్వారా సుమారు 10 కిలోమీటర్ల మార్గంలోని ఎనభైకి పైగా ఎకరాల్లోని గార్డెన్స్‌కు నీటిని అందజేస్తారు. దీంతో 35 శాతానికి పైగా నీరు ఆదా కానుంది. మొబైల్ ఫోన్ ద్వారా నియంత్రణ.. క్లౌడ్‌బేస్డ్ సెంట్రల్ ఆటోమేటిక్ టెక్నాలజీలో మొబైల్ ఫోన్ లేదా ల్యాప్‌ట్యాప్, కంప్యూటర్ ద్వారా ఆన్లైన్లోనే నీటి నిర్వహణ జరుగుతుంది. తొలుత 2018 జనవరిలో ఎయిర్‌పోర్టులోని ప్రధాన రహదారి గుండా ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్ ప్రారంభించారు. 2.4 కిలోమీటర్ల చొప్పున మూడు పొడవైన భాగాలను ఏర్పాటు చేసి వాటిలో రెండు సైట్ కంట్రోలర్లు అమర్చారు. మొదటి దశలో నీటిపారుదల షెడ్యూల్‌ను, విడుదల చేసే నీటి పరిణామాన్ని సైట్ కంట్రోలర్ల ద్వారా నియంత్రించారు. ప్రస్తుతం ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేశారు.దీంతో నీటి పారుదల వ్యవస్థలో ఇప్పటి వరకు వినియోగించిన కంట్రోలర్లు ఇక నుంచి క్లౌడ్ బేస్డ్ సెంట్రల్ ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానమై ఉంటాయి. ఈ వ్యవస్థ నిరంతరం నీటి పారుదలను పర్యవేక్షిస్తుంది. ఈ క్లౌడ్ బేస్డ్ సెంట్రల్ ఇరిగేషన్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ఎక్కడి నుంచైనా మొబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్, టాబ్లెట్ లాంటి ఏ ఇంటర్నెట్ కనెక్టెడ్ పరికరంతోనైనా నీటి పారుదలను నిర్వహించవచ్చు. పర్యావరణ పరిరక్షణకు దోహదం సహజ వనరులను పరిరక్షించేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఎయిర్‌పోర్టులో నీటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యల్లో క్లౌడ్ బేస్డ్ ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్ చాలా ముఖ్యమైంది. దీనివల్ల నీటిని పొదుపుగా వాడుకోవడంతో పాటు నీటిపారుదల వ్యవస్థను ఇంటర్నెట్ ఆధారిత ఉపకరణాల ద్వారా నియంత్రించొచ్చు. – కిశోర్, సీఈవో, శంషాబాద్ ఎయిర్‌పోర్టు పొదుపు మంత్రం.. - ఈ టెక్నాలజీ ద్వారా నీటి పొదుపు సాధ్యమవుతుంది. - వేసవిలో విమానాశ్రయంలోని ప్రధాన రహదారిపై నీటిపారుదలకు రోజూ 1,684 కిలో లీటర్ల నీరు అవసరమవుతుంది. క్లౌడ్ బేస్డ్ నీటిపారుదల వల్ల 35% వరకు నీరు ఆదా చేయొచ్చు. - లీకేజీలు, నీటి వృథాను గుర్తించి అరికట్టొచ్చు. - నీటి పారుదలలో లోటుపాట్లను గుర్తించి మెసేజీల రూపంలో చేరవేస్తుంది. - ఎయిర్ పోర్టు పరి ధిలో భూగర్భ జలాల పెంపు కోసం 40 ఎకరాల విస్తీర్ణం లో రీచార్జ్ బేసిన్‌ను, 10 కృత్రిమ రీచార్జ్ బావులను అభివృద్ధి చేశారు. - నీటి సంరక్షణలో పాటిస్తున్న చర్యలకు ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ నుంచి ‘గ్రీన్ ఎయిర్ పోర్ట్స్ రికగ్నిషన్–2019’పురస్కారం లభించింది. -
ఇక దృష్టంతా దక్షిణంపైనే
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడం.. అక్కడి ఉత్తర తెలంగాణ జిల్లాలకు నీటి కొరత తీరనుండటంతో ఇప్పుడు ప్రభుత్వం దక్షిణ తెలంగాణ జిల్లాలపై దృష్టిపెట్టింది. ముఖ్యంగా వలసలతో వెనుకబడ్డ పూర్వ పాలమూరు జిల్లా రూపురేఖలను మార్చేలా సాగునీటి వ్యవస్థను మెరుగులు దిద్దే పనిలో పడింది. ఈ జిల్లాలోనే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పరుగులు పెట్టించడంతో పాటు గట్టు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశం చేశారు. ఈపనుల ద్వారా మొత్తంగా జిల్లాలో 18 లక్షల ఎకరాల ఆయకట్టుకు వచ్చే ఖరీఫ్ నాటికి నీళ్లందించాలని ప్రభుత్వం లక్ష్యాలు పెట్టుకుంది. వంద శాతం పూర్తి పూర్వ పాలమూరు జిల్లాలో జలయజ్ఞం ప్రాజెక్టుల కింద కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను చేపట్టారు. వీటికింద 8.78 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందించాలని నిర్ణయించగా.. ఇప్పటివరకు 6.03లక్షల ఎకరాల మేర ఆయకట్టు అందుబాటు లోకి వచ్చింది. కల్వకుర్తి కింద గరిష్టంగా 2.59లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందించ గలిగారు. ఈ ఏడాది అనుకున్న స్థాయిలో నీరోస్తే ఈ ఒక్క ప్రాజెక్టు కిందే 3.25లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు నెట్టెంపాడు కింద 1.42లక్షలు, భీమా కింద 1.70లక్షల ఎకరాలకు నీరందించే అవకాశం ఉంది. చెల్లింపులు లేక నిలిచిన పనులు గత తొమ్మిది నెలలుగా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల పరిధిలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు వెనుకబడ్డాయి. చాలాచోట్ల భూసేకరణ నిలిచిపోయింది. కల్వకుర్తి పరిధిలో రూ.60కోట్లు, నెట్టెంపాడులో రూ.15కోట్లు, భీమాలో రూ.10 కోట్ల మేర పెండింగ్ బిల్లులతో పనులు కదల్లేదు. భూసేకరణకు సైతం ఈ ప్రాజెక్టులకు రూ.20కోట్ల మేర తక్షణం చెల్లించాల్సి ఉన్నా అది జరగకపోవడంతో ఈ ఏడాది పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరిచ్చే అవకాశాలు లేవు. దీనిపై ఇటీవల 15 రోజుల వ్యవధిలోనే రెండుమార్లు సమీక్షించిన కేసీఆర్ ఈ ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. ఆర్థిక శాఖ నిధులు విడుదల చేస్తే వచ్చే ఖరీఫ్ నాటికి 8.78 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి రావడం కష్టమేం కాదు. కేవలం రూ.150 కోట్లను తక్షణం విడుదల చేసినా ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం ఉంది. జూరాల కింద ఇప్పటికే లక్ష ఎకరాలు సాగవుతోంది. దీంతో పాటే ఆర్డీఎస్ కింద 87,500 ఎకరాలు, తుమ్మిళ్ల కింద 31,500 ఎకరాలు, గట్టు ఎత్తిపోతల ద్వారా 33 వేల ఎకరాలు కలిపి మొత్తంగా 11 లక్షల ఎకరాలను వచ్చే ఏడాది సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ ఇంజనీర్లకు మార్గదర్శనం చేశారు. బడ్జెట్ సమావేశాల తర్వాతే ‘గట్టు’పనులు బడ్జెట్ సమావేశాల అనంతరం గట్టు ఎత్తిపోతల పనులు మొదలు పెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా మొత్తంగా 12.30లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి తేవాల్సి ఉండగా, ఇందులో పూర్వ పాలమూరు జిల్లాలోని 7లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా పనులను వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికే పూర్తి చేసేలా శుక్రవారం రాత్రి జరిగిన సమీక్ష సందర్భంగా సీఎం ఆదేశాలిచ్చారు. దీనికోసం నిధుల ఖర్చు ఎలా ఉండాలి, రూ.10వేల కోట్ల రుణాలను ఎలా వినియోగించాలన్న దానిపై ఇంజనీర్లకు సూచించారు. -
కృష్ణా వరద తగ్గుముఖం
► ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి నీటి విడుదల నిలుపుదల ► దిగువకు తగ్గిన ప్రవాహాలు ► శ్రీశైలంలో విద్యుదుత్పత్తిపై తెలంగాణ తర్జనభర్జన సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లో గత కొన్ని రోజులుగా వర్షాల కారణంగా స్థిరంగా కొనసాగిన ప్రవాహాలు తగ్గుముఖం పట్టడంతో కర్ణాటక నుంచి జూరాల, శ్రీశైలానికి ప్రవాహాలు తగ్గిపోయాయి. గురువారం ఆల్మట్టికి కేవలం 6 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా ఆ నీటిని స్వీయ అవసరాలకు మళ్లించారు. అలాగే నారాయణపూర్‌కు 5,947 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఔట్‌ఫ్లో 8,049 క్యూసెక్కులుగా నమోదైంది. దీంతో జూరాలకు వరద 20 వేల క్యూసెక్కులకు పడిపోయింది. ఇందులో నెట్టెంపాడు కాల్వలకు 1,500 క్యూసెక్కులు, భీమా కాల్వలకు 2,100 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ కాల్వలకు 630 క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే జూరాల కుడి, ఎడమ కాల్వల అవసరాలకు మరో 2 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి 26,430 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి గురువారం ఉదయం 14 వేల క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో ఉండగా సాయంత్రానికి 8 వేల క్యూసెక్కులకు పడిపోయింది. ప్రస్తుతం శ్రీశైలంలో 215 టీఎంసీలకుగాను 33.72 టీఎంసీల నిల్వ ఉంది. మరోవైపు నాగార్జునసాగర్ కింద తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ పరిధిలో వపర్ స్లూయిస్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని దిగువ సాగర్‌కు వదలాలన్న అంశంపై తెలంగాణ తర్జనభర్జన పడుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 809 అడుగుల నీటిమట్టంలో 33.72 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. ఇందులో 775 అడుగులకుపైన 13.72 టీఎంసీల మేర నీటిని తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణకు 804 అడుగులకు ఎగువ ఉన్న నీటితో విద్యుదుత్పత్తి చేసే అవకాశం ఉండగా 804 అడుగులకు ఎగువన లభ్యత నీరు కేవలం 2.08 టీఎంసీలు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో విద్యుదుత్పత్తిపై నీటిపారుదలశాఖ, జెన్కో అధికారులు సమావేశమై లభ్యత నీటితో ఎన్ని రోజులపాటు విద్యుదుత్పత్తి చేయవచ్చు, దిగువకు వచ్చే నీటి పరిమాణం ఎంత, ఎగువ నుంచి ఉన్న ప్రవాహాలు తదితరాలపై చర్చించారు. అయితే లభ్యత నీరు పెరిగితే విద్యుదుత్పత్తి చేద్దామని ఇరువైపుల నుంచి ప్రతిపాదన వచ్చినట్లు తెలిసింది. అయినా మరోసారి ఉన్నతస్ధాయిలో చర్చించి తుది నిర్ణ యానికి రానున్నారు. -
మేడిగడ్డ వద్దే మళ్లింపు!
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై కీలక నిర్ణయం ♦ 100 మీటర్ల ఎత్తు, 10 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బ్యారేజీ ♦ తుమ్మిడిహెట్టి బ్యారేజీ 148 మీటర్ల ఎత్తుకే పరిమితం ♦ కాలువలను పక్కనపెట్టి నదీ మార్గం వినియోగంపై దృష్టి ♦ మేడిగడ్డ-ఎల్లంపల్లి మధ్య అదనంగా మరో రెండు బ్యారేజీలు ♦ డిసెంబర్లో పనులు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఈ ప్రాజెక్టుకు కాళేశ్వరం దిగువన ఉన్న మేడిగడ్డ నుంచే నీటిని మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. ఇక్కడ సుమారు 120 రోజులకుపైగా నీటి లభ్యత ఉండడం, నిర్ణీత 160 టీఎంసీల నీటిని మళ్లించుకునేందుకు అనువైన ప్రాంతం కావడంతో మేడిగడ్డ వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. ముంపునకు అవకాశం ఇవ్వకుండా ఇక్కడ బ్యారేజీని 100 మీటర్ల ఎత్తు, 10 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించాలనే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎత్తులోనూ ప్రాజెక్టుకు అవసరమయ్యే నీటిని పుష్కలంగా మళ్లించుకోవచ్చని వ్యాప్కోస్ సంస్థ తేల్చిన నేపథ్యంలో ప్రభుత్వం దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు కాలువల అలైన్మెంట్లో ఇప్పటికే గుర్తించిన 22 క్లిష్టమైన ప్రాంతాల దృష్ట్యా రెండు ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వం అన్వేషించింది. కాలువల వ్యవస్థను పక్కనపెట్టి నది ప్రాంతంలోనే మరో రెండు బ్యారేజీలను అదనంగా చేపట్టాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మహారాష్ట్ర అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటూ ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించ తలపెట్టిన బ్యారేజీని 148 మీటర్లకు పరిమితం చేయాలని నిర్ణయించింది. ప్రత్యామ్నాయాలపై దృష్టి.. తుమ్మిడిహెట్టితో పోలిస్తే కాళేశ్వరం దిగువన నీటి ప్రవాహం ఎక్కువ రోజులు ఉంటుందని, నీటి లభ్యత సైతం గణనీయం గా ఉందని ఇప్పటికే వ్యా ప్కోస్ ప్రాథమికంగా నిర్ధారిం చింది. అంతరాష్ట్ర వివాదాలకు ఆస్కారం లేకుండా ఇక్కడి నుంచి నీటిని మళ్లించుకుం టే.. ప్రాజెక్టు సాగు, తాగు నీటి లక్ష్యాలను చేరుకోవచ్చని నివేదించింది. మేడిగడ్డ-ఎల్లంపల్లి మధ్య రామగుండం, ఎన్టీపీసీ వంటివి ఉండడంతో టన్నెల్, కాలువల తవ్వ కం కష్టతరమైన దృష్ట్యా కాలువల నిర్మాణాన్ని పక్కన పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. కొత్తగా మేడిగడ్డ రిజర్వాయర్ నుంచి 10 కిలోమీటర్లు దాటాక 120 ఎఫ్ఆర్ఎల్ వద్ద గోదావరి ప్రవాహ ప్రాంతంలోనే ఒక బ్యారేజీని, కొద్ది దూరంలో 130 ఎఫ్‌ఆర్‌ఎల్‌తో మరో బ్యారేజీని నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ రెండు బ్యారేజీలకు 10 నుంచి 20 మీటర్ల మేర లిఫ్టును ప్రతిపాదించారు. ఈ రెండు బ్యారేజీల నుంచి నీటిని ఎల్లంపల్లికి తరలిస్తారు. అక్కడి నుంచి పాత డిజైన్ మేరకు మిడ్‌మానేరు, వివిధ రిజర్వాయర్ల ద్వా రా నీటిని తరలిస్తారు. ఈ అదనపు బ్యారేజీలతో పాటు, మేడిగడ్డ బ్యారేజీ పనులను డిసెంబర్లో ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తుపాకులగూడెం వద్ద మరో బ్యారేజీ దేవాదులకు నీటిని అందించేందుకు వీలుగా తుపాకుల గూడెం (కొత్తూరు ప్రాంత ం) వద్ద కూడా మరో బ్యారేజీని నిర్మించాలని ఆదివారం నాటి సమావేశంలో నిర్ణయించారు. ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టులను కలుపుతూ వీటికోసం ఇప్పటివరకూ చేసిన పనులను ఉపయోగించుకుంటూ ఖమ్మం జిల్లా సాగునీటి వ్యవస్థను మెరుగు పరచాలని భావిస్తున్నారు. దుమ్ముగూడెం దిగువన రిజర్వాయర్ నిర్మించి గ్రావిటీ ద్వారా నీటిని ఈ జిల్లాకు అందించాలని నిర్ణయించారు. -
ఖమ్మం సాగునీటి వ్యవస్థకు మెరుగులు
రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులపై సీఎం సమీక్ష సాక్షి, హైదరాబాద్: ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టుల కోసం ఇప్పటివరకూ చేసిన పనులను ఉపయోగించుకుంటూనే ఖమ్మం జిల్లా సాగునీటి వ్యవస్థను మెరుగుపరచాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. జిల్లా లో ప్రతి అంగుళానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని సూచిం చారు. ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్‌లకు ఇప్పటికే రూ.1,800 కోట్లతో పనులు చేసినా పెద్దగా సాగునీరు అందలేదన్న ఆయన.. జిల్లాలో ఇకపై సాగునీటి కోసం చేసే పనులు ప్రణాళికాబద్ధంగా ఉండాలన్నారు. ప్రస్తుతమున్న ప్రాజెక్టుల ద్వారా ఎంతవరకు సాగునీరు అందించవచ్చో అంచనా వేసి, మిగతా భూములకు ఏ మార్గం ద్వారా నీరందించాలనే అంశమై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో సాగునీటి అవకాశాలు, భవిష్యత్తులో చేయాల్సిన పనులపై గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జెడ్పీ చైర్పర్సన్ కవిత, ఎమ్మెల్యేలు మదన్‌లాల్, కనకయ్య, తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. జిల్లాలో అటవీ ప్రాంతం పోగా 13 లక్షల ఎకరాల భూమి సాగుకు అనుకూలంగా ఉందని, అందులో ఐదారు లక్షల ఎకరాలకు మాత్రమే నీరందుతోందని ముఖ్యమంత్రి చెప్పారు. సాగునీటి సౌకర్యం లేని తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్- అర్బన్, కామెపల్లి, టేకులపల్లి, కారెపల్లి, ఏలేరుపాడు, జూలూరుపాడు, ముల్కలపల్లి, అశ్వరావుపేట, దమ్మపేట, సత్తుపల్లి తదితర మండలాలకు నీరందించడంపై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. పినపాక, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాలకు గోదావరి నీటిని అందించేందుకు ప్రణాళికలు రూపొం దించాలని ఆదేశించారు. కిన్నెరసాని ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. గోదావరి ద్వారా ఎక్కువ ప్రాం తానికి సాగునీరు అందించే అవకాశాలున్నా, గత పాలకులు సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరించడంతో గడ్డు పరిస్థితి వచ్చిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.