Ishika
-
గ్రాండ్‌గా దిల్ రాజు మనవరాలు ఇషిక శారీ ఫంక్షన్ (ఫోటోలు)
-
కొత్తవారిని ప్రోత్సహించాలి
‘‘తెలుగు సినిమా పరిశ్రమకు కొత్త తరం అవసరం చాలా ఉంది. కొత్తవారు చేస్తున్న ఈ ‘అష్టదిగ్బంధనం’ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కొత్తవారు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రోత్సహించినప్పుడే మరిన్ని కొత్త సినిమాలు వస్తాయి’’ అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సూర్య భరత్ చంద్ర, ఇషికా ముఖ్య తారలుగా బాబా పీఆర్ దర్శకత్వంలో మనోజ్ కుమార్ అగర్వాల్ నిర్మిస్తున్న చిత్రం ‘అష్టదిగ్బంధనం’. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. మనోజ్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచనున్నాం. ఒక వినూత్న కథాంశంతో బాబా పీఆర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయింది’’ అన్నారు. ‘‘హైదరాబాద్ నేపథ్యంలో సాగే హై వోల్టేజ్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఇది’’ అని బాబా పీఆర్ అన్నారు. ‘‘నటనకు అవకాశం ఉన్న పాత్ర చేస్తున్నాను’’ అన్నారు సూర్య భరత్ చంద్ర. ‘‘తెలుగులో నాకు ఇది మూడో సినిమా’’ అన్నారు ఇషికా. -
యూత్‌పుల్ పెళ్లి కథ
శ్రీ రామాంజనేయులు ఇంటర్నేషనల్ మూవీ కార్పొరేషన్ పతాకంపై జి.యన్. మూర్తి దర్శకత్వంలో వడ్డి రామాంజనేయులు నిర్మిస్తున్న చిత్రం ‘పెళ్లి కథ’. మనోహర్, ఇషికా, అయేషా ముఖ్య తారాగణం. తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ను ఇటీవల ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్మాత రామాంజనేయులు మాట్లాడుతూ– ‘‘ఇది యూత్‌పుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫస్ట్ షెడ్యూల్లో సగానికిౖ పెగా చిత్రీకరణ జరిపాం. సెకండ్ షెడ్యూల్లో బ్యాలెన్స్ షూటింగ్‌ను హైద్రాబాద్, వైజాగ్‌లో కంప్లీట్ చేసి త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తాం’’ అన్నారు.