వామ్మో.. ఈ కోవిడ్ ఐసోలేషన్ వార్డ్ కంటే జైలు నయం!
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు చైనా జీరో కోవిడ్ పాలసీని అవలంభిస్తున్న విషయం తెలిసిందే. ఒక్క కేసు నమోదైనా.. లక్షల మందిని ఐసోలేషన్కు పరిమితం చేస్తోంది. ఇంకా వైరస్ లక్షణాలు కనిపించిన వారి పరిస్థితి మరీ దారుణంగా ఉందనేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా ట్విటర్లో షేర్ చేసిన వీడియోనే నిదర్శనం. చైనాలోని కోవిడ్ ఐసోలేషన్ వార్డులో పరిస్థితులు జైలును తలపిస్తున్నట్లు సూచిస్తూ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
‘ఇది జైలు అనుకుంటే మీరు ఆశ్చర్యపోక తప్పదు. అది చైనాలోని కోవిడ్ ఐసోలేషన్ వార్డు’ అని రాసుకొచ్చారు గోయెంకా. అయితే, ఈ వీడియోను ముందుగా వాల్ స్ట్రీట్ సిల్వర్ షేర్ చేసింది. ‘చైనాలోని కోవిడ్ ఐసోలేషన్ క్యాంపుల్లో జీవన విధానం ఇలా ఉంది. చిన్న పిల్లలు, మహిళలు, గర్భవతులను సైతం ఇక్కడ నిర్బంధించినట్లు తెలిసింది. ఇది నిజంగా కోవిడ్ కోసమేనా? నిజంగా నియంత్రించేందుకేనా?’ అంటూ పేర్కొంది వాల్ స్ట్రీట్ సిల్వర్. జైలులో కన్నా దారుణంగా ప్రజలను నిర్బంధించటంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
If you are wondering if it’s a prison- no, it’s a COVID isolation ward in China! pic.twitter.com/3SSnCI4dfi
— Harsh Goenka (@hvgoenka) October 15, 2022
ఇదీ చదవండి: ఆఫీస్కు రమ్మని చెప్పేది ఇందుకే: హర్ష గోయెంకా వైరల్ ట్వీట్