Isolated Man
-
ఆడవాళ్లను చూస్తే ఊపిరాడదు: అందుకే 55 ఏళ్లు ..!
CallitxeNzamwita Gynophobia మనుషులను రకరకాల భయాలు పట్టిపీడిస్తుంటాయి. సాధారణంగా ఇలాంటి ఫోబియాలు చనిపోయే దాకా వారిని వెంటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా దెయ్యాలు, కౄర జంతువులు, పాములు, బల్లులు, నిప్పు, ఎత్తైన ప్రదేశాలు, చీకటి అన్నా కూడా గజ గజ వణికిపోతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే పెద్ద జాబితానే ఉంది. అయితే తాజాగా ఆడవాళ్ళంటేనే భయపడిన వ్యక్తి వార్తల్లో నిలిచాడు. తాజా నివేదికల ప్రకారం రువాండాకు చెందిన 71 ఏళ్ల కాలిటెక్స్ నజాంవిటా (Callitxe Nzamwita)ఇలాంటి అసాధారణమైన భయంతో బాధపడుతూ ప్రపంచాన్ని నివ్వెరపర్చాడు. మహిళలంటే ఉన్న భయంతో గత 55 సంవత్సరాలుగా స్వీయ నిర్బంధంలో ఉండిపోయాడు. అతనికి పదహారేళ్ల వయసపుడే ఈ భయం పట్టుకుంది. అప్పటినుంచి మహిళ కనిపిస్తే చాలు ఇంట్లోకి వెళ్లి తలుపు తాళం వేసుకుంటాడు. కాలిటెక్స్ నజాంవిటా స్టోరీ ఆడవాళ్లంటే దెయ్యాన్ని చూసినట్టు భయపడతాడు. అందుకే నజాంవిటా తన ఇంటి చుట్టూ 15 అడుగుల ఎత్తైన కంచెను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆడవాళ్ళకే కాదు పురుషులకు కూడా దూరంగా ఉంటున్నాడట. అయితే ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే అతణ్ని అర్థం చేసుకున్న ఇరుగు పొరుగు మహిళలు కాలిటెక్స్ ఆహారం, కిరాణా సామాన్లు లాంటి అందించి జీవించడానికి సహాయం చేయడం. అతనికి అవసరమైన వాటిని ఇంట్లో వదిలి వెళితే..వారు వెళ్లిపోయాక అపుడువాటిని తీసుకుంటాడు. ఫోబియా Phobia అనేది ఫొబోస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. గ్రీకు భాషలో ఫొబోస్ అంటే భయం. వాస్తవానికి దాన్నించు మనకి ఎలాంటి ప్రమాదం, హాని లేకపోయినా కూడా తీవ్రంగా భయపడిపోవడం.సాధారణంగా మహిళలను చూస్తే భయపడటాన్ని గైనోఫోబియాగా పిలుస్తారు. అందమైన అమ్మాయిలను చూస్తే భయపడటాన్నే వెనుస్ట్రాఫోబియా అంటారు. అలాగే పెళ్లి చేసుకోవాలన్నా, రిలేషన్షిప్లో ఉండాలన్నా కలిగే భయాన్నే గామోఫోబియా అంటారు. గైనోఫోబియా అంటే ఏమిటి? స్త్రీల పట్ల ఉండే అహేతుక భయమే గైనోఫోబియా గైనోఫోబియా అంటే డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ (DSM-5)లో అధికారికంగా గుర్తించనప్పటికీ, ది క్లినికల్ సెట్టింగ్‌లో "నిర్దిష్ట భయం"గా వర్గీకరించారు. గైనోఫోబియా లక్షణాలు స్త్రీల పట్ల అహేతుకమైన, తీవ్రమైన భయం. వారి గురించిన ఆలోచనే వారిలో ఆందోళనకు దారితీస్తాయి. ఈ లక్షణాలు ఇతర ఫోబియాల్లో కనిపించేవిగానే ఉంటాయి. ముఖ్యంగా తీవ్ర భయాందోళనలు, ఛాతీ పట్టేసినట్టు అయిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ముచ్చెమటలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలొస్తాయి. -
రెండు ఇళ్లు ఉన్నా.. బాత్రూంలోనే ఐసోలేషన్
సాక్షి, వికారాబాద్: తన ద్వారా భార్యాపిల్లలకు కూడా కరోనా సోకుతుందేమోనన్న భయంతో ఓ కోవిడ్ రోగి బాత్రూంలో తలదాచుకున్నాడు. అతడి సెల్ఫీ వీడియో వైరల్ కావడంతో స్పందించిన అధికారులు అతడిని ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలోని మైలారంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అశోక్ (30)కు ఐదు రోజులక్రితం కరోనా సోకింది. హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిన అతడు వైరస్ తన కుటుంబ సభ్యులకు కూడా సోకుతుందేమోనని భయాందోళనకు గురయ్యాడు. దీంతో ఇంటికి కొంత దూరంలో ఉన్న బాత్రూంలో ఉంటున్నాడు. గురువారం ఉదయం అతడు సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. వీడియో వైరల్ కావడంతో జిల్లా వైద్యాధికారులు గమనించి స్థానిక డాక్టర్, ఎంపీడీఓ ద్వారా వివరాలు సేకరించారు. అనంతరం బాధితుడిని అనంతగిరిగుట్టలోని ఐసోలేషన్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అశోక్‌కు రెండు ఇళ్లు ఉన్నాయని, ఓ ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటే చికిత్స అందేలా చూస్తామని చెప్పినా వినలేదని సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు. ( చదవండి: అనగనగా సొసైటీ.. ఒక్క కేసు కూడా నమోదు కాని వైనం ) -
కరోనా ఎఫెక్ట్: ‘ఆమె మాట’కే ఇప్పుడు క్రేజ్
న్యూఢిల్లీ : ‘ప్రతి నర్సు తరచుగా తన చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. చేతులతోపాటు ముఖం కూడా కడుక్కోవడం ఇంకా మంచిది’ అని ఫ్లోరెన్స్ నైటింగేల్ 1860లో చెప్పిన మాటలు కరోనా వైరస్ కలవర పెడుతున్న నేటి సమయంలో గుర్తుకు వస్తున్నాయి. ఆమె నర్సుల గురించి చెప్పినప్పటికీ ఆమె ఉద్దేశం ఒక్కటే. చేతులు శుభ్రంగా కడుక్కోవడం వల్ల ఒకరి నుంచి ఒకరికి అంటు రోగాలు రావని, తద్వారా రోగులు త్వరగా కోలుకుంటారని. ఆమె 1860లో రాసిన ‘నోట్స్ ఆన్ నర్సింగ్’ పుస్తకంలో ‘చేతులు శుభ్రంగా కడుక్కోవాలి’ అనే విషయం ఉంది. (కరోనా పరీక్షలకు 18 కిట్లకు అనుమతి) ఆ పుస్తకంలో నర్సుల విధులేమిటీ? వాటిని ఎలా నిర్వర్తించాలో? చెప్పడం కంటే వ్యాధులకు ప్రజలు దూరంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించే ఎక్కువగా ఉంది. ఇల్లు, పరిసరాలను చాలా శుభ్రంగా ఉంచుకోవాలని, స్వచ్ఛమైన గాలి, వెలుతురు వచ్చేలా ఇంటికి కిటికీలు ఉండాలంటూ పలు సూచనలు చేశారు. ఆమె ఎక్కువగా తన సేవలను యుద్ధాల్లో గాయపడిన సైనికులకే కేటాయించారు. అప్పట్లో గాయపడిన సైనికులు ఇన్ఫెక్షన్ల వల్ల ఎక్కువ మంది చనిపోయేవారు. ఆమె ఎప్పటికప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోవడంతోపాటు, సైనికుల గాయాలను శుభ్రంగా తుడిచి చికిత్స అందించేవారు. ఆస్పత్రుల పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు కృషి చేసేవారు. ఆమె ఓసారి భారత్‌లోని ఓ సైనికుల ఆస్పత్రిని సందర్శించినప్పుడు అక్కడి పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్ల ఆందోళన వ్యక్తం చేశారట. ‘క్రిమియన్ వార్’ సమయంలో బ్రిటీష్ సైనిక ఆస్పత్రిలో నర్సింగ్ మేనేజర్‌గా ఆమె పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు వైద్యపరమైన వైఫల్యాలపై ఆమె ఏకంగా 900 పేజీల నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు సమర్పించారు. ఆ సమయంలో ఆమెకు ‘ది లేడి విత్ ది ల్యాంప్’ అనే నిక్ నేమ్ వచ్చింది. రాత్రివేళల్లో ఆమె దీపం పట్టుకొని గాయపడిన సైనికుల వద్దకు వెళ్లి పరామర్శించేవారు. ఆ యుద్ధానంతరం ఆమె ఫ్లూ లాంటి ‘బ్రూసెల్లాయిస్’ జబ్బు బారిన పడ్డారు. అప్పుడు ఆమె తనవద్దకు ఎవరూ రావద్దంటూ కుటుంబ సభ్యులను, తోటి నర్సులతో సామాజిక దూరం పాటించారు. ఒంటరిగా నిర్బంధంలో ఉన్నారు. ఆమె 1860లోనే సెయింట్ థామస్ హాస్పటల్లో నర్సుల కోసం ‘నైటింగేల్ ట్రెయినింగ్ స్కూల్’ను 1861లో కింగ్స్ కాలేజ్ ఆస్పత్రిలో ‘మిడ్వైఫరీ ట్రేనింగ్ ప్రోగ్రామ్’ నిర్వహించారు. అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. ధనిక కుటుంబంలో పుట్టినప్పటికీ నైటింగేల్ పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని నర్సింగ్ సేవలకు అంకితమిచ్చి నాటి నుంచి నేటి వరకు నర్సింగ్కు మార్గదర్శకురాలిగా మిగిలిపోయారు. (లాక్డౌన్లో ఆకలి చావులను ఆపాలంటే...) -
సోదరి పుర్రె.. తండ్రి శవం.. ఓ మాజీ టెకీ!
కోల్‌కతా: ఇదొక ఒళ్లుగగుర్పొడిచే ఘటన. ఒకటి కాదు రెండు ఏకంగా ఆరు నెలలుగా చనిపోయిన తన సోదరి, ఆమె పెంచుకుంటున్న కుక్కల కళేబరాలు, ఎముకలతో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్న ఓ మానసిక వికలాంగుడి చర్య. కోల్ కతా నడిమధ్యలోని రాబిన్ సన్ లేన్ అనే వీధిలో ఉంటున్న ఇంటి బాత్ రూములో నుంచి పొగలు బయటకు రావడంతో ఏం జరుగుతుందా అని వెళ్లి చూసిన పోలీసుల కళ్ల ముందు ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. పార్థా డే (47) అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా అసలు కనిపించకుండా ఇంట్లోనే ఉంటూ అనుమానాస్పదంగా కనిపించాడు. తన ఇంటి బాత్ రూం నుంచి పొగలు వస్తుండటంతో చుట్టుపక్కల వారు ఫిర్యాదు చేయగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లిన పోలీసులకు ఒక కాలిపోయిన పార్థాడే తండ్రి అరబిందా డే(77) మృతదేహం, పుర్రె, ఎముకలతో కూడిన బ్యాగు కనిపించింది. ఈ విషయాలపై అతడిని ఆరా తీయగా తనకు తన కుటుంబమంటే చాలా ఇష్టమని, తన సోదరి అంటే ప్రాణమని, సంగీత పాఠశాలలో ఉపధ్యాయినిగా పనిచేస్తున్న ఆమెకు తాము ముద్దుగా పెంచుకుంటున్న రెండు కుక్కలంటే చాలా ఇష్టమని అవి చనిపోవడంతో తన సోదరి చాలాకాలం భోజనం మానేసి నాలుగు నెలల కిందట ప్రాణాలు విడిచిందని చెప్పాడు. తన తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడని, వారిని దహనం చేయడం ఇష్టం లేక తనతోనే ఉంచుకున్నానని చెప్పాడు. అంతేకాకుండా, తాను ప్రతిరోజు రాత్రి వారి ఆత్మలతో మాట్లాడాతానని, తనకు వారు కనిపిస్తారని చెప్పాడు. దీంతో అవాక్కయిన పోలీసులు చివరకు పార్థా డేను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు లభించిన పుర్రెను ఒక గుడ్డలో చుట్టి అందులో ఆహారం పెట్టి ఉంచాడు. కాగా, పార్థాడే ఒకప్పుడు ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగి.