Issues Solution
-
అంధకారంలో విశ్వకర్మలు
కుల వృత్తులపై, చేతివృత్తులపై ఆధారపడి జీవి స్తున్న ప్రజలు భారత గ్రామీణ వ్యవస్థలో అత్యధికంగా వున్నారు. మారిన పాలకుల ఆర్థిక విధానాల వల్ల నమ్ముకున్న, నేర్చుకున్న వృత్తులు నిర్వీర్యం కావడం వల్ల తమ బతుకుదెరువును గురించి ఆందోళనలు చేపట్టారు, చాలా మంది ఇతర వృత్తులకు మారారు. కులం పరిధిలో వున్నారు కాబట్టి కుల వృత్తులు పోవాలి కాబట్టి వారి గురించి అభ్యుదయవా దులు, అంబేడ్కర్ వాదులు పట్టించుకోకుండా ఉందాం అంటారా, లేదు కులం పరిధిలో ఉన్న అణగారిన, బలహీనులను సమీకరించి చైతన్యం కలిగించి మానవీయకోణంలో వారి హక్కులు, అధికారాల వైపు ఆలోచింపజేస్తూ పోరాడేందుకు ప్రయత్నం చేద్దామా? మారోజు వీరన్న అన్నట్లు కులంలో వర్గం, వర్గంలో కులం అనే సిద్ధాంతం మన దేశానికి, ముఖ్యంగా, మన రెండు తెలుగు రాష్ట్రాలకు వర్తిస్తుంది. కులవృత్తులకు, చేతివృత్తులకు ప్రత్యామ్నాయ మార్గాలను మనం సూచిస్తూ ఆదిశగా ఏదైనా కార్యక్రమాన్నీ గతంలో చేశామా, భవిష్యత్‌లో ఏమైనా చేయగలమా, పాలకులు కులవృత్తులను, చేతివృత్తులను తప్పించి అన్ని రంగాలలో, తమ భూస్వామ్య, పెట్టుబడిదారీ వర్గాలకు, దళారులకు మొత్తంగా తమవారికి అనుకూలంగా బడ్జెట్లో కేటాయింపులు చేశారు, పంచవర్ష ప్రణాళికలలో అన్యాయం జరిగింది, మనం గమనించలేదు, నీతి అయోగ్‌లో అదే జరుగుతోంది మనం చూడటం లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు వోట్ బ్యాంక్ రాజకీయ సమీకరణాలు చేస్తున్నాయి మనం గమనించం. కానీ కులం పోవాలి, కుల వృత్తులు పోవాలి అంటాం.. ఇది ఎట్లా సాధ్యం. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి, సంక్షేమంలో జరిగే ప్రజా ఉద్యమాలలో వారిని భాగస్వామ్యం చేయడమే కుల నిర్మూలనకు పరి ష్కార మార్గం. కులరహిత సమాజం కోసం పని చేస్తున్న మనం కులవృత్తులు పోవాలి అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం. సంతోషం, కానీ కులాన్ని ప్రక్కన పెట్టి కులం పేరుతో వందల, వేల సంవత్సరాల నుంచి ఆ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారు తమ జీవితాల్లో విద్యా, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, తినడానికి తిండి, ఉండటానికి నివాసం వంటి కనీస మౌలిక సౌకర్యాలు పొందడానికి వారికి మనం కలిపిం చిన చైతన్యం ఏమిటి? ఆ దిశగా పాలకుల నిర్లక్ష్యంపై మనం చేసిన ఒత్తిడి ఏమిటి? ఒక వైపు చేతివృత్తులను నిర్లక్ష్యం చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు, బహుళజాతి సంస్థలకు విపరీతమైన రాయితీలను, భూమిని ధారాదత్తం చేస్తున్న సందర్భంలో గత 70ఏళ్లలో చేతివృత్తుల సామాజిక వర్గం ఒకటి ఉన్నదని, వారి గురించి కూడా మాట్లాడాలని ఏ అభ్యుదయ వాదులు, అంబేడ్కర్ వాదులు ప్రయత్నం చేసినా ఫలితాలు వేరే విధంగా ఉండేవి. ఇప్పుడు చెప్పండి. చేతివృత్తులపై ఆధారపడిన అశేష ప్రజానీకాన్ని మినహాయించి కుల రహిత, మత రహిత సమాజాన్ని ఎట్లా నిర్మిద్దాం? కుల వృత్తులకు నీచత్వం అంటగట్టి అదే కుల వృత్తులను ఆధునిక, యంత్ర,సాంకేతిక పరిజ్ఞానంతో పెట్టుబడిదారులు, భూస్వాములు, అగ్రకులాలు హస్తగతం చేసుకొని వృతికళాకారులను గుమస్తాలుగా, కూలీలుగా పెట్టుకుని కోట్లలో వ్యాపారం చేస్తున్నప్పటికీ, మన అభ్యుదయ వాదులకు, అంబేడ్కర్ వాదులకు కనిపించడం లేదు, వారికి మనువాదం మాత్రమే కనిపిస్తోంది. దాని వెనుక జరుగుతున్న దోపిడీ, పీడన, అణచి వేత కనిపించవు. కుల నిర్మూలన జరగాలి అంటే కులం పేరుతో కొనసాగుతున్న (కుల)చేతివృత్తుల వారికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, కావలసిన శిక్షణా, పెట్టుబడి, మార్కెట్ సౌకర్యాలు కల్పించాలి. ఆ పని మనం గతంలో చేశామా, ఇక ముందు మన ప్రయత్నం చేస్తామా? అనేది తేల్చుకోవాలి. ఈ పని మారోజు వీరన్న కొంతవరకు చేయగలిగిండు, అయిన చేయవలసింది ఇంకా మిగిలే ఉన్నదని గుర్తిస్తే దానికి తగిన ఆచరణ రూపాలను ఎంచుకోవచ్చు. వస్తువు ఉపరితలం ను మార్చితే వస్తువు రూపం మాత్రమే మారుతుంది, అందులోని సారం మాత్రం మారదు, మనం సారం మార్చితేనే సారం, రూపం మొత్తంగా పునాది నుంచి నిజమైన మార్పు జరిగినట్లుగా భావించాలి. బెజ్జంకి ప్రభాకరాచారి, కన్వీనర్ విశ్వకర్మ జనసమితి, తెలంగాణ 81439 66591 -
‘విశ్వ’మంత లక్ష్యం
- బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్కు పచ్చజెండా - కౌన్సిల్‌కు రూ.50 కోట్ల వరకు మంజూరు అధికారం - స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో సమస్యలకు పరిష్కారం - స్వచ్ఛ హైదరాబాద్ సమన్వయ కమిటీ ప్రాథమిక నివేదిక - నేడు సీఎంతో సమావేశం సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ను విశ్వ నగర స్థాయికి తీసుకు వెళ్లేందుకు... వివిధ సమస్యల పరిష్కారానికి... స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగాలని ప్రజాప్రతినిధులతో కూడిన సమన్వయ కమిటీ నిర్ణయించింది. నగరాన్ని స్లమ్ ఫ్రీ, చెత్త రహిత నగరంగా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించింది. ఈమేరకు రాజకీయాలకు అతీతంగా అన్నిపార్టీల వారు ఏకగ్రీవ తీర్మానం చేశారు. బీఆర్ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌లకు కమిటీ పచ్చజెండా ఊపింది. జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డుల సమస్యలపై ఏర్పాటైన స్వచ్ఛ హైదరాబాద్ సమన్వయ కమిటీ సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశమై... మూడు గంటలకుపైగా సుదీర్ఘంగా సమీక్షించింది. ప్రస్తుతానికి స్వల్ప కాలిక సమస్యల పరిష్కారానికి సూచనలు చేస్తూ... ప్రాథమిక ముసాయిదాను సిద్ధం చేసింది. మంగళవారం సీఎం కేసీఆర్‌తో సమావేశమై... నివేదిక అందజేయనుంది. భవన నిర్మాణ అనుమతులు పారదర్శకంగా పొందేందుకు ఓ విధానాన్ని రూపొందించాలని కమిటీ అభిప్రాయపడింది. జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డుల్లో దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన భర్తీచేయాలని సూచించింది. సమావేశం ముఖ్యాంశాలివీ... - నాలాల ఆక్రమణలు, బాటిల్‌నెక్స్ రోడ్ల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. నగరంలోని 74 నాలాల వెడల్పు, రక్షణ గోడల నిర్మాణాలకు డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులతో ప్రత్యేకంగా భూసేకరణ విభాగం ఏర్పాటు. - గోడలపై రాతలు, పోస్టర్ల నిషేధం క చ్చితంగా అమలు. ఫ్లెక్సీలు, హోర్డింగులకు జీహెచ్ఎంసీ అనుమతుల మేరకు నిర్ణీత వ్యవధికి మాత్రమే పరిమితం. అతిక్రమిస్తే పెనాల్టీలతో పాటు ఇతర చర్యలు. - డెబ్రిస్ తొలగింపు పనులను ఢిల్లీ తరహాలో ప్రైవేటు సంస్థకు అప్పగించాలని నిర్ణయం. ఇందుకుగాను సమన్వయ కమిటీ సభ్యులు ఢిల్లీలో పర్యటించాలి. - నగరంలో 60 వేలకు పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అంచనా. ఈమేరకు బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్లను తిరిగి అమలు చేయాలని నిర్ణయం. భవిష్యత్తులో తిరిగి అక్రమ నిర్మాణాలకు తావులేకుండా చర్యలు. ఇందులో భాగంగా అక్రమ నిర్మాణాలకు విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలను కల్పించకపోవడంతో పాటు రిజిస్ట్రేషన్లకు వీల్లేకుండా చట్టాల్లో మార్పులు తేవాలని సూచన. - భవన నిర్మాణ అనుమతుల్లో పారదర్శకతకు సంస్కరణలు తేవాలని నిర్ణయం. దరఖాస్తు చేసిన 15 రోజుల్లో అనుమతులివ్వాలని, అందులో విఫలమైన అధికారులను బాధ్యులు చేయాలని నిర్ణయం. రెవెన్యూ మ్యాప్‌లను డిజిటలైజ్ చేయడంతో పాటు రెవెన్యూ, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డుల మధ్య మరింత సమన్వయం అవసరం. - చెత్త సమస్య పరిష్కారానికి అవసరమైనన్ని అదనపు వాహనాల కొనుగోలు. చెత్త తరలింపు, ట్రీట్మెంట్కు తగిన విధానాలు అమలు చేయాలని తీర్మానం. రాంకీ ఒప్పందం తదితర అంశాల పరిష్కారానికి నిర్ణయం. చెత్తను తక్కువ ల్యాండ్‌ఫిల్ చేసి, ఎక్కువ విద్యుత్ ఉత్పత్తికి నిర్ణయం. - ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయం. - రోడ్డు కోతలకు తావులేకుండా కేబుల్స్ వంటివి ఏర్పాటుకు డక్టింగ్ పనులు. - రోడ్లపై నీటి నిల్వ సమస్యలు లేకుండా చూసేందుకు శాశ్వత చర్యలు. తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు. దీనికోసంప్రత్యేక బృందాల నియామకం. - కాంట్రాక్టుల విధానంలో మార్పులు అవసరమని అభిప్రాయ పడింది. ఒకరికే ఎక్కువ పనులు.. వేర్వేరు ప్రాంతాల్లో ఇవ్వకూడదు. కాంట్రాక్టర్ల స్థాయిని బట్టి చేయగల పనులు మాత్రమే ఇవ్వాలి. రూ.10 లక్షల లోపు పనులు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, బస్తీ కమిటీలకు అప్పగించాలి. - నిధుల మంజూరులో జాప్యం నివారణ. ఇందులో భాగంగా కమిషనర్‌కు ఉన్న రూ.50 లక్షల మంజూరు అధికారాన్ని రూ.2 కోట్లకు... స్టాండింగ్ కమిటీ అధికారాన్ని రూ.2 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచాలి. పాలకవర్గం అధికారాన్ని రూ.5 కోట్ల నుంచి రూ.50 కోట్లకు పెంచాలి. వీటికి అనుగుణంగా జోనల్ కమిషనర్లకు కూడా పెంచాలి. - పనులను రూ.2 కోట్లకు మించకుండా ప్యాకేజీలుగా విభజించాలి. తద్వారా నాణ్యతకు, మంచి కాంట్రాక్టర్లు రావడానికి అవకాశం ఉంటుందని కమిటీ అభిప్రాయం. - టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్, పారిశుద్ధ్యం, వాటర్ బోర్డు తదితర విభాగాల్లోని ఖాళీలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలి. - ఎల్ఈడీ వీధి దీపాల ప్రాజెక్టు అమలుకు అంగీకారం. - నగరంలో ప్రస్తుతం 5 శాతం మాత్రమే ఉన్న గ్రీనరీ పెంపునకు చర్యలు - కొత్త చట్టం వల్ల రహదారుల వెడల్పు పనులకు నష్ట పరిహారంగా అధిక నిధులు చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్లోర్‌స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ), సెట్‌బ్యాక్ మినహాయింపుల వంటివి అమల్లోకి తేవాలని తీర్మానం. - జీహెచ్ఎంసీకి సంబంధించిన 20, వాటర్ బోర్డుకు చెందిన 16 అంశాలపై ఏకాభిప్రాయం. - ప్రస్తుతానికి ప్రాథమిక ముసాయిదాకు సిద్ధమైన సభ్యులు... దీర్ఘకాలంలో చేపట్టాల్సిన పనులతో సహా పూర్తి స్థాయి నివేదిక రూపొందించాలని నిర్ణయం. - సమావేశంలో మంత్రులు నాయిని, పద్మారావు, ఎంపీ కేశవరావు, ఎమ్మెల్సీ జాఫ్రి, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, డాక్టర్ లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. - ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 11.30 గంటలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో కమిటీ నివేదికపై సమీక్ష సమావేశం జరుగనుంది.