పెద్దలు ఒప్పుకోలేదు..చనిపోదామనుకున్నారు
జనగామ: తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవటం లేదని ఓ ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది. జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుడి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సిద్దెంకి గ్రామానికి చెందిన మధు(24), వరంగల్ క్రిస్టియన్ కాలేజీకి చెందిన మౌనిక(23) హైదరాబాద్లోని యశోద హాస్పెటల్లో పనిచేస్తున్నారు.
వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వారి పెళ్లికి అభ్యంతరం తెలిపారు. దీంతో మనస్తాపం చెందిన ఇద్దరూ శుక్రవారం ఎల్లమ్మగుడిలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం పురుగుమందుతాగారు. అపస్మారక స్థితిలో ఉన్న వీరిని స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తున్నారు.