Italian marines
-
రూ.10 కోట్లు నష్టపరిహారం ఇచ్చాకే ఆ కేసు క్లోజ్ చేస్తాం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఇటాలియన్ మెరైన్స్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. బాధిత కుటుంబాలకు చెల్లించాల్సిన 10 కోట్ల రూపాయల నష్ట పరిహారం చెల్లిస్తేనే తాము ఈ కేసును మూసివేస్తామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం అనగా 2012, ఫిబ్రవరి 15న లో కేరళ తీరం వెంబడి చేపల వేటకు వెళ్ళిన జాలర్లను సముద్ర దొంగలుగా భావిస్తూ ఇటలీ ఓడ ‘ఎన్రికా లెక్సి’పై ఉన్న ఇటలీ మెరైన్లు సాల్వేటోర్ గిరోనే, మాసిమిలియానో లాటోరే కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు భారతీయ జాలర్లు చనిపోయారు. ఇందుకు కారకులైన మెరైన్స్ను ఇటలీ విచారించాలని అంతర్జాతీయ ట్రిబ్యూనల్ ఆదేశించింది. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాల్సిందిగా బాధిత కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బాధిత కుటుంబాలకు ఇటలీ ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వడానికి అంగీకరిస్తున్నట్లు కోర్టుకు తెలిపాడు. ఇరు దేశాల మధ్య సంబంధాలను దృష్టిలో ఉంచుకుని ఈ కేసును త్వరితగతిన ముగించాల్సిందిగా తుషార్ మెహతా ధర్మసనాన్ని కోరాడు. ఈ నేపథ్యంలో కోర్టు ఈ నెల 19న కేసును విచారిస్తామని తెలిపింది. ఈలోపు ఇటలీ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు చెల్లించే నష్టపరిహారం మొత్తాన్ని భారత ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేయాల్సిందిగా ఆదేశించింది. ఆ మొత్తాన్ని బాధిత కుటుంబాలకు పంచుతామని కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో ఇటలీ ప్రభుత్వం, కేంద్రం అకౌంట్ నంబర్ సెండ్ చేస్తే.. తాము బాధితుల కుంటుబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని ఆ ఖాతాలో జమ చేస్తామని తెలిపింది. దాంతో కేంద్రం ఈ రోజు అకౌంట్ నంబర్ని ఇటలీ ప్రభుత్వానికి సెండ్ చేసింది. డబ్బులు వచ్చిన మూడు రోజుల్లో ఆ మొత్తాన్ని సుప్రీంకోర్టు వద్ద డిపాజిట్ చేస్తామని కేంద్రం తెలిపింది. ఈ కేసును త్వరితగతిన విచారించాలన్న వ్యాఖ్యలపై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘‘మేం అన్ని కేసులను త్వరగానే పరిష్కరించాలనుకుంటాం. కానీ ప్రభుత్వమే గడువు కావాలని కోరి.. ఆలస్యం అయ్యేలా చేస్తుందంటూ’’ చురకలంటించింది. చదవండి: గతేడాది ఆత్మహత్య.. రూ.100 కోట్లు ఇప్పించండి -
గతేడాది ఆత్మహత్య.. రూ.100 కోట్లు ఇప్పించండి
తిరువనంతపురం: కేరళకు చెందిన ప్రిజిన్ అనే ఓ యువకుడు గత ఏడాది ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం అతడి కుటుంబం ఇటలీ నుంచి రూ. 100 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేస్తోంది. కేరళ యువకుడికి.. ఇటలీకి సంబంధం ఏంటనుకుంటున్నారా.. అయితే చదవండి. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం అంటే 2012లో కేరళ తీరం వెంబడి చేపల వేటకు వెళ్ళిన జాలర్లను సముద్ర దొంగలుగా భావిస్తూ ఇటలీ ఓడ ‘ఎన్రికా లెక్సి’పై ఉన్న ఇటలీ మెరైన్లు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు చనిపోయారు. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు ప్రిజిన్ అక్కడే ఉన్నాడు. అప్పుడు అతడి వయసు 14 సంవత్సరాలు. ఆ తర్వాత ఈ కేసు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంతర్జాతీయ ట్రిబ్యునల్‌కి చేరింది. ఈ క్రమంలో తాజాగా జాలర్ల మరణానికి సంబంధించి ప్రాణ నష్టానికి బదులుగా పరిహారం పొందేందుకు భారత్ అర్హత సాధించిందని ట్రిబ్యునల్ తెలిపింది. ఈ నేపథ్యంలో నాటి ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన ప్రిజిన్ కుటుంబం ఇటలీ నుంచి రూ.100 కోట్ల నష్ట పరిహారం ఇప్పించాల్సిందిగా కేంద్రాన్ని కోరుతుంది. ఈ సందర్భంగా ప్రిజిన్ కుటుంబ సభ్యులు ఈ నెల 6న కేంద్రానికి లేఖ రాశారు. దానిలో ‘‘ఎన్రికా లెక్సి’ సంఘటన 2012 ఫిబ్రవరి 15న జరిగింది. అప్పుడు ప్రిజిన్ అక్కడే ఉన్నాడు. నాటి ఘటనలో ప్రిజిన్ స్నేహితులు అజీష్ షింక్, మరోక మత్య్సకారుడు జెలాస్టిన్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటనతో అతడు షాక్‌కు గురయ్యాడు. తనకు కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలాయి’ అని తెలిపారు. (ఇటాలియన్ మెరైన్స్ కేసు: కీలక పరిణామం) అంతేకాక ‘ఈ దారుణానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన ప్రిజిన్కు అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇవ్వాల్సిన రక్షణ ఇవ్వలేదు. ఈ ఘటన తర్వాత అతడు డిప్రెషన్లోకి వెళ్లాడు. ప్రభుత్వం అతడికి సరైన వైద్య చికిత్స కూడా అందించలేదు. ఈ బాధతోనే అతడు గత ఏడాది ఆత్మహత్య చేసుకున్నాడు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ప్రిజిన్ నాటి ఘటనలో బాధితుడే. అతడికి ఇటలీ ప్రభుత్వం రూ.100 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలిందిగా కేంద్రం డిమాండ్ చేయాలి’ అని ప్రిజిన్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
ఇటాలియన్ మెరైన్స్ కేసు: కీలక పరిణామం
న్యూఢిల్లీ: కేరళకు చెందిన మత్స్యకారులను కాల్చి చంపిన ఇటలీ నావికాదళ అధికారులకు అంతర్జాతీయ ట్రిబ్యునల్‌లో ఎదురుదెబ్బ తగిలింది. 2012 నాటి ‘ఇటాలియన్ మెరైన్ కేసు’లో భారత్‌కు అనుకూలంగా ట్రిబ్యునల్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింది. ఇటలీ మిలిటరీ చర్యలు భారత పౌరుల హక్కుకు భంగం కలిగించి, నిబంధనలు ఉల్లంఘించాయన్న ట్రిబ్యునల్.. ఈ కేసులో భారత్ వాదనను సమర్థించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రాణ నష్టానికి బదులుగా పరిహారం పొందేందుకు భారత్ అర్హత సాధించిందని తెలిపింది. అంతేగాకుండా తమ అధికారులను బంధించినందుకు భారత్ పరిహారం చెల్లించాలన్న ఇటలీ వాదనను ట్రిబ్యునల్ తోసిపుచ్చినట్లు పేర్కొంది. అయితే నిందితులు ప్రభుత్వాధికారులు అయినందున వారిని భారత్‌లో విచారించే అవకాశం లేదని పేర్కొన్నట్లు తెలిపింది. కాగా 2012, ఫిబ్రవరి 15న సాల్వేటోర్ గిరోనే, మాసిమిలియానో లాటోరే ఇద్దరు ఇటలీ నావికదళాధికారులు దక్షిణ కేరళ తీరంలో ఇద్దరు మత్స్సకారులపై కాల్పులు జరపగా.. వారు మరణించారు. దీంతో ఫిబ్రవరి 19న కేరళ పోలీసులు ఇటలీ అధికారులను అరెస్టు చేశారు.(ఎస్ఆర్ఎస్ నివేదికలో షాకింగ్ విషయాలు) ఈ నేపథ్యంలో మే నెలలో కేరళ హైకోర్టు వారికి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. కొచ్చిని వీడి బయటకు వెళ్లకూడదని ఆదేశించింది. అయితే ఇటలీ సాధారణ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తమను అనుమతించాల్సిందిగా వారు భారత సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించడంతో.. కోర్టు ఇందుకు సానుకూలంగా స్పందించింది. బెయిల్ షరతులు సడలించి.. వారు స్వదేశానికి వెళ్లేందుకు అనుమతినిచ్చింది. ఇక ఆ తర్వాత వారిద్దరిని తిరిగి భారత్‌కు పంపించేందుకు ఇటలీ నిరాకరించింది. దీంతో భారత్- ఇటలీ మధ్య వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఘటన జరిగింది తమ జ్యురిడిక్షన్ పరిధిలోనే కాబట్టి.. విచారణ ఇక్కడే జరగాలని భారత్ పట్టుబట్టగా.. భారత సముద్ర జలాలకు ఆవల కాల్పులు జరిగాయి కాబట్టి అక్కడ తమ అధికారులను విచారించేందుకు వీల్లేదని ఇటలీ పేర్కొంది. తమ ఆయిల్ ట్యాంకర్లకు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలోనే తమ అధికారులు కాల్పులు జరిపారని వాదనకు దిగింది. దీంతో 2015లో నెదర్లాండ్స్‌లోని ది హేగ్‌లోని పర్మినెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌కు ఈ వ్యవహారం చేరుకుంది. అదే విధంగా రాజకీయ దుమారానికి తెరతీసింది. ఇటలీ హంతకులకు ఎవరు అండగా నిలిచారు? ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల్లో బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా బరిలో దిగిన నరేంద్ర మోదీ.. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో నిర్వహించిన ప్రచారంలో మాట్లాడుతూ.. ‘‘ఇటలీ హంతకులు ఇటలీకి వెళ్లడానికి బాటలు వేసింది ఎవరు? ఎవరి ఆదేశాలతో వారు అక్కడే ఉండిపోయారు? వారిని భారత్ వచ్చేందుకు ఏ శక్తులు అడ్డగించాయి?’’అంటూ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. ‘‘బాధితులైన అజీశ్ బింకి, జలాస్టిన్లకు న్యాయం జరిగేంత వరకు పోరాడతా. బాధితుల హక్కులను కాపాడతాను. కేరళ మత్స్యకారుల కోసం ఎవరితోనైనా యుద్ధం చేయడానికి నేను సిద్ధం’’ అంటూ వాగ్దానం చేశారు. ఈ క్రమంలో 2014లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడంతో ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఇటలీ అధికారులు మరోసారి సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అనారోగ్య కారణాలు చూపి వెసలుబాటు కల్పించాలని కోరారు. ఇక అప్పుడు విదేశాంగ మంత్రిగా ఉన్న దివంగత నేత సుష్మా స్వరాజ్ తమకు ఈ విషయంలో అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. దీంతో ఈ అంశం మరోసారి రాజకీయ విమర్శలకు దారితీసింది. -
ఇటాలియన్ మెరైన్స్పై న్యాయవిచారణ నిలిపివేత
న్యూఢిల్లీ: ఇటాలియన్ మెరైన్స్ ఇద్దరు భారత మత్స్యకారులను కాల్చిచంపిన కేసు మరో మలుపు తిరిగింది. నిందితులకు సంబంధించిన నేర విచారణ ప్రక్రయలన్నింటినీ భారత అత్యున్నత న్యాయస్థానం నిలిపివేసింది. ఇటాలియన్ మెరైన్స్ను శిక్షించే హక్కు భారత్‌కు లేదని, కేసుకు సంబంధించిన అన్ని వివరాలను సెప్టెంబర్ 24లోగా తనకు సమర్పించాలని యూనైటెడ్ నేషన్స్ ట్రిబ్యునల్ కోర్టు సోమవారం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ నిలిపివేత జనవరి 13 వరేకేనని కోర్టు పేర్కొంది. అసలేం జరిగింది? 2012 ఫిబ్రవరిలో ఇటలీకి చెందిన ఓ ఆయిల్ ట్యాంకర్ షిప్.. సింగపూర్ నుంచి ఈజిప్ట్ బయలుదేరింది. కేరళ తీరంలో తమ నౌకకు సమీపంగా వచ్చిన ఇద్దరు భారతీయ జాలర్లను ఇటలీ నావికులు విచక్షణా రహితంగా కాల్చిచంపారు. ఆ సమయంలో జాలర్ల వద్ద ఎలాంటి ఆయుధాలు కూడా లేవు. విషయం తెలుసుకున్న కేరళ పోలీసులు.. ఇటాలియన్ మెరైన్స్ పై ఐపిసీ 302 కింద కేసు నమోదుచేశారు. భారత ప్రభుత్వం కూడా వారిని లీగల్‌గా ప్రాసిక్యూట్ చెయ్యాలని నిర్ణయించింది. అయితే భారత్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇటలీ నౌకాదళం.. అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించింది. మూడేళ్ల విచారణ అనంతరం నిందితులను శిక్షించే అధికారం మన దేశానికి లేదని ఐక్యరాజ్య సమితి కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయవిచారణను నిలిపివేసినట్లు తెలిసింది.