అద్భుతమైన ఐఈసీసీ: ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
ఢిల్లీ: ఢిల్లీలో రీ డెవలప్ చేసిన ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ITPO) కాంప్లెక్స్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హవన్ పూజ నిర్వహించారు. ప్రగతి మైదాన్‌లో బుధవారం అధికారిక ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో ఈ అద్భుత నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులను ప్రధాని మోదీ సత్కరించారు, వారితో సంభాషించారు.123 ఎకరాల విస్తీర్ణంలో రూ.2700 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ అంతర్జాతీయ ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్ (ఐఈసీసీ) కాంప్లెక్స్‌ను జాతికి అంకితం చేయనున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు జరిగే భారీ ప్రారంభోత్సవ వేడుక కోసం ఆయన తిరిగి ఐటీపీఓకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా G20 స్టాంప్, నాణేలను ప్రధాని మోదీ విడుదల చేస్తారు.
ప్రధాన మంత్రి బుధవారం సాయంత్రం పునరుద్దరించిన ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్ (IECC) కాంప్లెక్స్‌ను అధికారికంగా ప్రారంభించి, ప్రసంగిస్తారు. ఈ కన్వెన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్ హాల్స్, యాంఫీథియేటర్‌లతో సహా బహుళ అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉందనీ, సమావేశాలను నిర్వహించడానికి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కలిగి ఉండాలనే మోదీ దృష్టికి అనుగుణంగా ఈ సెంటర్ రూపుదిద్దుకుందని పీఎంవో ప్రకటించింది.
Visuals of PM Modi performing Hawan Pujan at the inauguration of the redeveloped ITPO complex in Delhi. Several Union ministers are also present at the event.
(Source: Third Party) pic.twitter.com/JsNtfV2Thq
— Press Trust of India (@PTI_News) July 26, 2023
ITPO కాంప్లెక్స్ అని కూడా పిలుస్తున్న ఈ కాంప్లక్స్‌లో పెద్ద ఎత్తున ఈవెంట్లు, ట్రేడ్ ఫెయిర్లు, కాన్ఫరెన్స్‌లు ఎగ్జిబిషన్లకు కీలక వేదిక కానుంది. ఈ భవన సముదాయం భారతదేశం పారిశ్రామిక వృద్ధి, వాణిజ్యం, సాంస్కృతిక పరస్పర మార్పిడిని ప్రోత్సహించడంలో కీలకంగా మారనుంది. అలాగే సెప్టెంబరులో G20 నేతల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది.
ఆర్కిటెక్ట్ రాజ్ రేవాల్ రూపొందించిన, దేశానికి స్వాతంత్ర్యం పొందిన 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మించిన హాల్ ఆఫ్ నేషన్స్‌తో సహా ఇప్పటికే ఉన్న అనేక ఎగ్జిబిషన్ హాల్స్ కూల్చివేయబడిన తర్వాత 2017లో పునరాభివృద్ధికి సంబంధించిన పని ప్రారంభమైంది. వసుమారు 123 ఎకరాల క్యాంపస్ విస్తీర్ణంతో ప్రగతి మైదాన్ కాంప్లెక్స్ భారతదేశపు అతిపెద్దఎంఐసీఐ (మీటింగ్‌లు, ప్రోత్సాహకాలు, సమావేశాలు, ప్రదర్శనలు) కీలకవేదిక. ఆస్ట్రేలియాలోని ఐకానిక్ సిడ్నీ ఒపెరా హౌస్‌లో సీటింగ్ సామర్థ్యం 5500 కంటేమించి కన్వెన్షన్ సెంటర్ లెవల్ 3 వద్ద.. 7,000 సీటింగ్ సామర్థ్యం తో ఇది నిర్మాణమైంది. తద్వారా జర్మనీలోని హన్నోవర్ ఎగ్జిబిషన్ సెంటర్, షాంఘైలోని నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ (ఎన్ఈసీసీ)మాదిరిగా ఈ కాంప్లెక్స్ కూడా ప్రపంచంలోని టాప్ 10 ఎగ్జిబిషన్ , కన్వెన్షన్ కాంప్లెక్స్‌లలో ఒకటిగా ఉంది,.