IVF-test tube baby
-
ఐవీఎఫ్ సంతానానికి ఆ ప్రమాదం మరింత ఎక్కువ!
ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) ద్వారా సంతానం కోసం ప్రయత్నిస్తున్న దంపతులకు నిజంగా ఇది నిరాశ కలిగించే వార్త. యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో శుక్రవారం ప్రచురించిన అధ్యయనం ప్రకారం, ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన శిశువులలో గుండె లోపంతో పుట్టే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది.ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలకు గుండె జబ్బులు పెరుగుతున్నాయని స్వీడన్ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా జన్మించిన పిల్లలతో పోలిస్తే ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలకు గుండె జబ్బులు వచ్చే ముప్పు 36 శాతం ఎక్కువని చెప్పారు. అంతకాదు ఈ విధానం ద్వారా పుట్టిన కవల పిల్లల్లో రిస్క్ మరింత ఎక్కువని చెప్పారు. స్వీడన్ లోని గోథెన్ బర్గ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఉల్లా బ్రిట్ వెనర్ హాల్మ్ ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. హ్యూమన్ రీప్రొడక్షన్ జర్నల్ ఈ పరిశోధన వివరాలు ప్రచురితమైనాయి. ఫిన్లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వే దేశాలలో 1980 లలో జన్మించిన దాదాపు 77 లక్షల మంది చిన్నారుల హెల్త్ డేటాను అధ్యయన వేత్తలు పరిశీలించారు.ఈ అధ్యయనానికి స్వీడన్‌లోని గోథెన్బర్గ్ విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ ఉల్లా-బ్రిట్ వెన్నెర్హోమ్ నాయకత్వం వహించారు. ఆమె ఇలా చెప్పారు: ‘‘సహాయక పునరుత్పత్తి సాంకేతికత సహాయంతో గర్భం దాల్చిన శిశువులకు ఎక్కువ ప్రమాదాలు ఉన్నాయని మునుపటి పరిశోధనలు చూపిస్తున్నాయి. వీటిలో ముందస్తు జననం తక్కువ బరువుతో కూడిన జననాలున్నాయి. అయితే ఇలా జన్మించిన శిశువులకు గుండె లోపాల ప్రమాదం ఎక్కువగా ఉందా లేదా అనేది మరింత పరిశోధించాలనుకుంటున్నాము. .’’సాధారణ పద్ధతిలో జన్మించిన పిల్లలతో పోలిస్తే ఐవీఎఫ్ వంటి పద్ధతులలో జన్మించిన పిల్లల్లో గుండె లోపాలు ఎక్కువగా కనిపించాయన్నారుఉల్లా-బ్రిట్. బిడ్డ పుట్టిన సంవత్సరం, పుట్టిన దేశం, ప్రసవ సమయంలో తల్లి వయస్సు, గర్భధారణ సమయంలో తల్లి ధూమపానం చేసినట్లయితే లేదా తల్లికి మధుమేహం లేదా గుండె లోపాలు ఉన్నట్లయితే, పుట్టుకతో వచ్చే గుండె లోపాల ప్రమాదాన్ని పెంచే ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అయితే ఈ లోపాలను వీలైనంత తొందరగా గుర్తించి, చికిత్స అందించాలన్నారు.కాగా సహజంగా సంతానం కలగని దంపతులకు ఐవీఎఫ్ ఒక వరం లాంటిదని చెప్పవచ్చు. తాజా పరిశోధన కొంత ఆందోళన కలిగించినప్పటికీ, వైద్యుల పర్యవేక్షణలో ఇలాంటి ప్రమాదాలను తప్పించుకునే అవకాశాలున్నాయి. -
మూసేవాలా తల్లి ఐవీఎఫ్ చికిత్సపై నివేదిక ఇవ్వండి
న్యూఢిల్లీ: దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్‌కు 58 ఏళ్ల వయసులో ప్రసవానికి కారణమైన ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) చికిత్సపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ సేవలు పొందే మహిళ వయసు 21– 50 మధ్య ఉండాలి. మూసేవాలా హత్యకు గురైన రెండేళ్లకు ఆయన తల్లి చరణ్ కౌర్ మార్చి 17న మగబిడ్డను ప్రసవించారు. -
72 ఏళ్ల వయసులో తల్లయింది!
అమృత్ సర్: పంజాబ్ లోని అమృత్ సర్ కు చెందిన వృద్ధ దంపతుల కలలు 46 ఏళ్ల తర్వాత పండాయి. ఎందుకంటే పండంటి బిడ్డకు ఆ తల్లి ఏడు పదుల వయసులో జన్మనిచ్చింది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి... దల్జీందర్ కౌర్(72), మోహిందర్ సింగ్ గిల్(79) లు భార్యాభర్తలు. 46 ఏళ్ల కిందట వీరికి వివాహమైంది. మిగతా ఆడవాళ్లలా తాను తల్లిని కాలేకపోయానని ఎన్నో రోజులు కాదు.. సంవత్సరాలు వేదన చెందింది. కానీ, ఆమెకు మాత్రం కచ్చితంగా నమ్మకం ఉంది. తాను తల్లిని అవుతానని, చివరికి పండంటి బిడ్డకు జన్మనిచ్చి పరిపూర్ణ మహిళగా మారిపోయానంటూ ఆనందభాష్పాలతో దల్జీందర్ కౌర్ చెప్పింది. అసలే వివాహం అయి 46 ఏళ్లు అవుతుంది. మోనోపాస్ దశ దాటి రెండు దశాబ్దాలు కూడా గడచిపోయాయి. అలాంటి స్థితిలో ఇన్ విట్రో ఫర్టిలైజేషన్(ఐవీఎఫ్ - టెస్ట్ ట్యూబ్) గురించి విన్నారు. ఇందుకు తమ స్వస్థలం పంజాబ్, అమృత్ సర్ నుంచి హర్యానా లోని హిస్సార్ కు తరచు వెళ్లివచ్చేవారు. 2013 నుంచి హిస్సార్ లోనే ఉన్నామని తండ్రి అయిన మోహిందర్ సింగ్ చెప్పారు. గతంలో 70 ఏళ్ల వయసులో ఓ మహిళ తల్లి అయింది.. దల్జీందర్ కౌర్(72) మాత్రం అత్యధిక వయసులో తల్లి అయి గత రికార్డును తిరగరాశారు. 2013లో పేపర్ ప్రకటన చూసి ఆమె ఒంటరిగానే తమను సంప్రదించిందని టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకుడు, డాక్టర్ అనురాగ్ బిస్నోయ్ తెలిపారు. గర్భాశయం బయట అండాన్ని ఫలదీకరణం చెందించి తల్లి కావాలన్న ఆమె జీవిత కాల కోరికను తీర్చారు. రెండు సార్లు ఐవీఎఫ్ టెస్టులు ఫెయిలయ్యాను. చివరికి గతేడాది జూలైలో సంతోషకర వార్త విన్నారు. గత ఏప్రిల్ 19న పండంటి బిడ్డకు ఆమె జన్మనివ్వడంతో ఆ వృద్ధ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆర్మాన్ సింగ్ అనే పేరు పెట్టినట్లు తెలిపారు.