ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) ద్వారా సంతానం కోసం ప్రయత్నిస్తున్న దంపతులకు నిజంగా ఇది నిరాశ కలిగించే వార్త. యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో శుక్రవారం ప్రచురించిన అధ్యయనం ప్రకారం, ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన శిశువులలో గుండె లోపంతో పుట్టే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది.
ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలకు గుండె జబ్బులు పెరుగుతున్నాయని స్వీడన్ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా జన్మించిన పిల్లలతో పోలిస్తే ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలకు గుండె జబ్బులు వచ్చే ముప్పు 36 శాతం ఎక్కువని చెప్పారు. అంతకాదు ఈ విధానం ద్వారా పుట్టిన కవల పిల్లల్లో రిస్క్ మరింత ఎక్కువని చెప్పారు. స్వీడన్ లోని గోథెన్ బర్గ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఉల్లా బ్రిట్ వెనర్ హాల్మ్ ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. హ్యూమన్ రీప్రొడక్షన్ జర్నల్ ఈ పరిశోధన వివరాలు ప్రచురితమైనాయి. ఫిన్లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వే దేశాలలో 1980 లలో జన్మించిన దాదాపు 77 లక్షల మంది చిన్నారుల హెల్త్ డేటాను అధ్యయన వేత్తలు పరిశీలించారు.
ఈ అధ్యయనానికి స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్ విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ ఉల్లా-బ్రిట్ వెన్నెర్‌హోమ్ నాయకత్వం వహించారు. ఆమె ఇలా చెప్పారు: ‘‘సహాయక పునరుత్పత్తి సాంకేతికత సహాయంతో గర్భం దాల్చిన శిశువులకు ఎక్కువ ప్రమాదాలు ఉన్నాయని మునుపటి పరిశోధనలు చూపిస్తున్నాయి. వీటిలో ముందస్తు జననం తక్కువ బరువుతో కూడిన జననాలున్నాయి. అయితే ఇలా జన్మించిన శిశువులకు గుండె లోపాల ప్రమాదం ఎక్కువగా ఉందా లేదా అనేది మరింత పరిశోధించాలనుకుంటున్నాము. .’’
సాధారణ పద్ధతిలో జన్మించిన పిల్లలతో పోలిస్తే ఐవీఎఫ్ వంటి పద్ధతులలో జన్మించిన పిల్లల్లో గుండె లోపాలు ఎక్కువగా కనిపించాయన్నారుఉల్లా-బ్రిట్. బిడ్డ పుట్టిన సంవత్సరం, పుట్టిన దేశం, ప్రసవ సమయంలో తల్లి వయస్సు, గర్భధారణ సమయంలో తల్లి ధూమపానం చేసినట్లయితే లేదా తల్లికి మధుమేహం లేదా గుండె లోపాలు ఉన్నట్లయితే, పుట్టుకతో వచ్చే గుండె లోపాల ప్రమాదాన్ని పెంచే ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అయితే ఈ లోపాలను వీలైనంత తొందరగా గుర్తించి, చికిత్స అందించాలన్నారు.
కాగా సహజంగా సంతానం కలగని దంపతులకు ఐవీఎఫ్ ఒక వరం లాంటిదని చెప్పవచ్చు. తాజా పరిశోధన కొంత ఆందోళన కలిగించినప్పటికీ, వైద్యుల పర్యవేక్షణలో ఇలాంటి ప్రమాదాలను తప్పించుకునే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment