గొంతులో జామకాయ అడ్డుపడి చిన్నారి మృతి
పాల్వంచ రూరల్: జామకాయ తింటూ అది గొంతులో అడ్డుపడటంతో 8 నెలల చిన్నారి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం నాగారం శివారు రేపల్లెవాడలో సోమవారం జరిగింది. రేపల్లెవాడకు చెందిన కె.రవి, సుజాత దంపతుల రెండో కూతురు అమ్ములు సోమవారం సాయంత్రం ఇంట్లో జామకాయతో ఆడుకుంటూ తినబోయింది. ఆ జామకాయ గొంతులో ఇరుక్కుపోవడంతో అస్వస్థతకు గురైంది.
హుటాహుటిన స్థానిక ప్రైవేటు వైద్యునికి చూపించి అక్కడి నుంచి కొత్తగూడెంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగా చిన్నారి మృతి చెందింది.