జానారెడ్డి అలా మాట్లాడం సిగ్గుచేటు
నల్గొండ : ఎంసెట్ కౌన్సెలింగ్పై ఉన్నత విద్యామండలి తీసుకున్న నిర్ణయానికి, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదని విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కౌన్సెలింగ్ విషయంలో విద్యార్థులకు అన్యాయం చేయమని అన్నారు. రైతు ఆత్మహత్యలు, విద్యార్థులపై కేసుల గురించి జానారెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు అని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. జానారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే విద్యార్థులపై కేసులు ఉన్నాయని, మంత్రిగా ఆయన ఏనాడూ జిల్లాను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.