ప్రణవ స్వరూపా.. లక్ష్మీనరసింహా
ఐఎస్ జగన్నాథపురం (ద్వారకాతిరుమల): శ్రీకరుడు.. శుభకరుడు.. ప్రణవ స్వరూపాడైన లక్ష్మీనరసింహస్వామిని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం సుందరగిరిపై లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం విశేష పూజలు జరిగాయి. అమావాస్య కావడంతో భక్తులు అధికంగా తరలివచ్చారు. స్వామికి పానకాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. ప్రతి అమావాస్య రోజూ భక్తుల తాకిడి ఉంటుందని అర్చకులు తెలిపారు.