jaggesh
-
ఒక్క పైసా లేదు, దిక్కు తోచక గుడి ముందు.. నటుడు ఎమోషనల్
సాక్షి, యశవంతపుర (కర్ణాటక): నాకు కొడుకు పుట్టినప్పుడు చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. అప్పుడు తండ్రిగా ఓడిపోయాను అని ప్రముఖ నటుడు జగ్గేశ్ గతం గుర్తుచేసుకున్నారు. తన కొడుకు గురురాజ్‌కు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు జగ్గేశ్. '1987లో తండ్రినయ్యాను. అప్పట్లో పని లేదు, చిల్లర డబ్బులూ లేవు. తండ్రిగా ఓడిపోయాను. దిక్కుతోచని స్థితిలో మంత్రాలయం గురురాయర ముందు నిలిచి నా గోడును చెప్పుకున్నా' అని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదానికి గురైన నటుడి కొడుకు
చిక్కబళ్లాపురం: సినీ నటుడు జగ్గేశ్ కొడుకు యతిరాజ్ (29) రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బాగేపల్లి వైపు నుంచి బెంగళూరు వైపు వెళ్తుండగా గురువారం ఉదయం 11: 45 సమయంలో జాతీయ రహదారిపై అగలగుర్కి వద్ద సర్వీసు రోడ్డు నుంచి వచ్చిన బైకిస్టును తప్పించబోయి ఆయన బిఎండబ్ల్యూ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జు కాగా యతిరాజ్‌కు గాయాలు తగిలాయి. ఎస్పీ మిథున్‌కుమార్ విలేఖరులతో మాట్లాడుతూ యతిరాజ్‌కు చిక్కబళ్లాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి బెంగళూరు ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. బైకిస్టు సురక్షితంగా బయటపడ్డాడు. చదవండి: అందరికంటే ఎక్కువగా ఏడిపించే వ్యక్తి నువ్వే, అందుకే: నటి -
వెంకయ్యపై నటుడి ట్వీట్.. విమర్శల వెల్లువ
బెంగళూరు: భారత 14వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్య నాయుడును అభినందిస్తూ కన్నడ నటుడు జగ్గేశ్ ట్విటర్లో పోస్ట్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందని వెంకయ్య నాయుడుని రాష్ట్రం తరపున రాజ్యసభకు పంపడాన్ని వ్యతిరేకిస్తూ గతంలో నిరసనలు, ఆందోళనలు చేసారని.. ఇపుడు అదే వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారని ట్వీట్ చేశారు. దీనిపై అన్ని వర్గాల నుంచి జగ్గేశ్పై విమర్శలు వ్యక్తమయ్యాయి. జగ్గేశ్ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా కన్నడ ప్రజలను అవమానించే విధంగా ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు రావడంతో ఆయన తన ట్వీట్‌ను తొలగించారు. కన్నడిగ కాదన్న కారణంతో గతంలో వెంకయ్య నాయుడి రాజ్యసభ సభ్యత్వాన్ని చాలా మంది కర్ణాటక ప్రజలు వ్యతిరేకించారు. దీంతో ఆయనను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపాలన్న నిర్ణయాన్ని బీజేపీ అప్పట్లో మార్చుకుంది. కాగా, ఉపరాష్ట్రపతిగా ఎంపికైన తర్వాత తొలిసారిగా కర్ణాటక వచ్చిన వెంకయ్య నాయుడిని ఆదివారం బెంగళూరు ప్యాలెస్ మైదానంలో ఘనంగా సన్మానించారు. తనకు కర్ణాటకే రాజకీయ పునర్జన్మనిచ్చిందని ఈ సందర్భంగా వెంకయ్య వ్యాఖ్యానించారు. -
అంబరీష్‌ను తొలగించడం చారిత్రక తప్పిదం
హాస్య నటుడు జగ్గేష్ బొమ్మనహళ్లి (బెంగళూరు) : మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పదవిని కోల్పోయిన గృహనిర్మాణశాఖ మంత్రి అంబరీష్‌కు బీజేపీ నాయకుడు, శాండిల్‌వుడ్‌కే చెందిన హాస్యనటుడు జగ్గేష్ నుంచి మద్దతు లభించింది. ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పించి కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక తప్పిదానికి పాల్పడిందని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అందులో ఉన్న విషయాలు ‘రాజకీయనాయకులకు పదవులు ఉన్నప్పుడే గౌరవం ఉంటుంది. మంత్రిగా ఐదేళ్లు పని చేసి దిగిపోయిన తర్వాత ఎవరూ గౌరవించరు. అయితే అంబరీష్ రాజకీయ నాయకుడి కంటే కన్నడ నటుడిగా రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఆయన చిన్న పిల్లాడి మన స్థత్వం కలిగిన వారు. ఎటువంటి తప్పులు చేయలేదు. అయినా మంత్రి పదవి నుంచి తొలగించారు. ఇది చారిత్రాత్మక తప్పిందం. దీని వల్ల కన్నడిగుల ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ లోనయ్యింది.అందులో ఒక మహిళ చెప్పిన మాటలు విని ఆయన్ను తప్పించడం సరి కాదు’ అని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఎంపిగా ఎన్నికై మంత్రిగా ప్రజలకు సేవ చేస్తాను అని 1988లో అంబరీష్ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పుకొచ్చారన్నారు. చెప్పిన అన్ని పనులు చేశారు. 2018 నాటికి రాజకీయాల్లో బారీ మార్పులు చోటు చేసు కుంటాయని, అప్పడు ప్రజలు రాజకీయనాకులను మరిచిపోతారు. కాని అంబరీష్‌ను మరిచిపోరు.’ అని పేర్కొన్నారు. -
ఓడిన రమ్యపై విమర్శలు
ఎన్నికల్లో ఓటమి పాలైన నటి రమ్యపై కన్నడ హీరో ఘాటుగా విమర్శలు గుప్పించారు. దీంతో ఆయనపై రమ్య మండిపడుతున్నారు. తమిళంలో కుత్తు, పొల్లాదవన్, వానరం ఆయిరం తదితర చిత్రాల్లో నటించిన రమ్య కన్నడంలో ప్రముఖ హీరోయిన్గా వెలుగొందుతున్నారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. దీంతో నటనకు స్వస్తి చెప్పారు. ఆ సమయంలో నీర్ టోస్లాంటి కొన్ని చిత్రాలను అంగీకరించి ఆ తరువాత నటించలేదు. ఆ కారణంగా ఆ చిత్ర హీరో జగ్గేష్, దర్శకుడు విజయప్రసాద్ రమ్యపై తీవ్రంగా విమర్శించారు. రమ్య, జగ్గేష్ తరచు ట్విట్టర్లో ఢీకొంటూనే ఉన్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసిన రమ్య ఓటమిపాలయ్యారు. అంతేకాదు మళ్లీ నటిస్తానని ప్రకటించారు. దీంతో నటుడు జగ్గేష్ మరోసారి రమ్యపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్నికల్లో గెలిస్తే రమ్య మళ్లీ నటించేవారా? ఆమె సందర్భవాది అని ఎటు అవకాశం ఉంటే అటు దూకేసే మనస్తత్వం రమ్యదని విమర్శలు కురిపించారు. దీంతో జగ్గేష్‌పై రమ్య మండిపడుతున్నారు.