Jainoor
-
జైనూర్ ఘటన.. మానవ హక్కుల కమిషన్ నోటీసులు
న్యూఢిల్లీ, సాక్షి: మహిళపై అత్యాచారయత్నం, ఆపై హత్యాయత్నం ఘటనలతో రెండు వర్గాలు పరస్పర దాడులతో రణరంగంగా మారిన జైనూర్ ప్రస్తుతం కొద్దిగా కోలుకుంటోంది. మరోవైపు.. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ మంగళవారం తెలంగాణ సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ మొదటివారంలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఘటన.. ఆపై నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తీవ్రంగా పరిగణించింది ఎన్హెచ్ఆర్సీ. మీడియా ఆధారంగా వచ్చిన కథనాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. ఆ కథనాల్లో పేర్కొందే గనుక వాస్తవమైతే.. మానవ హక్కులకు తీవ్ర ఉల్లంఘన జరిగినట్లేనని అభిప్రాయపడింది. రెండువారాల్లోగా పూర్తి నివేదిక ఇవ్వాలంటూ తెలంగాణ చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు నోటీసులు పంపించింది.ఆ నివేదికలో.. ఎఫ్ఐఆర్తో పాటు బాధితురాలి ఆరోగ్య పరిస్థితి, ఆమెకు అందించిన కౌన్సెలింగ్.. ప్రభుత్వం తరఫున అందించిన పరిహార వివరాలను కూడా పొందుపర్చాలని సీఎస్, డీజీపీలకు స్పష్టం చేసింది. ఇదీ చదవండి: నిమజ్జన టైంలో కోరడం సరికాదు: తెలంగాణ హైకోర్టు -
రాష్ట్రంలో పాశవిక ప్రభుత్వం రాజ్యమేలుతోంది
గాం«దీ ఆస్పత్రి (హైదరాబాద్): రాష్ట్రంలో పాశవిక ప్రభుత్వం రాజ్యమేలుతోందని, రాష్ట్రం రావణకాష్టం కాకముందే ప్రజలంతా మేల్కొనాలని పలువురు బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. జైనూరు ఘటనలో గాయపడి.. సికింద్రాబాద్ గాం«దీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళ, అమె కుటుంబసభ్యులను శుక్రవారం పరామర్శించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. జైనూరులో ఆదివాసీ మహిళపై జరిగిన ఘటన అత్యంత దారుణమని, అత్యాచారం చేసి రాయితో ముఖంపై దాడి చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయని, నాగర్‌కర్నూలు, జైనూరు, హైదరాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, నల్లగొండ తదితర ప్రాంతాల్లో మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు మచ్చుకైనా కనిపించడం లేదని అన్నారు.తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో 1,900 అత్యాచారాలు, 2,600 హత్యలు, 230 ఆయుధాల కేసులు నమోదు అయ్యాయని ఆయన గణాంకాలతో వివరించారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం రక్షణకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందంటూ కేంద్ర హోంశాఖ అధికారులు, దేశ భద్రతా సలహాదారు మెచ్చుకున్నారని, పోలీస్ గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ భద్రతకు మారుపేరు అని కితాబు ఇచ్చారని గుర్తు చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన డీజీపీ బాధ్యతలు చేపట్టిన రెండు నెలల్లోనే నిర్మల్, సనత్‌నగర్, గోషామహల్, జైనూరులో మత కలహాలు చెలరేగాయన్నారు. మెదక్ మతకల్లోలాన్ని అదుపు చేయడంలో విఫలమైన ఎస్పీని హైదరాబాద్ ఈస్ట్‌జోన్ డీసీపీగా నియమించారని ఆక్షేపించారు. డయల్ 100 పనిచేయడంలేదని, మహిళల భద్రతపై జాతీయ మహిళా కమిషన్ స్పందించాలని, కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని కోరారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నిరంగాల్లో పూర్తిస్థాయిలో విఫలం అయ్యారని విమర్శించారు. ఆదివాసీ మహిళ దారుణ అత్యాచారానికి గురై చావుబ్రతుకుల్లో ఉంటే పరామర్శించే మానవత్వం లేదా అంటు రేవంత్‌రెడ్డిని ప్రశ్శించారు. జైనూరు ఘటనలో బాధిత మహిళలకు తక్షణ న్యాయం జరగాలని, రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేసేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కాగా, జైనూరు ఘటనలో నిందితుడికి వత్తాసు పలుకున్న వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని సునీతా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ముఠాగోపాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
తీజ్ సంబరాల్లో విషాదం: వ్యక్తి ఆత్మహత్య
జైనూర్ (ఆసిఫాబాద్): ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని ఆశేపల్లిలో జరిగిన తీజ్ వేడుకల్లో విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులు పండుగలో ఆనందంగా పాల్గొనగా ఇంట్లో ఉన్న ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. ఆశేపల్లి గ్రామానికి చెందిన జాదవ్ మెఘాజీ(30) శనివారం రాత్రి కుటుంబ సభ్యులు తీజ్ సంబరాల్లో ఉండగా ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మెఘాజీ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి సోదరుడు జగదీశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు, నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. చదవండి: కాపురానికి రావడం లేదని సెల్‌టవర్ ఎక్కి భర్త హల్చల్ చదవండి: తెలంగాణ సిగలో మరో అందం: వెలుగులోకి కొత్త జలపాతం -
అక్కలను చూసేందుకు వెళ్లి తమ్ముడి దుర్మరణం
జైనూర్, న్యూస్‌లైన్: మండలంలోని పొలాస గ్రామానికి చెందిన జాదవ్ అంబాదాస్, కవిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు హరిత, అశ్వని, కుమారుడు బాలాజీ ఉన్నారు. అంబాదాస్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తు న్నాడు. మండలంలోని రాసిమెట్ట ఆశ్ర మ పాఠశాలలో అశ్వని, హరిత ఆరో త రగతి చదువుతున్నారు. బాలాజీ పొలాసలోని పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. ఆశ్రమ పాఠశాలలో ఉన్న కూతుళ్లను చూసేందుకు తండ్రి అంబాదాస్ క్రమం తప్పకుండా వెళ్లేవాడు. మంగళవారం వారిని చూసేం దుకు వెళ్తూ ఈసారి బాలాజీ(8)ని వెంట తీసుకెళ్లాడు. జైనూర్‌లో ఆటో ఎక్కి రాసిమెట్ట పాఠశాల వద్ద దిగారు. ఆటో డ్రైవర్‌కు అంబాదాస్ డబ్బులు చెల్లిస్తుండగా బాలాజీ రోడ్డు దాటుతున్నాడు. ఇంతలో వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు అతడిని ఢీకొట్టింది. బాలాజీ అక్కడికక్కడే చనిపోయూడు. డ్రైవర్‌కు డబ్బులు చెల్లించి వెనుదిరిగేసరికి కొ డుకు మృతదేహం కనిపించడంతో అం బాదాస్ గుండెలవిసేలా రోదించాడు. తమ్ముడి రాక కోసం ఎదురుచూస్తున్న అక్కలు విషయం తెలిసి హతాశుల య్యూరు. పరుగున చేరుకుని మృతదేహంపై పడి కన్నీరుమున్నీరుగా విలపిం చారు. ఒక్కగానొక్క కొడుకు మృతితో తల్లి కవిత రోదన స్థానికులను కలచివేసింది. సంఘటన స్థలాన్ని సీఐ కాశ య్య, ఎస్సై కృణమూర్తి పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.