జైనూర్, న్యూస్‌లైన్: మండలంలోని పొలాస గ్రామానికి చెందిన జాదవ్ అంబాదాస్, కవిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు హరిత, అశ్వని, కుమారుడు బాలాజీ ఉన్నారు. అంబాదాస్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తు న్నాడు. మండలంలోని రాసిమెట్ట ఆశ్ర మ పాఠశాలలో అశ్వని, హరిత ఆరో త రగతి చదువుతున్నారు. బాలాజీ పొలాసలోని పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. ఆశ్రమ పాఠశాలలో ఉన్న కూతుళ్లను చూసేందుకు తండ్రి అంబాదాస్ క్రమం తప్పకుండా వెళ్లేవాడు.
మంగళవారం వారిని చూసేం దుకు వెళ్తూ ఈసారి బాలాజీ(8)ని వెంట తీసుకెళ్లాడు. జైనూర్‌లో ఆటో ఎక్కి రాసిమెట్ట పాఠశాల వద్ద దిగారు. ఆటో డ్రైవర్‌కు అంబాదాస్ డబ్బులు చెల్లిస్తుండగా బాలాజీ రోడ్డు దాటుతున్నాడు. ఇంతలో వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు అతడిని ఢీకొట్టింది. బాలాజీ అక్కడికక్కడే చనిపోయూడు. డ్రైవర్‌కు డబ్బులు చెల్లించి వెనుదిరిగేసరికి కొ డుకు మృతదేహం కనిపించడంతో అం బాదాస్ గుండెలవిసేలా రోదించాడు. తమ్ముడి రాక కోసం ఎదురుచూస్తున్న అక్కలు విషయం తెలిసి హతాశుల య్యూరు. పరుగున చేరుకుని మృతదేహంపై పడి కన్నీరుమున్నీరుగా విలపిం చారు. ఒక్కగానొక్క కొడుకు మృతితో తల్లి కవిత రోదన స్థానికులను కలచివేసింది. సంఘటన స్థలాన్ని సీఐ కాశ య్య, ఎస్సై కృణమూర్తి పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
అక్కలను చూసేందుకు వెళ్లి తమ్ముడి దుర్మరణం
Published Wed, Jan 1 2014 2:54 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement