Jala soudha
-
కాళేశ్వరం అధికారులపై NDSA కమిటీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన అధికారులు, ఇంజనీర్లపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ చీఫ్, సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ సీరియస్ అయ్యారు. శనివారం ప్రాజెక్టు పరిశీలన అనంతరం జలసౌధలో జరిగిన కీలక సమావేశంలో ఇది చోటు చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు తెలుసుకునే క్రమంలో అధికారుల తీరుపై అయ్యర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ భేటీలో కమిటీ అడిగిన ప్రశ్నలకు.. కొంతమంది అధికారులు క్లారిటీ లేని సమాధానాలిచ్చారు. అలాగే పలు ప్రశ్నలకు సమాధానాలు లేవంటూ నేరుగా చెప్పడంతో కమిటీ నిర్ఘాంతపోయింది. ఈ క్రమంలో.. ఇంజనీర్లు ఒకరిపై ఒకరు సాకులు చెప్పుకోవడంతో చంద్రశేఖర్ అయ్యర్ వాళ్లపై గరం అయ్యారు. ఇలా సమావేశంలో మూడుసార్లు ఆయన అధికారులపై సీరియస్ అయినట్లు సమాచారం. ఈ మీటింగ్‌లో నీటిపారుదల శాఖ అధికారులు, ప్రభుత్వ అధికారులతో పాటు ఈ మూడు బ్యారేజీలకు పని చేసిన వర్క్ ఏజెన్సీలు పాల్గొన్నాయి. అలాగే.. 2016 నుంచి ప్రస్తుతం (ఈనెల 8వ తేదీ దాకా) బ్యారేజీల ఇన్వెస్టిగేషన్, హైడ్రాలజీ, మోడల్ స్టడీస్, డిజైన్లు, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌లో పాల్గొన్నవారు.. ఆయా విభాగాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న వారితోపాటు బదిలీ అయినవారు, పదవీ విరమణ చేసినవారు కూడా విధిగా ఈ మీటింగ్‌కు హాజరు కావడంతో ఎన్డీఎస్ఏ కమిటీ కీలక సమాచారాన్నే రాబట్టే ప్రయత్ని చేసినట్లు స్పష్టమవుతోంది. ఇక తమ పర్యటన నేటితో ముగియడంతో ఆరుగురు సభ్యులతో కూడిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) కమిటీ బృందం ఢిల్లీకి పయనం అయ్యింది. అంతకు ముందు.. గురు, శుక్ర వారాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కమిటీ సందర్శించింది. భద్రత నడుమ.. కుంగిన ప్రాంతాలను పరిశీలించడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించింది. నాలుగు నెలల్లో ఈ కమిటీ తమ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. -
జలసౌధలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం
-
16న కృష్ణాబోర్డు భేటీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్, శ్రీశైలంలోని లభ్యత జలాలు, రెండు తెలుగు రాష్ట్రాల నీటి అవసరాలపై చర్చించేందుకు కృష్ణా బోర్డు ఈ నెల 16న జలసౌధలో భేటీ కానుంది. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాల ఎగువన లభ్యతగా ఉన్న జలాల పంపిణీ, వాటాకు మించి ఏపీ చేసిన వినియోగం, భవిష్యత్ అవసరాలకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఇందులో చర్చించనున్నారు. దీనికి బోర్డు సభ్య కార్యదర్శి పరమేశంతో పాటు తెలుగు రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శులు, ఈఎన్సీలు హాజరు కానున్నారు. టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు అంశంతో పాటు బోర్డు వర్కింగ్ మాన్యువల్ అంశాలను ఎజెండాలో చేర్చారు. -
నేడు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్, శ్రీశైలంలోని లభ్యత జలాలు, ఇరు తెలుగు రాష్ట్రాల నీటి అవసరాలపై చర్చించేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ శుక్రవారం మధ్యాహ్నం జలసౌధలో భేటీ కానుంది. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాల ఎగువన లభ్యతగా ఉన్న 36 టీఎంసీల జలాల్లో ఏపీ కోటా పూర్తయిన నేపథ్యంలో భవిష్యత్ అవసరాలకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఇందులో చర్చించనున్నారు. దీనికి బోర్డు సభ్య కార్యదర్శి పరమేశంతో పాటు తెలుగు రాష్ట్రాల ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్రావులు హాజరు కానున్నారు. లభ్యత జలాల నుంచే సర్దుబాటు చేయడమా.. లేక కనీస నీటి మట్టాలకు దిగువకు వెళ్లి నీటిని తోడటమా అనే దానిపై భేటీలో చర్చించనున్నారు. -
‘మిషన్ కాకతీయ’
ఉన్నతాధికారుల సమీక్షలో మంత్రి హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ‘మిషన్ కాకతీయ’తో ప్రజలకు అనుభవమయ్యేలా సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టాలని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు అధికారులను కోరారు. ఎర్రమంజిల్‌లోని జలసౌధలో మంగళవారం ఆ శాఖ ఉన్నతాధికారులతో పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణ పనులు పారదర్శకంగా జరగాలని, ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా పనిచేయాలని సూచించారు. ఎస్ఈలు, ఈఈలు, ప్రతిరోజూ ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించి పనులను పర్యవేక్షించాలని, వాటి పురోగతిపై ప్రభుత్వానికి నివేదికలు పంపాలని ఆదేశించారు. ఫీడర్ చానల్స్ ఆక్రమణల తొలగింపులో సమస్యలు ఉత్పన్నమైతే జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలన్నారు. ప్రతి వారం తాను కూడా వివిధ జిల్లాల్లో పర్యటిస్తానన్నారు. ఈనెల 4న మహబూబ్‌నగర్, 5న మెదక్, 11న వరంగల్ జిల్లాల్లో పర్యటించి ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తానన్నారు. వ్యవసాయ శాఖ మొబైల్ లేబొరేటరీల ద్వారా పూడిక మట్టి సారాన్ని పరీక్షించి, ఫలితాలను పత్రికలు, టీవీ చానల్స్ ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. సమీక్షలో భాగంగా మిషన్ కాకతీయకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకున్నారు. వికేంద్రీకరించిన విధంగానే టెండర్లు వేసే (క్లాస్ 4, 5) కాంట్రాక్టర్ల అర్హతను రూ.10 లక్షల నుంచి రూ.50 ల క్షలకు పెంచాలని ఉన్నతాధికారులు కోరగా, ఈ విషయమై ప్రభుత్వానికి వెంటనే ఫైల్ పంపాల్సిందిగా ఇంజనీర్ ఇన్ చీఫ్‌ను మంత్రి ఆదేశించారు. - ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని రూ.50 లక్షలకు పెంచాలన్నారు. - వివిధ సర్కిళ్ల పరిధిలో ఏఈఈ/ఏఈ పోస్టుల్లో 20 శాతం రిటైర్డ్ ఇంజనీర్లతో నింపాలని నిర్ణయించారు. కొత్త నియామకాలు జరిగే వరకు ఈ వ ్యవస్థను కొనసాగిస్తామన్నారు. - డిసెంబర్ 15 నాటికి 20 శాతం చెరువుల సర్వే, అంచనాలు పూర్తి కావాలని, నెలాఖరు కల్లా అన్ని చెరువులకు టెండర్లను ప్రకటించాలన్నారు. - పనుల నాణ్యతలో ఈఎన్సీ ఆధ్వర్యంలో ప్రత్యేక క్వాలిటీ కంట్రోల్ బృందాలు ఏర్పాటు చేసి, ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నివేదికలను ప్రభుత్వానికి నేరుగా పంపాలన్నారు. - చెరువుల పురోగతిని పర్యవేక్షించేందుకు జిల్లా చీఫ్ ఇంజనీర్లకు బాధ్యతలు అప్పగించారు. వీరంతా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వారానికి కనీసం 10 చెరువులను సందర్శించాల్సి ఉంటుంది.