
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్, శ్రీశైలంలోని లభ్యత జలాలు, రెండు తెలుగు రాష్ట్రాల నీటి అవసరాలపై చర్చించేందుకు కృష్ణా బోర్డు ఈ నెల 16న జలసౌధలో భేటీ కానుంది. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాల ఎగువన లభ్యతగా ఉన్న జలాల పంపిణీ, వాటాకు మించి ఏపీ చేసిన వినియోగం, భవిష్యత్ అవసరాలకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఇందులో చర్చించనున్నారు. దీనికి బోర్డు సభ్య కార్యదర్శి పరమేశంతో పాటు తెలుగు రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శులు, ఈఎన్‌సీలు హాజరు కానున్నారు. టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు అంశంతో పాటు బోర్డు వర్కింగ్ మాన్యువల్ అంశాలను ఎజెండాలో చేర్చారు.