నయీం అనుచరుల బెదిరింపు
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
వేములవాడ రూరల్ : మండలంలోని శాత్రాజుపల్లి గ్రామానికి చెందిన పాసం జలపతి తనను నయీం అనుచరులు బెదిరించారని గురువారం సాయంత్రం వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2006లో నయీమ్ అనుచరులు తనను బెదిరించి రూ.30 లక్షలు తీసుకున్నారని తెలిపాడు. మళ్లీ బుధవారం రాత్రి నలుగురు ముఖానికి ముసుగు ధరించి, తన ఇంటికి వచ్చారని, మీరెవరని అడిగితే నయీమ్ అనుచరులమని చెప్పారని పేర్కొన్నాడు. తమకు డబ్బు కావాలని చెప్పి వెళ్లారని పోలీసులకు తెలిపాడు. అయితే నయీమ్ అనుచరులు వచ్చి బెదిరించిన దాఖలాలు కనబడడం లేదని సీఐ శ్రీనివాస్ తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.