Jallianwala Bagh fire
-
80 ఏళ్లు పూర్తి.. అయినా గుండెలపై మానని గాయం
కొరాపుట్(భువనేశ్వర్): అది 1942 ఆగస్టు 24వ తేదీ. భారతదేశ చరిత్రలో అత్యంత అమానవీయ ఘటన జలియన్ వాలా బాగ్ దురంతం వంటి ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. బ్రిటీష్ సైనికుల కాల్పులకు 19 మంది స్వాతంత్య్ర సమరయోధులు అశువులు బాశారు. నబరంగ్‌పూర్ జిల్లా పపడాహండి సమితి టురి నది ఒడ్డున అమరులయ్యారు. నాటి రోజుల్లోకి వెళ్తే.. దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న రోజులవి. జాతిపిత మహాత్మా గాంధీ పిలుపు దక్షిణ ఒడిశాకు చేరడంతో అవిభక్త కొరాపుట్ జిల్లాలోని దండకారణ్యంలో మన్యంవీరుల్లో కదలిక వచ్చింది. నందాహండి, తెంతులకుంటి, జొరిగాం, డాబుగాం, పపడాహండి సమితుల్లో క్విట్ ఇండియా ఉద్యమం ర్యాలీల నిర్వహణకు సన్నాహాలు జరిగాయి. 1942 ఆగస్టు 14న స్థానిక సమరయెధుడు మాధవ ప్రధాని భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చాడు. ఈ సభ నబరంగ్‌పూర్ సమీపంలోని చికిలి వద్ద జరగాల్సి ఉంది. సుమారు 200 మంది ప్రజలు గూమిగూడారు అని తెలిసి పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే చికిలి నది ఒడ్డుకు ఎవరూ చేరకుండా వంతెన కూల్చివేశారు. ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం ఈ సంఘటనతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. స్వాతంత్య్ర సమరయెధుడు సోను మజ్జి నేతృత్వంలో ఉద్యమకారులు జఠాబల్ వంతెన కూల్చివేశారు. ఆగస్టు 24వ తేదీన సుమారు 500 మంది ఉద్యమకారులు పపడాహండి వద్ద టురి నదిపై ఉన్న వంతెన కూల్చి వేయడానికి బయల్దేరారు. వీరికి మాధవ ప్రధానితో ఉన్న 200 మంది ఉద్యమకారులు జత కలిశారు. దీంతో వీరిని నిలువరించేందుకు జయపురం, నబరంగ్పూర్ల నుంచి రిజర్వ్ పోలీసు బలగాలు టురి నది ఒడ్డుకు చేరుకున్నాయి. వంతెనకు ఒకవైపు పోలీసులు మరోవైపు ఉద్యమకారులు ఉన్నారు. ఉద్యమకారులు వంతెనపైకి రావడంతో పోలీసులు కాల్పులు జరిపారు. నదిలో రక్తం ప్రవహించిన వేళ పోలీసుల కాల్పులకు అక్కడికక్కడే 11 మంది స్వాతంత్య్ర సమరయోధులు కనుమూశారు. మరో 7గురు నబరంగ్‌పూర్ ఆస్పత్రిలో చనిపోయారు. పదుల సంఖ్యలో నదిలో పడి గల్లంతయ్యారు. అనేక మంది శాశ్వత దివ్యాంగులుగా మారారు. 140 మంది అరెస్టై జైలు పాలయ్యారు. ఫలితంగా టురి నది రక్తంతో పారినట్లు నాటి ప్రత్యక్ష సాకు‡్ష్యలు పేర్కొన్నారు. స్వాతంత్య్ర అనంతరం గల్లంతైన వారి కోసం గాలించినా లాభం లేకపోయింది. 1980 ఆగస్టు 24న అదే చోట అప్పటి రాష్ట్ర మంత్రి, స్వాతంత్య్ర సమరయెధుడు రాధాకృష్ట విశ్వాస్ రాయ్, స్థానిక ఎమ్మెల్యే హబిబుల్లాఖాన్లు సాయుధ స్థూపం కోసం శంకుస్థాపన చేశారు. 1984 మే 23న అప్పటి రాష్ట్ర గవర్నర్ విశ్వనాథ్ పాండే ఈ స్థూపాన్ని ప్రారంభించారు. స్థూపం మీద చనిపోయిన 19 మంది ఉద్యమకారుల పేర్లు లిఖించారు. నాటి నుండి నేటి వరకు అగస్టు 24న ఉద్యమకారుల కుటుంబాలను అక్కడ సత్కరిస్తున్నారు. వారి ఆచారాలకు అనుగుణంగా టురి నదిలో పిండ ప్రధానం చేస్తున్నారు. అనంతరం 2011లో డాబుగాం ఎమ్మెల్యే భుజబల్ మజ్జి తన కోటా నిధులతో అక్కడ స్మారక మందిరం నిర్మించారు. ప్రభుత్వం 24 మంది స్వాతంత్య్ర సమరయెధుల విగ్రహాలు, 100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు చేసింది. ఈ ఏడాది బుధవారం జరగనున్న కార్యక్రమానికి కలెక్టర్ డాక్టర్ కమలోచన్ మిశ్రా మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. -
అమరవీరులను అవమానించడమే
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జలియన్‌వాలా బాగ్ మెమోరియల్ ఆధునీకరణ పనులను ‘అమరవీరులకు కలిగిన అవమానం’గా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బలిదానం అంటే అర్ధం తెలియని వారే ఇలా అవమానించగలరని ప్రధాని మోదీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘నేను అమరవీరుడి కొడుకును. అమరులకు కలిగిన అవమానాన్ని ఏ మాత్రం సహించబోను. స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకోని వారు దీనిని అర్థం చేసుకోలేరు’ అని పేర్కొన్నారు. జలియన్ వాలాబాగ్ మెమోరియల్ సముదాయంలో ఆధునీకరణ పేరుతో చేసిన మార్పులు, చేర్పులు చరిత్రను నాశనం చేసేవిగా ఉన్నాయంటూ వెల్లువెత్తుతున్న విమర్శలపై ఒక మీడియా కథనాన్ని మంగళవారం ఆయన ట్విట్టర్లో ట్యాగ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన మార్పులు బ్రిటిష్ పాలన, జనరల్ డయ్యర్ పాల్పడిన అకృత్యాలను ప్రజలకు స్మరణకు తెచ్చేలా చేయడానికి బదులు..తుడిచేసేలా ఉన్నాయని కాంగ్రెస్ నేత జైవీర్ షేర్గిల్ ఆరోపించారు. ఆధునీకరించిన జలియన్ వాలాబాగ్ మెమోరియల్ సముదాయాన్ని శనివారం ప్రధాని మోదీ జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కూడా ఉన్నారు. కొత్తగా చేపట్టిన మార్పులపై కాంగ్రెస్ నేత రాహుల్ విమర్శలు కురిపించగా అదే పార్టీకి చెందిన సీఎం అమరీందర్ మాత్రం ప్రశంసలు కురిపించడం గమనార్హం. జలియన్‌వాలా బాగ్ మెమోరియల్ సముదాయం ఆధునీకరణ అనంతరం చూడటానికి చాలా బాగుందన్నారు. ఈ సముదాయంలో ఏఏ నిర్మాణాలను తొలగించారో తనకు తెలియదన్నారు. రాహుల్ ట్విట్టర్లో విమర్శించిన విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. -
భారతీయులకు దన్నుగా భారత్..!
అమృత్సర్: ప్రపంచంలో భారతీయులు ఎక్కడ ఆపదలో ఉన్నా, సాయం చేసేందుకు యావద్భారతం ముందుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ భరోసానిచ్చారు. అఫ్గాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తరలించడంలో ఎన్ని కష్టాలు ఎదురైనా వెనక్కుతగ్గమన్నారు. అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్ మెమోరియల్‌ను సుందరీకరించి దేశానికి అంకితం చేసే కార్యక్రమంలో ఆయన వీడీయోలైన్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ దేవీ శక్తి గురించి మాట్లాడారు. ఆపరేషన్ దేవీ శక్తిలో భాగంగా పలువురు స్వదేశీయులను అఫ్గాన్ నుంచి ఇండియాకు తీసుకువస్తున్నారు. ఈ తరలింపులో భాగంగా ప్రజలతో పాటు పవిత్రమైన సిక్కు మత గ్రంధాలను కూడా వెనక్కు తెచ్చామని మోదీ తెలిపారు. గురు కృప(సిక్కు గురువుల ఆశీస్సులు)తో ఈ కష్టమైన కార్యాన్ని సమర్ధవంతంగా భారత్ నిర్వహిస్తోందన్నారు. కోవిడ్ కావచ్చు, అఫ్గాన్ సంక్షోభం కావచ్చు... భారతీయులకు కష్టం వస్తే భారత్ వెంటనే ఆదుకుంటుందనే సందేశమిచ్చారు. ఇటీవల కాలంలో మానవాళి ఎదుర్కొంటున్న కఠిన సవాళ్లను ఎదుర్కోవడంలో గురువుల బోధనలు ఎంతగానో ఉపయోగపడతాయని కొనియాడారు. గురువులు చూపిన మార్గాన్ని అనుసరించి నూతన చట్టాలను తీసుకువచ్చామని పరోక్షంగా సీఏఏ గురించి ప్రస్తావించారు. ఆత్మనిర్భరత్వం, ఆత్మ విశ్వాసం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. పునరుద్ధరించిన జలియన్ వాలాబాగ్ మెమోరియల్ సముదాయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆనాటి ‘జలియన్‌వాలా మారణకాండ’లో వీరమరణం పొందిన వారి కోసం రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. సముదాయం అభివృద్ధికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. స్మారక సముదాయంలో ఉన్న ఉపయోగంలో లేని భవనాల్లో 4 మ్యూజియం గ్యాలరీలను కొత్తగా ఏర్పాటు చేసింది. నవీకరించిన సముదాయంలో జలియన్‌వాలా మారణకాండ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై దృశ్య, శ్రవణ ప్రదర్శనను అందుబాటులోకి తెచ్చింది. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా 1919 సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీన జలియన్‌వాలాలో సమావేశమైన వేలాది మందిపై బ్రిటిష్ సైనికులు విచక్షణా రహితంగా జరిగిన కాల్పుల్లో వేయి మంది పౌరులు నేలకొరగ్గా, వందలాదిగా గాయాలపాలైన విషయం తెలిసిందే. -
తప్పే.. కానీ క్షమాపణ చెప్పం!
జలియన్‌వాలా బాగ్ మారణకాండ.. భారత స్వాతంత్య్ర చరిత్రలో అత్యంత భయంకరమైన పీడకల. ఈ మారణహోమానికి వందేళ్లు పూర్తికావస్తున్నా.. దానికి కారణమైన బ్రిటిష్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తోందే తప్ప.. ఆనాటి గాయాలను మాన్పేందుకు ఎన్నో రోజులుగా డిమాండ్ చేస్తున్న ‘క్షమాపణ’ మాత్రం చెప్పడంలేదు. లండన్: జలియన్‌వాలా బాగ్ ఘటనకు బ్రిటిష్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సిందేనని లండన్ మేయర్ సాదిక్ ఖాన్ మరోసారి డిమాండ్ చేశారు. 1919లో జరిగిన ఈ మారణహోమం బ్రిటిష్ చరిత్రకు మాయని మచ్చగా మిగిలిందన్నారు. వేలాదిమంది భారతీయుల కుటుంబాల్లో దుఃఖాన్ని మిగిల్చిన దుర్ఘటనకు త్వరలోనే వందేళ్లు పూర్తవుతున్న విషయాన్ని సాదిఖ్ గుర్తుచేశారు. భారతీయులకు క్షమాపణ చెప్పేందుకు ఇదే సరైన సమయమని సాదిఖ్ అభిప్రాయపడ్డారు. ఓ వాణిజ్య కార్యక్రమం కోసం భారత్‌కు వచ్చిన ఆయన జలియన్‌వాలా బాగ్ ఘటన చోటుచేసుకున్న ప్రాంతాన్ని సందర్శించి, అమరులకు నివాళులర్పించారు. గతంలో కూడా.. : గతంలో కూడా బ్రిటిష్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ భారత పర్యటనకు వచ్చినప్పుడు జలియన్‌వాలా బాగ్ ఘటనను అత్యంత దురదృష్టకరమైనదిగా అభివర్ణిస్తూ విచారం వ్యక్తం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం తలదించుకునే ఘటనగా కూడా అభివర్ణించారు. అప్పటి డయ్యర్ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కూడా ప్రకటించారు. అయితే క్షమాపణ చెప్పడాన్ని దాటవేశారు. 1997లో బ్రిటిష్ రాణి ఎలిజబెత్, ఆమె భర్త, ప్రిన్స్ ఫిలిప్లు ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పటికీ క్షమాపణలు మాత్రం చెప్పలేదు. ‘నేను చాలా స్పష్టంగా చెబుతున్నా. నాటి దురాగతానికి బ్రిటిష్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పేందుకు ఇదే సరైన సమయం. బాధితుల గాయాలకు బ్రిటిష్ ప్రభుత్వం చెప్పే క్షమాపణలే మందు. ఈ విషయమై బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు నా వంతుగా కృషి చేస్తూనే ఉంటా’ – లండన్ మేయర్, సాదిక్ ఖాన్ -
కాల్ధరి కాల్పులు గుర్తున్నాయ్
జలియన్ వాలాబాగ్ .. స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో నెత్తుటి మరకల్ని మిగిల్చిన విషాద ఘట్టం. స్వేచ్ఛాస్వాతంత్య్రాల కోసం అలనాడు జలియన్ వాలాబాగ్‌లో సమావేశమైన భారతీయులను బ్రిటిష్ పోలీసులు విచక్షణా రహితంగా కాల్చి చంపారు.కాల్ధరి కాల్పులు.. కరవు కోరల నుంచి పంటను రక్షించుకునేందుకు.. చంద్రబాబు ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఉద్యమించిన అన్నదాతలపై పోలీసులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు అసువులు బాశారు. మరో 11 మంది క్షతగాత్రులయ్యారు. ఈ రెండు ఘటనలకు తేడా ఒకటే.. అది తెల్లదొరల పాలన.. ఇది నల్లదొరల ముసుగులో చంద్రబాబు పాలన.. కాల్ధరి ఘటన జరిగి 18 ఏళ్లు పూర్తి కావస్తోంది. వందలాది రైతుల వేదనను పట్టించుకోని గుడ్డిదర్బార్ వారిపై బుల్లెట్ల వర్షం కురిపించమని ఆదేశించింది. దీంతో రెచ్చిపోయిన పోలీసులు కాల్ధరి రైల్వేస్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులపై విరుచుకుపడ్డారు. ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే కాల్పులు జరిపి అన్నదాతలను పొట్టన పెట్టుకున్నారు. ఈ విషాద ఘటన గుర్తొచ్చినప్పుడల్లా కాల్ధరి ప్రజలే కాదు.. జిల్లాలోని రైతులంతా ఉలిక్కిపడుతుంటారు. ఉండ్రాజవరం, న్యూస్‌లైన్ :అది 1996.. సెప్టెంబర్ 6.. పచ్చటి పొలాలతో.. ప్రశాంతంగా ఉండే కాల్ధరి గ్రామంలో పోలీసు తూటాలు మారణహోమం సృష్టించాయి. రైతు పోరాటాల చరిత్రలో నెత్తుటి మరకల్ని మిగి ల్చాయి. పరాయిపాలన నుంచి దేశాన్ని విముక్తం చేసేందుకు విప్లవ సింహం అల్లూరి ప్రాణాలర్పిస్తే.. ప్రజాస్వామ్యం మసుగులో నియంత నెపోలియన్లా వ్యవహరించిన చంద్రబాబు పాలనలో పోలీసు తూటాలకు రైతులనే వరి కంకులు నేలవాలారుు. చంద్రబాబు పాలనలో ఉద్యమాలంటే ఊహామాత్రంగా సహించలేకపోయేవారు. రైతుల పేరు చెబితే ఆగ్రహంతో ఊగిపోయేవారు. కరువు విలయతాండవం చేస్తుంటే.. పచ్చని పంట పొలాలు నోళ్లు తెరుచుకుని నీటితడి కోసం ఎదురుచూస్తుంటే.. పంటను కాపాడుకునేం దుకు ధర్మాగ్రహంతో రోడ్డెక్కిన రైతన్నలకు అప్పటి టీడీపీ ప్రభుత్వం తూటాలను నజరానాగా ఇచ్చింది. నీటితీరువా, విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ శాంతియుత ఆందోళన చేస్తున్న రైతులను నిర్ధాక్షిణ్యంగా పోలీసులతో కాల్చి చంపించింది. ఈ దుర్మార్గ ఘటనలో ఆలపాటి రామచంద్రరావు (కాల్ధరి), గన్నమని కృష్ణారావు (వేలి వెన్ను) ప్రాణాలు కోల్పోయూరు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసిన వారిని సైతం వదిలిపెట్టకుండా తరిమితరిమి మరీ కాల్చారు. ఈ ఘటనలో మరో 11మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా మారగా.. వైద్యులు వారిని బతికించగలిగారు. కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయ్.. పచ్చటి పంట పొలాల నడుమ ఓడిన రైతన్నల రక్తధారలు గ్రామస్తుల కళ్లముందు నేటికీ కదలాడుతూనే ఉన్నాయి. పోలీసు కాల్పుల్లో సామాన్య రైతులు ఆలపాటి రామచంద్రరావు, గన్నమని కృష్ణారావు అసువులు బాయటంతో వారి కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయాయి. అభం శుభం తెలియని చిన్న పిల్లలు.. వితంతువులైన ఆడపడుచులు ఆదుకునే దిక్కులేక అల్లాడిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్య వాదులు, రైతు సంఘాలు ఉద్యమించడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేసింది. బాధితుల కుటుం బాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించకతప్పలేదు. భర్త ఆలపాటి రామచంద్రరావు పోలీసు కాల్పుల్లో మరణించిన కొద్దిరోజులకే ఆయన భార్య భద్రమ్మ కుమారుడిని కోల్పోయి ఏకాకిగా మిగిలారు. భద్రమ్మ ఇప్పటికీ ఒంటరిగా కాల్ధరిలోని పెంకుటింట్లో బతుకు భారంగా ఈడ్చుకొస్తున్నారు. కాల్పుల్లో మరణించిన రెండో వారైన గన్నమని కృష్ణారావు వేలివెన్ను గ్రామానికి చెందిన సన్నకారు రైతు. ఆయన మరణించే నాటికి ఆ దంపతుల ముగ్గురు పిల్లలు చిన్నవారే.వారిని పెంచి పెద్దచేయడానికి భార్య తులసీ రత్నం పడిన అవస్థలు అన్నీఇన్నీకావు. అలనాటి దుశ్చర్యను ఆ కుటుంబాలు తలచుకోని రోజు లేదు. సృ్మతిపథంలో... పోలీస్ కాల్పులో అసువులు బాసిన అమర వీరుల జ్ఞాపకార్థం కాల్ధరి రైల్వే స్టేషన్ రోడ్డు పక్కన ఆలపాటి రామచంద్రరావు విగ్రహాన్ని, వేలివెన్నులో చెరువు పక్కన గన్నమని కృష్ణారావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అవి అలనాటి ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎదిరించి ప్రాణాలను బలిదానం చేసిన ఘటనను నేటికీ గుర్తు చేస్తూనే ఉన్నారుు. నాకు జరిగిన నష్టం ఎంతని చెప్పను 18 ఏళ్ల క్రితం జరిగిన ఆ విషాద ఘటన ఇంకా నా కళ్లముందే మెదులుతోంది. కరెంటు చార్జీలు, నీటితీరువా తగ్గించాలని అడిగిన పాపానికి నా భర్తను ప్రభుత్వం కాల్చి చంపించింది. ఎక్స్‌గ్రేషియా అంటూ రూ.లక్ష చేతిలో పెట్టారు. కుటుంబ యజ మానిని కోల్పోయి.. చిన్న పిల్లలతో నేనుపడ్డ బాధలు అన్నీఇన్నీ కావు. నా భర్త లేని లోటును ఏ ప్రభుత్వం పూడ్చలేదు. నా భర్త ప్రాణాలకు వెలకట్టలేరు. మేం పడిన ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. -ఆలపాటి రామచంద్రరావు భార్య భద్రమ్మ, కాల్ధరి