జలియన్ వాలాబాగ్ .. స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో నెత్తుటి మరకల్ని మిగిల్చిన విషాద ఘట్టం. స్వేచ్ఛాస్వాతంత్య్రాల కోసం అలనాడు జలియన్ వాలాబాగ్‌లో సమావేశమైన భారతీయులను బ్రిటిష్ పోలీసులు విచక్షణా రహితంగా కాల్చి చంపారు.కాల్ధరి కాల్పులు.. కరవు కోరల నుంచి పంటను రక్షించుకునేందుకు.. చంద్రబాబు ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఉద్యమించిన అన్నదాతలపై పోలీసులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు అసువులు బాశారు. మరో 11 మంది క్షతగాత్రులయ్యారు. ఈ రెండు ఘటనలకు తేడా ఒకటే.. అది తెల్లదొరల పాలన.. ఇది నల్లదొరల ముసుగులో చంద్రబాబు పాలన.. కాల్ధరి ఘటన జరిగి 18 ఏళ్లు పూర్తి కావస్తోంది. వందలాది రైతుల వేదనను పట్టించుకోని గుడ్డిదర్బార్ వారిపై బుల్లెట్ల వర్షం కురిపించమని ఆదేశించింది. దీంతో రెచ్చిపోయిన పోలీసులు కాల్ధరి రైల్వేస్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులపై విరుచుకుపడ్డారు. ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే కాల్పులు జరిపి అన్నదాతలను పొట్టన పెట్టుకున్నారు. ఈ విషాద ఘటన గుర్తొచ్చినప్పుడల్లా కాల్ధరి ప్రజలే కాదు.. జిల్లాలోని రైతులంతా ఉలిక్కిపడుతుంటారు.
ఉండ్రాజవరం, న్యూస్‌లైన్ :అది 1996.. సెప్టెంబర్ 6.. పచ్చటి పొలాలతో.. ప్రశాంతంగా ఉండే కాల్ధరి గ్రామంలో పోలీసు తూటాలు మారణహోమం సృష్టించాయి. రైతు పోరాటాల చరిత్రలో నెత్తుటి మరకల్ని మిగి ల్చాయి. పరాయిపాలన నుంచి దేశాన్ని విముక్తం చేసేందుకు విప్లవ సింహం అల్లూరి ప్రాణాలర్పిస్తే.. ప్రజాస్వామ్యం మసుగులో నియంత నెపోలియన్‌లా వ్యవహరించిన చంద్రబాబు పాలనలో పోలీసు తూటాలకు రైతులనే వరి కంకులు నేలవాలారుు. చంద్రబాబు పాలనలో ఉద్యమాలంటే ఊహామాత్రంగా సహించలేకపోయేవారు. రైతుల పేరు చెబితే ఆగ్రహంతో ఊగిపోయేవారు. కరువు విలయతాండవం చేస్తుంటే.. పచ్చని పంట పొలాలు నోళ్లు తెరుచుకుని నీటితడి కోసం ఎదురుచూస్తుంటే.. పంటను కాపాడుకునేం దుకు ధర్మాగ్రహంతో రోడ్డెక్కిన రైతన్నలకు అప్పటి టీడీపీ ప్రభుత్వం తూటాలను నజరానాగా ఇచ్చింది. నీటితీరువా, విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ శాంతియుత ఆందోళన చేస్తున్న రైతులను నిర్ధాక్షిణ్యంగా పోలీసులతో కాల్చి చంపించింది. ఈ దుర్మార్గ ఘటనలో ఆలపాటి రామచంద్రరావు (కాల్ధరి), గన్నమని కృష్ణారావు (వేలి వెన్ను) ప్రాణాలు కోల్పోయూరు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసిన వారిని సైతం వదిలిపెట్టకుండా తరిమితరిమి మరీ కాల్చారు. ఈ ఘటనలో మరో 11మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా మారగా.. వైద్యులు వారిని బతికించగలిగారు.
కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయ్..
పచ్చటి పంట పొలాల నడుమ ఓడిన రైతన్నల రక్తధారలు గ్రామస్తుల కళ్లముందు నేటికీ కదలాడుతూనే ఉన్నాయి. పోలీసు కాల్పుల్లో సామాన్య రైతులు ఆలపాటి రామచంద్రరావు, గన్నమని కృష్ణారావు అసువులు బాయటంతో వారి కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయాయి.
అభం శుభం తెలియని చిన్న పిల్లలు.. వితంతువులైన ఆడపడుచులు ఆదుకునే దిక్కులేక అల్లాడిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్య వాదులు, రైతు సంఘాలు ఉద్యమించడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేసింది. బాధితుల కుటుం బాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించకతప్పలేదు. భర్త ఆలపాటి రామచంద్రరావు పోలీసు కాల్పుల్లో మరణించిన కొద్దిరోజులకే ఆయన భార్య భద్రమ్మ కుమారుడిని కోల్పోయి ఏకాకిగా మిగిలారు. భద్రమ్మ ఇప్పటికీ ఒంటరిగా కాల్ధరిలోని పెంకుటింట్లో బతుకు భారంగా ఈడ్చుకొస్తున్నారు. కాల్పుల్లో మరణించిన రెండో వారైన గన్నమని కృష్ణారావు వేలివెన్ను గ్రామానికి చెందిన సన్నకారు రైతు. ఆయన మరణించే నాటికి ఆ దంపతుల ముగ్గురు పిల్లలు చిన్నవారే.వారిని పెంచి పెద్దచేయడానికి భార్య తులసీ రత్నం పడిన అవస్థలు అన్నీఇన్నీకావు. అలనాటి దుశ్చర్యను ఆ కుటుంబాలు తలచుకోని రోజు లేదు.
సృ్మతిపథంలో...
పోలీస్ కాల్పులో అసువులు బాసిన అమర వీరుల జ్ఞాపకార్థం కాల్ధరి రైల్వే స్టేషన్ రోడ్డు పక్కన ఆలపాటి రామచంద్రరావు విగ్రహాన్ని, వేలివెన్నులో చెరువు పక్కన గన్నమని కృష్ణారావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అవి అలనాటి ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎదిరించి ప్రాణాలను బలిదానం చేసిన ఘటనను నేటికీ గుర్తు చేస్తూనే ఉన్నారుు.
నాకు జరిగిన నష్టం ఎంతని చెప్పను
18 ఏళ్ల క్రితం జరిగిన ఆ విషాద ఘటన ఇంకా నా కళ్లముందే మెదులుతోంది. కరెంటు చార్జీలు, నీటితీరువా తగ్గించాలని అడిగిన పాపానికి నా భర్తను ప్రభుత్వం కాల్చి చంపించింది. ఎక్స్‌గ్రేషియా అంటూ రూ.లక్ష చేతిలో పెట్టారు. కుటుంబ యజ మానిని కోల్పోయి.. చిన్న పిల్లలతో నేనుపడ్డ బాధలు అన్నీఇన్నీ కావు. నా భర్త లేని లోటును ఏ ప్రభుత్వం పూడ్చలేదు. నా భర్త ప్రాణాలకు వెలకట్టలేరు. మేం పడిన ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. -ఆలపాటి రామచంద్రరావు భార్య భద్రమ్మ, కాల్ధరి
కాల్ధరి కాల్పులు గుర్తున్నాయ్
Published Tue, Apr 22 2014 1:34 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement