
ఉండ్రాజవరం: పశ్చిమ గోదావరి జిల్లాలో సెల్ఫీ వీడియో కలకలం రేపింది. తాను ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆత్మహత్య చేసుకుంటున్నాని ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఈ విషయం పోలీసులకు చేరడంతో విచారణ చేపట్టారు. సెల్ఫీ వీడియో విడుదల చేసిన వ్యక్తి ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామానికి చెందిన గొరిల్లా శివరావుగా గుర్తించారు.
శివరావు ఎక్కడున్నాడో తెలియక కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. శివరావు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు. టీడీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వెల్లడించారు. గ్రామ సమస్యలపై ఫిర్యాదు చేస్తే కక్ష గట్టారని శివరావు వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment