James Matis
-
భారత్‌పై ఆంక్షలతో అమెరికాకే నష్టం
వాషింగ్టన్: భారత్‌పై ఎలాంటి ఆంక్షలు విధించినా చివరకు అమెరికానే నష్టపోవాల్సి వస్తుందని ఆ దేశ రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ కాంగ్రెస్‌ను హెచ్చరించారు. కాంగ్రెస్ ఇటీవల తీసుకొచ్చిన కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్(సీఏఏటీఎస్ఏ) నుంచి భారత్‌కు మినహాయింపు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నాడిక్కడ సెనెట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ ముందుకు హాజరైన మాటిస్ సభ్యులడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. రష్యాతో రక్షణ, నిఘా సంబంధాలు కలిగిఉండే దేశాలను శిక్షించేందుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన సీఏఏటీఎస్ చట్టం ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. దీనిప్రకారం రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలకు అమెరికా ఆయుధాలు అమ్మదు. భారత్ సహా కొన్ని దేశాలు ఆయుధాల కోసం రష్యాపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకుంటున్నాయన్నారు. -
మోదీతో అమెరికా మంత్రులు
వాషింగ్టన్: మోదీతో అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు జేమ్స్ మాటిస్, రెక్స్ టిల్లర్సన్లు సోమవారం విడివిడిగా భేటీ అయ్యారు. మోదీ బసచేసిన హోటల్ విలార్డ్ కాంటినెంటల్‌లో జరిగిన సమావేశాల్లో ఆయా రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలపేతంపై చర్చలు జరిపారు. మాటిస్‌తో జరిగిన భేటీలో భారత జాతీయ సలహాదారు అజిత్ దోవల్, ఇతర భారత సీనియర్ అధికారులు పాల్గొన్నారు. భారత నిఘా అవసరాల కోసం అమెరికా 22 ‘గార్డియన్’ డ్రోన్లను అమ్మనుందన్న వార్తల నేపథ్యంలో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు మూడు బిలియన్ డాలర్ల విలువైన ఈ ఒప్పందం ఇరు దేశాల సంబంధాలను కీలక మలుపు తిప్పుతుందని భావిస్తున్నారు. కాగా, ఇరు దేశాల వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసే మార్గాలపై టిల్లర్సన్, మోదీలు చర్చించారు.