James Mattis
-
పాకిస్తాన్‌కు ఇదే చివరి అవకాశం
వాషింగ్టన్ : ఉగ్రవాదంపై పాకిస్తాన్ అనుసరిస్తున్న ధోరణని అమెరికా నిశితంగా గమనిస్తోందని.. ఆదేశ రక్షణ శాఖ కార్యదర్శి జేమ్స్ మాటిస్ స్పష్టం చేశారు. దక్షిణాసియా, ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని అణిచేందుకు అమెరికా అమలు చేస్తున్న వ్యూహాల్లో పాక్ నిజాయితీ కలిగిన భాగస్వామిగా చేరుతుందా? లేదా? అన్నది ఆ దేశానికే వదిలేస్తున్నట్లు ఆయన చెప్పారు. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధికి అన్ని రకాలు భారత్ నిజాయితీతో కృషి చేస్తోందని ఆయన ప్రకటించారు. ఆఫ్టనిస్తాన్ ప్రజలకు నిరంతరం భారత్ తన సహాయ సహకారాలను అందిస్తోందని మాటిస్ కొనియాడారు. ఆఫ్ఘన్‌లోని ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. న్యూ ఆఫ్ఘన్ పాలసీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాద సంస్థలకు, గ్రూపులకు పాకిస్తాన్ ఆశ్రయమిస్తోందనే ఆరోపణలున్నాయి. దీనిపై మాటిస్ స్పందిస్తూ.. ట్రంప్ పాలసీని పాకిస్తాన్ నిజాయితీతో ముందుకు తీసుకువెళ్లాలని చెప్పారు. ఇదిలా ఉండగా.. ట్రంప్ ప్రతిపాదించిన ఆఫ్టన్, దక్షిణాసియా పాలసీని తిరస్కరిస్తున్నట్లు పాకిస్తాన్ స్పస్టం చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో పాకిస్తాన్ చేసిన త్యాగాలను అమెరికా మరిచిపోయినట్లుందని పాక్ పేర్కొంది. -
అన్నంత పనిచేసిన డొనాల్డ్ ట్రంప్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేశారు. అఫ్ఘానిస్తాన్ నుంచి తమ సైనిక బలగాలను ఉపసంహరించుకునేది లేదంటూ గత నెలలో స్పష్టం చేసిన ట్రంప్ తాను చెప్పిన విధంగానే దాదాపు మరో 3,500 సైనికులను అఫ్ఘానిస్తాన్ కు పంపేందుకు పచ్చజెండా ఊపారు. ఇప్పటికే అక్కడున్న 14,500 మంది సైన్యానికి తోడుగా వీరిని పంపిస్తున్నట్లు రక్షణశాఖ కార్యదర్శి జేమ్స్ మాటిస్ తెలిపారు. ఇంకా ఎంత మందిని పంపాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించిందో వెల్లడించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా బలగాల మోహరింపు ఉంటుందని స్పష్టం చేశారు. తీవ్రవాద సంస్థలు అఫ్ఘానిస్తాన్‌ను శిక్షణ కేంద్రంగాను, దాడులకు అడ్డాగాను మార్చుకునే యత్నాలను తాము అడ్డుకుంటామన్నారు. అక్కడి నుంచి బలగాల ఉపసంహరణ అంశం ప్రస్తుతానికి పరిశీలనలో లేదన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా తమ బలగాల పెంపు చేపట్టినట్లు వివరించారు. ఈ సైనికులకు అవసరమైన నిధుల మంజూరు కోసం ఈ నెల 13న కాంగ్రెస్ సమావేశమవుతుందని చెప్పారు. -
భారత్-అమెరికా కీలక నిర్ణయం
వాషింగ్టన్: రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని అమెరికా, భారత్‌లు నిర్ణయించాయి. సముద్ర భద్రత, ఉగ్రవాదంపై పోరు తదితర అంశాల్లో కలసి పనిచేయాలని సంకల్పించాయి. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గత మూడు రోజుల్లో అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్, అంతర్గత భద్రత మంత్రి జాన్ కెల్లీతోపాటు ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు హెచ్ మెక్‌మాస్టర్‌లతో సమావేశమై చర్చలు జరిపారు. దక్షిణాసియాలో శాంతి, సుస్థిరతల కోసం భారత్ చేస్తున్న కృషిని మాటిస్ కొనియాడారని పెంటగాన్ ప్రతినిధి జెఫ్ డేవిస్ వెల్లడించారు. జాన్ కెల్లీతో దోవల్ జరిపిన చర్చల్లో సరిహద్దు నియంత్రణ, ఉగ్రవాదం తదితర అంశాలు చర్చకు వచ్చాయి. పాకిస్తాన్ గురించి ప్రత్యేకంగా చర్చ జరగలేదని సమాచారం. న్యూఢిల్లీ అభిప్రాయాలు తెలుసుకునేందుకు దోవల్ జరిపిన చర్చలప్ర ట్రంప్ ప్రభుత్వ అధికారులు అమితాసక్తి కనబరిచారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. డీమోనిటైజేషన్, జీఎస్టీ బిల్లు గురించి చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిపాయి. భారత్ ఆర్థికాభివృద్ధి అంశాలపై అమెరికా ఆసక్తి చూపిస్తున్నట్టు వెల్లడించాయి.