అన్నంత పనిచేసిన డొనాల్డ్ ట్రంప్!
అన్నంత పనిచేసిన డొనాల్డ్ ట్రంప్!
Published Thu, Sep 7 2017 3:39 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేశారు. అఫ్ఘానిస్తాన్ నుంచి తమ సైనిక బలగాలను ఉపసంహరించుకునేది లేదంటూ గత నెలలో స్పష్టం చేసిన ట్రంప్ తాను చెప్పిన విధంగానే దాదాపు మరో 3,500 సైనికులను అఫ్ఘానిస్తాన్ కు పంపేందుకు పచ్చజెండా ఊపారు. ఇప్పటికే అక్కడున్న 14,500 మంది సైన్యానికి తోడుగా వీరిని పంపిస్తున్నట్లు రక్షణశాఖ కార్యదర్శి జేమ్స్ మాటిస్ తెలిపారు.
ఇంకా ఎంత మందిని పంపాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించిందో వెల్లడించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా బలగాల మోహరింపు ఉంటుందని స్పష్టం చేశారు. తీవ్రవాద సంస్థలు అఫ్ఘానిస్తాన్‌ను శిక్షణ కేంద్రంగాను, దాడులకు అడ్డాగాను మార్చుకునే యత్నాలను తాము అడ్డుకుంటామన్నారు. అక్కడి నుంచి బలగాల ఉపసంహరణ అంశం ప్రస్తుతానికి పరిశీలనలో లేదన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా తమ బలగాల పెంపు చేపట్టినట్లు వివరించారు. ఈ సైనికులకు అవసరమైన నిధుల మంజూరు కోసం ఈ నెల 13న కాంగ్రెస్ సమావేశమవుతుందని చెప్పారు.
Advertisement