ఆశారాం ఆశ్రమంలో ముగ్గురు పిల్లల మృతి, కేసు విచారణ
ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు ఆశ్రమంలో ముగ్గురు పిల్లలు అనుమానస్పద స్థితిలో మరణించడంపై విచారణ చేపట్టాల్సిందిగా జమ్మూకాశ్మీర్ పోలీసులకు స్థానిక కోర్టు ఆదేశించింది. జమ్మూలోని ఆశారాం ఆశ్రమంలో ఈ సంఘటన జరిగింది. వారిని అక్కడే పూడ్చిపెట్టారని ఆశ్రమంలో పనిచేసే ఓ పర్యవేక్షుడు అరోపించినట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు సోమవారం చెప్పారు.
అఖిల భారత కిసాన్ సేవా సంఘం అధ్యక్షుడు రాజ్‌కుమార్ చౌదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆశారాం ఆశ్రమంలో పనిచేసిన భోళానాథ్కు రక్షణ కల్పిస్తే కేసుకు సంబంధించిన అన్ని వివరాలు చెబుతాడని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. ఇదిలావుండగా, లైంగిక వేధింపుల కేసులో ఆశారాం ప్రస్తుతం రాజస్థాన్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. గత నెలలో ఆయన్ను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అరెస్ట్ చేశారు.