Jammu kashimr
-
జమ్మూలో ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూ శివార్లలో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కొనసాగిన ఎదురుకాల్పుల్లో కశ్మీర్ పోలీస్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్(ఏఎస్సై) ఒకరు నేలకొరిగారు. కశ్మీపోర్‌లీసులు, సీఆర్పీఎఫ్ కలిసి జమ్మూ శివార్లలోని పంథాచౌక్ ప్రాంతంలో శనివారం రాత్రి నాకా బందీ చేపట్టాయి. అర్ధరాత్రి సమయంలో ముగ్గురు ఆగంతకులు బైక్‌పై వచ్చి, బలగాలపైకి కాల్పులు జరిపారు. వారి వద్ద ఉన్న ఆయుధాలను లాక్కునేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు జరుపుతూ వారి ప్రయత్నాలను తిప్పికొట్టాయి. ఈ సందర్భంగా ఎదురు కాల్పుల్లో ఏఎస్సై బాబూరామ్ నేలకొరగ్గా, ఒక దుండగుడు హతమయ్యాడు. మిగతా వారు కాల్పులు జరుపుతూ బైక్ వదిలి పరారయ్యారు. వెంబడించిన బలగాలు..దుండగులు దాగున్న ధోబీ మొహల్లా ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. లొంగిపోవాలని పదేపదే హెచ్చరికలు చేశాయి. పాంపోర్ ప్రాంతానికి వారి సంబంధీకులను అక్కడికి తీసుకువచ్చి, వారి ద్వారా లొంగిపోవాలని కోరినా వినలేదు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తెల్లవారే దాకా కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో మిగతా ఇద్దరు దుండగులు చనిపోయారు. మృతులను లష్కరే తోయిబాకు చెందిన సకీబ్ బషీర్ ఖాన్‌దే, ఉమర్ తారిఖ్ భట్, జుబైర్ అహ్మద్ షేక్‌గా గుర్తించారు. ముగ్గురిదీ పాంపోర్ జిల్లా ద్రంగ్‌బల్ ప్రాంతమే. వీరిలో ఖాన్‌దే ఏడాదిన్నర నుంచి కమాండర్‌గా ఉంటూ అనేక నేరాలకు పాల్పడినట్లు డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. ఎల్వోసీ వెంట పాక్ కాల్పులు అసువులు బాసిన జేసీవో జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ బలగాలు కాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో జూనియర్ కమిషన్డ్ అధికారి అమరుడయ్యారు. ఎలాంటి కవ్వింపులేకుండా జరిపిన ఈ కాల్పులకు భారత్ బలగాలు దీటుగా స్పందించాయి. పాక్ వైపు భారీగా నష్టం వాటిల్లిందని సైన్యం తెలిపింది. పాక్ కాల్పుల్లో నాయిబ్ సుబేదార్ రజ్వీందర్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆయన ఆస్పత్రిలో కన్నుమూశారని సైనిక వర్గాలు తెలిపాయి. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన రజ్వీందర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రజ్వీందర్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారంతోపాటు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. -
పీవోకే ప్రజలు భారత్‌లో కలవాలనుకుంటారు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులతో పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) ప్రజలు కూడా భారత్‌లో చేరాలని కోరుకుంటారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ తీర్మానంతో ఆ ప్రాంతం కూడా దేశంలో అంతర్భాగంగా మారుతుందని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో పార్టీ చేపట్టిన జన్‌సంవాద్ ర్యాలీనుద్దేశించి ఆయన వర్చువల్ ప్రసంగం చేశారు. కశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాక్‌కు భద్రతా బలగాలు తగిన బుద్ధి చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు ద్వారా వేర్పాటువాదుల వెన్ను విరిచామని చెప్పారు. జాతి గౌరవం కాపాడే విషయంలో ప్రభుత్వం ఏమాత్రం రాజీపడబోదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సరిహద్దుల్లో సంభవించే అన్ని పరిణామాలను సరైన సమయంలో పార్లమెంట్లో వెల్లడిస్తామని, ఈ విషయంలో దాపరికం ఉండదని తెలిపారు. సైనిక, దౌత్యపరమైన సంభాషణల ద్వారా చైనాతో వివాదాన్ని పరిష్కరించుకుంటామని చెప్పారు. చైనా ఆధీనంలో ఉన్న ఆక్సాయ్ చిన్ కూడా భారత్‌లో కలిసిపోతుందని హోం మంత్రి అమిత్ షా ర్యాలీనుద్దేశించి అన్నారు. -
370 రద్దుపై ఎన్సీ సవాల్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ఉన్న రాజ్యాంగబద్ధ హోదాను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయా న్ని సవాల్ చేస్తూ నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర పౌరుల సమ్మతి లేకుండానే వారి హక్కులను కేంద్రం లాగేసుకుందని పేర్కొంది. జమ్మూకశ్మీర్ పునర్వ్య వస్థీకరణకు సంబంధించిన చట్టం అమలు కాకుండా చూడాలని ఎన్సీకి చెందిన ఎంపీలు మహమ్మద్ అక్బర్ లోనె, హస్నైన్ మసూదీ తమ పిటిషన్లో పేర్కొన్నారు. ‘కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్ శాశ్వతమైంది. కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం–2019, రాష్ట్రపతి ఉత్తర్వుల ఫలితంగా ఆర్టికల్ 370, 35ఏ రద్దయ్యాయి. రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభ జించి ప్రజల హక్కులను కాలరాశారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు రాజ్యాంగవిరుద్ధం. భారత సమాఖ్య వ్య వస్థ, ప్రజాస్వామ్యం, చట్ట పాలనకు సంరక్షకుడిగా ఉన్న సుప్రీంకోర్టు ఈ విషయమై స్పందించాలి. ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయాలను అమలు కాకుండా రద్దు చేయాలి’ అని కోరారు. మీడియాపై ఆంక్షలను ఎత్తివేయాలి జమ్మూకశ్మీర్‌లో మీడియాపై కొనసాగుతున్న ఆం క్షలను ఎత్తివేయాలంటూ కశ్మీర్ టైమ్స్ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధా భాసిన్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఆగస్టు 4వ తేదీ నుంచి కొనసాగుతున్న నియంత్రణల కారణంగా కశ్మీర్‌తో పాటు జమ్మూలోని కొన్ని జిల్లాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయన్నారు. -
ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో ఏం జరుగుతోంది
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో అక్కడ భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో అని రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా భద్రతా దళాలు మరింత అప్రమత్తమయ్యాయి. రాష్ట్రమంతటా 144 సెక్షన్ కొనసాగుతోంది. శ్రీనగర్‌తో పాటు జమ్మూ, రెశాయ్, దోడా జిల్లాల్లో నిషేధాజ్ఞలు అమలు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా అదనపు బలగాలను మోహరించారు. పాకిస్తాన్ దాడులు నిర్వహించే అవకాశం ఉందని భావించిన కేంద్రం, పీఓకేలో భారీగా సైన్యాన్ని మోహరించింది. పాక్ నుంచి వచ్చే ఏ ప్రతిచర్యనైనా తిప్పికొట్టడానికి సైన్యం సిద్ధంగా ఉందని సైనికవర్గాలు తెలిపాయి. ఆర్మీ ప్రధానాధికారులంతా జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు. కేంద్రం సైన్యానికి పూరి స్వేచ్ఛనిచ్చింది. కశ్మీర్ లోయలో పాక్ హింసకు, ఐఈడీ పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఏ సమయంలోనూ పరిస్థితిని చేజారనివ్వమని ఓ సీనియర్ మిలిటరీ అధికారి తెలిపారు. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు, పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా, సజ్జాద్‌లోన్‌తో సహా వేర్పాటువాదులంతా ఇంకా గృహనిర్భంధంలోనే కొనసాగుతున్నారు. ఇంటర్నెట్, కమ్యూనికేషన్ సర్వీసులు రద్దు చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. జమ్మూకశ్మీర్ వ్యవస్థీకరణ బిల్లు పూర్తిగా చట్టంగా మారేవరకు ఎవరు సంబరాలు నిర్వహించరాదని బీజేపీ అధిష్టానం ఆదేశించింది. కాగా నేడు లోక్‌సభలో ఆర్టికల్ 370 రద్ధు తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. జమ్మూకశ్మీర్ వ్యవస్థీకరణ బిల్లు, రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరగనుంది. లోక్‌సభలో స్పష్టమైన మెజార్టీతో ఉండడంతో ఈ బిల్లులను బీజేపీ సునాయసంగా నెగ్గనుంది. రేపు జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. -
పాకిస్తానీల నమ్మకం.. ‘హఫీజ్ సయీద్’
ఇస్లామాబాద్ : ముంబైదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను సమర్థించే వారి సంఖ్య పాకిస్తాన్లో క్రమక్రమంగా పెరుగుతోంది. హఫీజ్ సయీద్‌కు నేనో పెద్ద అభిమానినంటూ పాక్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా జాబితాలోకి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బాజ్వా చేరారు. దశాబ్దాలుగా నలుగుతున్న కశ్మీర్ సమస్యను హఫీజ్ సయీద్ మాత్రమే పరిష్కరించగలరని ప్రతి పాకిస్తానీలు విశ్వసిస్తున్నాడంటూ.. జావేద్ సంచలన ప్రకటన చేశారు. ఇస్లామాబాద్‌లో జరిగిన సెనెట్ కమిటీ సమావేశంలో జావేద్ ఈ వ్యాఖ్యలు చేశారు. హఫీజ్ సయీద్ దేశం కోసం పోరాటం చేస్తున్నాడని జావేద్ కీర్తించారు. అంతేకాక కశ్మీర్ అంశంలో సయీద్ చేస్తున్న పోరాటం చాలా గొప్పదని చెప్పారు. హఫీజ్ సయీద్ మాత్రమే కశ్మీర్‌కు విముక్తి ప్రసాదిస్తాడని పాకిస్తానీలంతా నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. -
కాశ్మీర్ మంత్రులకు ఆర్మీ డబ్బు
మరో వివాదానికి తెరలే పిన వీకే సింగ్ న్యూఢిల్లీ: మాజీ సైనికాధిపతి జనరల్ వీకే సింగ్ మరో వివాదానికి తెరదీశారు. జమ్మూకాశ్మీర్‌లో శాంతియుత పరిస్థితులు కొనసాగేలా చూసేందుకు ఆ రాష్ట్రానికి చెందిన మంత్రులకు ఆర్మీ డబ్బులు ఇచ్చినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగ్ చేసిన ఈ ప్రకటన మంగళవారం రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. డబ్బులు ఎవరికి ఇచ్చారో చెబితే ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోం మంత్రి షిండే పేర్కొనగా.. ఎవరికి డబ్బులు అందాయో బయటపెట్టాలంటూ జమ్మూకాశ్మీర్ అధికార పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలన్నారు. డబ్బులు తీసుకున్న మంత్రుల పేర్లు బయటపెట్టాలని, లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని జమ్మూకాశ్మీర్ మంత్రులు, మాజీ మంత్రులు వీకే సింగ్‌ను హెచ్చరించారు. అటు కాంగ్రెస్ కూడా సింగ్ వ్యాఖ్యలపై మండిపడింది. సున్నితమైన అంశాలపై వీకే సింగ్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారంటూ దుయ్యబట్టింది. తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో వీకే సింగ్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. మంత్రులకు ఆర్మీ డబ్బులిచ్చింది లంచం రూపంలో కాదని, సదుద్దేశంతోనే ఇచ్చిందన్నారు. మంగళవారం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఈ మేరకు వివరణ ఇచ్చారు.