
ఇస్లామాబాద్ : ముంబైదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను సమర్థించే వారి సంఖ్య పాకిస్తాన్‌లో క్రమక్రమంగా పెరుగుతోంది. హఫీజ్ సయీద్‌కు నేనో పెద్ద అభిమానినంటూ పాక్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా జాబితాలోకి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బాజ్వా చేరారు. దశాబ్దాలుగా నలుగుతున్న కశ్మీర్ సమస్యను హఫీజ్ సయీద్ మాత్రమే పరిష్కరించగలరని ప్రతి పాకిస్తానీలు విశ్వసిస్తున్నాడంటూ.. జావేద్ సంచలన ప్రకటన చేశారు.
ఇస్లామాబాద్‌లో జరిగిన సెనెట్ కమిటీ సమావేశంలో జావేద్ ఈ వ్యాఖ్యలు చేశారు. హఫీజ్ సయీద్ దేశం కోసం పోరాటం చేస్తున్నాడని జావేద్ కీర్తించారు. అంతేకాక కశ్మీర్ అంశంలో సయీద్ చేస్తున్న పోరాటం చాలా గొప్పదని చెప్పారు. హఫీజ్ సయీద్ మాత్రమే కశ్మీర్‌కు విముక్తి ప్రసాదిస్తాడని పాకిస్తానీలంతా నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment