janga krishnamurti
-
బీసీలపై టీడీపీ నేతలు అక్కసు వెల్లగక్కుతున్నారు
-
మహిళా టీచర్లకు పురస్కారం
సాక్షి, విజయవాడ: సావిత్రిభాయి పూలే 188వ జయంతి సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉత్తమ మహిళా ఉపాధ్యాయులకు సావిత్రి భాయి పూలే పురస్కారాలు ప్రదానం చేశారు. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎంపీ కొనగళ్ళ నారాయణ, విద్యార్థి సమాఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిభాయి పూలే అని, ఆమె జయంతిని పురస్కరించుకుని ఉత్తమ మహిళా ఉపాధ్యాయురాళ్లను సత్కరించటం శుభపరిణామం అన్నారు. అలాగే మహాత్మా జ్యోతీరావు పూలే ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. అస్సృశ్యత, అంటరాని తనంపై పోరాడిన మానవతావాది జ్యోతిరావ్ పూలే అని, ఇప్పటికీ సమాజంలో పురుషాధిక్యత కొనసాగుతోందని అన్నారు. మహిళలపై దాడులు, అకృత్యాలు పెరిగిపోయాయని, దేశంలో తల్లులకు దిక్సూచి సావిత్రిభాయి పూలే అని పేర్కొన్నారు. రచయిత, సామాజిక వేత్త అయిన సావిత్రిభాయి పూలే చేసిన త్యాగం వల్లనే మహిళల చదువుకు మంచి రోజులు వచ్చాయని అన్నారు. కాగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో సావిత్రిభాయి పూలే, జ్యోతీరావు పూలే జయంతి, వర్ధంతులు అధికారికంగా నిర్వహించేలా జీవోలు తెచ్చారని ఎమ్మెల్సీ తెలిపారు. మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆ జీవోను కోనసాగించలేదని, వచ్చే ఏడాది నుంచి వారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా కృషి చేస్తామన్నారు. అలాగే మహిళా ఉపాధ్యాయులను సత్కరించేలా చర్యలు కూడా చేపడతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు పెద్దపీట వేశారని, మంత్రి వర్గకూర్పులో మహిళలకు ప్రాధాన్యత కల్పించారని పేర్కొన్నారు. అలాగే మహిళల రిజర్వేషన్లు 33 శాతం నుంచి 50శాతం పెంచారని తెలిపారు. మహిళల రక్షణకు దిశ చట్టం చేశారని అన్నారు. ఇక మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ.. సావిత్రి భాయిపూలే ఆశయాలను అందరు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఎన్ఆర్సీ బిల్లుపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 3 రోజుల్లో మూడు మాటలు మాట్లాడారని విమర్శించారు. ప్రజలను ప్రశాంతంగా బతకనివ్వాలని వ్యాఖ్యానించారు. -
‘ఇది భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం కాదు’
సాక్షి, అమరావతి: మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ఏర్పాటుపై అన్నివర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శాసన, పరిపాలన, న్యాయ విభాగ రాజధానులు ప్రజల సెంటిమెంట్ అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అప్పటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ నగరాన్ని కోల్పోయినట్లు ఆంధ్రా ప్రజలు నష్టపోకుండా మూడు ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. ఇది భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం కాదని, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు తీసుకున్న నిర్ణయమని వ్యాఖ్యానించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఓర్వలేక రాజధానుల విషయంపై రైతులను రెచ్చగోడుతున్నారని, రాష్ట్ర అభివృద్ధిపై ఆయనకు శ్రద్ధ లేదని విమర్శించారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని, ఆయన అన్న, హీరో చిరంజీవి బాటలో నడుస్తున్నట్లు చెప్పే పవన్ రాజధాని విషయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. -
వైఎస్సార్ సీపీ నేతలపై ఖాకీల జులుం..!
ఎమ్మెల్యే యరపతినేని అక్రమాలపై వైఎస్సార్ సీపీ నిరసన దాచేపల్లిలో ర్యాలీ ప్రారంభం కాకముందే అడ్డుకున్న పోలీసులు మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తిపై దౌర్జన్యం ఈడ్చి ఆటోలో పడేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన వైనం అడ్డుపడిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై లాఠీచార్జి పోలీస్‌స్టేషన్‌లో ధర్నా చేస్తూ సొమ్మసిల్లి పడిపోయిన జంగా సాక్షి, గుంటూరు: జిల్లాలో పోలీసుల దౌర్జన్యాలకు అడ్డ్డు అదుపు లేకుండా పోతోంది. అధికార పార్టీ నేతల ఆదేశాలను శిరసావహిస్తూ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ముఖ్యంగా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆజ్ఞను శిరసావహిస్తూ ఆయన అక్రమాలను సహకరించడంతో పాటు, వాటిని అడ్డుకొనే ప్రయత్నం చేసే వారిపైనే తప్పుడు కేసులు పెడుతూ లాఠీలతో జులుం ప్రదర్శిస్తున్నారు. తమకేం జరిగినా ఆయన చూసుకుంటాడనే ధైర్యంతో పోలీసులు పచ్చచొక్కా వేసుకున్న కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై దౌర్జన్యాలకు, దాడులకు దిగుతున్న వారికి సహకరిస్తున్నారు. ఇలాంటి సంఘటనలపై గతంలో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఇక్కడి పోలీసులు మరింతగా రెచ్చిపోతూ వైఎస్సార్సీపీ నాయకులను అణచి వేస్తూ అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులు వత్తుతున్నారు. అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడుతున్న వారిపై కేసులు బనాయించి ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా చూడాల్సిందిపోయి, క్వారీ వైపు ఎవరూ వెళ్లకుండా కాపలా కాయడం పోలీసుల దిగజారుడు స్థాయిని తెలియజేస్తోంది. తాజాగా బుధవారం దాచేపల్లిలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యానికి దిగి లాఠీలతో జులుం ప్రదర్శించారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్, ఇసుక దందా, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసుల బనాయింపు, రాజకీయ కక్షసాధింపు చర్యలకు నిరసనగా ర్యాలీ నిర్వహించాలని భావించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు, గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో వందలాది మంది వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు నారాయణపురంలోని ఆర్ అండ్ బీ బంగ్లా నుంచి నల్ల జెండాలతో నిరసన ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీ మొదలు కాకముందే బంగ్లా వద్ద గురజాల రూరల్ సీఐ అళహరి శ్రీనివాసరావు, దాచేపల్లి, కారంపూడి ఎస్ఐలు కిరణ్, నారాయణస్వామి ర్యాలీకి అనుమతి లేదంటూ అడ్డు తగిలి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామని జంగా చెప్పినప్పటికీ పట్టించుకోకుండా దౌర్జన్యంగా ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నించారు. వారిని విడిపించుకుని రోడ్డుపైకి ర్యాలీ చేసుకుంటూ వెళుతున్న జంగాను దౌర్జన్యంగా లాగి ఆటోలో పడేసి స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న జంగాను వదిలిపెట్టాలంటూ నినాదాలు చేసిన నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. జంగాను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుకు నిరసనగా జంగా స్టేషన్ ఆవరణలో బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ సమయంలో జంగా తీవ్ర అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. తనపై, కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్య కాండకు జంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. సాయంత్రానికి స్టేషన్ నుంచి సొంత పూచీకత్తుపై బయటకు వచ్చిన జంగా ఎమ్మెల్యే, పోలీసుల తీరుకు నిరసనగా గుంటూరు కలెక్టరేట్‌కు పాదయాత్రగా బయలుదేరారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఉన్నారు.