Jashpur
-
టెన్త్ విద్యార్థులతో టీచర్ నీచమైన పని!
రాయ్‌పూర్: విద్యార్థులకు ఇంగ్లిష్ పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయుడు తానే దారితప్పాడు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో విద్యార్థులను స్టాఫ్‌రూమ్‌కు పిలింపించుకొని.. వారితో ఒళ్లు పట్టించుకున్నాడు. బొక్కబోర్ల పడుకున్న అయ్యవారికి ఓ విద్యార్థి నడుముపై భాగంలో మసామ్ చేస్తే.. మరో ఇద్దరు విద్యార్థులు చెరోకాలిని పట్టుకొని నొక్కారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్లైన్లో వైరల్‌గా మారిపోయింది. ఛత్తీస్‌గఢ్ జశ్పూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. తుమ్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అనూప్ మింజ్ ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. కానీ ఆయన తాజాగా విద్యార్థులను స్టాప్రూమ్కు పిలింపించుకొని ఒళ్లు పట్టించుకున్నాడు. ముగ్గురు విద్యార్థులు సేవకులుగా ఆయన ఒళ్లు పడుతుండగా వీడియో కెమెరా కంటికి చిక్కింది. ఈ వీడియో ఛత్తీస్‌గఢ్‌లో సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో దావానలంలా పాకింది. దీంతో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా విద్యాధికారికి సదరు ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని విద్యాధికారి హామీ ఇచ్చారు. ఈ చర్యకు పాల్పడిన ఇంగ్లిష్ టీచర్ అనూప్ మాత్రం 'నేను జ్వరంతో ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నా. నేనేమీ విద్యార్థులను ఒళ్లు పట్టమని బలవంతపెట్టలేవు. వారే ఉద్దేశపూరితంగా అలాచేశారు' అని చెప్పుకొచ్చారు. -
బాలికపై ఏడుగురు యువకుల సామూహిక అత్యాచారం!
రాయ్‌పూర్: ఏడుగురు యువకులు ఓ గిరిజన బాలికపై 9 రోజులపాటు సామూహిక అత్యాచారం చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జిల్లా కేంద్రం జష్పూర్ శివారులో ఈ దారుణం జరిగింది. నిందితులలో ఆరుగురిని వేరువేరు ప్రదేశాలలో ఈరోజు అరెస్ట్ చేసినట్లు జష్పూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ జీఎస్ దుబే చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం తప్కరా ప్రాంతానికి చెందిన ఆ బాలిక ఈ నెల 18వ తేదీన తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్‌కు వెళ్లే సమయంలో నలుగురు యువకులు రెండు మోటార్ సైకిళ్లపై వచ్చారు. లిప్ట్ ఇస్తామని చెబితే, ఆ బాలిక రానని తిరస్కరించింది. కానీ వాళ్లు ఆ బాలికను బలవంతంగా ఓ టూరిస్ట్ ప్రదేశంలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. ఆ తరువాత మరో ముగ్గురు స్నేహితులు కూడా వచ్చి అత్యాచారం చేశారు. అలా వారు ఆ బాలికను 9 రోజుల పాటు వివిధ ప్రదేశాలకు తీసుకువెళ్లి సామూహికంగా ఈ అఘాయిత్యానికి పాల్పడారు. చివరకు ఈ నెల 28న ఆ బాలికను ఓ స్టేడియం వద్ద వదిలి వెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు, నిందితులకు సంబంధించి చెప్పిన వివరాల మేరకు పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితులు అందరూ జష్పూర్కు చెందినవారేనని పోలీసులు తెలిపారు. **