అయ్యో పాపం..
కోతులకు భయపడి పరుగులు.. రెండేళ్ల చిన్నారి మృతి
ఏన్కూరు: కోతుల గుంపునకు భయపడి పిల్లలు పరుగులు తీసిన ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు విడిచింది. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం అరికాయలపాడులో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బెజవాడ సుధాకర్ రెండో కుమార్తె జస్విక(2) ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. ఈ చిన్నారికి సమీపంలో వీధిలో మరికొందరు పిల్లలు ఆడుకుంటున్నా రు.
ఈలోగా ఓ కోతులు గుంపు అటువైపు రావడంతో పిల్లలు భయపడి ఒక్కసారిగా పరుగులు తీశారు. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న జస్వికకు ఓ చిన్నారి బలంగా తగలడంతో ఆమె ఒక్కసారిగా కిందపడి కుప్పకూలింది. దీంతో ఆమె తలకు బలమైన గాయమైంది. వెంటనే ఏన్కూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. జస్విక మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.