jathihitham
-
దేశ రక్షణనూ వదలని జూదక్రీడ
మన రక్షణ కొనుగోళ్లలో కచ్చితంగా భారీ కుంభకోణం చోటు చేసుకున్నట్లే మరి. మనం దేన్నీ కొనలేని అసమర్థులం. దీనికి బలయ్యేది మాత్రం మన సాయుధ బలగాలే. ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ రంగ ఉత్పత్తిదారులు రక్షణ రంగంలో బలంగా పాదం మోపుతున్నప్పటికీ భారత్ మాత్రం వ్యతిరేకత తెలుపుతూ సొంత యుద్ధవిమానం తయారీ విషయంలో వెనుకంజ వేస్తోంది. మనది మూర్ఖుల దేశం అంటూ జస్టిస్ మార్కండేయ ఖట్జూ కొన్ని సందర్భాల్లో చెప్పినది నిజమే అని భావించవచ్చు. భారత్‌లో ఆయుధాల తయారీకి మనం ప్రైవేట్ రంగాన్ని అనుమతించం. అదే సమయంలో ప్రపంచ ప్రైవేట్ రంగం నుంచి అవే ఆయుధాలను కొనడానికి వెంపర్లాడతాం. ఈ కథనం 1998 ఆరం భానికి సంబంధించినది. అప్పుడే జార్జి ఫెర్నాం డెజ్ అటల్ బిహారీ వాజ్‌పేయి కేబినెట్లో రక్షణ మంత్రిగా నియమితులయ్యారు. ఇది ఎవరూ ఊహించని విషయమేగాదు, ఆయన అసలేం చేస్తా రనే ప్రశ్న తలెత్తింది. నలిగిన కుర్తా, పైజామా, మామూలు చెప్పులు ధరించే ఈ వింత పోకడల కార్మిక నాయకుడు సాదాసీదాగా నడిచే భారత రక్షణ శాఖను ఎలా నడుపుతారని పలువురు ప్రశ్నించారు. ఫెర్నాండెజ్ మాత్రం చాలా వేగంగా తనదైన మార్గంలో బాగా పనిచేస్తూ మనల్ని ఆశ్చర్యపరి చారు. ‘నేనేమీ చేయను–మిమ్మల్నేమీ చేయనీయను’ అనే ధోరణి ఉన్న ఉన్నత ఉద్యోగవర్గంతో నిండిన విషవలయాన్ని మొదట ఛేదించడం ఆయనకు తొలి సవాలు అయింది. నాస్తికుడైన ఫెర్నాండెజ్‌కు సియా చిన్ గ్లేసియర్ ప్రాంతం ఇష్టమైన పుణ్యతీర్థమైంది. ‘భారత రక్షణశాఖలో వారు(అధికారులు) అవునని గాని, లేదనిగాని చెప్పరు. వారు ఫైళ్లను ఓ కక్ష్యలో పడేస్తారు. మనం దాని వెంటపడతూ ఉండాల్సిందే. ఈ లోగా యుద్ధాలొస్తాయి, పోతాయి. వాటిని గెల వచ్చు, గెలవకపోవచ్చు. ఫైల్లోని విషయం మాత్రం తేలదు. ఇది నేను గుర్తించిన చిరాకుపుట్టించే వాస్త వం’ అని సియాచిన్‌లో నాకిచ్చిన ఇంటర్వ్యూలో జార్జి చెప్పారు. సియాచిన్ మంచుకొండల్లో వేగంగా కదలడానికి సైనిక దళాలకు విదేశీ స్నోమొబైల్ ఫోన్లు, స్కూటర్లు అత్యవసరమని ఆయన ఈ ప్రాంతానికి వెళ్లిన ఓ సందర్బంలో గుర్తించారు. ఇవి కొనుగోలు చేయడానికి పంపిన ఫైలు కూడా పైన చెప్పినట్టు కక్ష్యలో తిరుగుతూనే ఉంది. రాజధానికి తిరిగి వచ్చాక ఈ ఫైలు ముందుకు జరగకుండా తొక్కిపట్టిన ఉన్నతాధికారులెవరో జార్జి గుర్తించారు. వెంటనే సియాచిన్‌కు వెళ్లాలని వారిని ఆదేశించారు. సైనికులకు ఈ స్కూటర్ల అవసరం ఎంత ఉందో తెలుసుకునే వరకూ వారు అక్కడే గడపాలని కూడా మంత్రి కోరారు. దురదృష్టవశాత్తూ ఇప్పుడు ఇలాంటి విషయాలపై ఆయన మాట్లాడే స్థితిలో లేరు. అందుకే, రాఫెల్ యుద్ధవిమానాల కొనుగో లుకు సంబంధించిన ఫైలుపై తమ అసమ్మతి తెలుపుతూ తమ వ్యాఖ్యలు రాసిన రక్షణశాఖలోని జాయింట్ సెక్రెటరీ గురించి మనం అంచనాలకే పరిమితం కాకతప్పదు. ఈ అధికారి నోట్‌ను ఫెర్నాం డెజ్ చదివితే, వెంటనే ఆయనను ‘అత్యంత నైపుణ్య మున్న రాకెట్ సైంటిస్టు’గా ప్రకటించేవారు! ఎందు కంటే ఎంతో అవసరమైన రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలును కూడా ముందుకు సాగనీయకుండా అడ్డుపడడం మామూలు విషయం కాదు. ఇది రక్షణ శాఖ ఉన్నతాధికారుల నైజం. ఒక్క రాఫెల్‌తో ఆరు సుఖోయీ విమానాలా! ఈ సందర్భంగా ఈ రక్షణశాఖ అధికారి తెలివితేట లను ప్రశ్నించే సాహసం చేస్తున్నాను. 36 రాఫెల్ విమానాల కొనుగోలుకు ఫ్రెంచ్ కంపెనీ డాసోకు చెల్లించే సొమ్ముతో హెచ్ఏఎల్ నుంచి మరెన్నో సుఖోయి యుద్ధవిమానాలు కొనవచ్చని సూచిస్తూ ఆయన ఇచ్చిన నివేదిక నన్నెంతో ఆకట్టుకుంటోంది. తక్కువ ధరకు లభించేపక్షంలో హెచ్ఏఎల్ నిర్మించే సుఖోయి విమానాలు మనకు సరిపోతే మనం విదే శాల నుంచి ఎందుకు యుద్ధవిమానాలు కొనుగోలు చేయాలి? ‘‘ఒక రాఫెల్ విమానానికి చెల్లించే ధరతో హెచ్ఏఎల్ నుంచి ఆరు మిగ్–21 విమానాలు ఎందుకు కొనకూడదు?’’ అని ఫెర్నాండెజ్ ఈ అధికా రిని ప్రశ్నించేవారే! అంతేకాదు, మిగ్ విమానాలపై శిక్షణ ఇచ్చే కేంద్రానికి ఆయనను బదిలీచేసేవారు. అంతటితో ఆగకుండా, రోజూ ఉదయం మిగ్ విమా నంలో పైలట్ వెనుక (బెల్టుతో కటి)్ట ఈ అధికారిని కూర్చుని విహరించాలని కూడా ఆదేశించేవారు! ఒక రాఫెల్ ధరకు మరెన్నో సుఖోయి విమానాలొస్తా యని భావించే ఉన్నతాధికారి(సివిల్ సర్వెంట్) ఎవ రైనా ఆయనకు ఇలాంటి ‘శిక్షణ’ అవసరం. సైనిక సంబంధ విషయాలపై నైపుణ్యంలేని ఇలాంటి సివిల్ సర్వెంట్లపై సైనికాధికారులకు అపనమ్మకం ఎక్కువ. ఆయుధాల కొనుగోలుకు సంబంధించిన ఏ కుంభ కోణంలోనూ ఎవరికీ ఏ కోర్టులో శిక్షలు పడినట్టు నేను వినలేదు. బోఫోర్స్ శతఘ్నుల కుంభకోణం చూసిన ఆ తరం ప్రముఖులు నేనీ మాటలు అన్నం దుకు నన్ను నిందిస్తారని తెలుసు. అయితే, ఆయు ధాల లావాదేవీల్లో చేతులు మారిన ముడుపుల సొమ్ము ఏదీ ఇండియాకు రాలేదనేది వాస్తవం. బోఫోర్స్ కుంభకోణం నాటి రాజీవ్‌గాంధీ తర్వాత అధికారంలోకి వచ్చిన వీపీ సింగ్, వాజ్‌పేయీ ప్రభు త్వాలు సైతం శతఘ్నుల కొనుగోలు వ్యవహారంలో దళారులుండరని హామీ ఇచ్చిన స్వీడన్ సర్కారును సైతం మాట నిలబెట్టుకోవాలని ఒత్తిడి చేయలేక పోయారు. అంటే, బోఫోర్స్‌లో కుంభకోణం ఏదీ లేదనుకోకూడదు. ఈ కుంభకోణానికి ముగింపు పల కకుండా దాన్ని ఎన్నికల్లో వాడుకుని ఓట్లు సంపాదిం చుకోవాలనే ఆలోచనే దాన్ని ఇంకా బతికిస్తోంది. ఈ కుంభకోణంలో ముడుపులు తీసుకున్నవారి నుంచి సొమ్ము రాబట్టి, కొందరు దోషులను జైలుకు పంపా లనే ఆసక్తి ఎవరికీ లేదు. బోఫోర్స్ దెబ్బతో నిలిచిపోయిన కొనుగోళ్లు! బోఫోర్స్ కుంభకోణం ఫలితంగా రష్యా మినహా ఇతర దేశాల నుంచి మన ఆయుధాల కొనుగోళ్లు దాదాపుగా నిలిచిపోయాయి. 1982లో ఇందిరా గాంధీ మిరాజ్–2000 విమానాల కొనుగోలుకు ఆదేశాలు జారీచేశాక, మళ్లీ ఇన్నేళ్లకు రష్యా మినహా ఇతర దేశాల నుంచి కొంటున్న తొలి యుద్ధవిమానం రాఫెల్ మాత్రమే. కొత్త ఆయుధాల కొనుగోలుకు ఏమాత్రం చొరవ చూపకుండా అడ్డుకట్ట వేసే రక్షణ శాఖ ‘సంప్రదాయాని’కి రాఫెల్ ఒప్పందం కూడా బలి అయితే ఇది నిజంగా విషాదమే అవుతుంది. 20 ఏళ్ల తర్జనభర్జన తర్వాత అత్యంత అవసరమైన ఆధు నిక యుద్ధవిమానం(రాఫెల్) కొనుగోలుకు నిర్ణయం తీసుకోగానే కొన్ని వదంతులు వ్యాపించాయి. ఈ వివాదం కారణంగా నేతలు ఒకరినొకరు ‘నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ’ అని దూషించుకుంటు న్నారు. ఈ ఒప్పందం వ్యవహారంలో దోషులుగా ఎవరూ పట్టుపడలేదు. ఏమీ జరగనే లేదు. కాని అంతులేని గోల. ఫలితంగా, రాఫెల్ విమానాల కొనుగోలుకు మొదటి ఆర్డరు తర్వాత మళ్లీ ఇవి కావాలని ఏ ప్రభుత్వం కూడా ఫ్రెంచి కంపెనీని అడిగే ధైర్యం చేయకపోవచ్చు. దీంతో మన రక్షణ బలగాలు అవసరమైన యుద్దవిమానాలు లేక ఇబ్బం దులు పడకతప్పదు. ఈ గొడవ కారణంగా రాఫెల్ విమానాల కొనుగోలు కూడా ముందుకు సాగదు. తగినన్ని ఆధునిక ఆయుధాలు, యుద్ధవిమానాలు లేక వైమానిక దళం అల్లాడిపోక తప్పదేమో! రాఫెల్ వివాదం ఫలితంగా లోక్‌సభ ఎన్నికల సమయంలో దేశంలో ప్రభుత్వరంగ సంస్థ హిందూస్తాన్ ఏరోనా టిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)కు ఎనలేని ప్రచారం, గౌరవం దక్కడం అత్యంత ఆసక్తికరమైన అంశం. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్–ఆడాగ్ సంస్థతో పోల్చితే నేడు హెచ్ఏఎల్ గొప్ప కంపెనీగా కనిపిస్తుందని నేను అంగీకరిస్తాను. కాని, ఈ అత్యంత భారీ భారత సర్కారీ ఆయుధాల కంపెనీ ఏం చేస్తోందో చూద్దాం. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద సైనిక దళం ఇండియాకుంది. 75 శాతం వైమానికి దళం, నూరు శాతం ఆర్మీ, 66 శాతం నౌకాదళం, నూరు శాతం కోస్ట్ గార్డ్ దళాల వైమానికి సంబంధ అవసరాలను హెచ్ఏఎల్ తీరుస్తోంది. వాటికి అవసరమైనవాటిని తయారుచేసి సరఫరా చేస్తోంది. అయితే, వ్యాపారం విలువ ఎంతో చూద్దాం. దీని టర్నోవర్ రూ. 18,000 కోట్లు. అంటే దేశంలో అతి పెద్ద లారీ తయారీ కంపెనీల్లో ఒకటైన అశోక్ లేలాండ్ టర్నోవర్‌లో సగమే. ఇండిగో ఎయిర్ లైన్స్, హిందూజాల యాజమాన్యంలోని చిన్న బ్యాంకు ఇండస్ఇండ్ టర్నోవర్ల కన్నా తక్కువే. బడా కంపెనీలకు స్థానం లభించే ఫార్చ్యూన్ 500 ఇండియా జాబితాలో హెచ్ఏఎల్ పేరు ఎక్కడో వెనుక ఉంటుంది. తన రంగంలో పూర్తి గుత్తాధి పత్యంతోపాటు తన దగ్గర మాత్రమే ఉత్పత్తులను తప్పక కొనుగోలు చేసే ఖాతాదారులన్న ఈ ప్రభుత్వ రంగం పనితీరు ఇంత గొప్పగా ఉంది. దీని వార్షిక ఎగుమతులు రూ. 300 కోట్లు దాటవు. మీర్జాపూర్, పానిపట్‌లోని కొందరు చేనేతదారులు అంతకన్నా ఎక్కువ మొత్తంలో ఎగుమతులు చేస్తున్నారు. ఇప్ప టికి హెచ్ఏఎల్ నాలుగు వేలకు పైగా విమానాలు తయారుచేసింది. అవన్నీ కూడా ఇతర దేశాల నుంచి లైసెన్స్‌తో విదేశీ కంపెనీల విమానాలను చూసి తయారుచేసినవే. ఇంకా ఇండియా పూర్తిగా దేశంలో నిర్మించే హెచ్ఫ్–24 మారుత్ విమానాలు దాదాపు 150 వరకూ హెచ్ఏఎల్ నిర్మించింది. అయితే, ఈ విమానం విఫలమైంది. ఈ కంపెనీ అతి సునాయా సమైన పద్ధతిలో పనిచేస్తోంది. ప్రభుత్వ ఓ విదేశీ యుద్ధవిమానాన్ని కొనుగోలు చేస్తుంది. ఆ విదేశీ కంపెనీతో కలిసి దీన్ని దేశంలో తయారు చేయడానికి ఒప్పందం చేసుకుని ఆ పని హెచ్ఏఎల్కు అప్పగి స్తుంది. ఈ ప్రభుత్వ కంపెనీ ఇన్నేళ్లుగా ఇలాగే నెట్టుకొస్తోంది. మన రక్షణ కొనుగోళ్లలో కచ్చితంగా భారీ కుంభ కోణం చోటు చేసుకున్నట్లే మరి. మనం దేన్నీ కొన లేని అసమర్థులం. దీనికి బలయ్యేది మాత్రం మన సాయుధ బలగాలే. ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ రంగ ఉత్పత్తిదారులు రక్షణ రంగంలో బలంగా పాదం మోపుతున్నప్పటికీ భారత్ మాత్రం వ్యతిరేకత తెలు పుతూ సొంత యుద్ధవిమానం తయారీ విషయంలో వెనుకంజ వేస్తోంది. భారత్‌లో ఆయుధాల తయారీకి మనం ప్రైవేట్ రంగాన్ని అనుమతించం. అదే సమ యంలో ప్రపంచ ప్రైవేట్ రంగం నుంచి అవే ఆయు ధాలను కొనడానికి వెంపర్లాడతాం. యూపీఏ హయాంలో నాటి రక్షణమంత్రి ఏకే ఆంటోనీ ఆయుధాల కొనుగోళ్లకు ప్రయత్నించడానికే భయపడిపోయారు. ప్రపంచంలోని ప్రతి ప్రధాన ఆయుధ ఉత్పత్తిదారుల సంస్థలనూ నిషేధించడం లోనే ఆయన కాలం గడిపేశారు. మోదీ ప్రభుత్వం ప్రైవేట్ రంగాన్ని ముందుకు తీసుకురావడానికి సిగ్గుపడలేదు. కానీ రిలయన్స్–అడాగ్స్తో ఇన్నింగ్స్ మొదలెట్టమని దానికి ఎవరు చెప్పినట్లు? పారదర్శ కత, సత్యం అనేవి ఉత్తమ ఆత్మరక్షణ పద్ధతులు కాగా అహంకారం, లెక్కలేనితనంలో ప్రభుత్వం ఎందుకు మునిగి తేలుతున్నట్లు? శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ -
'ఉచితం తాయిలం'తో దేశంపై దాడి!
దేశం సమస్యల రాజకీయాల నుంచి ఆకాంక్షల రాజకీయాల దిశగా పయనిస్తోంది. వాతావరణ మార్పులు, పర్యావరణం వంటివి కీలక ఎజెండాలో చేరుతున్నాయి. డేటా చార్జీలతో పాటు కాల్-డ్రాప్స్ పెరిగిపోవడమనే సమస్య కూడా ద్రవ్యోల్బణం లాగే జీవన నాణ్యతకు సంబంధించిన సమస్యగా మారింది. కాబట్టే జుకెర్‌బర్గ్ ‘‘ఉచితం తాయిలం’’తో మన దేశంపై దాడికి దిగాడు. ఇంటర్నెట్ ప్రజాస్వామ్యం గురించి ఆందోళనచెందే దేశం, ప్రభుత్వ ప్రైవేటు రంగాల వైద్య సేవల నాణ్యతను ప్రశ్నించే రోజు ఎంతో దూరంలో లేదు. డిసెంబర్ 31కి జనవరి 1కి మధ్య రాజకీయ చర్చ దిశను మార్చేటంతటి గొప్ప మార్పేమీ జరిగిపోదు. కాకపోతే కొత్త సంవత్సరం ప్రారంభం కావడం కాస్త విశ్రాంతిగా భవిత వేపు దృష్టిని సారించడానికి తగ్గ సాకును అంది స్తుంది. 2016లోకి అడుగు పెడుతుండగా వార్తా పత్రికల పేజీల్లో, వార్తా చానళ్ల ప్రైమ్‌టైమ్ చర్చల్లో ప్రముఖంగా కనిపించిన అంశాలతో ప్రారంభిద్దాం. ఢిల్లీ కార్లకు సరి-బేసి సంఖ్యల పరిమితి విధింపు పథకం వాటన్నిటిలోకీ అతి పెద్ద కథనం. కార్లకు, జనాభాకు మధ్య నిష్పత్తి అధ్వానంగా ఉన్న మన దేశ సామాజిక-వ్యవసాయక పద్ధతులకూ, మన నగరాల కాలుష్య మేఘాల సంక్షోభానికి మూల కారణమైన ఇంధన విధానాల వక్రీకరణలకూ ఈ బ్యాండ్ ఎయిడ్ శాశ్వత పరిష్కారం ఎలా అవుతుందని శంకించేవారిలో నేనూ ఒకడిని. అయితే ఈ పథకానికి విస్తృతమైన ప్రజా మద్దతు లభించింది. మనం పీల్చే గాలి నాణ్యత ఇప్పుడు మనల్ని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో మొదటిగా మారింది. ఇక ఆ తదుపరిది, ‘నెట్-న్యూట్రాలిటీ’ (అందరికీ సమాన అవకాశాలు లభించేలా ఇంటర్నెట్ను తటస్థంగా ఉంచడం). ఆకాశం గురించిన ఒకప్పటి మన అవగాహనను బట్టి మనం ఈ చర్చను ఏదో కొందరు మేధావులకు సంబంధించినదిగా భావించేవాళ్లం. వారం రోజుల పాటూ ఫేస్బుక్ ‘ఫ్రీ బేసిక్స్ ఆఫర్’ పత్రికల మొదటి పేజీల్లో కనబడ్డాక అదీ చర్చనీయాంశమైంది. పార్టీ రాజకీయాలను, అస్తిత్వ సమస్యలను, మౌలిక అవసరాలనే అతిగా పట్టుకువేలాడే సమాజంలో... విచ్ఛిన్నకరమైన కొత్త ఉచిత ఇంటర్నెట్ సేవ ‘‘అమ్మకం’’ కోసం వంద కోట్లు ఖర్చు పెడతారని ఎన్నడైనా ఊహించారా? కొత్త ఏడాదైతే మాత్రం ఇదేం పిచ్చి? భారతదేశానికేమైనా వెర్రి పట్టిందా? మరో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నంత మాత్రాన గాలి నాణ్యత, ఇంటర్నెట్ ప్రజాస్వామ్యం మన అతి ప్రధాన సమస్యలలో చేరిపోతాయా? తిండి, బట్ట, గూడూ, కులం, మతం, భాషా, విద్యుత్తు, రోడ్లు, విద్యా, అవినీతి, చెడ్డ పరిపాలనా ఇక వెనక్కు పోయినట్టేనా, ఏమిటీ? అవేమీ వెనక్కుపోలేదు. కాకపోతే గతంలో మనం, అవకాశాలతో కూడిన భవిత కోసం మనుగడకు సంబంధించిన సమస్యల బరువు కింద నలిగిపోతూ ఉండేవాళ్లం. ఆ బరువును తప్పించుకుని బయట పడేసరికి మన రాజకీయ సమస్యలు కూడా విలువ నిచ్చెనపైకి ఎగబాకాయి. ఇలాంటి విషయాలను గట్టిగా ప్రస్తావించనప్పుడల్లా, క్షామం తాండ వమాడుతున్న బుందేల్‌ఖండ్‌లో రైతులు గడ్డి తిని బతకాల్సివస్తోందనే నివేది కలతో లేదా రైతు ఆత్మహత్యలతో ప్రతిఘటించేవారు. మన దేశం సమస్యల రాజకీయాల నుంచి ఆకాంక్షల రాజకీయాల దిశగా పయనిస్తోందనే నా విశ్వా సాన్ని 2009లో వెలిబుచ్చినప్పుడు కూడా నేను అలాంటి వాదనలనే ఎదుర్కో వాల్సి వచ్చింది. మంచి నాణ్యతగల గాలి, ఇంటర్నెట్ ప్రజాస్వామ్యం ఆ కొత్త కోరిక దిశగా వేసిన తార్కికమైన ముందడుగు మాత్రమే. బహుశా ఆ తర్వాత ఆహార నాణ్యతే కావచ్చు. వాతావరణ మార్పుల సమస్య కూడా రెండేళ్ల క్రితం వరకు కొందరు మేధావుల చర్చే. కానీ, ఆ సమస్య గురించిన అవగాహన పెరగడంతో, మీడియా, ఇంటర్నెట్ కనెక్షన్ల విస్తరణతో నేడా పరిస్థితి మారింది. మన నగర వాసులకు లాగే రైతులకు, జాలర్లకు కూడా వాతావరణ మార్పుల దుష్ర్ప భావం అనుభవంలోకి వస్తోంది. చె న్నై మన తాజా అనుభవం. పంజాబ్‌లో పత్తి పంట ఈ ఏడాది తెల్ల దోమ కాటుకు గురైంది. వానలు ఆలస్యం కావ డం, అరకొరగా మాత్రమే కురవడం వల్ల పంటకు పంటకు మధ్య వారాల తరబడి నిలిచిన నీటిలో తెల్లదోమ లార్వాలు నానిపోయి చనిపోయే అవ కాశం రైతులకు లేకుండా పోయింది. గత 110 ఏళ్లలో మొదటిసారిగా మనం వరుసగా రెండేళ్లు రుతుపవనాల వైఫల్యాన్ని ఎదుర్కొన్నామని మన వ్యవసాయ శాస్త్రవేత్తలందరిలోకీ అగ్రగణ్యుడైన అశోక్ గులాతి తెలిపారు. మూడో ఏడాది అలా జరగకపోవచ్చని అంటూనే ఆయన సందిగ్ధంతో ‘‘చెన్నై లో ఏం జరిగిందో చూశాక, ఏం జరుగుతుందో ఎవరికి మాత్రం ఏం తెలుసు?’’ అన్నారు. చేపలు దొరికే ప్రాంతాలు కదలిపోవడాన్ని జాలర్లు గమనించారు. గుజరాత్ తీరంలోని మన జాలర్లు తరచూ పాకిస్తాన్ జలాల్లో పట్టుబడుతుం డటానికి ఇది కూడా ఒక కారణం. కొరమీను చేపలు పెద్ద తుట్టెల్లా గుంపుగా ఈదులాడే ప్రాంతాలు మారిపోవడంతో మన జాలర్లు మరింత సుదూరాలకు పోక తప్పడం లేదు. గాలి నాణ్యత గురించి నగరవాసులం ఇప్పుడిప్పుడే జాగృతమవుతున్నట్టే జాలర్లు కూడా ఈ ప్రకృతి శాపానికి కొంతవరకు మనిషే కారణమని అర్థం చేసుకుంటున్నారు. నేటి రాజకీయాలకు కొత్త చేర్పులు మనది విశిష్టమైన పెద్ద ప్రజాస్వామ్య దేశం. అతి తీవ్రవాద, లుడ్డైట్ (యంత్ర విధ్వంసక) వామపక్షవాదుల నుంచి కాషాయ మితవాదుల వరకు అంతా ఇక్కడ ఉన్నారు. కానీ వాతావరణ మార్పుల ఉపద్రవాన్ని కాదనేవారు మాత్రం వారిలో ఎవరూ లే రు. అందువలన వాతావరణ మార్పులు, పర్యావ రణం, గాలి నాణ్యత మన రాజకీయాల కీలక ఎజెండాలోకి వచ్చి చేరుతు న్నాయి. మన ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకునే స్థితికి అవి నెడ తాయి. ఉదాహరణకు, కేంద్రం మన వాయు, జల వనరుల పరిరక్షణకు పూనుకోవడం అనివార్యం. కాబట్టి విద్యుత్తు, ఇంధన ధరలకు సంబంధిం చిన సంస్కరణలను అది ఇకనెంత మాత్రమూ వాయిదా వేయలేదు. రైతు లకు ఉచిత విద్యుత్తు లభించినట్టయితే, కరెంటు రోజుకు ఆరు గంటలే, అదీ ఎవరికీ తెలీని ఏ అర్ధరాత్రో లభిస్తుంది. దీంతో పలువురు రైతులు తమ బోరు బావుల మోటర్ల స్విచ్‌లను ఆన్ చేసి ఉంచేస్తున్నారు. నరేంద్ర మోదీ తన ప్రభుత్వంలోని వ్యవసాయ మంత్రిత్వ శాఖను ఆర్ఎస్ఎస్ చెప్పినవారికే ఇవ్వక తప్పలేదు. ఆవు పేడ, మూత్రాలతో చేసే ‘‘జీవక్ ఖేతీ’’(సేంద్రియ వ్యవసాయం) అంటే ఆయనకు పిచ్చి వ్యామోహం. అయితే ఆయన సైతం ఆధునీకరణ చెందక తప్పదు. లేకపోతే రైతులు శిక్షిస్తారు. అందువలన, నేల లోని పోషక పదార్థాల అసంతులనాన్ని తిరిగి వెనక్కు మరల్చడం కోసం ఎరు వుల ధరల సంస్కరణలను చేపట్టాల్సిన, విత్తన పరిశోధన శృంఖలాలను తెంచాల్సిన తక్షణ అగత్యం వచ్చిపడింది. ఆ దిశగా చర్యలు చేపట్టే ప్రయ త్నాలను యూపీఏ హయాంలో వామపక్షాలు ఎంతగా అడ్డగించాయో అంత గానూ నేడు నాగపూర్ మితవాద పక్షం అడ్డగిస్తోంది. మరింత సమర్థవంతం గా, వివేచనాయుతంగా భూమి, నీరు, గాలిని ఉపయోగించుకోవడం ఎలాగ నేది కూడా నేడు రాజకీయాలను ప్రభావితం చేసే ముఖ్యఅంశంగా మారింది. డిజిటల్ భారతాన్ని వాగ్దానం చేసేవారిలో నరేంద్ర మోదీ ఒకరు. కానీ సాగుకు నీటి సదుపాయం ఎలాగో, డిజిటలైజేషన్‌కు కనెక్టివిటీ (ఇంటర్నెట్ లేదా సెల్‌ఫోన్ సిగ్నల్ అందడం లేదా అనుసంధానం కావడం) కూడా అలాం టిదే. బిహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రయోగించిన అతి శక్తివంతమైన అస్త్రం ‘కాల్-డ్రాప్స్’ (ఫోన్లో మాట్లాడుతుండగా సాంకేతిక కారణాలతో కనెక్షన్ తెగిపోవడం). దేశంలోనే అతి పేద రాష్ట్రంలో ఆ సమస్య గురించి మాట్లాడటం అంటే కేక్ గురించి మాట్లాడటమేనని పలువురు బీజేపీ నేతలు నవ్వేశారు. కానీ బిహార్‌లో కూడా చౌకగా దొరికే స్మార్ట్ ఫోన్లు, వాటితో పాటూ కనెక్టివిటీ తక్కువగా ఉండటమనే సమస్యా విస్తృతంగా వ్యాపించాయి. డేటా చార్జీలు పైపైకి ఎగబాకుతుండగా కాల్- డ్రాప్స్ పెరిగిపోతుండటం అనే సమస్య కూడా ద్రవ్యోల్బణంతోపాటూ నేడు జీవన నాణ్యతకు సంబంధించిన సమస్యగా మారింది. కాబట్టే జుకెర్‌బర్గ్ ‘‘ఉచితం తాయిలం’’తో మన దేశంపై దాడికి దిగాడు. మునుముందుకు సాగుతున్న ప్రజా చర్చ గాలి, నీటి నాణ్యత గురించి ఇంటర్నెట్ ప్రజాస్వామ్యం గురించి ఆందోళన చెందే దేశం, ప్రభుత్వ ప్రైవేటు రంగాలు తమ నుంచి ధర వసూలుచేసి మరీ అందిస్తున్న వైద్య సేవల నాణ్యతను గురించి అడగడానికి ఎంతో కాలం పట్టదు. అలాగే క్షీణదశలో ఉన్న మన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ప్రమా ణాలు తక్కువగా ఉన్న ప్రైవేటు ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కళాశాలలు మొత్తంగా ఒక తరం భారతీయులకు అందిస్తూ వస్తున్న విద్య నాణ్యతపై అసంతృప్తి కూడా త్వరలోనే పేరుకుపోతుంది. ఇంకా ముందుకు పోతే, మీ తల్లిదండ్రుల కష్టార్జితంతో మీరు సంపాదించుకున్న డిగ్రీ మిమ్మల్ని ఉద్యోగార్హత గల వారిగా చేయగలుగుతుందా, లేదా? అనేదే ఇకపై రాజకీయాలను, ఓటరు ఎంపిక అవకాశాలను శాసిస్తుంది. అంతేగానీ మెకాలే విద్యావిధానానికి అనుకూలమా? లేక వ్యతిరేకమా? లేదా ఔరంగజేబు క్రూరనియంతా లేక బాగా అపార్థానికి గురైన మొఘల్ చక్రవర్తా? అనేవి కావు. ఆహారానికి సంబంధించి కూడా గుణాత్మకమైన పెను మార్పులు హఠాత్తుగా చోటుచేసు కుంటున్నాయి. తిండిగింజల వినియోగం నిలకడగా ఉండగా, పప్పులు, మాంసం, పాలు, గుడ్లు, కూరగాయలు, పళ్లు వ గైరాల వినియోగం పెరుగు తోంది. ఎక్కువ మంది ప్రజలు మాంస కృత్తులూ, విటమిన్లు, ఖనిజాలతో కూడిన సూక్ష్మ పోషకపదార్థాలూ ఉన్న ఆహారాన్ని ఎంచుకుంటున్నారు. సురక్షితమైన, నాణ్యమైన ఆహారం ప్రజల ముఖ్య సమస్యగా మారుతోంది. ఒక ఏడాది అంతా మన పార్లమెంటు స్తంభించిపోవడం విచారకరం. ఫలితంగా ప్రభుత్వం పనీ కొంత వరకు అలాగే అయింది. కానీ ప్రజా చర్చ మాత్రం ముందుకు సాగుతోంది, మార్పు చెందుతోంది. అవును, నేను మరోసారి చెబుతున్నాను ప్రజా చర్చ విలువ నిచ్చెనపైపైకి ఎగ బాకుతోంది. అందుకే బీజేపీ ఆవుపై శ్రద్ధ చూపిస్తుండటం ఓటర్లను మెప్పించలేక పోయింది. ఇది కొంత వరకు, మీరు ఎక్స్‌ప్రెస్ హైవేపై ఆగి ఉన్నప్పుడు రేర్ వ్యూ మిర్రర్లో నుంచి వాహనాలు మీ మీదకు దూసు కొచ్చేస్తున్నట్టు కనిపించటం లాంటిదే. అందువలన ఇది మనం కదిలి ముందుకు సాగాల్సిన సమయం. సమంజసమైన ఈ కోరికే నా నూతన వర్ష కామన. (వ్యాసకర్త: శేఖర్ గుప్తా) -
‘అధికారుల’ నోళ్లకు తాళాలేవి?
జాతిహితం ప్రజాస్వామ్య దేశాల్లో రహస్యాలు శాశ్వతంగా ఉండిపోకుండా చూడటం ముఖ్యం. రహస్యాలను వెల్లడించడాలు, పునర్విమర్శలు, వాటికి ప్రతివాదాలు ఆ సంవాదాన్ని సుసంపన్నం చేస్తాయి. పరిణతి చెందిన ప్రజాస్వామ్యాలు సైతం వీటికి సంబంధించి నిబంధనలను రూపొందించుకోవడం, ప్రత్యేకించి భద్రతావ్యవస్థలోని ఉన్నతాధికారుల విషయంలో మరీ అవసరం. లేకపోతే భద్రతా అధికారులు వివేచనారాహిత్యంతో అన్నీ బయట పెట్టేయడమనే వైరస్ ప్రబలి అదుపు చేయలేనిదిగా మారే ప్రమాదం ఉంది. యాకూబ్ ప్రాణాలు కాపాడాలని రామన్ అంత బలంగా భావించి ఉంటే బహిరంగంగానే మాట్లాడాల్సింది. అంతేగానీ ఒక వ్యాసాన్ని రాసి, దాన్ని ప్రచురించకుండా భద్రంగా దాచి ఉంచేవారు కారు. అదొకవేళ మిగతా నిందితుల విచారణకు హాని కలగజేస్తుందని ఆయన భయపడి ఉన్నా, యాకూబ్ శిక్షను సుప్రీంకోర్టు ధ్రువీకరించాకనైనా మాట్లాడాల్సింది. కానీ వివేచనతో కూడిన నైతిక ధైర్యం ఆయనకు కొరవడింది. ఆయుర్వేదం, యోగ, నయం చేయలేని జీవనశైలి సంబంధమైన వ్యాధు లేవీ లేవని కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ అన్నారు. ఆయుష్ (ఆయుర్వేదం, యోగ, ప్రకృతి వైద్యం, యునానీ, సిద్ధ, హోమియోపతి) శాఖ సహాయ మం త్రియైన ఆయన ఢిల్లీలో ఈ నెల 14న జరిగిన భారత మహిళా పాత్రికేయుల సమావేశంలో ఈ విషయాన్ని చెప్పారు. వేదకాలం నుంచి మనకు వార సత్వంగా సంక్రమించిన ఈ అద్భుత చికిత్సలను, స్వస్థతను చేకూర్చగల శక్తు లను ధిక్కరించగల వ్యాధి ఒకటి ఉన్నదని ఆయనకు సూచించాలని ఉబలా టంగా ఉంది. అది మాటల అతి విరేచన వ్యాధి. నేను మాట్లాడేది నానా విధాలైన కాషాయ యోధుల గురించిగానీ, ఎవరో ఓ సాధు లేదా సాధ్వి గురించిగానీ కాదు. కనీసం విచక్షణా రహితంగా నోరు పారేసుకుని మనకు కావాల్సినంత వినోదాన్ని, ప్రధానికి కొంత చికా కును కలిగించే ఓ మంత్రివర్యుల గురించైనా కాదు. తోటి భారతీయుల కంటే మరింత గురుతరమైన, సున్నితమైన పనులను నిర్వహించే బాధ్యతలను నిర్వహించిన వారి గురించి. కీలక రంగాలలో వ్యక్తిగత బాధ్యతతో నిర్వహిం చాల్సిన విధులకు జీవితకాలపు వివేచనాపరత్వం ఆవశ్యకం. అలాంటి విధు లను నిర్వర్తించిన వారే ఈ మాటల అతి విరేచన వ్యాధిగ్రస్తులైతే... అది రేకె త్తించే మహా దుర్భరమైన కంపు మీ నాసికలను, మనస్థితినే కాదు, స్థూలంగా అందరి ప్రయోజనాలను సైత ం పాడుచే సేస్తుందని తెలిసీ అనాగరి కమైన ఇలాంటి భాష వాడుతున్నందుకు మన్నించాలి. పైగా ఈ వ్యాధి, ఆ ముగ్గురూ తమ వృత్తి జీవితాన్ని ఏ ఆశయాలకు అంకితం చేశారో వాటికి సైతం చెరుపు చేసేది. ‘పెద్ద మనుషులు’ కాని ఆ ముగ్గురు ఇక మనం స్వీయాభిప్రాయ సహిత పాత్రికేయ వృత్తిలో రాణించడానికి సంబంధించిన మూడు ప్రాథమిక సూత్రాలకు తిరిగి వచ్చి ఈ తాజా ఉదం తాలను చూద్దాం. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, ప్రస్తుత బీజేపీ లోక్‌సభ సభ్యుడు ఆర్కే సింగ్ వ్యవహారాన్ని, ఆ తదుపరి భారత గూఢచార సంస్థ ‘రా’ మాజీ అధిపతి, కశ్మీర్ సమస్యపై మధ్యవర్తులలో ఒకరైన ఏఎస్ దౌలత్, ‘రా’ లోనే కీలక బాధ్యతలను నిర్వహించిన సీనియర్ అధికారి దివంగత బీ రామ న్ల ఉదంతాలను పరిశీలిద్దాం. భద్రతా సంస్థలలో పనిచేసిన ఉన్నతాధికారి పదవీ విరమణానంతరం, ప్రత్యేకించి పదవీ విరమణ చేసిన వెంటనే ఎలా ప్రవర్తించాలనే విషయానికి సంబంధించి ఈ ముగ్గురూ అతి చెడ్డ ఉదాహర ణలుగా నిలిచారని చెప్పడానికి విచారంగా ఉంది. ‘‘అధికారియైనా పెద్ద మనిషే’’ అనే నానుడి మరీ పాతది. ఆ ముగ్గురు అధికారుల గురించి చర్చిం చేటప్పుడు దాన్ని ప్రయోగించకుండా ఉండటం కోసమే నేను ‘‘అధికారి- పెద్దమనిషి’’ అంటూ ఉద్దేశపూర్వకంగానే రెండు పదాల మధ్య హైఫన్ను ఉంచుతూ కొత్త నానుడిని తయారు చేశాను. ఇది భద్రతా వ్యవస్థలో కీలక బాధ్యతను నిర్వహించిన పోలీసు, సైనిక అధికారులు సహా సీనియర్ ప్రభు త్వాధికారులను కూడా అభివర్ణించేది. ఈ ముగ్గురిలో ప్రతి ఒక్కరూ, నైతిక బాధ్యతతో తమ జీవితాన్ని అంకితం చేసిన వృత్తికే హాని కలగజేసేలా వంతుల వారీగా బహిరంగంగా మాట్లాడారు. వారలా మాట్లాడటంలో స్థాయి, పద్ధతులకు సంబంధించి తేడాలున్నా అదో ఉన్మాదం కాదనగలిగింది ఏదీ లేదు. అది... గప్పాలు కొడుతూ, వివేకరహితంగా పతాక శీర్షికల కోసం పాకులాడటమే కావచ్చు (సింగ్), మరి కొన్ని కాపీలు అమ్ముకోవడం కోసం కొంత వివాదాన్ని కూడా జోడించమని ప్రచురణకర్తలు తెచ్చిన ఒత్తిడే కావచ్చు (దౌలత్) లేదా పెడదోవబట్టిన అపరాధ భావనతో మానసికంగా ముడుచుకుపోయే వారిలో కనిపించే ‘లీమా సిండ్రోమ్’గా పిలిచే బందీల పట్ల సానుభూతే (రామన్) కావచ్చు. బందీ తనను బంధించిన వ్యక్తితో ప్రేమలో పడటమనే పరిస్థితిని సూచించే ‘స్టాక్‌హోమ్ సిండ్రోమ్’కు సరిగ్గా విరుద్ధమైన పరిస్థితికి ఇటీవలే ఈ ‘లీమా సిండ్రోమ్’ భావనను ప్రవేశపెట్టారు. దీనికి గురైతే మీరు మీ ఖైదీపట్ల సానుభూతిని ప్రదర్శించడం మొదలవుతుంది. వివేక రాహిత్యంతోనే అతి వాగుడు వివేకరాహిత్యపు కొలబద్ధతో ఈ మూడింటినీ కొలవాల్సిన అవసర మేమీలేదు. అలాగే, మాజీ భద్రతా అధికారులు ఇలా బహిరంగంగా రహస్యా లను రచ్చకెక్కించడం ఇదే మొదలనీ కాదు. కాకపోతే ఈ ముగ్గురూ అతి తక్కువ కాలంలోనే, అదీ కూడా ఒకరి కంటే మరొకరు మరింత ఎక్కువగా భారత ప్రయోజనాలకు నష్టం కలిగించేలా వరుసగా మాట్లాడటంలోని నిజా న్ని రాబట్టడంకోసం అధికారిక రహస్యాలను బట్టబయలు చేసే కృషి కొంత అవసరం. ప్రత్యేకించి నేను ఏమంత జాగ్రత్తగా వ్యవహరించని వ్యాఖ్యాతను. అయినా ఈ విషయంలో ఇతరుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రశ్నిస్తున్నట్టుగా కనిపించినా లెక్కచేయను. ఇక కాలక్రమానుసారంగా వెనక్కు తిరిగి చూద్దాం. పాకిస్తాన్‌కు వ్యతి రేకంగా ఇటీవల సింగ్ చేస్తున్న రభస ఎంత యుద్ధోన్మాదభరితంగా ఉందం టే... బహుశా అది శాశ్వత ఆగ్రహోదగ్రులైన వార్తా చానళ్ల తెల్ల మీసాల ఆసా ములలో అభద్రతాభావాన్ని కలిగించి ఉంటుంది. సింగ్ తాజాగా గత వారం ‘‘ఇండియా టుడే టీవీ’’కి చెందిన రాహుల్క న్వల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ... ఆయన ప్రలాపాలన్నిటిలోకీ విభిన్నమైనది. టీవీలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుండగా ఆయన 2005లో దావూద్ ఇబ్రహీంను దుబాయ్‌లో హత్య చేయడానికి వేసిన పథకాన్ని ‘‘వెల్లడి చేశారు.’’ దుబాయ్‌లో జరిగే దావూద్ ఇబ్రహీం కుమార్తె మహ్రుఖ్, పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారుడు జావెద్ మియాం దాద్ కుమారుడు జానాయిద్ల వివాహానికి వచ్చినప్పుడు చేయాలని తల పెట్టిన ఈ పథకం అమలుకు పదవీ విరమణ చేసిన అజిత్ దోవల్‌ను రప్పించారని ఆయన తెలిపారు. దోవల్ యూపీఏ హయాంలో 2004-05 మధ్య మన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధిపతిగా పనిచేశారు. ముంబై చీకటి ప్రపంచంలో ‘‘ముస్లిం’’ దావూద్ ఇబ్రహీంకు బద్ధ శత్రువైన ‘‘హిం దూ’’ ఛోటా షకీల్ ముఠాకు చెందిన ఇద్దరు షార్ప్ షూటర్లు (గురి తప్ప కుండా కాల్చగల నిపుణులు) దుబాయ్‌లో పొంచి ఉండేలా చేయాలని పథకం. బహుశా ఆ పెళ్లి వద్దే దావూద్‌ను అతన్ని పుట్టించిన ఆ పైవాడి దగ్గరకు పంపేయాలనుకున్నారు. సింగ్ కథనం ప్రకారం, ఛోటా షకీల్ ముఠాకు చెందిన ఆ ఇద్దరు షార్ప్ షూటర్లు ఢిల్లీలో ఉన్న విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు అక్కడికి వచ్చి వారిని అరెస్టు చేయడంతో ఆ పథకం విఫలమైంది. షకీల్ మనుషుల గురించి ముంబై పోలీసులకు ఎవరో ‘‘ఉప్పందించి’’, వారిని అరెస్టు చేయిం చారని ఆయన వాదన. మన గూఢచారి సంస్థ రచించిన పథకానికి ముంబై పోలీసులు వెన్నుపోటు పొడిచారా, లేదా? దావూద్ ఇబ్రహీం తన శత్రువుకు చెందిన షార్ప్ షూటర్ల జాడను కనిపెట్టి, ముంబై పోలీసులలోని తన మిత్రు లను హెచ్చరించాడా, లేదా? లేకపోతే జరగడానికి ఎక్కువ అవకాశం ఉన్న ట్టుగా... కుడి చెయ్యి ఏం చేయనున్నదో ఎడమ చేతికి తెలియకపోవడమే దీనికి కారణమా? ఇక మీరే చర్చించుకోవచ్చు. ఏదేమైనా సింగ్ ప్రలాపనల వల్ల భిన్న స్థాయిల్లో జరగాల్సిన నష్టం జరగనే జరిగిపోయింది. వివేచనే గూఢచార సంస్థలకు ప్రాణం భారత్ తన సొంత పౌరులను విదేశాల్లో హత్యలు చేయించడానికి సైతం వెనుకాడదని ఆయన ప్రపంచానికి చాటారు. దావూద్ కోసం హృదయం ద్రవీ భవించిపోతుండగా భుజానికి సంచీ వేలాడేసుకుతిరిగే విప్లవకారుడివంటూ నన్ను దుమ్మెత్తిపోయడానికి ముందు మీరు ‘‘ద వే ఆఫ్ లైప్’’ పుస్తకాన్ని తిర గేయండి. అది ‘‘న్యూయార్క్ టైమ్స్’’ గూఢచార వ్యవహారాల విలేకరి మార్క్ మాజెట్టీ రచించిన అద్భుతమైన పుస్తకం. అందులో ఆయన అమెరికాకు చెందిన సీఐఏ ఒక గూఢచార సంస్థ నుంచి హత్యా యంత్రంగా పరివర్తన చెందిన వైనాన్ని చిత్రించారు. అయినా ఆ సంస్థ యెమెన్‌లోని అల్ కాయిదా కీలక నేత అన్వర్ అల్ వకీల్‌పై ద్రోన్ దాడికి వచ్చేసరికి... అతగాడు ఆమెరికన్ పౌరుడైనందున అత్యున్నత స్థాయిలో (అధ్యక్షస్థాయి) లోతుగా ఆలోచించి తీసుకునే నిర్ణయం కావాలనుకోవడం విశేష ప్రాముఖ్యం గల విషయం. భారత గూఢచార వ్యవస్థ ఒక మాఫియా ముఠాకు వ్యతిరేకంగా మరో దాన్ని చేరదీస్తుందనే వాస్తవం తెలిసిందే. అయినా ఆ విషయాన్ని ఇంతవరకు ఎన్నడూ లాంఛనంగా అంగీకరించింది లేదు. సింగ్ ఆ పని కూడా చేసేశారు. మంచి లేదా చెడ్డ ఉగ్రవాదులు అంటూ ఉండరని మనం ఎప్పుడూ అంటూ ఉంటాం. అయినా చీకటి ప్రపంచంలో మాత్రం మంచి, చెడ్డా ఉంటాయని ఎలా అనగలం? మూడోది, మీ భూభాగంలో మేం చట్టవిరుద్ధమైన హత్యలకు పథకం పన్నామని చెప్పడం... అప్పుడు యునెటైడ్ ఎమిరేట్స్‌లోనే ఉన్న ప్రధానిని, ఆయన మిత్రులను పూర్తి సంకటస్థితికి నెట్టేసింది. అందుకోసం మనం చీకటి ప్రపంచానికి చెందిన హంతకులను వాడుకోవాలనుకోవడం అతి సులువుగా విదేశీ ఉగ్రవాద చర్య అనిపించుకుంటుంది. సింగ్ ఉద్దేశపూర్వకంగానే అలా చేశారా లేదా అనేది నేను ఇదమిత్థంగా చెప్పలేను. నాలుగు, ఆయన ముంబై పోలీసులకు దావూద్ డబ్బు సంచులు అందు తున్నాయని ఆరోపించారు. ఐదు, దోవల్ భారతదేశం తరఫున అత్యంత నమ్మకంగా ఆపరేషన్స్‌ను చేపట్టే వ్యక్తి అని బయటపెట్టారు. తద్వారా సింగ్ నేరుగా ‘‘దోవల్ భారత హమీద్ గుల్’’ (పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అధిపతి) అని పనిగట్టుకు ప్రచారం చేస్తున్న పాకిస్తాన్ ప్రచార యంత్రాం గానికి తోడ్పడ్డారు. ఆయన తప్పులకు లెక్కలేదు ఆయన వివేకరహితంగా చేసిన పనులను ఎన్నైనా ఇలా లెక్కిస్తూ పోగలం. దీనికి సంబంధంలేనిదే అయినా ఆయనకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. నిర్భయ ఘటనపై నిరసన ప్రదర్శల మధ్య ఆయన ఓ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీ పోలీసులు ఆందో ళనకారులతో వ్యవహరిస్తున్న తీరును గట్టిగా సమర్థించారు. నిజానికి ఆనాటి ఢిల్లీ పోలీసుల తీరు నేడు వారు మాజీ సైనికాధికారుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు ముందస్తు కసరత్తు మాత్రమే. సింగ్ యూపీఏలో ఉన్నారా లేదా ఎన్డీఏలో ఉన్నారా అనేదానితో నిమిత్తం లేదు. పంజాబీలో అనేట్టుగా లాహోర్‌లో వినాశకారకుడైన వాడు పెషావర్లోనైనా వినాశకారకుడే అవుతాడు. మిగతా ఇద్దరి వ్యవహారానికి వచ్చేసరికి వారికి అనుకూలంగానైనా, ప్రతికూలంగానైనా కూడా వాదించవచ్చు. దౌలత్ కశ్మీర్ చేదు వాస్తవాన్ని బయటపెట్టడం మాత్రమే చేస్తున్నారు, హురియత్ నేతలు దాదాపు అంతా కిరాయికి పనిచేస్తున్నవారే అనే ముఖ్య విషయం కశ్మీర్ ప్రజలకు, మిగతా దేశానికి కూడా రూఢి కావడం ముఖ్యమని వాదించొచ్చు. చిన్నా చితకా ఎత్తుగడలతోనూ, కూటనీతితోనూ, లంచాలు తినిపించడంతోనూ కొంత సమయాన్ని సంపాదించడమనే దాన్ని కొనసాగించడం కశ్మీర్ సమస్యతో వ్యవహరించే వ్యూహంగా ఉంటోంది. దౌలత్ కథనం... ఇది మనగలిగేదేమీ కాదని, నూతన వైఖరికి రూప కల్పన చేయడం అవసరమని ఢిల్లీలోని కొత్త ప్రభుత్వానికి గుర్తు చేసే పద్ధతి కూడా అవుతుంది. ఇక రామన్ విషయానికి వస్తే, ఆయన ఘటికుడైన గూఢచారి అధికారి మాత్రమే కాదు, అంతరాత్మ ఉన్న మనిషి కూడానని మీరనవచ్చు. కస్టడీలో ఉండి సహకరించిన ఉగ్రవాది ప్రాణాలను కాపాడా లని ప్రయత్నం చేయాల్సిన నైతిక బాధ్యత ఆయనకు ఉన్నదనీ వాదిం చవచ్చు. అరెస్టు అయ్యేలా భారత ప్రభుత్వం అతడితో ముందుగా ‘‘మాట్లాడింది’’ కాబట్టి అతని పట్ల దయ చూపాల్సి ఉన్నదనీ అనొచ్చు. కానీ ఆ ఇద్దరు చేసినదీ సమస్యాత్మకమైనదే. ఇద్దరూ ఇప్పుడు నడు స్తున్న పరిణామాలపై ఉన్న ముసుగును తొలగించేశారు. ఒక రహస్య ప్రేమ కార్య కలాపం కథనాన్ని, అది ముగిసిపోయాక తగినంత సమయం గడిచాక, దానివల్ల ఆ వ్యక్తులకు, వారి మిత్రులకు బాధ కలగకుండా వారు గతించాక రాయడం వేరు. రాజకీయవేత్తలు, గూఢచారి అధికారులు, చివరికి పాత్రి కేయులు సైతం మరింత పెద్ద ప్రయోజనం కోసం తమకు సమాచారం అందిం చిన వ్యక్తులు (సోర్స్) ఎవరో ఎప్పటికీ బయటపెట్టరు. ‘వాషింగ్టన్ పోస్ట్’కు చెందిన బాబ్ వుడ్వార్డ్, కార్ల్ బెర్నిస్టీన్లు వాటర్‌గేట్ కుంభకోణాన్ని బయట పెట్టినా, ఆ సమాచారాన్ని అందించిన ‘‘డీప్ థ్రోట్ ’’ ఎవరో ఆయన మరణా నంతరం వరకు వెల్లడించలేదు. నైతిక ధైర్యం లోపించింది రామన్ సైతం తనకు సహకరించిన వ్యక్తుల పేర్లను బయటపెట్టలేదు. కానీ, తాను సైతం నిస్సందేహంగా నేరస్తుడని భావించిన యాకూబ్ మెమెన్ పట్ల ఉదారవాద సానుభూతి పెంపొంద డానికి దోహదపడ్డారు. యాకూబ్ ‘‘భారత వ్యవస్థ’’ చేతుల్లో వంచనకు గురైన బాధితుడనే అభిప్రాయం ముస్లింలలో, ప్రత్యేకించి ముస్లిం యువతలో ఉంది. దానికి రామన్ సామం జస్యాన్ని కల్పించారు కూడా. రామన్ బతికే ఉంటే యాకూబ్‌ను ఒక హీరోగా సమాధి చేయడానికి పోగైన జనాలు ఎలాంటివారో చూసి విచారించి ఉండేవారు. నేడు లేని ఒక వ్యక్తిని గురించి ఇలా అనడం ఇబ్బందికరంగానే ఉన్నా చెప్పక తప్పడం లేదు... రామన్ తానొక నైతికపరమైన పిరికివాడినని రుజువు చేసుకున్నారు. యాకూబ్ ప్రాణాలు కాపాడాలని ఆయన అంత బలంగా భావించి ఉంటే బహిరంగంగానే మాట్లాడాల్సింది. అంతేగానీ ఒక వ్యాసాన్ని రాసి, దాన్ని ప్రచురించకుండా భద్రంగా దాచి ఉంచేవారు కారు. అదొకవేళ మిగతా నిందితుల విచారణకు హాని కలగజేస్తుందని ఆయన భయపడి ఉన్నా, యాకూబ్ శిక్షను సుప్రీం కోర్టు ధ్రువీకరించాకనైనా మాట్లాడాల్సింది. కానీ వివేచనతో కూడిన నైతిక ధైర్యం ఆయనకు కొరవడింది. రా వ్యవస్థాప కుడు ఆర్ఎన్ కావో శిష్యుడినంటూ ఆయన తనను తాను ‘‘కావోబాయ్’’గా పిలుచుకున్నారేగానీ అందుకు భిన్నంగా ప్రవర్తించారు. చివరికి ఆయన తన ఆశయానికే తీవ్ర న ష్టం కలగజేశారు. ప్రజాస్వామ్య దేశాల్లో రహస్యాలు శాశ్వతంగా అలాగే ఉండిపోకుండా చూడటం ముఖ్యమైనది. రహస్యాలను వెల్లడించడాలు, వాటిపై పునర్విమ ర్శలు, వాటికి ప్రతివాదాలు ఆ సంవాదాన్ని సుసంపన్నం చేస్తాయి. అయితే పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశాలు సైతం వీటికి సంబంధించి నిబం ధనలను రూపొందించుకోవడం, ప్రత్యేకించి భద్రతా వ్యవస్థలోని ఉన్నతాధి కారుల విషయంలో మరీ అవసరం. అమెరికాలో ఇలాంటి అనుమతులకు, పరిశీలనకు విస్తృత యంత్రాంగం ఉంది. సీనియర్ ఎమ్15 అధికారి పీటర్ రైట్ సంచలనాత్మక స్మృతుల ‘‘స్పైకేచర్’’ ప్రచురణ తదుపరి బ్రిటన్‌లో ఈ అంశం చర్చకు వచ్చింది. వివేచనారాహిత్యమనే ఈ వైరస్, అంటువ్యాధిగా ప్రబలి అదుపు చేయలేనిదిగా విజృంభించకముందే దాన్ని నియంత్రించడం అవసరం. శేఖర్ గుప్తా Twitter@Shekargupta. -
ఏకవీరునికి చెప్పక తప్పని నిజం
మోదీలో ఎన్ని సుగుణాలున్నా ఆయన ప్రభుత్వం పనితీరు అస్తవ్యస్తంగా ఉందెందుకు? వివాదాస్పదమైనవి కాని గంగానది శుద్ధి, స్వచ్ఛభారత్ల నుంచి మేక్ ఇన్ ఇండియా వరకు ఆయన గొప్ప ఆలోచనలన్నీ ఎందుకు కొట్టుకుపోతున్నాయి? ఆర్థిక వృద్ధి ఎందుకు పుంజుకోవడం లేదు? ఓ ఆర్డినెన్స్‌తో కొత్త భూసేకరణ చట్టాన్ని తేవాలని ప్రయత్నించడం వంటి ఘోర వ్యూహాత్మక తప్పిదం ఆయన ఎలా చేశారు? యాకూబ్ మెమన్ ఉరిశిక్షపై చానళ్లకు నోటీసులను పంపి వార్తా మాధ్యమంపైనే ఆయన ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందన్నట్టు ఎందుకు కనిపిస్తోంది? మన దేశంలో ఇందిరాగాంధీ తర్వాత అత్యంత శక్తివంతమైన సుప్రసిద్ధ రాజకీయవేత్త నరేంద్ర మోదీనే. అయితే మీ శోధనను మరింత కుదించి చూసేట్టయితే, సంపూర్ణాధికారాన్ని చలాయించే సహజానుసార వర్తనుడైన నాయకుడు ఆయన మాత్రమేనని మీరు వాదించవచ్చు. మార్గరేట్ థాచర్ విషయంలో సహజానుసార నాయకత్వానికి చెప్పిన నిర్వచనమే మోదీ విష యంలోనూ వర్తిస్తుందని నా నమ్మకం. ఈ విషయంలో ఏకాభిప్రాయం గురిం చి చింతించాల్సిన అవసరమేమీ లేదు. నేను నా నమ్మకాన్నే అనుసరిస్తాను. ఆ విషయాన్ని అలా ఉంచితే, మోదీ మనకున్న అతి శక్తివంతమైన బహిరంగ ఉపన్యాసకుడు. తనదైన స్వంత విలక్షణ శైలిగల ప్రభావశీలియైన వక్త. ఆయ న పార్లమెంటులో ఎక్కువగా మాట్లాడరని లేదా సూటిగా సంధించే ప్రశ్నలను ఎదుర్కోలేరని మీరు అభ్యంతర పెట్టవచ్చు. అయితే, పూర్తిగా తన నియం త్రణలో ఉంచుకో గల వాతావరణంలో ఆయన మహాశక్తివంతంగా శ్రోతలను ప్రభావితం చేయగల వక్త. ఒక్కసారి ఆయన తన శ్రోతలు ఎవరనే విష యాన్ని స్పష్టంగా అవగతం చేసుకుని, వారిని నియంత్రిత వాతావరణంలో ఉంచగలిగారంటే చాలు... ఇక ఆయన తప్ప వేదికపై మరెవరూ కనిపించరు. మన దేశంలో అలాంటి వక్తను మునుపెన్నడూ చూసి ఎరుగం. వాజపేయి కూడా గొప్పవక్తే, కానీ అది అప్పుడప్పుడూనే. పైగా ఆయన పెద్ద వేదికలను తన భావాలను లేదా భావజాలాన్ని వ్యాపింపజేయడానికి వాడుకోలేదు. బలమైన నేతల తీరే వేరు ఈ గుణాలు తనకున్నాయని గత వారంలో మోదీ రెండుసార్లు నిరూపిం చారు. ఒకటి, ఆయన స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో. రెండవది, దుబా య్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి చేసిన ఉపన్యాసంలో. ఢిల్లీ ఎర్రకోట నుంచి ఆయన ఈ ఏడాది చేసిన ప్రసంగంతో పోలిస్తే గత ఏడాది ప్రసంగం మరింత ఎక్కువ కదలించేదిగా ఉన్నమాట నిజమే. కానీ ఆయన ఉద్దేశపూర్వ కంగానే ఈ ఏడాది ప్రసంగానికి తక్కువ ప్రాధాన్యాన్నిచ్చారు. సుదీర్ఘ ప్రయా ణం సాగించే వానిలా నౌకను నియంత్రించడంలో కుదురుకుంటున్నట్టు ప్రవర్తించారు. ఈసారి ప్రసంగంలో కొత్త భావాలు ఏమీలేవు. అదీ బహుశా ఉద్దేశపూర్వకంగా చేసినదే కావాలి. ఇంతకుముందు ముందుకు తెచ్చిన ఆలో చనలు, ప్రత్యేకించి మరుగుదొడ్లు, స్వచ్ఛ భారత్ ఉదాసీన పురోగతిని చూపు తుండటం అందుకు కారణమై ఉండొచ్చు. అయితే ఒత్తిడికి గురై ఆయన ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్ (ఓఆర్ఓపీ) సమస్యపై వెంటనే ఎలాంటి ప్రకటనా చేయ కుండా కొంత సాహసాన్ని ప్రదర్శించారు. బలమైన నేతలు ఘటనలకు విధానపరంగా ప్రతిస్పందించరు. సహజా నుసార వర్తనులైన నేతలు తమ నుంచి అంతా ఏమేమి ఆశిస్తే అది చేసే యరు. అందుకు బదులుగా వారు చేసేదేదో ఆశ్చర్యకరంగా చేసేస్తారు. ఓఆర్ ఓపీ సమస్యపై సాధారణమైన మాటలకు మించి మోదీ మరేమీ ప్రస్తావించ కపోవడం అందరికంటే ఎక్కువగా మీడియావాళ్లను ఆశ్చర్యచకితులను చేసిం ది. ప్రత్యేకించి జంతర్‌మంతర్ వద్ద మాజీ సైనికుల ప్రతినిధులను సమీకరిం చి, వారితో మాట్లాడించడానికి టీవీ సేనలను మోహరించిన చానళ్ల వారు నివ్వెరపోయేలా చేశారు. శక్తివంతమైన, సహజానుసార వర్తనులైన నేతలు పెద్ద వేదికలపై తమ మీదే ఉన్న కేంద్రీకరణను ఇతరులు వారిపైకి మరల్చు కోవడాన్ని అనుమతించరు. ఒకవేళ మోదీ ఓఆర్ఓపీపై నిర్దిష్టంగా ఓ నాట కీయ ప్రకటనను చేశారనే అనుకున్నా, దానికి మాజీ సైనికులు పూర్తిగా సం తృప్తి చెందారని అనుకున్నా... అప్పుడు ఈ ఏడాది స్వాతంత్య్రదినోత్సవం మోదీదిగా గాక, వారిదిగా మారిపోయేది. ప్రభుత్వ పరిపాలనకు సంబంధిం చి తీసుకునే రోజువారీ నిర్ణయాలను అలాంటి ప్రతి సందర్భంలోనూ ఆయన ప్రకటిస్తారని ఆశించే చెడు సంప్రదాయాన్ని ఏర్పరచినట్టయ్యేది. అది, ఆయ నకున్న ఒక సువిశాల వేదికను సమస్యల పరిష్కార వేదిక స్థాయికి కుదించేసి ఉండేది. ప్రధాని కొత్త ఎజెండా అలాగే దుబాయ్ ప్రసంగం కూడా. ఒక ఇస్లామిక్ దేశంలో అదే మోదీ తొలి పర్యటన. అది కూడా మన దేశంతో సంబంధాలు గతుకులబాటలో ఉన్న దేశంలో పర్యటన. పైగా అది మన పన్ను ఎగవేతదార్లకు, స్మగ్లింగ్ సిండి కేట్లకు, మరీ ముఖ్యంగా దావూద్ ఇబ్రహీంకు కర్మభూమియైన దుబాయ్. ఈ వాస్తవాల స్పృహ ఉన్నా కూడా ఆయన హుందాతనంతో కూడిన దృఢ త్వంతో అందించాల్సిన సందేశాన్ని అందించారు. ఆయన ఉపన్యాసంలో పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఇస్తున్న మద్దతుపై ఫిర్యాదులుగానీ, అది దాని పద్ధతులను మార్చుకునేలా మీ పలుకుబడిని ఉపయోగించమని పాకిస్తాన్‌కు మిత్రులైన యూఏఈ షేక్‌లకు విజ్ఞప్తులు చేయడం గానీ లేవు. తెలివైన ఓ సున్నిత సందే శం మాత్రమే ఉంది. యుూరప్లాగే దక్షిణ ఆసియా కూడా ఐక్యమౌతోం ది. తూర్పున అంతా దగ్గరకు చేరువవుతున్నారు. పశ్చిమాన పాకిస్తానీయులు ఈ క్రమాన్ని అడ్డుకోడాన్ని కొనసాగిస్తే, కప్పదాటు వేసి వారిని దాటుకొని యూఏఈని చేరుకోవడంతో ఈ ఐక్యతా వలయం పూర్తవుతుంది. కాబట్టి ఇం దులో చేరండి లేదా మిమ్మల్ని వదిలేసి పోయే ముప్పును ఎదుర్కోండి అనే సందేశాన్ని పాకిస్తాన్‌కు పంపారు. అదే సమయంలో సరిహద్దుల్లో కాల్పులు కొనసాగుతూనే ఉన్నా ఆయన దాన్ని దూషించడమో లేదా శాపనార్ధాలు పెట్ట డమో చేయలేదు. మోదీ ఒక కొత్త ఎజెండాను తయారు చేస్తుండటాన్ని మీరు చూడవచ్చు. పాకిస్తాన్‌తో చర్చలు తిరిగి కొనసాగాలని ఆయన కోరుకుంటు న్నారు. ఎవరూ ఆ క్రమానికి భంగం కలిగించడాన్ని ఆయన అనుమతించరు. ఒక్కసారి ఆయన దుబాయ్ ప్రసంగం టేప్‌ను మరోమారు చూడండి. దుబాయ్ ‘‘యువరాజు’’ను కీర్తిస్తూ సభికుల చేత ఎన్నిసార్లు నినాదాలు చేయించారో లెక్కించండి. ఇప్పుడు ఆలోచించండి. ఒక భారత ప్రధాని భార తీయ సభికుల చేత... వారు విదేశీ భూభాగంలో పనిచేస్తున్నవారే అయినా... అక్కడి పాలకుని కీర్తిస్తూ నినాదాలు చేయించడం అలవాటుగా జరిగేదేనా? అందులోనూ సభికులు ప్రధానంగా హిందువులే అయినాగానీ ఒక ఇస్లామిక్ రాచరికాన్ని కీర్తింపజేయడం సైతం కాకతాళీయం. దూరదర్శన్ కెమెరాల వాళ్లు, మోదీ ఇమేజ్ మేనేజర్లు... సంప్రదాయక దుస్తుల్లోని బోరా ముస్లింలం దరినీ ఒకే చోట గుంపుగా కూర్చునేలా చేసి, పదే పదే వారిపైకే కెమెరాలను ఫోకస్ చేస్తూ ఈ అసాధారణ దృశ్యాన్ని కొంత చెడగొట్టారు. వ్యూహాత్మక ్రప్రారంభం నాకు గుర్తున్నంత వరకు, ఒక భారత నేత భారత సభికుల చేత ఒక విదేశీ నిరంకుశ నేతను ఇలా కీర్తించేలా చేసిన ఘటనలు రెండున్నాయి. మొద టిది, 1955లో నెహ్రూ, సోవియట్ యూనియన్ ప్రధాని కృశ్చెవ్, రక్షణమంత్రి బుల్గానిన్‌లను రామ్‌లీలా మైదాన్‌కు తీసుకెళ్లినప్పుడు. రెండవది, బాబ్రీ మసీదు విధ్వంసం, అల్లర్ల తదుపరి లక్నోలోని ఇమాంబారా వద్ద పీవీ నర సింహారావు, ఇరాన్ అధ్యక్షుడు రఫ్సంజానీ పెద్ద జనసమూహాన్ని ఉద్దేశిస్తూ ప్రసంగించినప్పుడు. అయినప్పటికీ ఒక తేడా ఉంది. నెహ్రూ సోషలిస్టు అలీన విధానం దశ తారస్థాయిలో ఉండగా కృశ్చెవ్ పర్యటన జరిగింది. కాబట్టి రెండు దేశాల మధ్య భావజాలపరమైన అనుబంధం ఉండేది. ఇక రఫ్సంజానీకి హర్షధ్వానాలు చేసినవారంతా ముస్లింలు, లేదా ఎక్కువగా షియాలు. ఆయన సభికులనుద్దేశించి ఏం మాట్లాడినా, నా పుస్తకంలో మాత్రం మన చరిత్రలోనే అది అత్యంత చతురతతో సాధించిన దౌత్య విజ యమని రాసుకున్నాను. అది భారత లౌకిక వ్యవస్థలో భారతీయ ముస్లింలు సురక్షితమనే సందేశాన్ని ప్రపంచానికి పంపింది. ఇరాన్‌పై ఆంక్షలు, పాకిస్తాన్ సమస్య, అప్పుడప్పుడు ఇరుదేశాల మధ్య తలెత్తే చికాకులు ఉన్నప్పటికీ... ఆ పర్యటన దానికదే ఇరాన్‌తో భారత్‌కున్న అతి ప్రత్యేక అనుబంధాన్ని నొక్కి చెప్పింది, సముచిత మైనదని స్పష్టం చేసింది. మోదీ ఇంతవరకు ఏ ఇస్లామిక్ దేశాన్ని సందర్శించలేదని ఆయన విమ ర్శకులు ఫిర్యాదు చేస్తూ వచ్చారు. బంగ్లాదేశ్, మధ్య ఆసియా రిపబ్లిక్కులకు వెళ్లారు, నిజమే. కానీ ఒక నిజమైన ఇస్లామిక్ దే శానికి వెళ్లలేదు. ఆ లోటును ఇప్పుడు పూడ్చుకుంటున్నారు. అదీ కూడా తన పర్యటనల ప్రపంచపటంలో మరో పిన్నును గుచ్చడంగా కాదు... ఒక వ్యూహాత్మక ప్రారంభంతో మొదలు పెట్టారు. తాను హిందూ ప్రధాన మంత్రినని నిస్సంకోచంగా విశ్వసించే వ్యక్తి 50,000 మంది స్వదేశీయులతో, వారిలో అత్యధికులు హిందువులే అయినా గానీ, ఒక విదేశంలోని వంశపారంపర్య ముస్లిం పాలకునికి హర్షధ్వానాలు చేయించారంటే అది ఆయనలోని సహజాతానుసార ప్రవర్తనను గురించి, దాని శక్తి, నైపుణ్యాల గురించి చెబుతుంది. ఏమిటీ పనితీరు? ఇన్ని గొప్ప సుగుణాలున్నా, ఆయన ప్రభుత్వం పనితీరు తలా తోకా లేకుం డా కాకున్నా, ఇప్పటికీ క్రమరాహిత్యంగా నడుస్తోందెందుకు? వివాదా స్పదమైనవి కాని గంగానది శుద్ధి, స్వచ్ఛభారత్ల నుంచి మేక్ ఇన్ ఇండియా వరకు ఆయన గొప్ప ఆలోచనలన్నీ ఎందుకు కొట్టుకుపోతున్నాయి? ఆర్థిక వృద్ధి ఎందుకు కోలుకోవడం లేదు? ప్రత్యేకించి కొన్ని ప్రమాణాలను మార్చి పౌరాణిక గాథల్లోలా అంకెలను అద్భుతంగా పెంచేసి చూపడంలో ప్రదర్శిం చిన గణాంకశాస్త్ర సృజనాత్మకతను తీసేసి చూస్తే, ఆర్థికవృద్ధి ఇంకా కోలుకో వడం లేదనేది అవగతమవుతుంది. కేవలం రెండే రెండు స్క్వాడ్రన్ల రాపేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ప్రధాని స్థాయిలో ఒక ప్రత్యేకమైన, కచ్చిత మైన నిర్ణయం జరగాల్సి ఉన్నా... బేరసారాలు తదితర లాంఛనాల వద్ద అది ఎందుకు మూలనపడి ఉంది? ప్రధానికి బదులుగా గిరిరాజ్ సింగ్, సాక్షి మహరాజ్‌ల నుంచి గ జేంద్ర చౌహాన్ వరకు, అక్కడి నుంచి మ్యాగి వరకు నానారకాల తలతిక్క బాప తును పతాక శీర్షికలకు ఎందుకు ఎక్కనిస్తున్నట్టు? రాత్రికి రాత్రే ఓ ఆర్డినె న్స్‌తో కొత్త భూసేకరణ చట్టాన్ని తేవాలని ప్రయత్నించడం వంటి ఘోర వ్యూహాత్మక తప్పిదం ఆయన ఎలా చేశారు? యాకూబ్ మెమన్ ఉరిశిక్షపై ప్రసారం చేసిన వార్తా కథనాల (వాటిలో కొన్ని అసంబద్ధమైనవే అయినా) కారణంగా చానళ్లకు లాంఛనంగా నోటీసులను పంపి... మొత్తంగా వార్తా ప్రసార మాధ్యమంపైనే యుద్ధం ప్రకటించిందన్నట్టుగా ఆయన ప్రభుత్వం ఎందుకు కనిపిస్తున్నట్టు? సన్ గ్రూపు మీడియా లెసైన్సుల ఉపసంహరణకు ఆయన ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖ ‘‘జాతీయ భద్రతకు ముప్పు’’ను అస్త్రాన్ని ప్రయోగించింది. ఇక ఆయన సీబీఐ, తీస్తా సెతల్వాద్ అంటే దావూద్ ఇబ్రహీం ఇక్కడే వదిలి వెళ్లిన ప్రమాదకరమైన అతగాడి చుట్టమన్నట్టుగా ఆమెను ‘‘జాతీయ భద్రతకు ముప్పు’’ను చేసేసింది. మోదీ, ఆయ న ప్రభు త్వమూ చేసిన ఈ పోరాటాలన్నిటి వల్లా మహా అయితే వారికి నచ్చని వారె వరో ఒకర్ని జైలుకు పంపగలగడంలోనో లేదా ఒక మీడియా సంస్థ ప్రచురణ ను కొంతకాలంపాటూ బలవంతంగా నిలిచిపోయేలా చేయడంలోనో సఫ లమై ఉండొచ్చు. కానీ అవన్నీ వారు సారాంశంలో ఓటమికి గురికాక తప్ప నివే. తెలివివంతులు, సహజానుసార వర్తనులు, శక్తి వంతులు, ఆత్మ విశ్వాసం కలిగిన నేతలు, ప్రభావశీలురైన గొప్పవక్తలు... అలాంటి చిల్లర మల్లర విషయాల కోసం తమ శక్తులను, తమకున్న మంచి పేరును చెల్లా చెదు రుచేసి, వ్యర్థం చేసుకోరు. గొప్పదనాన్ని హరించే ‘అదే’ బలహీనత ఆయనలో ఇన్ని గొప్ప సుగుణాలున్నా, శక్తివంతులైన చాలామంది నేతలకు న్నట్టే ఆయనకూ ఓ బలహీనత ఉంది. దాని ఫలితంగా వారు ఎంత ప్రతి భాశాలురైనాగానీ నిజమైన గొప్పదనాన్ని సాధించే అవకాశాన్ని తమకు తామే దక్కకుండా చేసుకుంటారు. ప్రతిభ ఎక్కడవున్నా, అది తమ రాజకీయ సామీ ప్యపు పరిధికి లేదా భావజాలపరమైన సౌఖ్యతా పరిధికి వెలువల ఉన్నాగానీ ఆకర్షించగల, ఆహ్వానించ గల శక్తి కొరవడటం, అందుకు విముఖులై ఉండ టం, లేదా అంతటి వినయం లేకపోవడం అందుకు కారణం కావచ్చా? లేదం టే అధికారంలో ఉన్న వారికి అంతర్గతంగానే అయినా నిజాన్ని సూటిగా చెప్ప గలిగేపాటి వెన్నెముక గలిగిన తెలివైన వారిని తమ వ్యవస్థలోకి తీసుకురావ డమైనా చేయాలి. ఉదాహరణకు, ఫలానా సూటు ఆకర్షణీయంగా ఉన్నా, అలాంటి సూటు ధరించడం మంచి యోచన కాదని ఆయనకు చెప్పగలవారు ఎవరైనా కావాలి. ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు చాలా చికాకు పుట్టించేవిగా గడి చాయి నిజమే. కానీ లోక్‌సభలో అధికారపక్ష నాయకుడైన ప్రధాని సభలో ఉండి, ప్రతిపక్షాలు లేవనెత్తిన సమస్యలపై తనంతట తానుగానే ఒక ప్రకటన చేసి ఉంటే బావుండేది. అది వారిని ఒప్పించగలిగి ఉండేదేమీ కాదు. కానీ అలా చేయకపోవడం వల్ల ప్రధానిగా ఆయన తన నైతిక అధికారాన్ని ప్రయో గించే అవకాశాన్ని కోల్పోయారు. తప్పో, ఒప్పోగానీ మీడియా స్వేచ్ఛల విష యంలో ఆయన ప్రభుత్వాన్ని అనుమానంగా చూడటం అలవాటైంది కాబట్టి కనీసం ఆయన మీడియా స్వేచ్ఛ విషయంలో కొత్త యుద్ధరంగాలను తెరవ వద్దని తన హోం, సమాచార శాఖలను హెచ్చరించైనా ఉండాల్సింది. రామ్ విలాస్ పశ్వాన్ మ్యాగి విషయంలో నమ్మశక్యంకాని విధంగా క్లాస్ యాక్షన్ సూట్ (సమూహ ప్రాతినిధ్య వ్యాజ్యం) వేయడానికి ముందే ఆయన చేత ఓ ‘చిల్ పిల్’ (మానసిక ప్రశాంతత కోసం ఇచ్చే ఉత్తుత్తి మందు)ను మిం గించమని ప్రధాని చెవిలో జోరీగలా పోరే వారెవరైనా ఉండాల్సింది. మీది శక్తివంతమైన సర్వసత్తాక ప్రభుత్వం. మీ దేశ రిపబ్లిక్లోనే ఉన్న ఆహార రక్షణ భద్రత చట్టాలకు అనుగుణంగా మీరు ‘నెస్లే’ను నియంత్రించగలరు. మీ స్వంత పరిశోధనా కేంద్రాల్లో నెస్లే ఉత్పత్తులన్నిటినీ పరీక్షింపజేయగలరు. ఏమైనా తప్పున్నట్టుగా లేదా నేరానికి పాల్పడ్డట్టుగా నిర్ధారించగలిగితే విచా రించి శిక్షించవచ్చు. అంతేగానీ క్లాస్ యాక్షన్ సూటా? అది బలాన్ని ప్రకటిం చేది కాదు, మూర్ఖత్వాన్ని వెల్లడించేది మాత్రమే. ప్రధాని వీటిని పట్టించుకోలేనంతగా ఇంతకంటే ముఖ్యమైన ఇతర బాధ్యతలతో తలమునకలై ఉన్నారని మీరనొచ్చు. అయితే మాత్రం మీ ప్రభు త్వం ఇలా కుంటుతూ నడవడాన్ని ఎలా అనుమతిస్తారు? ఒకే ఒక్క యోధు నితో కూడిన అశ్వికసేన అనే అద్భుతమైన ఆలోచన ఆసక్తికరమైనదే. కానీ మిమ్మల్ని అనుసరించే నిజమైన సేనలను నిర్మించనిదే యుద్ధాలను గెలవలేరు. (వ్యాసకర్త: శేఖర్ గుప్తా) -
నవయువ భారతం ‘మసాన్’
జాతిహితం భారత జనరంజక సినిమా మారుతున్న మన సమాజపు వైఖరులను, పోకడలను అంత త్వరగా పసిగట్టగలదా? లేదంటే, వాస్తవంగా వాటిని అది ముందుగానే ఊహించి తానే మారుతుందా? ఇదో ఆసక్తికరమైన చర్చనీయాంశం. అయితే భారత సినిమా, నిర్దిష్టంగా చెప్పాలంటే హిందీ సినిమా (నా భాషా పరిధి పరిమితం కాబట్టి) మన సమా జంలో, ఆర్థికతత్వంలో, జీవనశైలులలో, వైఖరుల లోనే కాదు, లైంగిక భావనల్లో సైతం వస్తున్న మార్పులను మరిదేనికన్నా కూడాసుస్పష్టంగా ప్రతిఫలించగలుగుతోందనేది మాత్రం నిస్సందేహం. పండితులు, సామాజిక శాస్త్రవేత్తలు, రాజకీయవేత్తలు కనుగొనడానికి ముందే అది ప్రస్తుతం చిన్న పట్టణాల భారతాన్ని కనిపెట్టిం ది. సంజయ్ గ్యావన్ తీసిన అద్భుతాతి అద్భుతమైన మసాన్ (ఒంటరిగా ఎగిరిపో) చూసేసరికి సినీలోకానికి చెందని, తేలికగా ప్రభావితమయ్యే సామాన్యమైన నా మతి గతి తప్పి ఉండొచ్చని మీరనొచ్చు. చిన్న పట్టణ భార తం గుండె చప్పుళ్లను మసాన్ పట్టుకున్నట్టుగా నేను చూసిన మరే సినిమా పట్టుకోలేకపోయింది. నా మనస్సుపై అది ప్రగాఢ ముద్రను వేసిందనడం నిస్సందేహం. దాన్ని చూసే ప్రేక్షకులలో చాలా మంది పరిస్థితి కూడా అదే కావచ్చని నా అనుమానం. షాద్ అలీ తీసిన బంటీ ఔర్ బబ్లీతో ఆవిర్భవిం చిన ఈ ధోరణి ఆ తర్వాతి ఏళ్లలో ఓంకార, ఇష్కియా, లవ్, సెక్స్ ఔర్ ధోకా, దేవ్. డి, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్లతో కొనసాగి, ఇప్పుడు మసాన్తో పరిణతి చెందినట్టు రూఢీ అయింది. సాపేక్షికంగా సరదా సినిమాల కోవకు చెందిన శుద్ధ్ దేశీ రొమాన్స్, రాంఝనా, తను వెడ్స్ మను, దాని రెండో భాగం, బ్లాక్ బస్టర్ స్థాయిలోని దబాంగ్, రబ్ నె బనా దీ జోడీ కూడా ఆ ధోరణిలో భాగమే. 1970ల మొదటి వరకు హిందీ సినిమాలో గ్రామీణ భారతం ప్రధాన ధోరణిగా ఉండేది. నిరాశా నిస్పృహలు, ఆగ్రహావేశాలు ప్రవేశించడంతో అది రంగం నుంచి తప్పుకుని, సర్వ విజేతయైన ఆగ్రహభరిత యువకునికి చోటి చ్చింది. కానీ దాదాపు గత దశాబ్దికి పైగా చిన్న పట్టణ భారతం అలనాటి గ్రామీణ భారతమంతటి ప్రస్ఫుటమైన ధోరణిగా ఆవిర్భవించింది. మారే సమాజంతో మారుతున్న సినిమా రాజకీయ అర్థశాస్త్ర దృష్టితో ఈ మార్పునకు సంబంధించిన చరిత్రను కొంత వరకు వ్యాఖ్యానిద్దాం. 2001 నాటి దిల్ చాహతా హై ఒక కొత్త మార్పును సూచించింది. నేటి మార్పు దానికి తార్కికమైన కొనసాగింపేనని నిరభ్యంత రంగా చెప్పొచ్చు. అంతకు ముందు వరకు హిందీ సినిమాలు ప్రజాకర్షక రాజ కీయాల కాలాన్ని ప్రతిఫలించేవి. పేదరికాన్ని గొప్పగా కీర్తిస్తూ అవి ‘‘టాటా- బిర్లా’’ తరహా సంపన్నులను అవహేళన చేస్తుండేవి. నిజమైన సంతోషం, వివేకం, నైతికత పేదలకే సొంతమని పదేపదే చెబుతుండేవి. ఫర్హాన్ అక్తర్ తీసిన దిల్ చాహతా హై ఆర్థిక సంస్కరణల తదుపరి సరిగ్గా దశాబ్దికి వచ్చిం ది. నిస్సిగ్గుగాసంపన్నవంతులదిగా చాటుకున్న సినిమా హిట్ కావడం అదే మొదటిసారి. అందులోని ముగ్గురు మగాళ్లూ సంపన్నులు, గారాబం వల్ల చెడిపోయినవాళ్లు, ఫ్యాన్సీ కార్లు డ్రైవ్ చేస్తూ షాంపేన్ తాగుతూ గడిపే వాళ్లు. వాళ్ల గర్ల్ ఫ్రెండ్స్ కూడా సంపన్నులే. అంతవరకు సాధారణ హిందీ సినిమా అంటే, ఆ ముగ్గురిలో ఒకరు ఆ ఇద్దరి ఇళ్లలో పనిమనిషిగా ఉండే ఓ విధవరాలి కొడుకై ఉండేవాడు. ఆ కొడుకు వంటగదిలోకి వెళ్లి ప్రపంచంలో మరెవరూ ఆమెలా వంట చేయలేరని చెబుతుండేవాడు. కానీ ఫర్హాన్ తీసిన ఈ సినిమా అంత కొట్టవచ్చినట్టుగా సంపదల వైభోగాన్ని ఏమాత్రం క్షమాప ణాభావం లేకుండా చూపడం ‘జాతిహితం’ దాన్ని (‘ఆహా! ఏమి మధు రమైన పేదరికపు పరిమళం!’, సెప్టెంబర్ 1, 2001) గుర్తించడానికి ప్రేరణ అయ్యింది కూడా. వాస్తవానికి నేను ఆ సినిమా గురించి ఆలోచిస్తుండగానే... పేదరికం నా జన్మహక్కు. అయితే దాన్ని మీరూ పంచుకోవచ్చు అని సూచించే ‘‘పేదరికవాదం’’ అనే వ్యక్తీకరణ మొలకెత్తింది. అందుకని దానిపై ట్రేడ్ మార్క్ హక్కులను సైతం నేను ప్రకటిస్తున్నాను. ఆ సినిమా తర్వాత దశాబ్దికిపైగా ధనవంతులు, ప్రత్యేకించి ఎన్ఆర్ఐల సినిమాలు వచ్చాయి. జిందగీ న మిలేగా దొబారాతో అది బహుశా తారస్థాయినందుకుంది. ఆ ధోరణి స్థానంలో ఇప్పుడు చిన్న పట్టణం కథ ప్రవేశిస్తుండటం మనకు రెండు విషయాలను చెబుతోంది. ఒకటి, మనలాంటి సంచార పాత్రికేయుల్లో కొందరం మాట్లాడుతున్న ఆకాంక్షాభరిత భారత ఆవిర్భావం అనే భావనను హిందీ సినిమా నిర్మాతలు ఎక్కడో దొరకబట్టుకుని ఉండాలి. రెండు, 1991లో మొదలైన ఆ మార్పు ఆ తదుపరి దశాబ్దిలో మనం సంపదలను గౌరవించ డానికి, ఆ సంపదల సృష్టికర్తలను ప్రేమించడానికి తోడ్పడింది. ఇప్పుడు, ఆర్థిక సంస్కరణల 25వ ఏట అది చిన్న పట్టణంలోకి, వేగంగా పట్టణీకరణం ప్రవేశిస్తున్న (రర్బనైజింగ్) గ్రామంలోకి కూడా మెల్లగా వ్యాపిస్తోంది. అబ్బాయి-అమ్మాయి కొత్త కథ ఇక మసాన్ వద్దకు తిరిగి వద్దాం. ఆ చిత్ర కథ ఏమిటో చెప్పకుండానే, దానిలో నాకు నచ్చిన ఘట్టం గురించి చెప్పనివ్వండి. దేవీ పాఠక్ వారణాసిలో చితి మంటలు రగులుతుండే ఘాట్లలోని పేద పూజారి కూతురు, విద్యావం తురాలు, ఆకాంక్షాభరితురాలు. దేవి పాత్రలో రిచా చద్దా ఓ రైల్వే స్టేషన్లో బుకింగ్ క్లర్క్‌గా పనిచేస్తుంటుంది. ఆమె బుకింగ్ కిటికీ ముందు నిల్చుని ఓ అబ్బాయి-అమ్మాయి జంట ఏదైనా చోటుకు పోయి, రాత్రికి కలసి గడపాలని రెండు టికెట్లు అడుగుతారు. అది చూసి దేవి బిర్రబిగుసుకుపోతుంది. అస మ్మతి పూర్వకమైన ఆమె కళ్లు మానిటర్‌ను చూసే సరికి 26 ఖాళీ సీట్లు కని పిస్తుంటాయి. కానీ ఆమె వారికి లేవని చెబుతుంది. దేవి పేదరాలే అయినా విద్యావంతురాలు, చిన్న పట్టణ వాసే అయినా ఆకాంక్షాభరితురాలు. కానీ ఓ రెండు గంటలపాటు ఒక బాయ్‌ఫ్రెండ్‌తో తను సన్నిహితంగా గడిపితే, ఆ తర్వాత ఎంతటి అపనిందలు, వేధింపులకు గురికావాల్సి ఉంటుందో ఎరిగి నది. ఇంతే అయితే ఇది పాత కథే కావచ్చు. కానీ ఆమె దాన్ని అంగీకరించ దు. తాను పుట్టి పెరిగిన చోట ఉండే పరిస్థితుల వల్ల తనకు అందని దాన్ని దా దాపు తన వయసువారే అయిన ఆ అబ్బాయి, అమ్మాయిలకు అందనివ్వదు. కొత్త ధోరణికి శిఖరాయమానం మన చిన్న పట్టణవాసుల వైఖరులు ఎంత త్వరత్వరగా మారిపోతున్నాయ నేది ఈ కోవకు చెందిన సినిమాలన్నిటిలోనూ పూసల్లో దారంలా కనిపిస్తుం టుంది. వాటిలో మసాన్ శిఖరాయమానమైనది. అసాధారణ స్థాయి సమా చార అనుసంధానం (హైపర్-కనెక్టివిటీ), విద్య - అది విసుగెత్తించే ఇంజనీ రింగ్ లేదా సాంకేతిక కళాశాలలదే అయినాగానీ - మోటారు వాహనాలు, మీడియా తదితరాలన్నీ చిన్న పెద్ద పట్టణాల మధ్య అంతరాలను పూడ్చేస్తు న్నాయి. కుల, సామాజిక అడ్డుగోడలను తునాతునకలు చేస్తున్నాయి. అయితే అదేసమయంలో తరాల మధ్య అంతరాన్ని పెంచుతున్నాయి. బనారస్ లేదా బరెల్లీ, హోషంగాబాద్ లేదా హత్రాస్ పట్టణాల్లో ఎక్కడైనాగానీ అమ్మాయి, అబ్బాయిల మధ్య తొలి పరిచయం ఫేస్బుక్ ద్వారానే. హార్మోన్లవంటి అంత స్రావాల పరంగా జీవితంలోని అత్యుత్తమమైన ఆ దశలోని వారి ప్రేమాయ ణం పేరు పెట్టి పిలుచుకోవడంతోనే పూర్తిగా సాగుతుంది. అది ఒకరు మరొ కరి ‘‘ఫ్రెండ్’’ అభ్యర్థనను ఆమోదించడంతో మొదలవుతుంది. తల్లిదండ్రు లు, కుటుంబాలు కులం వంటి పెద్ద విషయాలను ఆరా తీసేసరికే సమయం మించిపోతుంది. సాధారణంగా ఆంటీల ఇచ్చకాలు లేదా గుసగుసల నుంచి ఇరవైయేళ్లుపైబడిన అమ్మాయికి తెలిసివచ్చే లైంగికత, పేద ఇళ్లలో సైతం అందుబాటులో ఉంటున్న కంప్యూటర్లలో నీలి చిత్రాలను చూడటం ద్వారా తెలుస్తోంది. అలాంటప్పుడు వారు పెళ్లి లేదా సంబంధాల కోసం వేచి చూసేదానికంటే దాని కోసం అన్వేషణ ప్రారంభించే అవకాశం ఉంది. తర్వా త ‘‘పట్టుబడి’’నప్పుడు... ఏమిటీ దరిద్రగొట్టు పని అని ఆగ్రహంతో ప్రశ్ని స్తే... వాళ్లు అతి తేలిగ్గా, మహానగరాల్లోని తమకంటే సంపన్న గృహాల్లోని తమ సోదరిలవలే తామూ అదేమిటో తెలుసుకోవాలనే ఆసక్తితోనేనని సైతం చెప్పగలరు. సాంప్రదాయకతను ధ్వంసిస్తున్న ‘స్మార్ట్’ తరం చౌకగా దొరికే స్మార్ట్ ఫోన్-మోటార్‌సైకిల్-ప్రైవేట్ కళాశాలల సమ్మేళనం పాత ‘‘సంప్రదాయకమైన’’ కుటుంబ సంబంధాలు, ఆశయాలు, లైంగికత లను పూర్తిగా ధ్వంసం చేసేసింది. దీనికి సంబంధించిన మొదటి ప్రకటనను మనం అనురాగ్ కశ్యప్ దేవ్ డి. లో చూశాం. మాహీగిల్ చాపను తీసుకుని సైకిల్‌పై అభయ్ దియోల్తో చెరకు తోట సమాగమం కోసం వెళ్లడం చూసి దిగ్భ్రాంతులమయ్యాం, ఉద్విగ్నతకు సైతం గురయ్యాం. పంజాబ్ లోతట్టు ప్రాంతంలో అంతకుమించిన ఏకాంత ప్రదేశం మరెక్కడ దొరుకుతుంది? అయితే ఆమె మారిన, నూతన భారతనారి. చురుకైన చిత్ర నిర్మాతలు ఈ నూతన పోకడలను ముందుగా గమనించారు. తమ కుటుంబాల్లో, ఇరుగు పొరుగుల్లో తాము నిత్యమూ చూస్తున్నదాన్నే ఆ సినిమాలు అంతగా వ్యక్తీకరి స్తున్నాయి కాబట్టే ప్రేక్షకులు ఇప్పుడు వాటిని ఆమోదిస్తున్నారు. ఈ ధోరణిని మొదట పసిగట్టి, పాటలుగా మలచినవారు గుల్జార్, జైదీప్ సహానీలే. బంటీ అవుర్ బబ్లీ చిత్ర ప్రారంభ గీతం ‘‘ఛోటే ఛోటే షెహరాం సే...’’ వారు కలసి రాసినదే. ఆ తర్వాత జైదీప్ (చక్ దే ఇండియా, ఖోస్లా కా ఘోస్లా తదితర చిత్రాలకు అద్భుతంగా రాశారు) కెమెరా ముందే ఆ గీతం గురించి చెప్పారు. ఆ సినిమా సారాన్నంతటినీ క్రోడీకరించి అత్యుత్తమంగా వ్యక్తీకరించగలిగే చరణం కోసం తానింకా అన్వేషిస్తుండగా గుల్జార్‌కు ‘‘ఖాలీ బోరే దోహా రోం సే’’ తట్టిందని (తట్టాబుట్టా సర్దుకు మేం చిన్న పట్టణం నుం చి, బోరెక్కించే సోమరి సాయంకాలాల నుంచి తప్పించుకు పారిపోయాం) చెప్పారు. చిత్ర కథను అది చాలా చక్కగా మన ముందుంచింది. నేటి ఈ యువ భారతీయులు తమ తలరాతని సరిపెట్టుకునే బాపతుకారు. భౌతి కంగా కాకున్నా మానసికంగానైనా అందులోంచి బయటపడాలని కోరుకుం టారు. తట్టాబుట్టా సహా లేదా మునుపటి తరానికి చెందిన సామానంతా పారేసైనా వారా పనిచేయాలనుకుంటారు. నగరం ఒకప్పుడు ఉండేంత దూరంగా ఇప్పుడు లేదు. ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో పెరిగిన వారితో పోలిస్తే రెండవ శ్రేణి హోదాను అంగీకరించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. స్వీయ విషయాలను ఉదహరించడంలో ప్రమాదాలు ఉన్నాయి. అయినా చెప్పాల్సి వస్తోంది. నా తరం పెరిగినది గ్రామీణ భారతంలో. సంస్కరణల తర్వాతి కాలంలో అది అక్కడి నుంచి ఎంతో దూరం వచ్చేసింది. అప్పట్లో ప్రపంచాన్ని వీక్షించడానికి మీకున్న ఏకైక గవాక్షం షార్ట్వేవ్ రేడి యోనే. ఇక ఇంగ్లిష్ మాట్లాడటంలో శిక్షణంటే బెర్రీ సర్వాధికారి, మెలవిల్లే డె మెల్లో, చక్రపాణిల క్రికెట్ కామెంటరీనే. రవి చతుర్వేది, జస్దేవ్ సింగ్‌ల హిం దీ ఎంత అద్భుతంగా ఉన్నా తల్లిదండ్రులు వారి ఇంగ్లిష్ కామెంటరీనే వినా లని నిర్బంధించేవారు. లేదంటే నిజంగానే దయగలిగిన ఉపాధ్యాయుడు ఎవ రైనా ఢిల్లీకి వెళ్లినప్పుడు జమామసీద్‌కు పక్కనే ఉన్న, అప్పట్లో సుప్రసిద్ధమైన దైన కబాదీ బజార్ (వీధి దుకాణాల మార్కెట్) నుంచి తెచ్చే టైమ్, లైఫ్ పత్రికల పాత కాపీలను... తన అభిమాన పాత్రులకు, ఎక్కువ ఆసక్తిగల విద్యార్థులకు ఇచ్చేవాడు. ఇప్పుడైతే మీరు ఏ చౌక చైనా స్మార్ట్ ఫోన్తోనైనా ఇంగ్లిష్ మాట్లాడటమే కాదు, ప్రపంచంలో దేన్నయినా నేర్చేసుకోవచ్చు. ఇక ఉచ్ఛారణ, శైలి గురించి పట్టించుకోనవసరమే లేదు. ఎందుకంటే మీ బాసో లేక సహచరో, సహచరుడో కూడా బహుశా అంతే దేశీయమైన, స్వీయ చైత న్యరహితమైన భాషనే మాట్లాడుతుంటారు. మీకు నచ్చిన వారెవరికైనా ‘‘ఫ్రెండ్’’ రిక్వెస్ట్‌ను పంపేయొచ్చు. ‘‘నేను ఎవరీకీ ఏమీ రుణపడి లేను’’ నేను అప్పుడప్పుడూ రాస్తుండే ‘రైటింగ్స్ ఆన్ ది వాల్’ నివేదికల పరంపర లోని పలువాటిలో నేను ఈ తరం భారతీయులను ఆకాంక్షాభరిత, ఆశా యుత, అసహనపూరిత, భావజాలానంతర తరంగా, ‘‘వెనకబడి ఉండటా నికి వీల్లేదు’’, ‘‘నేను ఎవరికీ ఏమీ రుణపడి లేను’’ అని భావించే తరంగా సైతం పేర్కొన్నారు. అందుకే రాహుల్ తన నాయనమ్మ గురించి చేసిన ప్రస్తా వనలు వారికి చిర్రెత్తించాయి. మోదీ గుజరాత్ నమూనా వాగ్దానం ఉత్సా హాన్ని రేకెత్తించింది. అపారమైన తెలివితేటలుగల మన సినిమా నిర్మాతలు నేడు వారిని వెండితెరకి ఎక్కించి మన జీవితాల్లోకి తీసుకొస్తున్నారు. రాహుల్ తన మీద తానే జాలిపడిపోతూ పంపిన సందేశం కంటే నరేంద్ర మోదీయే తమను ముందుకు తీసుకుపోగలిగే అవకాశం ఎక్కువని అనుకున్నారు. దీంతో వారు 2014లో ఎలాంటి వెల్లువను సృష్టించారో మీరే చూశారు. వాళ్లే, ఢిల్లీ ఎన్నికలకు వచ్చేసరికి కొన్ని నెలల క్రితం తాము ఏ పార్టీకి ఓటేశామో కూడా మరచి, సరిగ్గా అందుకు పూర్తి వ్యతిరేక దిశకు మొగ్గడమూ చూశారు. మందిర్, మసీదు, గోవు లేదా కులం, హిందీ మీడియం, ఏం తినాలి, సామా జిక తిరోగమనవాదం తదితర అంశాలను మాట్లాడితే వారిని మీరు బోరెక్కిం చేస్తారు. అది మీకే ప్రమాదం. శేఖర్ గుప్తా Twitter@ShekarGupta. -
తప్పదు, సేద్యమే మూలం!
(జాతిహితం) మిగిలిన అన్ని రంగాలు కలసిన దాని కంటే, ఒక్క వ్యవసాయ రంగం వృద్ధే రెండు నుంచి మూడు రెట్లు వేగంగా దారిద్య్రాన్ని తగ్గిస్తుందని ఆయన అంటారు. 2008 నాటి ప్రపంచ అభివృద్ధి నివేదిక ప్రకారం చైనాలో వ్యవసాయ వృద్ధి ద్వారా తగ్గిన దారిద్య్రం 3.5 రెట్లు. లాటిన్ అమెరికాలో సైతం అది 2.7 రెట్లు. జాతీయ ఆదాయంలో ఏడింట ఒకవంతుపైన ఆధారపడే సగం జనాభా జీవిస్తున్న సంగతిని గమనిస్తే ఇది సహేతుకమే అనిపిస్తున్నది. వీళ్లే నిజమైన పేదలుగా గణనలోకి వస్తున్నారు. దేశంలో వ్యవసాయ రాజకీయ పాలనానుకూలత సూచీ గత కొన్నేళ్లలో వ్యవసాయ వృద్ధి, అందులో పైచేయి సాధించిన ఐదు బీజేపీ రాష్ట్రాలు అంకెలనీ, గణాంకాలనీ చాలా పద్ధతులతో చూడ వ చ్చు. అందులో మొదటిది పురాతనమైనదీ, రసాత్మక మైనదీ. బికినీ మాదిరిగానే గణాంకాలు కూడా ఆసక్తి కరమైన అంశాలను వెల్లడిస్తూ, కీలకమైన అంశాలను మాత్రం కప్పి ఉంచుతాయి. ఇక రెండోది, బికినీ రాకకు చాలా ముందు యుగం నుంచీ గణాంకాల గురించి ప్రచారంలో ఉన్న డిజ్రాయెలీ నిర్వచనం ‘అబద్ధాలు, పచ్చి అబద్ధాలు’. ఇది బికినీ పోలిక కంటే దారుణ మైనది. కానీ 1500 డాలర్ల (డాలర్ 63 రూపాయలు) తలసరి ఆదాయం కలిగిన పేద దేశంలో వ్యవసాయానికి సంబంధించిన సంపూర్ణ భోగట్టాను అర్థం చేసుకోవ డానికి ఈ రెండు నిర్వచనాలూ పనికిరావు. కారణం ఏమిటంటే, నిజమైన అర్థం తెలుసుకోవాలంటే, మొదట వ్యవసాయరంగానికి సంబంధించిన గణాంకాలను రాజ కీయ అంశాలలోకి అనువదించాలి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ పాటికి అర్థం చేసుకున్నట్టు భారత రాజ కీయాలు రైతుకే పెద్దపీట వేస్తాయి- స్థూల జాతీయో త్పత్తి (జీడీపీ)లో వ్యవసాయ రంగం వాటా ఇప్పుడు 15 శాతం కంటే తక్కువే అయినా సరే. లేదా ఆ వాటా 15 శాతం కావడం వల్లనే రైతుకు భారత రాజకీయాలు ప్రాముఖ్యం ఇస్తూ ఉండొచ్చు. రైతుతో అనుబంధం తప్ప భారత రాజకీయాలలో ఇంక మరేదీ ముక్కు సూటిగా ఉండదు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల జాతీయోత్పత్తి 7.3 శాతానికి చేరుకోవడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరానికి వేసుకున్న అంచనాలు 7.8 శాతం (ఆర్థిక మంత్రిత్వశాఖ), 7.6 శాతం (రిజర్వు బ్యాంక్). చైనాకు ఉన్న విస్తృతమైన ఆర్థిక పునాది సంగతిని పక్కన పెట్టి చూస్తే, ఆ దేశ వార్షిక వృద్ధిరేటును అధిగమించే అవ కాశం తొలిసారి భారత్‌కు దక్కిందని అనుకోవాలి. అయి నప్పటికీ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రభుత్వం సంతోషంగా కనిపించదు. దిగులుగా ఉన్నట్టు కనిపిస్తుంది. మార్కెట్ కూడా అందుకు అనుగుణంగానే స్పందిస్తున్నది. తగ్గు తున్న ద్రవ్యోల్బణంతో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, క్షీణి స్తున్న వడ్డీరేట్లు వంటి మెరుపులు కనిపిస్తున్నప్పటికీ అన్నిచోట్లా విషణ్ణ వదనాలే దర్శనమిస్తున్నాయి. చితికి పోయి నిస్తేజమైన ప్రతిపక్షంలో చైతన్యం నింపుకుం టున్న భావన. ముట్టడిలో ఉన్నట్టు ప్రభుత్వం కనిపిస్తున్నది. అయినా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సూచీ లను రాజకీయాలు ఎట్లా ధిక్కరిస్తాయి? దీనికి సమా ధానం వ్యవసాయ రంగంలో ఉంది. ఒకానొక క్రూరమైన వాస్తవం ఏమిటంటే, భారత్ ఇకపై వ్యవసాయాధార ఆర్థిక వ్యవస్థగా కొనసాగకపోవచ్చు గానీ, వ్యవసాయా ధార రాజకీయమే ఇప్పటికీ కీలకం. అదెలాగో చూద్దాం. గత ఏడాది భారత్ వృద్ధి 7.3 శాతం ఉండగా, ఆహా రోత్పత్తులలో దాదాపు 5 శాతం పతనంతో వ్యవసాయ రంగం వృద్ధి మాత్రం .02 శాతం దగ్గర నిలిచిపోయింది. గతేడాది అన్ని రంగాలలోను 6.9 శాతం వృద్ధి కనిపిం చగా, వ్యవసాయ రంగంలో కనిపించిన 3.6 శాతం వృద్ధి పర్వాలేదు. అయితే 2012-13 నాటి 1.5 శాతాన్ని పరిగ ణించినట్లయితే మూడేళ్ల వ్యవసాయోత్పత్తులలో 1.7 సగటు వృద్ధి కనిపిస్తుంది. ఇది జాతీయ వృద్ధిలో నాలు గింట ఒక వంతు. ఇదే గ్రామీణ ప్రాంత అసంతృప్తికి సంబంధించి డేటాలో గమనించదగిన కీలకాంశం. మోదీ మొదటి దశ రాజకీయాలను సంక్లిష్టం చేస్తున్నది కూడా ఇదే. ప్రతికూల వాతావరణంతో ధ్వంసమైన రబీ పంట మాత్రమే ఇందుకు కారణం కాదు. పరిశ్రమల ద్వారా వచ్చే వృద్ధి గురించి బాకా ఊదే వాళ్లకి- ఈ వ్యాసకర్త కూడా వారిలో ఒకడని అంగీకరి స్తూనే- ఇదంతా గందరగోళంగా ఉంటుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న అన్ని ఆర్థిక వ్యవస్థల వలెనే భారతదేశంలో కూడా స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసా యం వాటా తగ్గుతూ ఉంది. సేవల, వస్తు తయారీ రం గాల వాటా పెరుగుతోంది. ఇది విధాయకమే. గిట్టు బాటుకాని వ్యవసాయం ఊబిలో నుంచి సాధ్యమైనంత మందిని బయటకు తీసి ఉత్పాదక రంగాలవైపు మళ్లించ వలసిన అవసరం మాత్రం ఉంది. అందుకోసం పట్టణీ కరణ, పారిశ్రామికీకరణ అవసరం. వ్యవసాయ భూము లను సేకరించడాన్ని సులభతరం చేసే చట్టాలను సమ ర్థించడం ఇందుకోసమే. మరోసారి నా మార్గం ఏమిటో స్పష్టం చేయాలి. నేను మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లును సమర్థిస్తున్నాను. మీరు పాత గణాంకాలను వదిలేసి వ్యవసాయ రం గాన్ని సవ్యంగా అర్థం చేసుకుంటే దృశ్యం మారిపో తుంది. భారతదేశ కార్మికవ ర్గంలో 49 శాతానికి వ్యవ సాయరంగమే పని కల్పిస్తున్నదని అశోక్ గులాతి అం చనా. ఆయన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలు, మార్కెట్లకు సంబంధించి దేశంలోనే అత్యుత్తమ నిపుణుడు. ఢిల్లీ కేం ద్రంగా పనిచేస్తున్న ఐసీఆర్ఐఈఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్)లో ఇన్ఫోసిస్ నెలకొల్పిన పీఠంలో ఆచార్యుడు. మన గ్రా మీణ ప్రాంత కుటుంబాలు సగటున పెద్దవి కాబట్టి, 55- 60 శాతం జనాభా వ్యవసాయం మీద ఆధారపడినదేనని అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు సమీకరణలు తల్లకిందులవుతాయి. దేశంలోని శ్రమజీవులలో సగం మంది స్థూల జాతీయోత్పత్తిలో కేవలం ఏడు శాతమే ఉత్పత్తి చేయగలుగుతున్నారు. దేశ జనాభాలో మూడిం ట రెండు వంతుల మంది దాని మీద ఆధారపడుతు న్నారు. స్థూలంగా చెప్పుకోవాలంటే ఇతర రంగాలలోని శ్రమజీవితో పోల్చితే వ్యవసాయదారు నాలుగింట ఒక వంతు కంటే తక్కువే సంపాదిస్తున్నాడు. రైతులు వరు సగా మూడేళ్ళపాటు 1.7 శాతం వృద్ధి రేటు మాత్రమే సాధిస్తే జాతి యావత్తూ సాధించిన వృద్ధి రేటు 6 శాతం. ఈ అంశాన్ని పరిశీలించినప్పుడు రైతు అనుభవిస్తున్న వ్యథ కళ్ళకు కడుతుంది. భారత వ్యవసాయరంగం మీద నేను ప్రతిపాదిం చిన సిద్ధాంతానికి ఆధారాలు గులాతియే అందించారు. ఆయనకు కృతజ్ఞతలు. మిగిలిన అన్ని రంగాలు కలసిన దాని కంటే, ఒక్క వ్యవసాయ రంగం వృద్ధే రెండు నుంచి మూడు రెట్లు వేగంగా దారిద్య్రాన్ని తగ్గిస్తుందని ఆయన అంటారు. 2008 నాటి ప్రపంచ అభివృద్ధి నివేదిక ప్రకా రం చైనాలో వ్యవసాయ వృద్ధి ద్వారా తగ్గిన దారిద్య్రం 3.5 రెట్లు. లాటిన్ అమెరికాలో సైతం అది 2.7 రెట్లు. జాతీయ ఆదాయంలో ఏడింట ఒకవంతుపైన ఆధార పడే సగం జనాభా జీవిస్తున్న సంగతిని గమనిస్తే ఇది సహేతుకమే అనిపిస్తున్నది. వీళ్లే నిజమైన పేదలుగా గణనలోకి వస్తున్నారు. వ్యవసాయం ప్రాధాన్యం గురించి చెప్పేవారి రెండు రకాల ధోరణులు ఉన్న ఆర్థికవేత్తలు కనిపిస్తారు. అం దులో ఒకరు నా చిరకాల మిత్రుడు, సరళ విధానాలలో కలసి ప్రయాణిస్తున్నవాడు, కాలమిస్ట్ సుర్జిత్ భల్లా. పెద్ద ఆర్థిక వ్యవస్థలు వ్యవసాయరంగంలో చాలా అరుదు గానే 4 శాతం వృద్ధిని సాధిస్తాయని ఆయన చెబుతారు. దీనికి, ఎందుకు కాకూడదు? అని ప్రశ్నిస్తుంది రెండో ధోరణి. దీనినే మనం గులాతి ధోరణిగా కూడా పేర్కొన వచ్చు. చైనా సంస్కరణలు చేపట్టిన తొలిదశలో 1978- 84 మధ్య రెండు పర్యాయాలు వ్యవసాయంలో రెట్టింపు వృద్ధిని నమోదు చేసింది. మరో మంచి ప్రశ్న-భారత దేశంలో కనీసం ఐదు రాష్ట్రాలలో గత దశాబ్ద కాలంగా ఇదెలా సాధ్యమయింది? ఇందులో ప్రతి రాష్ట్రం ప్రపం చంలో చాలాదేశాల కంటే పెద్దదే. చివరికి తేలేదేమి టంటే, ఈ ఐదు రాష్ట్రాలలో ప్రతి ఒక్కటి బీజేపీ కంచు కోటగానే ఉంది. మూడింటిలో ఒకే ముఖ్యమంత్రి మూడోసారి అధికారంలోకి రావడం జరిగింది. దీనికి అటువైపు ప్రాణాంతక ప్రభుత్వ వ్యతిరేక బురదలో కూరుకుపోయి ప్రతికూల ప్రగతితో బాగా వెనుకబడిన కేరళ కనిపిస్తుంది. మహారాష్ట్ర కాంగ్రెస్-ఎన్సీపీతో విసిగి పోయింది. ఉత్తరప్రదేశ్ సెక్యులర్ వ్యవసాయం తన ప్రత్యర్థి, ఒక దశాబ్దంగా ఓడిపోతున్న పాత జాతీయ హిందు రేటు మీద 2 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే బాగా వెనుకబడిన ఇంకో రాష్ట్రం బిహార్ (ఉత్తర ప్రదేశ్ కంటే మెరుగే) ఈ ధోరణిని 2010లో అధిగమిం చింది. నితీశ్‌కుమార్ పాలన మొదటి ఐదేళ్లలో జరిగిన భారీ రోడ్ల నిర్మాణం అన్నిరంగాల ప్రగతికి ఊత మిచ్చింది. ఇక్కడ నేను ప్రతిపాదించిన కీలక వ్యవసాయ- రాజకీయ పాలన అనుకూలత గురించి చెబుతాను. ఈ వ్యాసంతో ఆ చార్టును జత చేయడానికి కారణం, పరిశ్ర మలతో కూడిన, పట్టణీకరించిన భారత్ రాజకీయ భవి ష్యత్తేమిటో అది సూచిస్తుంది. ఆర్థిక స్థూల జాతీయో త్పత్తిలో వ్యవసాయం వాటా 15 శాతం కంటే తక్కువ. కానీ ఎన్నికలలో, రాజకీయాలలో స్థూల జాతీయోత్పత్తి - దాదాపు 60 శాతం ఉత్పత్తితో సమానమైనది. మనకు వినోదం కలిగించే విషయం ఏమిటంటే, ఈ విషయాన్ని రాహుల్, మోదీ ఇద్దరూ అర్థం చేసుకు న్నారు. అందుకే రాహుల్ ప్రచారమంతా వ్యవసాయ రంగ అసంతృప్తి కేంద్రబిందువుగా ఉంది. దీనికి భూచ ట్టం అంశాన్ని జోడించి మాట్లాడుతూ, ప్రాణం పోయిన ప్రతిపక్షానికి ఊపిరిపోస్తున్నారు. ఇప్పటికే భారత్‌లో రెండు పంటలు పోయాయి. కరవు కాటకాల గురించి వాతావరణశాఖ జోస్యం నిజమయ్యే పక్షంలో మూడో పంట కూడా పోయే అవకాశముంది. ఇలాంటి పరిస్థి తిలో రాహుల్ వస్తున్నారు. మోదీ తన మార్గాన్ని మార్చు కోవడానికి కారణం కూడా అదే. దీనిని మోదీ ప్రభుత్వ తొలి వార్షికోత్సవ సభలలో ఇచ్చిన ఉపన్యాసాల ద్వారా, ఇంటర్వ్యూల ద్వారా తెలుసుకోవచ్చు. అన్నీ గ్రామీణ భారతం, రైతు, పేద గురించే ఉన్నాయి. మధురలో అయితే మోదీ పెట్టుబడిదారులను ఉద్దేశించి ధన్నా సేథ్స్ అని అన్నారు. చిన్నచిన్న వాళ్లు ఇచ్చే ఉద్యోగాలు కూడా వారు చూపరని కూడా అన్నారు. వ్యవసాయ వృద్ధిని చూపుతున్న ఆ 2 శాతం అంకె, దాదాపు మూడేళ్ల సగటు 1.7 శాతం అంకె నిజానికి ఈ సంవత్సరం నమోదైన 7.3 శాతం కంటే, మూడేళ్ల సగటు 6 శాతాన్ని కూడా ముంచెత్తేవే. ఎందుకంటే మన రాజకీయ స్థూల జాతీయోత్పత్తి గురించి మాట్లాడుతున్నాం. భారత్‌లో రెండు పంటలు పోయాయి. కరవు కాటకాల గురించి వాతావరణ జోస్యం నిజమయ్యే పక్షంలో మూడో పంట కూడా పోయే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితిలో రాహుల్ వస్తున్నారు. మోదీ తన మార్గాన్ని మార్చుకోవడానికి కారణం కూడా అదే. దీనిని మోదీ ప్రభుత్వ తొలి వార్షికోత్సవ సభలలో ఇచ్చిన ఉపన్యాసాల ద్వారా, ఇంటర్వ్యూల ద్వారా తెలుసుకోవచ్చు. అన్నీ గ్రామీణ భారతం, రైతు, పేద గురించే ఉన్నాయి. (శేఖర్ గుప్తా)....(shekhargupta653@gmail.com)