తప్పదు, సేద్యమే మూలం! | must, farming is the source! | Sakshi
Sakshi News home page

తప్పదు, సేద్యమే మూలం!

Published Sat, Jun 6 2015 1:11 AM | Last Updated on Sun, Sep 3 2017 3:16 AM

must, farming is the source!

 

(జాతిహితం)
 
 మిగిలిన అన్ని రంగాలు కలసిన దాని కంటే, ఒక్క వ్యవసాయ రంగం వృద్ధే రెండు నుంచి మూడు రెట్లు వేగంగా దారిద్య్రాన్ని తగ్గిస్తుందని ఆయన అంటారు. 2008 నాటి ప్రపంచ అభివృద్ధి నివేదిక ప్రకారం చైనాలో వ్యవసాయ వృద్ధి ద్వారా తగ్గిన దారిద్య్రం 3.5 రెట్లు. లాటిన్ అమెరికాలో సైతం అది 2.7 రెట్లు. జాతీయ ఆదాయంలో ఏడింట ఒకవంతుపైన ఆధారపడే సగం జనాభా జీవిస్తున్న సంగతిని గమనిస్తే ఇది సహేతుకమే అనిపిస్తున్నది. వీళ్లే నిజమైన పేదలుగా గణనలోకి వస్తున్నారు.
 
 
 దేశంలో వ్యవసాయ రాజకీయ పాలనానుకూలత సూచీ
 గత కొన్నేళ్లలో వ్యవసాయ వృద్ధి, అందులో పైచేయి సాధించిన ఐదు బీజేపీ రాష్ట్రాలు
 
 అంకెలనీ, గణాంకాలనీ చాలా పద్ధతులతో చూడ వ చ్చు. అందులో మొదటిది పురాతనమైనదీ, రసాత్మక మైనదీ. బికినీ మాదిరిగానే గణాంకాలు కూడా ఆసక్తి కరమైన అంశాలను వెల్లడిస్తూ, కీలకమైన అంశాలను మాత్రం కప్పి ఉంచుతాయి. ఇక రెండోది, బికినీ రాకకు చాలా ముందు యుగం నుంచీ గణాంకాల గురించి ప్రచారంలో ఉన్న డిజ్రాయెలీ నిర్వచనం ‘అబద్ధాలు, పచ్చి అబద్ధాలు’. ఇది బికినీ పోలిక కంటే దారుణ మైనది. కానీ 1500 డాలర్ల (డాలర్ 63 రూపాయలు) తలసరి ఆదాయం కలిగిన పేద దేశంలో వ్యవసాయానికి సంబంధించిన సంపూర్ణ భోగట్టాను అర్థం చేసుకోవ డానికి ఈ రెండు నిర్వచనాలూ పనికిరావు. కారణం ఏమిటంటే, నిజమైన అర్థం తెలుసుకోవాలంటే, మొదట వ్యవసాయరంగానికి సంబంధించిన గణాంకాలను రాజ కీయ అంశాలలోకి అనువదించాలి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ పాటికి అర్థం చేసుకున్నట్టు భారత రాజ కీయాలు రైతుకే పెద్దపీట వేస్తాయి- స్థూల జాతీయో త్పత్తి (జీడీపీ)లో వ్యవసాయ రంగం వాటా ఇప్పుడు 15 శాతం కంటే తక్కువే అయినా సరే. లేదా ఆ వాటా 15 శాతం కావడం వల్లనే రైతుకు భారత రాజకీయాలు ప్రాముఖ్యం ఇస్తూ ఉండొచ్చు. రైతుతో అనుబంధం తప్ప భారత రాజకీయాలలో ఇంక మరేదీ ముక్కు సూటిగా ఉండదు.

 2014-15 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల జాతీయోత్పత్తి 7.3 శాతానికి చేరుకోవడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరానికి వేసుకున్న అంచనాలు 7.8 శాతం (ఆర్థిక మంత్రిత్వశాఖ), 7.6 శాతం (రిజర్వు బ్యాంక్). చైనాకు ఉన్న విస్తృతమైన ఆర్థిక పునాది సంగతిని పక్కన పెట్టి చూస్తే, ఆ దేశ వార్షిక వృద్ధిరేటును అధిగమించే అవ కాశం తొలిసారి భారత్‌కు దక్కిందని అనుకోవాలి. అయి నప్పటికీ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రభుత్వం సంతోషంగా కనిపించదు. దిగులుగా ఉన్నట్టు కనిపిస్తుంది. మార్కెట్ కూడా అందుకు అనుగుణంగానే స్పందిస్తున్నది. తగ్గు తున్న ద్రవ్యోల్బణంతో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, క్షీణి స్తున్న వడ్డీరేట్లు వంటి మెరుపులు కనిపిస్తున్నప్పటికీ అన్నిచోట్లా విషణ్ణ వదనాలే దర్శనమిస్తున్నాయి. చితికి పోయి నిస్తేజమైన ప్రతిపక్షంలో చైతన్యం నింపుకుం టున్న భావన. ముట్టడిలో ఉన్నట్టు ప్రభుత్వం కనిపిస్తున్నది.

అయినా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సూచీ లను రాజకీయాలు ఎట్లా ధిక్కరిస్తాయి? దీనికి సమా ధానం వ్యవసాయ రంగంలో ఉంది. ఒకానొక క్రూరమైన వాస్తవం ఏమిటంటే, భారత్ ఇకపై వ్యవసాయాధార ఆర్థిక వ్యవస్థగా కొనసాగకపోవచ్చు గానీ, వ్యవసాయా ధార రాజకీయమే ఇప్పటికీ కీలకం. అదెలాగో చూద్దాం.
 గత ఏడాది భారత్ వృద్ధి 7.3 శాతం ఉండగా, ఆహా రోత్పత్తులలో దాదాపు 5 శాతం పతనంతో వ్యవసాయ రంగం వృద్ధి మాత్రం .02 శాతం దగ్గర నిలిచిపోయింది. గతేడాది అన్ని రంగాలలోను 6.9 శాతం వృద్ధి కనిపిం చగా, వ్యవసాయ రంగంలో కనిపించిన 3.6 శాతం వృద్ధి పర్వాలేదు. అయితే 2012-13 నాటి 1.5 శాతాన్ని పరిగ ణించినట్లయితే మూడేళ్ల వ్యవసాయోత్పత్తులలో 1.7 సగటు వృద్ధి కనిపిస్తుంది. ఇది జాతీయ వృద్ధిలో నాలు గింట ఒక వంతు. ఇదే గ్రామీణ ప్రాంత అసంతృప్తికి సంబంధించి డేటాలో గమనించదగిన కీలకాంశం. మోదీ మొదటి దశ రాజకీయాలను సంక్లిష్టం చేస్తున్నది కూడా ఇదే. ప్రతికూల వాతావరణంతో ధ్వంసమైన రబీ పంట మాత్రమే ఇందుకు కారణం కాదు.
 పరిశ్రమల ద్వారా వచ్చే వృద్ధి గురించి బాకా ఊదే వాళ్లకి- ఈ వ్యాసకర్త కూడా వారిలో ఒకడని అంగీకరి స్తూనే- ఇదంతా గందరగోళంగా ఉంటుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న అన్ని ఆర్థిక వ్యవస్థల వలెనే భారతదేశంలో కూడా స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసా యం వాటా తగ్గుతూ ఉంది. సేవల, వస్తు తయారీ రం గాల వాటా పెరుగుతోంది. ఇది విధాయకమే. గిట్టు బాటుకాని వ్యవసాయం ఊబిలో నుంచి సాధ్యమైనంత మందిని బయటకు తీసి ఉత్పాదక రంగాలవైపు మళ్లించ వలసిన అవసరం మాత్రం ఉంది. అందుకోసం పట్టణీ కరణ, పారిశ్రామికీకరణ అవసరం. వ్యవసాయ భూము లను సేకరించడాన్ని సులభతరం చేసే చట్టాలను సమ ర్థించడం ఇందుకోసమే. మరోసారి నా మార్గం ఏమిటో స్పష్టం చేయాలి. నేను మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లును సమర్థిస్తున్నాను.  

 మీరు పాత గణాంకాలను వదిలేసి వ్యవసాయ రం గాన్ని సవ్యంగా అర్థం చేసుకుంటే దృశ్యం మారిపో తుంది. భారతదేశ కార్మికవ ర్గంలో 49 శాతానికి వ్యవ సాయరంగమే పని కల్పిస్తున్నదని అశోక్ గులాతి అం చనా. ఆయన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలు, మార్కెట్లకు సంబంధించి దేశంలోనే అత్యుత్తమ నిపుణుడు. ఢిల్లీ కేం ద్రంగా పనిచేస్తున్న ఐసీఆర్‌ఐఈఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్)లో ఇన్ఫోసిస్ నెలకొల్పిన పీఠంలో ఆచార్యుడు. మన గ్రా మీణ ప్రాంత కుటుంబాలు సగటున పెద్దవి కాబట్టి, 55- 60 శాతం జనాభా వ్యవసాయం మీద ఆధారపడినదేనని అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు సమీకరణలు తల్లకిందులవుతాయి.

దేశంలోని శ్రమజీవులలో సగం మంది స్థూల జాతీయోత్పత్తిలో కేవలం ఏడు శాతమే ఉత్పత్తి చేయగలుగుతున్నారు. దేశ జనాభాలో మూడిం ట రెండు వంతుల మంది దాని మీద ఆధారపడుతు న్నారు. స్థూలంగా చెప్పుకోవాలంటే ఇతర రంగాలలోని శ్రమజీవితో పోల్చితే వ్యవసాయదారు నాలుగింట ఒక వంతు కంటే తక్కువే సంపాదిస్తున్నాడు. రైతులు వరు సగా మూడేళ్ళపాటు 1.7 శాతం వృద్ధి రేటు మాత్రమే సాధిస్తే జాతి యావత్తూ సాధించిన వృద్ధి రేటు 6 శాతం. ఈ అంశాన్ని పరిశీలించినప్పుడు రైతు అనుభవిస్తున్న వ్యథ కళ్ళకు కడుతుంది.

 భారత వ్యవసాయరంగం మీద నేను ప్రతిపాదిం చిన సిద్ధాంతానికి ఆధారాలు గులాతియే అందించారు. ఆయనకు కృతజ్ఞతలు. మిగిలిన అన్ని రంగాలు కలసిన దాని కంటే, ఒక్క వ్యవసాయ రంగం వృద్ధే రెండు నుంచి మూడు రెట్లు వేగంగా దారిద్య్రాన్ని తగ్గిస్తుందని ఆయన అంటారు. 2008 నాటి ప్రపంచ అభివృద్ధి నివేదిక ప్రకా రం చైనాలో వ్యవసాయ వృద్ధి ద్వారా తగ్గిన దారిద్య్రం 3.5 రెట్లు. లాటిన్ అమెరికాలో సైతం అది 2.7 రెట్లు. జాతీయ ఆదాయంలో ఏడింట ఒకవంతుపైన ఆధార పడే సగం జనాభా జీవిస్తున్న సంగతిని గమనిస్తే ఇది సహేతుకమే అనిపిస్తున్నది. వీళ్లే నిజమైన పేదలుగా గణనలోకి వస్తున్నారు.

 వ్యవసాయం ప్రాధాన్యం గురించి చెప్పేవారి రెండు రకాల ధోరణులు ఉన్న ఆర్థికవేత్తలు కనిపిస్తారు. అం దులో ఒకరు నా చిరకాల మిత్రుడు, సరళ విధానాలలో కలసి ప్రయాణిస్తున్నవాడు, కాలమిస్ట్ సుర్జిత్ భల్లా. పెద్ద ఆర్థిక వ్యవస్థలు వ్యవసాయరంగంలో చాలా అరుదు గానే 4 శాతం వృద్ధిని సాధిస్తాయని ఆయన చెబుతారు. దీనికి, ఎందుకు కాకూడదు? అని ప్రశ్నిస్తుంది రెండో ధోరణి. దీనినే మనం గులాతి ధోరణిగా కూడా పేర్కొన వచ్చు. చైనా సంస్కరణలు చేపట్టిన తొలిదశలో 1978- 84 మధ్య రెండు పర్యాయాలు వ్యవసాయంలో రెట్టింపు వృద్ధిని నమోదు చేసింది. మరో మంచి ప్రశ్న-భారత దేశంలో కనీసం ఐదు రాష్ట్రాలలో గత దశాబ్ద కాలంగా ఇదెలా సాధ్యమయింది? ఇందులో ప్రతి రాష్ట్రం ప్రపం చంలో చాలాదేశాల కంటే పెద్దదే. చివరికి తేలేదేమి టంటే, ఈ ఐదు రాష్ట్రాలలో ప్రతి ఒక్కటి బీజేపీ కంచు కోటగానే ఉంది. మూడింటిలో ఒకే ముఖ్యమంత్రి మూడోసారి అధికారంలోకి రావడం జరిగింది. దీనికి అటువైపు ప్రాణాంతక ప్రభుత్వ వ్యతిరేక బురదలో కూరుకుపోయి ప్రతికూల ప్రగతితో బాగా వెనుకబడిన కేరళ కనిపిస్తుంది.

మహారాష్ట్ర కాంగ్రెస్-ఎన్సీపీతో విసిగి పోయింది. ఉత్తరప్రదేశ్ సెక్యులర్ వ్యవసాయం తన ప్రత్యర్థి, ఒక దశాబ్దంగా ఓడిపోతున్న పాత జాతీయ హిందు రేటు మీద 2 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే బాగా వెనుకబడిన ఇంకో రాష్ట్రం బిహార్ (ఉత్తర ప్రదేశ్ కంటే మెరుగే) ఈ ధోరణిని 2010లో అధిగమిం చింది. నితీశ్‌కుమార్ పాలన మొదటి ఐదేళ్లలో జరిగిన భారీ రోడ్ల నిర్మాణం అన్నిరంగాల ప్రగతికి ఊత మిచ్చింది.

ఇక్కడ నేను ప్రతిపాదించిన కీలక వ్యవసాయ- రాజకీయ పాలన అనుకూలత గురించి చెబుతాను. ఈ వ్యాసంతో ఆ చార్టును జత చేయడానికి కారణం, పరిశ్ర మలతో కూడిన, పట్టణీకరించిన భారత్ రాజకీయ భవి ష్యత్తేమిటో అది సూచిస్తుంది. ఆర్థిక స్థూల జాతీయో త్పత్తిలో వ్యవసాయం వాటా 15 శాతం కంటే తక్కువ. కానీ ఎన్నికలలో, రాజకీయాలలో స్థూల జాతీయోత్పత్తి - దాదాపు 60 శాతం ఉత్పత్తితో సమానమైనది.

 మనకు వినోదం కలిగించే విషయం ఏమిటంటే, ఈ విషయాన్ని రాహుల్, మోదీ ఇద్దరూ అర్థం చేసుకు న్నారు. అందుకే రాహుల్ ప్రచారమంతా వ్యవసాయ రంగ అసంతృప్తి కేంద్రబిందువుగా ఉంది. దీనికి భూచ ట్టం అంశాన్ని జోడించి మాట్లాడుతూ, ప్రాణం పోయిన ప్రతిపక్షానికి ఊపిరిపోస్తున్నారు. ఇప్పటికే భారత్‌లో రెండు పంటలు పోయాయి. కరవు కాటకాల గురించి వాతావరణశాఖ జోస్యం నిజమయ్యే పక్షంలో మూడో పంట కూడా పోయే అవకాశముంది. ఇలాంటి పరిస్థి తిలో రాహుల్ వస్తున్నారు. మోదీ తన మార్గాన్ని మార్చు కోవడానికి కారణం కూడా అదే. దీనిని మోదీ ప్రభుత్వ తొలి వార్షికోత్సవ సభలలో ఇచ్చిన ఉపన్యాసాల ద్వారా, ఇంటర్వ్యూల ద్వారా తెలుసుకోవచ్చు. అన్నీ గ్రామీణ భారతం, రైతు, పేద గురించే ఉన్నాయి. మధురలో అయితే మోదీ పెట్టుబడిదారులను ఉద్దేశించి ధన్నా సేథ్స్ అని అన్నారు. చిన్నచిన్న వాళ్లు ఇచ్చే ఉద్యోగాలు కూడా వారు చూపరని కూడా అన్నారు. వ్యవసాయ వృద్ధిని చూపుతున్న ఆ 2 శాతం అంకె, దాదాపు మూడేళ్ల సగటు 1.7 శాతం అంకె నిజానికి ఈ సంవత్సరం నమోదైన 7.3 శాతం కంటే, మూడేళ్ల సగటు 6 శాతాన్ని కూడా ముంచెత్తేవే. ఎందుకంటే మన రాజకీయ స్థూల జాతీయోత్పత్తి గురించి మాట్లాడుతున్నాం.
 
 భారత్‌లో రెండు పంటలు పోయాయి. కరవు కాటకాల గురించి వాతావరణ జోస్యం నిజమయ్యే పక్షంలో మూడో పంట కూడా పోయే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితిలో రాహుల్ వస్తున్నారు. మోదీ తన మార్గాన్ని మార్చుకోవడానికి కారణం కూడా అదే. దీనిని మోదీ ప్రభుత్వ తొలి వార్షికోత్సవ సభలలో ఇచ్చిన ఉపన్యాసాల ద్వారా, ఇంటర్వ్యూల ద్వారా తెలుసుకోవచ్చు. అన్నీ గ్రామీణ భారతం, రైతు, పేద గురించే ఉన్నాయి.
 

 

(శేఖర్ గుప్తా)....(shekhargupta653@gmail.com)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement