సూపర్ సర్వీస్
కరెంటు బిల్లు క ట్టాలి... సరుకులు తేవాలి... ఫ్రెండ్ బర్త్‌డేకి గిఫ్ట్ కొనాలి... అన్నీపెండింగ్ జాబితాలోనే... సిటీజనుల గజి‘బిజీ’ జీవితంలో ఇది సర్వసాధారణం. ఈ పెండింగ్ పనులను పట్టాలెక్కించేందుకు రంగంలోకి దిగాడు సిటీ చిన్నోడు జతిన్ అగర్వాల్. అనుకున్నదే తడవు.. అన్నీ వుుంగిట్లో ప్రత్యక్షవుయ్యే విధంగా ‘సూపర్వ్యూన్ సర్వీసెస్’ను ప్రారంభించాడు. పువ్వులు, సరకులు, డాక్యుమెంట్లు, గిఫ్ట్స్, చిల్లీ చికెన్, పిజ్జా.. ఏది కావాలన్నా ఎక్కడి నుంచి ఎక్కడికైనా నిమిషాల్లో డెలివరీ చేసేస్తుంది జతిన్ బృందం. అదీ పర్యావరణానికి హాని చేయుని విధంగా... సైకిళ్లతో పాటు మెట్రో సర్వీస్ వంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారానే అందిస్తారు. ‘ఒక్క కాల్ చేస్తే చాలు.. వేగంగా, సురక్షితంగా మీక్కావల్సిన సరుకులు మీ ఇంటికి అందజేస్తాం. పర్యావరణాన్ని పరిరక్షించడంలో వూ వంతు పాత్రగా ఇలా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లు, సైకిళ్లనే ఉపయోగిస్తున్నాం’ అంటున్నాడు జతిన్. ఈ రకంగా డోర్ డెలివరీ చేసే సంస్థ భారతదేశంలోనే ఇది మొదటిదట. ఈ సర్వీస్‌కు చార్జ్ రూ. 99 నుంచి రూ.999.
- సిద్ధాంతి