Jawahar Bagh clash
-
అంతకుముందే డేట్స్ ఇచ్చేశాను..
మథుర: ఉత్తరప్రదేశ్‌లోని మథురలో భారీ స్థాయిలో హింసచెలరేగిన తర్వాత స్థానిక ఎంపీ, బాలీవుడ్ నటి హేమమాలిని తీరుపై తీవ్ర విమర్శలు రావడం, బీజేపీ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమె దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. గురువారం రాత్రి మథుర ఘటన జరగగా.. శుక్రవారం ఉదయం తనకు తెలిసిందని హేమమాలిని చెప్పారు. మథురకు వెళుతున్నానంటూ ట్వీట్ చేశారు. ఇక మథుర అల్లర్లతో అట్టుడికిపోతుంటే, అదే సమయంలో హేమమాలిని షూటింగ్లో పాల్గొని ఆ ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేయడంపై వచ్చిన విమర్శలపైనా ఆమె స్పందించారు. 'నేనొక నటి. షూటింగ్‌కు అంతకుముందే డేట్స్ ఇచ్చాను. గురువారం రాత్రి జరిగిన ఘటన ఊహించనిది' అంటూ హేమమాలిని ట్వీట్ చేశారు. మథురలో అక్రమ కట్టడాలను తొలగించే విషయంలో తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగి ఇద్దరు పోలీసులు సహా 24 మంది మరణించారు. మరణించినవారిలో ఒక ఎస్పీ స్థాయి అధికారి కూడా ఉన్నారు. మథుర ఎంపీ అయిన హేమమాలిని ఈ ఘటనపై స్పందించకుండా, ఒక సినిమా షూటింగులో ఆమె పాల్గొన్నప్పటి ఫొటోలను ట్విట్టర్ ఖాతాలో అప్లోడ్ చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మథుర కాలిపోతుంటే ఈ సంబరాలు ఏంటంటూ నెటిజెన్లు నిలదీశారు. ఆ తర్వాత హేమ మాలిని.. ఆ ఫొటోలను తన ట్విట్టర్ ఖాతా నుంచి డిలీట్ చేశారు. -
నాలుక కరుచుకున్న హేమ
ఒకవైపు తన లోక్‌సభ నియోజకవర్గం అంతా అట్టుడుకుతుంటే.. తీరిగ్గా షూటింగ్ ఫొటోలు పెడతారా అంటూ విమర్శలు రావడంతో బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్ హేమ మాలిని నాలుక కరుచుకున్నారు. విషయం ఏమిటంటే.. మథురలో అక్రమ కట్టడాలను తొలగించే విషయంలో తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగి ఇద్దరు పోలీసులు సహా 21 మంది మరణించారు. మరణించినవారిలో ఒక ఎస్పీ స్థాయి అధికారి కూడా ఉన్నారు. అయితే, సరిగ్గా ఇదే సమయంలో ఒక సినిమా షూటింగులో పాల్గొంటున్న మథుర బీజేపీ ఎంపీ హేమమాలిని.. ఆ ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో అప్లోడ్ చేశారు. ఒక లాంచీ ఎక్కుతున్న ఫొటోలు మూడింటిని ఆమె ట్వీట్ చేశారు. దాంతో వెంటనే ట్విట్టర్ విమర్శలతో మోతెక్కిపోయింది. మథుర కాలిపోతుంటే ఈ సంబరాలు ఏంటంటూ నిలదీశారు. వెంటనే మేల్కొన్న హేమ మాలిని.. ఆ ఫొటోలను తన ట్విట్టర్ ఖాతా నుంచి డిలీట్ చేసేశారు. అయితే.. ఈ విషయంలో అటు హేమమాలినికి వ్యతిరేకంగా, మద్దతుగా రెండువైపులా కూడా ట్వీట్లు వెల్లువెత్తాయి. -
'20 లక్షలు వద్దు.. మా కొడుకును తెండి'
మథుర: ఉత్తరప్రదేశ్‌లోని మథురలో అక్రమ కట్టడాల కూల్చివేత వ్యవహారం సందర్భంగా గురువారం జరిగిన హింసాకాండలో మృతి చెందిన వారి సంఖ్య 21కి పెరిగింది. మృతుల్లో ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారు. 40 మంది గాయపడ్డారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు గురువారం మథురలోని జవహార్ బాగ్ ప్రాంతంలో అక్రమ కట్టడాలు కూల్చివేస్తుండగా ఆందోళనకారులు పోలీసులపైకి కాల్పులు జరపడంతో ఘర్షణ మొదలైంది. ఈ ఘటనలో మథుర ఎస్పీ ముకుల్ ద్వివేది, ఫరాహ్ పీఎస్ అధికారి సంతోష్ యాదవ్ మృతి చెందారు. గాయపడిన వారిలో నగర మేజిస్ట్రేట్ జావేద్ అహ్మద్ కూడా ఉన్నారు. కాగా, ముకుల్ ద్వివేది మరణంతో ఆయన తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బు తమకు అవసరం లేదని, తమ కొడుకును తెచ్చివాలని ముకుల్ తల్లిదండ్రులు విలపించారు. 'ముఖ్యమంత్రి మాకు రూ. 20 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఈ డబ్బు మాకొద్దు. మా బిడ్డను తిరిగి తెచ్చివండి' అని వారు కన్నీళ్ల పర్యంతమయ్యారు.