Jawahar Navodaya Vidyalaya
-
నవోదయ విద్యాలయ.. దరఖాస్తు చేయండిలా
సాక్షి, హైదరాబాద్: జవహర్ నవోదయ విద్యాలయ రంగారెడ్డి జిల్లాలో 2021–22 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ డేనియల్ రత్నకుమార్ కోరారు. శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలోని జేఎన్వీ కార్యాలయంలో మంగళవారం ఆయన ‘సాక్షి’తో ప్రవేశ ప్రక్రియను వివరించారు. రంగారెడ్డి జిల్లా జేఎన్వీ పరిధిలోకి వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని ప్రస్తుతం అయిదో తరగతి విద్యార్థులంతా అర్హులన్నారు. ఆరవ తరగతి ప్రవేశ పరీక్షను 2021 ఏప్రిల్ 10న నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రశ్న: దరఖాస్తులను ఎలా చేసుకోవాలి? ప్రిన్సిపల్ : వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తులను ఆన్లైన్లోనే చేసుకోవాలి. డిసెంబర్ 15వ తేదీ వరకు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రశ్న: ఆరవ తరగతి దరఖాస్తులకు అర్హులెవరు? ప్రిన్సిపల్ : 01–05–2008 నుంచి 30.4.2012 మధ్య పుట్టినవారై వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతుండాలి. ప్రశ్న: ఆరవ తరగతిలో అడ్మిషన్లకు రిజర్వేషన్లు వర్తింపజేస్తారా? ప్రిన్సిపల్ : ఆరవ తరగతిలోని మొత్తం సీట్లలో 75 శాతం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, మిగిలిన 25 శాతం పట్టణ వాసులకు రిజర్వు చేస్తారు. మొత్తం సీట్లలో 1/3 సీట్లు బాలికలకు కేటాయించారు. అంతేకాక ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోసం కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం సీట్లు కేటాయిస్తాం. ప్రశ్న: ఆన్లైన్ దరఖాస్తులో తోడ్పడుటకు ఎలాంటి సౌకర్యం కల్పించారు? ప్రిన్సిపల్ : విద్యార్థులకు ఆన్లైన్ దరఖాస్తులో తోడ్పడుటకు సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. విద్యార్థి అన్ని డాక్యుమెంట్లను తీసుకొని రిజిష్ట్రేషన్ చేసుకొనేటప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ స్వీకరించడానికి పనిచేస్తున్న మొబైల్ తీసుకొని సహాయ కేంద్రాన్ని సంప్రదించాలి. అందుకోసం సహాయకేంద్రం సహాయకులు పీ. శ్రీనివాసరావు– 9959513171, కే.మట్టారెడ్డి– 9490702185, భూప్‌సింగ్– 9390728928లతో సంప్రదించవచ్చు. ప్రశ్న: జేఎన్వీ ప్రత్యేకతలు ఏమిటి? ప్రిన్సిపల్ : కేంద్ర విద్యాశాఖ, నవోదయ విద్యాలయ సమితి ద్వారా జేఎన్వీలను నిర్వహిస్తారు. సీబీఎస్ఈ సిలబస్‌తో ఇంగ్లిష్ మీడియం బోధన ఉంటుంది. జేఎన్వీ రంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవల అన్ని అత్యాధునిక సౌకర్యాలను సమకూర్చాం. 11, 12 తరగతి చదివే అమ్మాయిలకు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖచే నెలకు రూ. 2 వేల స్కాలర్షిప్ అందిస్తారు. అవంతి ఫెలోస్ స్వచ్ఛంద సంస్థ ద్వారా 11, 12 తరగతులు చదివే వారికి జేఈఈ (జీ), నీట్ పరీక్షలకు ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరగుతుంది. చదవండి: బూజు జాడ చెప్పే కొత్త యంత్రం! -
విద్యార్థుల భవితకు నవోదయం
కరన్‌కోట్: గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అధునాతన, నాణ్యమైన, క్రమశిక్షణ, క్రీడల్లో ప్రతిభతో పాటు అనేక సదుపాయాలతో విలువలతో కూడిన విద్యను అందించేందుకు కేంద్ర మానవవనరులశాఖ ఆధ్వర్యంలో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పడ్డాయి. దేశవ్యాప్తంగా 595 నవోదయ విద్యాలయాలు ఉండగా, తెలుగు రాష్టాల్లో 24 ఉన్నాయి. ఈ విద్యాలయాలు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) సిలబస్‌లో విద్యా బోధనలు అందిస్తున్నాయి. రూ.లక్షలు వెచ్చించి కార్పొరేట్ విద్యాసంస్థల్లో చేర్పించినా కేవలం విద్యపైనే దృష్టి సారిస్తున్నారు తప్ప ఇతర రంగాల్లో తమ పిల్లలు రాణించలేకపోతున్నారనే అపోహ తల్లిదండ్రుల్లో నెలకొంది. కాగా నవోదయ విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తుండటంతో ఈ విద్యాలయాల్లో ప్రవేశానికి వందల సంఖ్యలో మాత్రమే ఉన్న ప్రవేశాలకు వేలాదిమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు సీటు లభించాలని వేచి చూస్తుంటారు. రానున్న విద్యాసంవత్సరంలో ప్రవేశానికి తాజాగా నవోదయ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ విద్యాలయాల్లో 2018–19 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రిజర్వేషన్ల పద్ధతి ద్వారా విద్యార్తులకు ప్రవేశపరీక్ష నిర్వహించి ఆరో తరగతిలో ప్రవేశం కల్పిస్తారు. వచే ఏడాది ఫిబ్రవరి 10న జరిగే ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి ప్రవేశం లభిస్తుంది.దీనికై వచ్చేనెల నవంబర్ 25లోగా దరఖాస్తులు చేసుకోవాలి. అర్హతలు, రిజర్వేషన్ విధానం.. నవోదయ ప్రవేశ పరీక్షకు అన్ని ప్రభుత్వ, ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాలలో ప్రస్తుతం అయిదో తరగతి చదువుతున్న బాలబాలికలు అర్హులు. వీరు 2005 మే1 నుంచి 2009 ఏప్రిల్ 30 మధ్య జన్మించి ఉండాలి. 3, 4, 5వ తరగతులను విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతలలో చదివి ఉత్తీర్ణులవ్వాలి. నవోదయ విద్యాలయలో ప్రవేశానికి రిజర్వేషన్ విధానం పక్కాగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు 75శాతం, పట్టణ ప్రాంత విద్యార్థులకు 25శాతం సీట్లు కేటాయిస్తారు.షెడ్యూల్ కులాలకు 15,షెడ్యూల్ తరగతులకు 7,వికలాంగులకు 3శాతం రిజర్వేషన్లు ఉన్నాయి.బాలికలకు 33శాతం అమలుచేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు.. గతంలో విద్యార్థులు సంబంధిత మండల విద్యాశాఖ అధికారి(ఎంఈవో) కార్యాలయంలో దరఖాస్తు పత్రాన్ని తీసుకుని మాన్యువల్ చేతిరాత ద్వారా నింపి అదే కార్యాలయంలో స మర్పించేవారు. కాగా ఆ విధానంలో పలు ఇబ్బదులు ఎదురవుతున్నాయని గుర్తించి కేంద్రీయ నవోదయ విద్యాలయ అధికారులు ఈ విద్యాసంవత్సరం నుంచి తొలిసారిగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించారు. సమీ పంలోని మీసేవ కేంద్ర నుంచి రూ.10 చెల్లించి ఆన్లైన్ ద్వా రా దరఖాస్తు పత్రం తీసుకొని విద్యార్థి చదివే పాఠశాల ప్రధనోపాధ్యాయుడి సంతకాన్ని తీసుకోవాలి.ప్రవేశ పరీక్ష దరఖాస్తు కోసం మరో రూ.35 చెల్లించి విద్యార్థి పాస్‌పోర్టు సైజ్ ఫొటోను జత చేసి పూరిత వివరాలు నింపాలి. ఫోన్ నంబర్‌ను కూడా నమోదు చేయాలి. దరఖాస్తు ఆన్లైన్లో అప్‌లో డ్ చేయగానే సంబంధిత ఫోన్‌కు వచ్చిన వోటీపీ నమోదు చేయగానే దరఖాస్తు స్వీకరించినట్లు నిర్ధారణ అవుతుంది. ప్రవేశ పరీక్ష విధానం.. నవోదయ ప్రవేశ పరీక్షను ఏభాషలోనైనా రాయవచ్చు. విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న భాషను ఎంచుకోవచ్చు. 2 గంటల సమయం కేటాయించే ఈ పరీక్షలో 100 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. మూడు విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. మేధాశక్తికి 50, గణితం 25 మూడో విభాగంలో 25 మార్కులకు భాష సంబంధిత ప్రశ్నలు ఉంటాయి. పోటీ తీవ్రమే అయినా.. నవోదయ విద్యాలయలో ప్రవేశం కోసం ఏటా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి 12 వేలకు పైగా విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరవుతారు. కాగా ప్రణాళిక బద్ధంగా చదువుకుని పరీక్షకు సిద్ధమైతే ఫలితాలు సాధించవచ్చు. ఒకటవ తరగతి నుంచి ఐదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలలో ఉన్న గణిత అంశాలపై సాధన చేయాలి.అలాగే ప్రవేశ పరీక్ష బుక్‌లెట్‌లో ఇచ్చిన సిలబస్ ఆధారంగా ఆయా అంశాలపై దృష్టిసారిస్తే పరీక్షలో నెగ్గడం ఎంతో సులభం. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు బంగారు బాటకు భరోసా సాధించినట్టే. -
నవోదయ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2015-16 విద్యాసంవత్సరంలో 6వ తరగతిలో చేరేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నవోదయ విద్యాలయ సమితి డిప్యూటీ కమిషనర్ ఆర్.రామారావు గురువారం తెలిపారు. అక్టోబర్ 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2015 ఫిబ్రవరి 7న నిర్వహించనున్న ఈ ఎంపిక పరీక్షకు 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. నవోదయ వెబ్సైట్ నుంచి దరఖాస్తులను పొందవచ్చు. -
భారతరత్నకు పీవీ అర్హుడు
=పీవీఘాట్ నిర్మాణం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి =ప్రముఖ పాత్రికేయుడు కె.రామచంద్రమూర్తి =కేయూలో పీవీ స్మారకోపన్యాసం కేయూక్యాంపస్, న్యూస్‌లైన్ : తెలుగువాడిగా అసమాన ప్రతిభతో అనేక పదవులు చేపట్టిన దివంగత ప్రధానమంత్రి పీవీ నర్సింహరావు భారతరత్నకు అర్హుడని ప్రముఖ పాత్రికేయుడు కె.రామచంద్రమూర్తి అన్నారు. కేయూ పరిపాలనా భవనంలో మంగళవారం పీవీ మూడో స్మారకోపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ముందుగా పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ‘న ర్సింహరావూస్ పాత్ బ్రేకింగ్ ఇనిషియేటివ్స్’ అంశంపై రామచంద్రమూర్తి ప్రసంగించారు. 1991లో పీవీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మన్మోహన్సింగ్ను ఆర్థికశాఖ మంత్రిగా నియమించుకుని ఐసీయూలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని గుర్తుచేశారు. ఓ సంజీవనిగా భారత ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించారని చెప్పారు. మొదటిసారిగా రాష్ట్రస్థాయిలో రెసిడెన్షియల్ స్కూళ్లను కూడా ప్రవేశపెట్టారని వివరించారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని జూనియర్, డిగ్రీ కళాశాలలో అప్పట్లో చదివిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నతస్థానాలను అధిరోహించారని పేర్కొన్నారు. అప్పట్లో పీవీ మూడు ప్రాంతాల్లో మూడు రెసిడెన్షియల్ స్కూళ్లు, జాతీయ స్థాయిలో జవహర్ నవోదయ విద్యాలయాలను కూడా ఏర్పాటు చేసి విద్యారంగాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. ప్రధానిగా పీవీ నర్సింహారావు మలేషియా, సింగపూర్, థాయ్‌లాండ్, భూటాన్, చైనా, శ్రీలంకతో సత్సంబంధాలు నెలకొల్పారన్నారు. ఇరుగుపొరుగు దేశాలతో ప్రస్తుతం 50 మిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోందన్నారు. పంజాబ్ లాంటి అనేక సమస్యలను కూడా ఆయన పరిష్కరించారన్నారు. బాబ్రీ మసీదు విషయంలో లిబరహాన్ కమిషన్ ఆయనను నిర్దోషిగా పేర్కొందని గుర్తుచేశారు. నిజాంను సైతం ఎదిరించిన దృఢచిత్తం, ధీరత్వం పీవీ సొంతమని రామచంద్రమూర్తి వివరించారు. పీవీకి న్యూఢిల్లీలో తగిన గుర్తింపు లేకపోవడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఇతర ప్రధానమంత్రులకు సమానంగా పీవీఘాట్‌ను కూడా నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం రాబోయే తెలంగాణ రాష్ట్రంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. 8 సంవత్సరాలుగా ఢిల్లీలో పీవీ సంస్మరణ సభలను నిర్వహించకపోవడం శోచనీయమన్నారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ కుగ్రా మం నుంచి సామాన్యుడు ప్రధానమంత్రి స్థాయికి ఎదగగలరని పీవీ నిరూపించారని వివరించారు. కేయూ వీసీ వెంకటరత్నం మాట్లాడుతూ పీవీ ప్రధానిగా దేశానికి అందించిన సేవలు గొప్పవన్నారు. రిజిస్ట్రార్ సాయిలు మాట్లాడుతూ పీవీ బహుభాషా కోవిధుడు, రాజనీతిజ్ఞుడు, సాహితీవేత్త అని కొనియాడారు. స్మారకోపన్యాసం కార్యక్రమ నిర్వాహకురాలు పీవీ కూతురు, సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ బాధ్యురాలు వాణి మాట్లాడుతూ మహిళలు కూడా చదువుకోవాలని తన తండ్రి ప్రోత్సహించారని వివరించారు. తాను మూడు కళాశాలలను ఏర్పాటు చేసి, ఆయన పేరుమీద 14 బంగారు పతకాలను ప్రతిభగల విద్యార్థులకు అందజేస్తున్నానని పేర్కొన్నారు. కేయూ సోషల్ సైన్స్ డీన్ సీతారామారావు, పరీక్షల నియంత్రణాధికారి ఎంవీ. రంగారావు, ప్రిన్సిపాల్ ఎన్.రామస్వామి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్ర హీత అంపశయ్య నవీన్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కె.దామోదరావు, టీచింగ్, నాన్‌టీచింగ్, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను సన్మానించారు. -
విద్యార్థుల భావి జీవితానికి ‘నవోదయ'ం
గ్రామీణ విద్యార్థులకు కూడా మెరుగైన విద్యనందించి, ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. మన దేశంలో మొత్తం 595 జవహర్ నవోదయ విద్యాలయాలున్నాయి. మన రాష్ర్టంలో ఉన్న 24 నవోదయా పాఠశాలల్లో 1920 సీట్లు ఉన్నాయి. వీటిల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రతి ఏటా ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో విజయం సాధించి ప్రవేశం పొందిన విద్యార్థులకు 12వ తరగతి వరకు విద్య, వసతి, భోజనం, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు ఉచితంగా లభిస్తాయి. ఈ నేపథ్యంలో జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ (జేన్‌వీఎస్‌టీ)-2014 పరీక్ష విధానం, ప్రిపరేషన్ ప్లాన్‌పై ఫోకస్... జాతీయ విద్యా విధానం(1986) ప్రకారం గ్రామీణ ప్రాంత విద్యార్థులను సైతం పట్టణ ప్రాంత విద్యార్థులకు దీటుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. నేడు తల్లిదండ్రులకు విద్య పెను భారంగా మారింది. నర్సరీలు, ప్లేస్కూల్స్‌లో ఫీజులు వేలల్లోనే. ఇంటర్నేషనల్ స్కూల్స్‌ల్లో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నవోదయ విద్యాలయాలు విద్యార్థులకు వరమని చెప్పొచ్చు. వీటిల్లో ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు గురుకుల విధానంలో బాలబాలికలకు విద్యనందిస్తారు. ఈ నవోదయ విద్యాలయాలను నిర్వహించడానికి ప్రత్యేకంగా స్వత ంత్ర ప్రతిపత్తి కలిగిన జవహర్ నవోదయ విద్యాలయ సమితి ఉంది. జిల్లాకు ఒకటి చొప్పున, కొన్ని జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా ఆధారంగా మరికొన్ని నవోదయ విద్యాలయాలున్నాయి. ప్రవేశం ఇలా: నవోదయ విద్యాలయాల్లో మొదట ఆరో తరగతిలోకి మాత్రమే ప్రవేశం లభిస్తోంది. అది కూడా ఒక్కో విద్యాలయానికి 80 మంది విద్యార్థులకు ప్రవేశం ఉంటుంది. ఒకసారి ప్రవేశం పొందిన విద్యార్థులు 12వ తరగతి వరకు విద్యనభ్యసించొచ్చు. ఎనిమిదో తరగతి వరకు విద్యార్థి మాతృభాషలో బోధన చేస్తారు. పదో తరగతి, 12వ తరగతి పరీక్షలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకే షన్ (సీబీఎస్ఈ) సిలబస్‌తో రాయాలి. అర్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదో తరగతి చదువుతుండాలి. ఏ జిల్లాలో నవోదయ స్కూల్ ఉందో.. ఆ జిల్లాకు మాత్రమే అర్హులవుతారు. మే 1, 2001 కంటే ముందు, ఏప్రిల్ 30, 2005 తర్వాత జన్మించి ఉండకూడదు. సీట్లు: ప్రతి జిల్లాలో కనీసం 75 శాతం సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులతో భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు. గ్రామీణ కోటాలో, అర్బన్ కోటాలో సీట్లు పొందాలంటే సంబంధిన ప్రాంతంలో ఉన్న పాఠశాలలో మూడు, నాలుగు, ఐదు తరగతులు చదివుండాలి. రిజర్వేషన్స్: ప్రతి నవోదయ పాఠశాలలో మొత్తం సీట్లలో 15 శాతం సీట్లు ఎస్సీలకు, 7.5 శాతం సీట్లు ఎస్టీలకు కేటాయిస్తారు. 1/3 వంతు సీట్లు బాలికలకు ఉంటాయి. మూడు శాతం సీట్లను శారీరక వికలాంగులతో భర్తీ చేస్తారు. పరీక్ష విధానం: రెండు గంటల వ్యవధి ఉండే పరీక్షలో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులుంటాయి. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉండవు. విద్యార్థి ఏ మీడియంలో ఐదో తరగతి చదువుతున్నాడో అదే మాధ్యమంలో ప్రశ్నపత్రం ఉంటుంది. విభాగం ప్రశ్నలు మార్కులు సమయం మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 50 50 60 ని. అర్థమెటిక్ టెస్ట్ 25 25 30 ని. లాంగ్వేజ్ టెస్ట్ 25 25 30 ని. మొత్తం 100 100 2 గం. దరఖాస్తు ఇలా: దరఖాస్తుతోపాటు ప్రాస్పెక్టస్‌ను బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్,జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ నుంచి పొందొచ్చు. లేదా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 31, 2013 పరీక్ష తేదీ: ఫిబ్రవరి 8, 2014 వివరాలకు: www.navodaya.nic.in అన్నీ ఉచితమే నవోదయ విద్యాలయాల్లో ప్రవేశం లభించిన విద్యార్థులందరికీ ఉచిత విద్య, వసతి, భోజన సదుపాయం కల్పిస్తారు. యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, వైద్య సదుపాయాలు కూడా ఉచితంగా అందిస్తారు. కో ఎడ్యుకేషన్ విధానంలో, పూర్తిగా గురుకుల పద్ధతిలో బోధన ఉంటుంది. బాలబాలికలకు వేరు వేరుగా హాస్టల్ వసతి ఉంటుంది. ఇక్కడి నవోదయా లో మొత్తం 45 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. 12వ తరగతి వరకు ఉచితంగా విద్య అభ్యసించవచ్చు. -కె.దామోదర్ రెడ్డి, ప్రిన్సిపాల్, జవహర్ నవోదయా, గచ్చిబౌలి, హైదరాబాద్ -
ఆకట్టుకున్న ‘యూత్ పార్లమెంట్’
నిజాంసాగర్, న్యూస్‌లైన్: నిజాంసాగర్ జవహార్ నవోదయ విద్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ‘యూత్ పార్లమెంట్’ కార్యక్రమం అతిథులను ఆకట్టుకుంది. నవోదయ విద్యాలయ సమితి న్యూఢిల్లీ వారి ఆదేశాను సారంగా స్థానిక విద్యాలయంలో 17వ జాతీయ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాలకు చెందిన విద్యార్థిని భావిక లోక్‌సభ స్పీకర్, శ్రీకాంత్ ప్రధానమంత్రిగా వ్యవహరిస్తూ పార్లమెంట్ సమావేశం నిర్వహించారు. దేశంలో దారిద్య్రరేఖకు దిగువన ఎంతశాతం మంది ప్రజలు ఉన్నారు..పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఏమిటి.. అని ప్రతిపక్ష ఎంపీలు సమావేశంలో ప్రధానమంత్రిని ప్రశ్నించారు. దీనికి కార్మిక మంత్రి సమాధానం ఇస్తు దేశంలో 21.9 శాతం మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారన్నారు. ఇలా సమావేశంలో ప్రతి పక్ష ఎంపీలు ప్రశ్నలు సంధించగా, ఆయా శాఖల మంత్రులు సమాధానాలు చెప్పారు. సుమారు నాలుగు గంటల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థులను, గ్రామస్తులను ఆకట్టుకుంది. విద్యాలయంలోని 37 మంది విద్యార్థులు మంత్రు లుగా, ఎంపీలుగా వ్యవహరించారు. పార్లమెంట్ గురించి ప్రజలకు చెప్పాలి యూత్ పార్లమెంట్ కార్యక్రమం చాలా బాగుందని జుక్కల్ ఎమ్యెల్యే హన్మంతుసింధే అభినందించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాలపైన ప్రజలకు అవగాహన కల్పిం చాల్సిన అవసరం ఉందన్నారు.