Jayalalithaas niece
-
ఢిల్లీకి దీప శిబిరం
దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీప మద్దతుదారులు ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రపతి, ప్రధాని, హోం శాఖ కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించారు. పళనిస్వామి సర్కారుపై ఫిర్యాదులు చేశారు. ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని డిమాండ్‌చేశారు. దీపకు ప్రాణహాని ఉందని, ఆమెకు భద్రత కల్పించాలని వేడుకున్నారు. హా అందరికీ వినతి పత్రాలు. ♦పళని సర్కారుపై ఫిర్యాదులు ♦ డిస్మిస్కు డిమాండ్ ♦భద్రతకు వేడుకోలు సాక్షి, చెన్నై : జయలలిత మరణం తదుపరి అన్నాడీఎంకే ముక్కలైన విషయం తెలిసిందే. సీఎం పళనిస్వామి, మాజీ సీఎం పన్నీరుసెల్వం, అన్నాడీఎంకే ఉపప్రధాన కార్యదర్శి దినకరన్ శిబిరాలు ఓవైపు సాగుతుంటే, మరోవైపు తానే మేనత్తకు నిజమైన వారసురాలు అంటూ జయలలిత సోదరుడు జయకుమార్ కుమార్తె దీప రాజకీయంగా ఎదిగే ప్రయత్నంలో ఉన్నారు. ఎంజీయార్, అమ్మ దీప పేరవై పేరుతో ముందుకు సాగుతున్నారు. రాజకీయంగానే కాదు, మేనత్త ఆస్తులకు వారసురాలినని పేర్కొంటూ వివాదాలను కొని తెచ్చుకుంటున్నారు. పోయెస్ గార్డెన్ వేదికగా కొద్ది రోజుల క్రితం తనమీద దాడి కూడా జరిగినట్టు దీప ఆరోపించిన సందర్భం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో సీఎం పళనిస్వామి సర్కారు తీరును, అన్నాడీఎంకేలో సాగుతున్న పరిణామాలను, తనకు జరుగుతున్న అన్యాయాన్ని జాతీయస్థాయిలోకి తీసుకెళ్లే పనిలో దీప నిమగ్నం అయ్యారు. ప్రధాని అనుమతిస్తే కలిసేందుకు సిద్ధం అని ప్రకటించినా, అందుకు తగ్గ పిలుపు ఢిల్లీ నుంచి ఇంతవరకు రాలేదు. దీంతో తమ ఫిర్యాదులు, విజ్ఞప్తుల్ని ఢిల్లీకి వినిపించుకునేందుకు దీప మద్దతు నేతలు సిద్ధం అయ్యారు. బిజీ బీజీగా దీప మద్దతుదారులు దీప ప్రతినిధులుగా ఆ పేరవై కీలక నాయకుడు, న్యాయవాది పసుం పొన్ పాండియన్, మాజీ ఎమ్మెల్యేలు సరస్వతి రామచంద్రన్, వెంకట్ తదితరులు ఢిల్లీ వెళ్లారు. దీప శిబిరం వర్గాలు ఢిల్లీలో గురువారం బిజీ అయ్యాయి. అక్కడి అన్నాడీఎంకే మద్దతు తమిళుల్ని తమ వైపునకు ఆకర్షించే విధంగా ముందుకు సాగాయి. రాష్ట్రపతి , ప్ర«ధాని, హోం శాఖ కార్యాలయాల్లో వారు వినతిపత్రాలను సమర్పించారు. సీఎం పళనిస్వామి ప్రభుత్వం అన్ని రకాలుగా పాలనాపరంగా విఫలం అయిందని అందులో వివరించారు. శాంతి భద్రతలు క్షీణించాయని, తమిళనాడు ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. దీపకు ప్రాణహాని ఉందని, ఆమె భద్రతకు కేంద్రం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. అన్నాడీఎంకేలో జరిగిన, జరుగుతున్న పరిణామాలు, రాజకీయంగా దీపను అణగదొక్కేందుకు సాగుతున్న ప్రయత్నాలు, జయలలిత ఆస్తుల వ్యవహారం తదితర అంశాలను కూడా ఆ వినతి పత్రంలో వివరించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. -
అచ్చం అమ్మలానే!
► ఆర్కేనగర్ నుంచి దీప రాష్ట్ర పర్యటన ► జయ బాణీలో ప్రచారం ► నేడు కన్వీనర్లతో సమావేశం ► జయ మృతిపై ప్రధానికి గౌతమి లేఖ సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయాల్లో కాలుమోపిన జయలలిత మేనకోడలు దీప అత్త బాణీలోనే సాగుతున్నారు. ఎమ్మెల్యేగా అత్త ప్రాతినిధ్యం వహించిన ఆర్కేనగర్ నుంచి తన రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. వేష భాషలు, ఆప్యాయంగా మాటతీరు అమ్మను తలపిస్తోందంటూ ఆర్కేనగర్ ప్రజలు దీపను అక్కున చేర్చుకున్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తన రాజకీయ పయనం ఆగదని ఈ సందర్భంగా దీప స్పష్టం చేశారు. రాష్ట్రపర్యటన ఏర్పాట్ల దీప పేరవై కో ఆర్డినేటర్లతో ఆదివారం దీప సమావేశం అవుతున్నారు. జయలలిత స్థానంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను జీర్ణించుకోలేని పార్టీ శ్రేణులు దీప వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. గత నెల 17వ తేదీన ఎంజీ రామచంద్రన్ జయంతి రోజున రాజకీయాల్లో అడుగుపెట్టినట్లు దీప ప్రకటించారు. ఆరంభంలో పార్టీలోని కార్యకర్తలు మాత్రమే దీపవైపు మొగ్గుచూపగా కాలక్రమేణా మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో మద్దతు పలకడం ప్రారంభించారు. దాదాపుగా అన్ని జిల్లాల్లో దీప పేరవైని స్థాపించి సభ్యులను చేర్పిస్తున్నారు. ఈనెల 24వ తేదీన జయలలిత జయంతి సందర్భాన రాజకీయంగా ఒక కీలకమైన ప్రకటన చేయనున్నట్లు రాజకీయ అరంగేట్రం రోజునే దీప ప్రకటించారు. అత్త జయలలితను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఆర్కేనగర్ నుంచే తన పర్యటనను ప్రారంభించారు. అన్నాదురై జయంతి సందర్భంగా శుక్రవారం మెరీనాబీచ్‌లోని ఆయన సమాధి వద్ద నివాళులర్పించి ఆర్కేనగర్కు చేరుకోవాలని ఆమె తలంచారు. దీప రాక సందర్భంగా ఆమె అభిమానులు ఆర్కేనగర్లో ఏర్పాటు చేసిన వేదికను తొలగించాలని పోలీసులు అభ్యంతరం చెప్పగా అన్నాడీఎంకే కార్యకర్తలు, దీప అభిమానులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఆర్కేనగర్లో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో దీప తన పర్యటనను కొద్దిసేపు వాయిదా వేసుకుని ఆ తరువాత వచ్చారు. జయలలిత వలే నిండుగా కప్పుకుని ఆర్కేనగర్లో పర్యటించారు. స్థానికంగా ఉన్న తన అభిమానులను, వృద్ధులను, చిన్నారులను కలుసుకున్నారు. వృద్ధ మహిళల కాళ్లకు దీప నమస్కరించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో పోటీచేయాల్సిందిగా దీపను కోరగా, త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని బదులిచ్చారు. జయలలిత వదిలి వెళ్లిన ఆశయాలను తాను నెరవేరుస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆర్కేనగర్లోని మూడు ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయకాలను పంచిపెట్టారు. ఆర్కేనగర్ ప్రజలు అమ్మ మరణం అనుమానాస్పదమని భావిస్తున్నారు. అంతేగాక జయలలిత అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోవడానికి శశికళే కారణమని దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రధాన కార్యదర్శిగా అమ్మ పదవిలో కూర్చునట్లే ఆర్కేనగర్ నుంచి పోటీకి దిగితే సహించబోమని, ఎన్నికల పర్యటనకు వస్తే తరిమికొడతామని హెచ్చరిస్తున్నారు. అర్కేనగర్ ప్రజల హృదయాల్లో అమ్మ ఆ స్థాయిలో గూడుకట్టుకుని ఉండగా దీప పర్యటన వారిలో సంతోషాన్ని కలిగించింది. నిన్ను చూస్తుంటే అమ్మను చూసినట్లే ఉందని ఆనందపడిపోతూ దీపకు అఖండస్వాగతం పలికారు. జయ మరణ మిస్టరీపై పోరాటం తప్పదా: ప్రధానికి నటి గౌతమి లేఖ జయలలిత మరణం వెనుక దాగి ఉన్న మిస్టరీని బద్దలు కొట్టేందుకు న్యాయవిచారణ జరపాలన్న తన డిమాండ్‌పై కేంద్రం ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తూ నటి గౌతమి ప్రధాని మోదీకి శనివారం లేఖ రాసారు. జల్లికట్టు పోరాటంలా ప్రజలు ఉద్యమించక తప్పదాని నిలదీశారు. జయలలిత మరణం పట్ల తమిళనాడు ప్రజలకు ఉన్న సందేహాలను నివృత్తి చేసేలా విచారణ జరిపించాల్సిందిగా కోరుతూ గత ఏడాది డిసెంబరు 8వ తేదీన గౌతమి ప్రధానికి లేఖ రాశారు. అయితే ఇంత వరకు కేంద్రం నోరుమెదపక పోవడంతో శనివారం మరోసారి ఉత్తరం రాశారు. జయలలిత మరణం విచారణకు ఆమోదించాలంటే తాము ఇంకా ఏమి చేయాల్లో చెప్పాల్సిందిగా ఆమె కోరారు. కేంద్రం దృష్టిని ఆకర్షించేలా జల్లికట్టును పోలిన ఉద్యమాన్ని లేవనెత్తాలా అని వ్యాఖ్యానించారు.