jayalithaa
-
అమ్మకు ఘన నివాళి.. మెరీనా తీరంలో ఉద్రిక్తత
సాక్షి, చెన్నై(తమిళనాడు): దివంగత ముఖ్యమంత్రి అమ్మ జయలలిత ఐదో వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. వాడవాడల్లో అన్నాడీఎంకే, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేతలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మ సమాధి సాక్షిగా కుట్రలను భగ్నం చేస్తామని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ పెద్దలు పన్నీరు సెల్వం, పళని స్వామి ప్రతిజ్ఞ చేశారు. గెలుపే లక్ష్యంగా అందరం ఏకం అవుదామని చిన్నమ్మ శశికళ పిలుపునిచ్చారు. ఇరు వర్గాలు అమ్మ సమాధి సాక్షిగా బల ప్రదర్శనకు దిగడంతో మెరీనా తీరంలో ఉద్రిక్తత నెలకొంది. పోటాపోటీ.. అన్నాడీఎంకే నేతలు వాడవాడల్లో జయలలిత విగ్రహాలు, చిత్రపటాలకు నివాళులర్పించారు. పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తామేమి తక్కువ తిన్నామా..? అన్నట్టుగా అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించాయి. సమాధి వద్ద నివాళులు మెరీనా తీరంలోని అమ్మ సమాధి వద్దకు నేతలు క్యూకట్టారు. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో కన్వీనర్ పళనిస్వామి, ప్రిసీడియం(తాత్కాలిక) చైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతినిధులు పెద్దఎత్తున తరలివచ్చారు. నల్ల చొక్కాలు ధరించిన నేతలు అమ్మ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అమ్మ సేవలను గుర్తు చేస్తూ ఆమె ఆశయ సాధన లక్ష్యంగా అందరి చేత పన్నీరు సెల్వం ప్రతిజ్ఞ చేయించారు. అన్నాడీఎంకేను కైవశం చేసుకునేందుకు పగటి కలలు కంటున్న వారి కుట్రలను భగ్నం చేస్తామని అమ్మ సమాధి సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు. అమ్మకు నివాళులర్పించినానంతరం ఎంజీఆర్ సమా«ధి వద్దకు నేతలు వెళ్లడం సహజం. అయితే ఈసారి ఎంజీఆర్‌ను మరిచారు. అటు వైపుగా వెళ్లకుండానే నేతలు వెళ్లిపోవడం గమనార్హం బల ప్రదర్శనకు వేదికగా.. మెరీనా తీరంలోని అమ్మ సమాధి సాక్షిగా వర్ధంతి కార్యక్రమాన్ని అన్నాడీఎంకే, అమ్మమక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు బల ప్రదర్శనకు వేదికగా చేసుకున్నాయి. దీంతో మెరీనా తీరంలో ఉద్రిక్తత నెలకొంది. పన్నీరు, పళని నివాళులర్పించి వెళ్తున్న సమయంలో ఏఎంఎంకే నేతలు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీశాయి. పళని స్వామి వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు చెప్పులు, రాళ్లు విసరడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరు వర్గాలు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. దినకరన్ మద్దతుతో కొందరు దాడులకు ప్రయత్నించారని అన్నాడీఎంకే నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దినకరన్ ఓపెన్ టాప్ వాహనంలో ప్రచారానికి వెళ్తున్నట్టుగా మద్దతుదారులతో తరలిరావడం గమనార్హం. కన్నీటితో చిన్నమ్మ ప్రతిజ్ఞ జయలలిత నెచ్చెలి శశికళ సమాధి వద్దకు చేరుకుని అంజలి ఘటించారు. ఆమె వెన్నంటి మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థులను ఓడించడం కోసం అందరం ఏకం అవుదామని అమ్మ సమాధి వద్ద ప్రతిజ్ఞ చేస్తూ అన్నాడీఎంకే వర్గాలకు పరోక్షంగా చిన్నమ్మ పిలుపునిచ్చారు. ఈ సమయంలో ఆమె ఉద్వేగానికి గురై కన్నీటి నివాళులర్పించారు. అనంతరం అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగం నేత దినకరన్ సమాధి వద్దకు చేరుకుని అంజలి ఘటించారు. -
స్త్రీలోక సంచారం
మెరుగైన జీవితం కోసం ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలి వెళ్లే యువతులు, మహిళల సంఖ్య గత మూడు దశాబ్దాలలో పురుషుల కంటే కూడా ఎక్కువగా ఉండటంతో పాటు, వారిలో ఒంటరి జీవితం గడుపుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోందని న్యూఢిల్లీలోని ‘రిసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్’లో పనిచేస్తున్న ప్రొఫెసర్ అమితాబ్ ఖండు రూపొందించిన తాజా నివేదిక వెల్లడించింది. వివాహం అయ్యి, భర్త పని చేస్తున్న చోటికి వెళ్లడం అనేది స్త్రీ జీవితంలో ఎప్పుడూ ఉండేదే అయినప్పటికీ.. సంపాదన కోసం స్వతంత్రంగా.. ఉన్న చోటు నుంచి కదలి వెళ్లడానికి మహిళలు చొరవ చూపడం సామాజికంగా ఎంతో ప్రయోజనకరమైన పరిణామం అని నివేదిక వ్యాఖ్యానించింది ::: త్రిపుల్ తలాక్ ఆచారానికి వ్యతిరేకంగా ఉద్యమించిన ముస్లిం వితంతువు నిదాఖాన్‌ను ఇస్లాం మతం నుంచి బహిష్కరిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఒక ముస్లిం మతాధికారి జారీ చేసిన ఫత్వాను దేశంలోనే అత్యున్నతస్థాయి ముస్లిం సంస్థ అయిన ‘ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్’ తిరస్కరించింది! ‘మతం నుంచి ఒక వ్యక్తిని బహిష్కరించడం ఇస్లాం విలువలకు విరుద్ధమైన చర్య మాత్రమే కాదు, అమానుషం కూడా’ అని బోర్డులోని సీనియర్ సభ్యులు మౌనాలా ఖలీద్ రషీద్ ఫరంగీ మహాలీ ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు ::: అమెరికాలోని ఆఫ్రికావర్ణ మహిళలు, హిస్పానిక్ (లాటిన్ అమెరికాలో దేశాల్లో స్పానిష్ భాష మాట్లాడే సంతతి) స్త్రీలు సాధించిన నూతన ఆవిష్కరణలకు పేటెంట్లు ఇవ్వడంలో ‘యు.ఎస్. పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ ఆఫీస్’ తీవ్రమైన వివ„ý పాటిస్తోందని వాషింగ్టన్‌లోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్స్ పాలసీ రిసెర్చ్’ తన తాజా నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. తెలివుండీ, ప్రపంచానికి ఉపయోగపడే గొప్ప విషయాలను కనిపెట్టి, అనేక సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలను సూచించినప్పటికీ తెల్లవారితో సమానంగా ఈ నల్లజాతి, హిస్పానిక్ మహిళలు మేధోహక్కులను పొందలేకపోతున్నారని నివేదికను సమర్పించినవారిలో ఒకరైన జెస్సికా మిల్లీ.. పేటెంట్ ఆఫీస్ ధోరణిని ఎండగట్టారు ::: అమెరికా నుంచి రెండేళ్ల తర్వాత ఇండియా చేరుకున్న మాజీ అందాలరాణి, బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగడానికి కొన్ని నిముషాల ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫొటోలో రూపురేఖలు మారిపోయి పూర్తిగా కొత్త మనిషిలా కనిపించడం విశేషం అయింది! తొలి చిత్రం ‘ఆషిక్ బనాయా అప్నే’లో ఎమ్రాన్ హష్మీతో నటించి, బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తనుశ్రీ విమానాశ్రయంలో సైతం ఏ కొద్దిమంది ఫొటోగ్రాఫర్లు మాత్రమే గుర్తుపట్టేలా మారిపోవడం చర్చనీయాంశం అయింది::: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తన జీవితకాలంలో ఏనాడూ గర్భిణిగా లేరని తమిళనాడు అడ్వొకేట్ జనరల్ విజయ్ నారాయణ్ మద్రాసు హైకోర్టు దృష్టికి తెచ్చారు. అమృత అనే బెంగళూరు యువతి తను జయలలిత కూతురునని కోర్టులో వేసిన పిటిషన్‌పై విజయ్ తన వాదనలు వినిపిస్తూ, 1980లో అమృత తను పుట్టానని చెప్పుకుంటున్న తేదీకి కొద్ది రోజుల ముందు జయ పాల్గొన్న ఒక ఫిల్మ్ అవార్డు ఫంక్షన్ వీడియోను చూపించి, అందులో ఆమె గర్భిణిగా లేకపోవడాన్ని గమనించాలని న్యాయమూర్తిని కోరారు ::: ఎబోలా వైరస్ మహిళల్లో కూడా ఒక ఏడాది పాటైనా నిక్షిప్తం అయి ఉండి, ఇతరులకు వ్యాపించే గుణం కలిగి ఉంటుందని తొలిసారిగా శాస్త్ర పరిశోధకులు కనుగొన్నారు. ఎబోలా పురుషులలో మాత్రమే దాగి ఉండి, వ్యాపిస్తుందని ఇంతవరకు భావిస్తూ వస్తున్న పరిశోధకులు.. ఎబోలా తీవ్రత పూర్తిగా తగ్గిపోయిందని లోకం స్థిమిత పడుతున్న తరుణంలో లైబీరియాలోని ఒక మహిళలోఏడాది తర్వాత ఎబోలా వైరస్ బయటపడటాన్ని గమనించి, ఆ వివరాలను ‘లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్’ పత్రికకు ప్రచురణ కోసం అందించారు ::: -
రజనీకాంత్, జయలలిత కంటే శంకరే గొప్ప!
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. శంకర్ 'ఐ' ట్రైలర్ చూసిన తర్వాత.. తన భావం ఒకటేనని, తమిళనాడులో జయలలిత కంటే, రజనీకాంత్ కంటే కూడా శంకరే గొప్పవాడని చెప్పారు. 'ఐ' చిత్రం రెండో ట్రైలర్ చూసిన ఆయన.. ఈ సంక్రాంతి కాస్తా శంకర్ రాత్రిగా అయిపోతుందన్నారు. రజనీకాంత్ కంటే శంకర్ చాలా గొప్పవాడని, ఆయన సినిమా చూస్తే ఒకరకమైన విద్యుత్ పుట్టి.. ఆసక్తి రేపుతుందన్నారు. ఐ సినిమా మొదటి రోజు కలెక్షన్లు లింగా కలెక్షన్ల కంటే ఎక్కువ ఉంటాయని, అందుకే తాను రజనీకాంత్ కంటే శంకర్ గొప్పవాడని అంటున్నానని చెప్పారు. ఇన్నాళ్లూ తాను రజనీకాంత్‌కు పెద్ద అభిమాననని, కానీ ఇప్పుడు శంకర్ వైపు మారిపోయానని వర్మ తెలిపారు. ఈ సినిమా వస్తున్నప్పుడు కేవలం చెవిటివాళ్లు మాత్రమే ఇతర సినిమాలను దాంతోపాటు విడుదల చేస్తారన్నారు. భారతీయ దర్శకులకు ఈ సినిమా చూస్తే మంచి కిక్ వస్తుందని చెప్పారు. ఇప్పటివరకు తీసిన భారతీయ సినిమాలన్నింటినీ హాలీవుడ్ వాళ్లు సీరియస్‌గా చూస్తే.. అది కేవలం శంకర్ 'ఐ' వల్లే అవుతుందని చెప్పారు. శంకర్ గనక ఒకవేళ అమీర్‌ఖాన్‌తో సినిమా తీస్తే అది భారతీయ 'అవతార్' అవుతుందని రాంగోపాల్ వర్మ చెప్పారు. గొప్పగొప్ప దర్శకులంతా షారుక్, సల్మాన్, అమీర్ లాంటివాళ్లమీద ఆధారపడితే.. శంకర్ మాత్రం రజనీకాంత్ లాంటి వాళ్లను కూడా సర్వనాశనం చేసేస్తాడని, స్టార్ పవర్ కంటే శంకర్ పవరే ఎక్కువని వర్మ వ్యాఖ్యానించారు. తనకు శంకర్ ట్విట్టర్ ఐడీ తెలియదు గానీ.. భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తంలో ట్రైలర్లతోనే దుమ్ము రేపగలిగిన ఏకైక మగాడు నువ్వేనని అన్నారు. After seeing " I " trailer purely as a general common outsider I feel Shanker is bigger than Jayalalitha and Rajnikanth in Tamilnadu — Ram Gopal Varma (@RGVzoomin) December 26, 2014 "I" in terms of its sheer originality,iaudacity,imaginativity and in every other vity is going to be a groundbreaker — Ram Gopal Varma (@RGVzoomin) December 26, 2014 Hey Shanker I don't know ur twitter I'd but I want to tell u that u are the only trail blazer we have in the entire Indian film industry — Ram Gopal Varma (@RGVzoomin) December 26, 2014 The biggest of directors depend upon Sharuk's Salman's and Aamir's nd Shanker destroys Rajnikant nd that's Shanker power against Star Power — Ram Gopal Varma (@RGVzoomin) December 26, 2014 I was a super huge fan of Rajnikant but now I shifted my loyalty to Shanker — Ram Gopal Varma (@RGVzoomin) December 26, 2014 My prediction Is that "I" collections on first day will be bigger than "Lingaa" nd that's why I say Shanker is bigger than Rajnikant — Ram Gopal Varma (@RGVzoomin) December 26, 2014 Shanker's film with Aamir will be india's "Avataar" — Ram Gopal Varma (@RGVzoomin) December 26, 2014 In pure eyeball grabbing and generating electrical enthusiasm I think Shanker is bigger than Rajnikant — Ram Gopal Varma (@RGVzoomin) December 26, 2014 If at all Indian films ever will be taken seriously by Hollywood I think it will be because of Shanker's "I" — Ram Gopal Varma (@RGVzoomin) December 26, 2014 I think " I " will be the film for Indian film makers to feel a kick on their ..that they are not pushing the boundaries like Shanker — Ram Gopal Varma (@RGVzoomin) December 26, 2014 Just saw "I" trailer 2 nd am sure Sankrantri is going to be shanker raatri...only dumb people will release their films in front of it — Ram Gopal Varma (@RGVzoomin) December 26, 2014