రజనీకాంత్, జయలలిత కంటే శంకరే గొప్ప! | shankar is bigger than rajinikanth and jayalalithaa in tamilnadu, tweets varma | Sakshi
Sakshi News home page

రజనీకాంత్, జయలలిత కంటే శంకరే గొప్ప!

Published Sat, Dec 27 2014 5:55 PM | Last Updated on Sat, Aug 25 2018 6:31 PM

రజనీకాంత్, జయలలిత కంటే శంకరే గొప్ప! - Sakshi

రజనీకాంత్, జయలలిత కంటే శంకరే గొప్ప!

సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. శంకర్ 'ఐ' ట్రైలర్ చూసిన తర్వాత.. తన భావం ఒకటేనని, తమిళనాడులో జయలలిత కంటే, రజనీకాంత్ కంటే కూడా శంకరే గొప్పవాడని చెప్పారు. 'ఐ' చిత్రం రెండో ట్రైలర్ చూసిన ఆయన.. ఈ సంక్రాంతి కాస్తా శంకర్ రాత్రిగా అయిపోతుందన్నారు. రజనీకాంత్ కంటే శంకర్ చాలా గొప్పవాడని, ఆయన సినిమా చూస్తే ఒకరకమైన విద్యుత్ పుట్టి.. ఆసక్తి రేపుతుందన్నారు. ఐ సినిమా మొదటి రోజు కలెక్షన్లు లింగా కలెక్షన్ల కంటే ఎక్కువ ఉంటాయని, అందుకే తాను రజనీకాంత్ కంటే శంకర్ గొప్పవాడని అంటున్నానని చెప్పారు. ఇన్నాళ్లూ తాను రజనీకాంత్కు పెద్ద అభిమాననని, కానీ ఇప్పుడు శంకర్ వైపు మారిపోయానని వర్మ తెలిపారు.

ఈ సినిమా వస్తున్నప్పుడు కేవలం చెవిటివాళ్లు మాత్రమే ఇతర సినిమాలను దాంతోపాటు విడుదల చేస్తారన్నారు. భారతీయ దర్శకులకు ఈ సినిమా చూస్తే మంచి కిక్ వస్తుందని చెప్పారు. ఇప్పటివరకు తీసిన భారతీయ సినిమాలన్నింటినీ హాలీవుడ్ వాళ్లు సీరియస్గా చూస్తే.. అది కేవలం శంకర్ 'ఐ' వల్లే అవుతుందని చెప్పారు.

శంకర్ గనక ఒకవేళ అమీర్ఖాన్తో సినిమా తీస్తే అది భారతీయ 'అవతార్' అవుతుందని రాంగోపాల్ వర్మ చెప్పారు. గొప్పగొప్ప దర్శకులంతా షారుక్, సల్మాన్, అమీర్ లాంటివాళ్లమీద ఆధారపడితే.. శంకర్ మాత్రం రజనీకాంత్ లాంటి వాళ్లను కూడా సర్వనాశనం చేసేస్తాడని, స్టార్ పవర్ కంటే శంకర్ పవరే ఎక్కువని వర్మ వ్యాఖ్యానించారు. తనకు శంకర్ ట్విట్టర్ ఐడీ తెలియదు గానీ.. భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తంలో ట్రైలర్లతోనే దుమ్ము రేపగలిగిన ఏకైక మగాడు నువ్వేనని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement