JC venkatramreddy
-
ముహూర్తం ముంచుకొస్తోంది
► 5వ తేదీలోగా సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో బోర్డులు వెలియాలి ► అధికారులతో జేసీ సమీక్ష.. శాఖలవారీగా నివేదికలు సిద్ధం ► ఉద్యోగులు, వసతులపై ఆరా సిద్దిపేట జోన్: దసరా ముందుకోస్తుంది.. రాష్ర్ట ప్రభుత్వం జిల్లాల పునర్విభజన ప్రక్రియను వేగవంతం చేస్తుంది. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా సిద్దిపేట జిల్లా ఏర్పాటు ప్రక్రియలో పాల్గొననున్న తరుణంలో జిల్లా అధికార యంత్రాంగం నూతన జిల్లా పరిణామాలపై కసరత్తును వేగవంతం చేస్తుంది. సిద్దిపేటలో సమీకృత కలెక్టరేట్ తాత్కలిక భవనం ఒక వైపు వేగంగా నిర్మాణ దిశగా ముందుకు సాగడం మరోవైపు ఆయా ప్రభుత్వ శాఖల స్థితిగతులపై అధికారులు అడుగు ముందుకు వేస్తున్నారు. అందులో బాగంగా శనివారం సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్రాంరెడ్డి జిల్లా వివిధ శాఖ అధికారులచే సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల వారిగా వివరాలను సేకరించారు. ప్రభుత్వ అదేశాల మేరకు నివేదికలు రూపొందించి ప్రోఫార్మాకు అనుగుణంగా కార్యాలయం , అధికారులు , సిబ్బంది, గదులు, కనీస వసతులు , పర్నిచర్ తదితర అంశాలతో జేసీ జిల్లా అధికారుల ద్వారా వివరాలు సేకరించారు. అదే విధంగా ఉద్యోగుల పంపిణీ ప్రక్రియపై చర్చించారు. ముఖ్యంగా కీలక శాఖలను బలోపేతం చేసే దిశగా సమీక్షలో చర్చా కొనసాగింది. ఈ నెల 5న తప్పనిసరిగా ఆయా ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు బోర్డులు సిద్దం చేసుకోవాలని జేసీ సూచించారు. అదే విధంగా ఉద్యోగులు వివరాలు, గదుల వివరాలు అవసరమయ్యే పర్నిచర్ తదితర ఏర్పాట్లను వేగవంతం చేసుకోవాలని సూచించారు.ఈ సమీక్షలో సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డితో పాటు పలు శాఖల అధికారులు ఉన్నారు. -
'ఎర్రవల్లి' పనుల్లో వేగం పెంచాలి
సీఎం దత్తతగ్రామమై ఎర్రవల్లిలో అభివృద్ధి పనులను పరిశీలించిన జేసీ వెంకట్రాంరెడ్డి జగదేవ్‌పూర్: శ్రావణ మాసం దగ్గరకు వస్తోంది..పనుల్లో వేగం పెంచాలి..సమయం తక్కువగా ఉంది..చాలా రోజులయ్యే.. ఊరికి రాక.. పనులెట్లా జరుగుతున్నాయ్.. అంటూ జేసీ వెంకట్రాంరెడ్డి మంగళవారం రాత్రి సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లి వీడీసీ సభ్యులతో అన్నారు. మంగళవారం రాత్రి 7 గంటల సమీపంలో సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో జేసీ వెంకట్రాంరెడ్డి, గడా అధికారి హన్మంతరావుతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో చేపడుతన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఇళ్ల పనులు ఎంత వరకు వచ్చాయంటూ మీనాక్షి కంపెనీ ప్రతినిధులను, వీడీసీ సభ్యులను ఆడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం శ్రావణ మాసం దగ్గరకు వస్తోందని, పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. ఫంక్షన్‌హాల్, గోదాం, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షుడు కిష్టారెడ్డి, సభ్యులు బాల్‌రాజు, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.