Jefferies
-
ఈక్విటీల్లో ర్యాలీ కొనసాగుతుంది: క్రిస్ వుడ్
కోవిడ్-19 రెండోదశ వ్యాధి వ్యాప్తి ఆందోళనలు కేవలం ముందస్తు భయాలేనని, రానున్న రోజుల్లో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీ కొనసాగవచ్చని జెఫ్పారీస్ బ్రోకరేజ్ సంస్థ గ్లోబల్ హెడ్‌ఆఫ్‌ఈక్విటీ స్ట్రాటజీ క్రిస్టోఫర్ వుడ్ అభిప్రాయపడ్డారు. ‘‘మార్కెట్లు కరోనా కేసుల రెండో దశ వ్యాప్తి ఆందోళనల కంటే... ఆర్థిక వ్యవస్థ పునఃప్రారంభంపైనే అధిక దృష్టిని సారించాయని స్పష్టమైంది. మొదటిసారి లాక్డౌన్లో భాగంగా ఇన్వెస్టర్లు సైక్లికల్స్, గ్రోత్ షేర్లకు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఇప్పడు రెండోదశ కోవిడ్ కేసులు పెరగడంతో సైక్లికల్స్ షేర్ల కొనుగోళ్లను తగ్గించి వృద్ధి షేర్లను అధికంగా కొంటారు. అయితే వచ్చే త్రైమాసికంలో సెంట్రల్ బ్యాంకుల ద్రవ్యపాలసీ సరళంగా ఉండటం గ్రహించి మార్కెట్లు వీ-ఆకారపు రికవరీని అంచనా వేస్తూ తిరిగి సైక్లికల్ షేర్లను కొంటారు.’’ అని వుడ్ తన వీక్లీ నోట్ గ్రీడ్ అండ్ ఫియర్లో తెలిపారు. ఈక్విటీ ఇన్వెస్టర్లు వృద్ధి, వ్యాల్యూయేషన్ స్టాక్లను సొంతం చేసుకునేందుకు ‘‘బార్బెల్ వ్యూహాన్ని’’ అమలుపరచాలని వుడ్ సలహానిచ్చారు. కోవిడ్-19 రెండోదశ వ్యాప్తి భయాలు తెరపైకి రావడంతో గ్రోత్ స్టాక్‌లు ఆలస్యంగా ర్యాలీని ప్రారంభించాయి. అయితే మార్కెట్ వీ-ఆకారపు రికవరీ సెంటిమెంట్ బలపడటంతో ఫైనాన్షియల్, అటో, ఇంధన, మెటీరియల్(సైక్లికల్స్ స్టాక్స్) మరోసారి ర్యాలీ చేయవచ్చు అని తెలిపారు. అమెరికా, ఐరోపా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనా వైరస్ రెండో దశ లాక్డౌన్ ఉండకపోవచ్చని వుడ్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది చివర్లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉండటంతో ట్రంప్ నేతృత్వంలో ప్రభుత్వం మళ్లీ ఆర్థికవ్యవస్థను మూసివేయడానికి మొగ్గుచూపకపోవచ్చన్నారు. రాబోయే త్రైమాసికంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం మార్కెట్లను ప్రభావితం చేయటం ప్రారంభిస్తుందని వుడ్ చెప్పారు. -
మరో 3ఏళ్లలో ఎయిర్టెల్ షేరు రెండింతలు: జెఫ్పరీస్
భారత్ టెలికాం రంగంలో ఆదాయాల వృద్ధితో వచ్చే 3 ఏళ్లలో భారతీ ఎయిర్టెల్ షేరు రెండింతలు పెరిగే అవకాశం ఉందని జెఫ్పరీస్ ఇండియా బ్రోకరేజ్ అంచనా వేసింది. ఈ ఏడాదిలో సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో అన్నింటి కన్నా ఎయిర్టెల్ షేరు అత్యధికంగా 26శాతం ర్యాలీ చేసి టాప్‌గెయినర్‌గా నిలిచింది. టెలికాం రంగంలో రిలయన్స్ జియో ప్రవేశం తర్వాత వైర్లెస్ క్యారియర్‌లో ప్రథమ స్థానాన్ని కోల్పోయింది. అయినప్పటికీ మొత్తం 30 బ్రోకరేజ్ సంస్థల్లో 28 బ్రోకరేజ్ సంస్థలు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడం విశేషం. టెలికాం రంగంలో రెండు కంపెనీల ఆధిపత్యంతో పోటీతత్వం చాలా తక్కువగా ఉంది. దీంతో వచ్చే ఐదేళ్లలో టెలికాం రంగ ఆదాయం రెట్టింపు అయ్యి 38బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. జెఫ్పరీస్ బ్రోకరేజ్ సంస్థ నిపుణులు అక్షత్ అగర్వాల్, ప్రతిక్ చౌదరీలు నివేదికలో తెలిపారు. రిలయన్స్ జియో 2016 లో టెలికాం రంగంలోకి ప్రవేశించింది. ఉచిత కాల్స్, చౌక డేటా ప్లాన్లతో టెలికాం పరిశ్రమను కుదిపేసింది. జియో దెబ్బకు కొన్ని టెలికాం కంపెనీలు విలీనం అయ్యాయి. పోటీకి నిలబడలేక మరికొన్ని కంపెనీలు మూతబడ్డాయి. ఈ కన్సాలిడేట్ ప్రభావంతో అంతర్జాతీయ కార్పోరేట్ దిగ్గజ కంపెనీలు భారత టెలికాం మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. అందులో భాగంగా రిలయన్స్ జియో ఫ్లాట్‌ఫామ్‌లో ఫేస్బుక్ వాటా కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల భారతీ ఎయిర్‌టెల్‌లో అమెజాన్, వోడాఫోన్ ఐడియాలో గూగుల్ పెట్టుబడులు పెట్టేందుకు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. అమెజాన్ వాటాల కొనుగోలు వార్తలను ఎయిర్టెల్ ఖండించింది. వ్యాపార విస్తరణలో భాగంగా అన్ని డిజిటల్, ఓటీటీ సంస్థలతో సాధారణ చర్చలు జరుపుతున్నామని కంపెనీ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. వివిధ దేశాలతో పోలిస్తే భారత్ స్థూల జాతీయోత్పత్తిలో మొబైల్ ఆదాయ నిష్పత్తి తక్కువగా ఉంది. ఇది టెలికాం కంపెనీల యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ పెరిగేందుకు తోడ్పడుతుందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. డిసెంబర్లో టారీఫ్‌లను పెంచినప్పటికీ మార్చి క్వార్టర్లో భారతీ ఎయిర్టెల్, జియోలకు 24 మిలియన్ల స్థూల యూజర్లు పెరిగాయి. అంటే టెలికాం మార్కెట్ అధిక వ్యయాలను భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుందని బ్రోకరేజ్ సూచిస్తుంది. ఈ క్రమంలో జెఫ్పరీస్ భారతీ ఎయిర్ షేరు ఏడాదికి కాలానికి ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించింది. అలాగే టార్గెట్ ధరను రూ.660గా నిర్ణయించింది. -
సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీరేట్లు తగ్గింపు?
ముంబై : సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ కు బ్యాంకులు షాకివ్వనున్నాయి. రుణాల వృద్ధి తగ్గిపోవడంతో సేవింగ్స్ అకౌంట్లపై ఇచ్చే వడ్డీరేట్లను తగ్గించేందుకు బ్యాంకులు ప్లాన్స్ వేస్తున్నాయి. వడ్డీరేట్లు తగ్గించి తమ ప్రీ ప్రొవిజన్ ఆపరేటింగ్ ప్రాఫిట్లను(నిర్దేశించిన కాలవ్యవధిలో ఆర్జించే ఆదాయాలు) పెంచుకోవాలని బ్యాంకులు యోచిస్తున్నట్టు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ జేఫ్ఫెరీస్ చెప్పింది. ప్రస్తుతం చాలా బ్యాంకులు 4 శాతం వడ్డీరేట్లను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ దిగ్గజ బ్యాంకులు అధిక రేటుని అందిస్తున్నాయని జేఫ్ఫెరీస్ పేర్కొంది. జేఫ్ఫెరీస్ రిపోర్టు ప్రకారం 50 బేసిస్ పాయింట్లు సేవింగ్స్ రేట్లపై బ్యాంకులు తగ్గిస్తాయని, దీంతో ప్రీ ప్రొవిజన్ ఆపరేటింగ్ ప్రాఫిట్లను 8 శాతం మెరుగుపరుచుకోనున్నాయని తెలిపింది. రుణాల వృద్ధి తగ్గడం నికర వడ్డీరేట్ల మార్జిన్లకు మంచిది కాదని పేర్కొంది. సెక్టార్ విలువను చాలా మంది ఇన్వెస్టర్లు గమనిస్తుంటారని, బలహీనమైన రాబడుల వృద్ధి సెక్టార్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపనుందని రిపోర్టు నివేదించింది.