jet lag
-
ఇక విమానాల్లో సుఖ ప్రయాణం
న్యూయార్క్: ఒకప్పటితో పోలిస్తే విమాన చార్జీలు తగ్గడమే కాకుండా ప్రమాదాలు కూడా తగ్గాయి. అయినా ప్రయాణికుల ఫిర్యాదులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇరుకైన సీట్లలో సర్దుకోలేక సతమతమవడం, సీటు హ్యాండిల్‌ను తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం ప్రయాణికులు ఒకరి మోచేతులను ఒకరు తోసేసుకోవడం, చంటి పిల్లల ఏడుపులను భరించలేక పోతున్నామంటూ గోల చేయడం తరచు బయటకు వినిపించే ఫిర్యాదులు. విమాన ప్రయాణ బడలికను ప్రయాణికులు అనుభవిస్తారేగానీ పెద్దగా బయటకు మాట్లాడరు. తలనొప్పి రావడం, కళ్లుతిరగడం, కళ్లు మండడం, వాంతివచ్చినట్లవడం, నోరు ఎండిపోవడం, ఊపిరాడకపోవడం, అన్నీ కలిసి భరించలేని అసహనం కలగడం, నిద్రపట్టకపోవడం లాంటి సమస్యలను వైమానిక పరిభాషలో ‘జెట్ ల్యాగ్’ అని పిలుస్తారు. కమర్షియల్ విమానంలో, ముఖ్యంగా దూరప్రాంతాలకు వెళ్లే విమానాల్లో ప్రతి ప్రయాణికుడికి ఇలాంటి సమస్యలు తప్పవు. సముద్రం లేదా నేలకు అత్యంత ఎత్తులో విమానాలు ప్రయాణిస్తాయి కనుక అంత ఎత్తులో ఉండే వాతావరణం ఒత్తిడి కారణంగా ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. 3,800 అడుగులు ఎత్తులో విమానం ప్రయాణిస్తున్నప్పుడు విమానం లోపల 8,000 అడుగుల ఎత్తులో ఉండే ఒత్తిడి ప్రయాణికులపై పడుతుంది. అంటే ఎనిమిదివేల అడుగుల ఎత్తులో ఉన్న బొగోటా, కొలంబియా పర్వతాల్లో లేదా కొలరాడోలోని స్కై రిసార్ట్‌లో ఉండే వాతావరణ పరిస్థితి విమానంలో కూడా ఉంటుంది. తలనొప్పి, ఊపిరి పీల్చుకోవడం లాంటి జెట్ ల్యాగ్ సమస్యలు అక్కడికెళ్లే పర్యాటకులు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. మరి విమానాల్లో ఇలాంటి సమస్యల నుంచి విముక్తి లేదా? ఇలాంటి సమస్యలను కొత్త తరం విమానాలు ఎక్కువ వరకు అధిగమించాయి. ‘బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్, ఎయిర్‌బస్ ఏ 350’ విమానాలు ఆ కోవకు చెందినవే. వీటిలో సీట్లు విశాలంగా సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా 18 గంటలపాటు ఏక బిగినా ప్రయాణించినా ప్రయాణికులకు ‘జెట్ ల్యాగ్’ సమస్యలు పెద్దగా ఎదురుకావు. ఈ విమానాలు 3,800 అడుగుల ఎత్తులో ప్రయాణించినప్పటికీ విమానం లోపల 6000 అడుగుల ఎత్తులో ఉండే వాతావరణ పరిస్థితులే ఉంటాయి. అందుకు కారణం విమానాల నిర్మాణంలో కార్బన్‌తో బలోపేతం చేసిన తేలికైన పటిష్టమైన ప్లాస్టిక్ పరికరాలతోపాటు హైటెక్ మెటీరియల్ ఉపయోగించడమే. ఈ విమానాల్లో కావాల్సిన మేరకు తేమ ఉండడం కూడా మరో విశేషం. గాలిలో తేమను ఉత్పత్తి చేయడానికి ప్రత్యేక పరికరాలేమీ లేవు. ప్రయాణికుల శ్వాస నుంచి ఉత్పన్నమయ్యే తేమనే ఉంటుంది. మామాలు కమర్షియల్ విమానాల్లోనైతే ఈ తేమ వల్ల పరికరాలు పాడవుతాయి. మరమ్మతులు అవసరమవుతాయి. కొత్తతరం విమానాల్లో కార్బన్‌తో తయారు చేసిన ప్లాస్టిక్‌ను ఉపయోగించడం వల్ల తేమ వల్ల ప్రమాదం లేదు. అయితే ఈ కొత్త విమానాలు అన్ని దేశాలకు అందుబాటులోకి రావాలంటే మరో దశాబ్దం పాటు నిరీక్షించాల్సిందే. ఎయిర్‌బస్ ఏ 350 విమానాల కోసం ఇప్పటివరకు ప్రపంచ దేశాలు 810 అర్డర్లను మాత్రమే ఇచ్చాయి. వీటిలో 67 ఆర్డర్లు ఒక్క సింగపూర్ ఎయిర్‌లైన్స్ నుంచి వచ్చినవే. ఇక 787 విమానాల కోసం ప్రపంచ దేశాలు 1200 విమానాల కోసమే ఆర్డర్లు ఇచ్చాయి. -
'జెట్ లాగ్'కు ఫ్లాష్ లైట్ థెరపీ...
సుదీర్ఘ ప్రయాణం అంటే భయం వేస్తోందా? జెట్ లాగ్ సమస్య మిమ్మల్ని వేధిస్తోందా? కొత్త టైమ్ జోన్ లో అలవాటు పడటానికి ఇబ్బందులు పడుతున్నారా? అటువంటి వారికి ఫ్లాష్ లైట్ చికిత్స ఎంతో సహాయ పడుతుందంటున్నారు పరిశీలకులు. ఈ కొత్త టెక్నిక్... టైమ్ జోన్ మారినా నిద్ర లేవడంలో రీఫ్రెష్ ఫీలింగ్ తెస్తుందంటున్నారు. ప్రయాణానికి ముందు నిద్రపోయే సమయంలో ఫ్లాష్ లైట్ థెరపీ చేయడం జెట్ లాగ్ ను అధిగమించేందుకు ఉత్తమ మాగ్గమని చెప్తున్నారు. ప్రయాణానికి ముందు రాత్రి నిద్రించే సమయంలో ఫ్లాష్ లైట్ల వెలుగులో నిద్రిస్తే మంచిదంటున్నారు. ఫ్లాష్ లైట్ థెరపీ శరీరంలో అలవాటు పడ్డ సమయాన్ని సరి చేస్తుందని తాజా పరిశోధనల్లో కనుగొన్నారు. సుదీర్ఘ ప్రయాణం చేయాలనుకునే ముందు కొత్త టైమ్ జోన్ కు అలవాటు పడాలంటే ఫ్లాష్ లైట్ థెరపీతో అధిక ప్రయోజనం ఉంటుందంటున్నారు. కొత్త ప్రదేశానికి వెళ్ళినపుడు శరీరం అక్కడి పరిస్థితులకు, సమయానికి అలవాటు పడేవరకూ జెట్ లాగ్ ఇబ్బంది పెడుతుంటుంది. దీంతో అరుగుదల తగ్గి కడుపులో ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే విషయాలపట్ల ఏకాగ్రత తగ్గడం, అలసటగా ఉండి.. విసుగు చెందడం వంటి అనేక సమస్యలు కూడ వస్తుంటాయి. కొన్ని గంటలపాటు పగటిపూట ప్రకాశవంతమైన లైట్ దగ్గర కూర్చొని లైట్ థెరపీ చికిత్స తీసుకోవడం జెట్ లాగ్ లక్షణాలను తగ్గించేందుకు ఉపయోగకరంగా ఉంటుందని ఇంతకు ముందు తెలిసినదే. అయితే నిద్ర సమయంలో ఫ్లాష్ లైట్ థెరపీ జెట్ లాగ్ సమస్యకు అత్యంత ఉపయోగపడుతుందని నూతన పరిశోధనలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న ఇతర పద్ధతులకన్నా ఈ తాజా పరిశోధనలు తక్కువ సమయంలో జెట్ లాగ్ నుంచి ఉపశమనం కలిగిస్తాయని అమెరికా స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ కు చెందిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ జామీ జెట్జర్ చెప్తున్నారు. కళ్ళు మూసుకొని పడుకొని ఉన్పపుడు రెటీనా పై పడే ఫ్లాష్ లైట్... సంకేతాల ద్వారా... మెదడులోని రోజువారీ వ్యవస్థను సరిచేస్తుందని ఆయన చెప్తున్నారు. రెండువారాల పాటు ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోయి, లేచేట్టు సుమారు 19 నుంచి 39 ఏళ్ళ మధ్య వయస్కులపై పరిశోధనలు జరిపారు. అలాగే నిద్రపోయే సమయంలో ఫ్లాష్ లైట్, లేదా పూర్తిగా లైట్ ను ప్రయోగించి చూశారు. పూర్తిగా ప్రకాశవంతమైన లైట్ కేవలం 36 నిమిషాల తేడాను మాత్రమే చూపించగా... ఫ్లాష్ లైట్ తో ఎక్కువ ప్రయోజనం కలిగినట్లు గుర్తించగలిగారు. అందుకే సుమారు 2000 మైళ్ళకు మించి ప్రయాణం చేయాలనుకున్నవారు ముందురోజు రాత్రి టైమ్ జోన్ మార్పులకు అలవాటు పడేందుకు ఫ్లాష్ లైట్ థెరపీని చేయాలని జెట్జర్ సూచిస్తున్నారు. అంతేకాక ఫ్లాష్ లైట్ వల్ల నిద్ర పట్టదు అన్న అపోహ ఎంతోమందికి ఉంటుందని, అది నిజం కాదని... ఆయన చెప్తున్నారు. ఈ థెరపీ నైట్ షిఫ్ట్ లో పనిచేసే వారికి, లారీ డ్రైవర్లకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధకులు ఓ క్లినికల్ ఇన్వెస్టిగేషన్ జర్నల్ లో ప్రచురించారు. -
ఫ్లైట్ ఎక్కుతున్నారా?
జెట్లాగ్ ఫ్లైట్ జర్నీ వల్ల చాలామంది ‘జెట్లాగ్’ సమస్యతో బాధపడుతుంటారు. ‘జెట్లాగ్’కు అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతారు. ముఖ్యంగా ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు దీనికి ముఖ్యకారణమట. ‘జెట్లాగ్’ వల్ల బీపీలో హెచ్చుతగ్గులు, అజీర్తి, ఆయాసం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుసుకుందాం... ఫ్లైట్ ఎక్కడానికి ముందు... {పయాణానికి వారం రోజుల ముందు నుంచే పోషకాహారం తీసుకోవడం, కెఫీన్‌కు దూరంగా ఉండటం, తగినంత నిద్రపోవడం, వ్యాయామం చేయడం మరచిపోకండి. ఎయిర్ పోర్టుకు వీలైనంత త్వరగా వెళ్లండి. ఫ్లైట్ టైమ్ అయ్యే వరకు ఒకే చోట కూర్చోకుండా అందర్నీ చూస్తూ అటూ ఇటూ తిరగండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. టేకాఫ్‌కు ముందు తాజా పండ్ల రసాలు, వెజిటబుల్ సలాడ్లు తీసుకోండి. వాటితో పాటు డ్రైఫ్రూట్స్ తీసుకోవడం కూడా మంచిది. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు... విమానంలో ఎప్పటికప్పుడు హైడ్రేట్ అవుతూ ఉండటం చాలా ముఖ్యం. టీ, కాఫీ అలవాటు ఉంటే, వాటి బదులు కెఫీన్ లేని హెర్బల్ టీ తాగడం మంచిది. రిలాక్సేషన్ కోసం మంచి సినిమా చూడడం, మ్యూజిక్ వినడం, మంచి పుస్తకం చదవడం లాంటివి చేయండి. నిద్ర వస్తున్నట్టు అనిపిస్తే, వెంటనే ఈ పనులన్నీ మానేసి హాయిగా నిద్రలోకి జారుకోండి. నిద్రాభంగం కలగకుండా ఉండేందుకు ‘డోన్ట్ డిస్టర్బ్’ బోర్డు పక్కనే పెట్టుకోండి. దానివల్ల నిద్రపోతున్నప్పుడు మిమ్మల్నెవరూ అనవసరంగా లేపరు. కళ్లకు మాస్క్, ఇయర్ ప్లగ్స్ పెట్టుకొని, ఫ్రైట్ కుషన్స్పై కొద్దిగా ల్యావెండర్ ఆయిల్ కానీ యూకలిప్టస్ ఆయిల్ కానీ స్ప్రే చేసి పడుకుంటే పూర్తి విశ్రాంతి దొరుకుతుంది. విమానం దిగాక... కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడి టైమ్‌కు అనుగుణంగా మీ వాచ్ టైమింగ్‌ను మార్చేసుకోండి. మన ఇంటి దగ్గర ఇప్పుడెంత టైమ్ అవుతుందో అనే ఆలోచనలు మానుకోండి. మీరు వెళ్లిన చోటుకు, మీరు నివసించిన చోటుకు టైమింగ్స్‌లో వ్యత్యాసం ఉండొచ్చు. కాబట్టి వెళ్లగానే అతిగా నిద్ర పోవడం ఆరోగ్యకరం కాదు. ఒకవేళ తప్పకుండా కునుకు తీయాల్సిందే అనుకుంటే మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య పడుకోవచ్చు. అదీ 20 నిమిషాలు మించకుండా చూసుకునేందుకు అలారం పెట్టుకోండి.