Jewellery bag
-
వీడు మాములోడు కాదు.. 100 రోజులు, 200 విమానాలు కట్ చేస్తే..!
కేటుగాళ్లకే కేటుగాడు.. చోరకళలో మహాముదురు. గత ఏడాది కాలంలో200 విమానాలు ఎక్కి, 100 రోజుల పాటు దేశంలో వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. చేతివాటం చూపించి ఏకంగా లక్షలు కొట్టేశాడు. పోలీసులకు చుక్కలు చూపించాడు. కట్ చేస్తే.. పోలీసుల చేతికి చిక్కి కటకటాల వెనక్కి చేరాడు. అసలు స్టోరీ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.ఢిల్లీలోని పహర్‌గంజ్ ప్రాంతానికి చెందిన రాజేశ్ కపూర్ చోరీలోతనకు తానే తోపు అనుకున్నాడు. మొదట రైళ్లలో చోరీ చేసేవాడు. చాలాకాలానికి అక్కడ దొరికిపోవడంతో ఇక విమానాల్ని ఎంచుకున్నాడు. ఒకదాని తరువాత మరొకటి దర్జాగా లక్షల రూపాయల విలువచేసే బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను కొట్టేసేవాడు. కానీ ఎప్పటికైనా పాపం పండుతుంది అన్నట్టు. మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ పోలీసుల పని అంత ఈజీగా అవ్వలేదు. ఢిల్లీ, హైదరాబాద్, అమృత్సర్ విమానాశ్రయాల్లోని కొన్ని గంటల సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేసిన తర్వాత రాజేష్ కపూర్‌ను పట్టుకున్నట్టు వెల్లడించారు.ఢిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ ఉషా రంగరాణి అందించిన సమాచారం ప్రకారం, లగ్జరీ ప్రయాణికుడిలాగా పోజు కొడుతూ విమానాల్లో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులు ముఖ్యంగా మహిళలు, వృద్ధులును ట్రాప్ చేసి చోరీ చేయడంలో రాజేశ్ ఆరితేరిపోయాడు.కనెక్టింగ్ ఫ్లైట్స్‌లో ప్రయాణించే వారిని టార్గెట్ చేసి చోరీలు చేసేవాడు. ప్రయాణికులతో మాటలు కలిపి వారికి సాయం చేస్తున్నట్టు నటించి నగలు, విలువైన వస్తువులు దోచేసేవాడు. ఏప్రిల్‌లో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ మహిళ ఐజిఐ విమానాశ్రయం నుంచి యూఎస్‌కి కనెక్టింగ్ ఎయిరిండియా విమానంలో ఆమె బ్యాగు నుంచి రూ. 7 లక్షల విలువైన నగలు కొట్టేశాడు. అంతేకాదు అమెరికాకు చెందిన వర్జిందర్‌జిత్ సింగ్ కూడా ఇతని బాధితుడే. అమృత్సర్ నుంచి ఢిల్లీ వచ్చి కనెక్టింగ్ ఫ్లైట్‌లో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళుతున్న వర్జిందర్‌జిత్ సింగ్ క్యాబిన్ బ్యాగ్ నుండి రూ. 20 లక్షల విలువైన వస్తువులు దొంగిలించాడు.మోడస్ ఒపరాండీ అమాయకంగా కనిపించే వృద్ధులు, మహిళా ప్రయాణీకులే ప్రధాన టార్గెట్. వారి బ్యాగేజీ డిక్లరేషన్ స్లిప్‌లోని సమాచారాన్ని దొంగచాటుగా పసిగడతాడు. బోర్డింగ్ గేట్ వద్ద వారితో మాటలు కలుపుతాడు. విమానంలో వారి పక్కకే తన సీటు మార్పించుకుంటాడు. వారి లగేజీ సర్దడానికి సాయం చేస్తున్నట్టు నటించి, సమయం చూసి అక్కడి నుంచి జారుకుంటాడు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు టికెట్ బుకింగ్ సమయంలో అతడు నకిలీ ఫోన్ నంబర్ ఇచ్చాడని పోలీసులు గుర్తించారు.ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, చండీగఢ్, బెంగళూరు, ముంబై, అమృత్సర్ విమానాశ్రయాల్లోని అనేక మంది మహిళా ప్రయాణికుల బ్యాగుల్లోని దొంగిలించిన వస్తువులను కరోల్ బాగ్‌లోని శరద్ జైన్ అనే నగల వ్యాపారికి విక్రయించేవాడట. అంతేకాదు పహర్‌గంజ్‌లోని అతని ఇంటి నుండి పెద్ద మొత్తంలో బంగారం వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.గెస్ట్ హౌస్ ఓనర్న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ఢిల్లీ పహర్గంజ్లో రాజేష్‌కి ‘రికీ డీలక్స్’ అనే గెస్ట్ హౌస్ ఉంది. ఇందులో మూడో అంతస్తులో అతడు నివసిస్తున్నాడు. మనీ క్స్చేంజ్ బిజినెస్‌తో పాటు ఢిల్లీలో మొబైల్ రిపేర్ షాప్ నడుపుతున్నాడు. -
అమెరికాలో దోపిడీకి గురైన భారత సంతతి జంట
అమెరికాలోని కాలిఫోర్నియా పరిధిలోగల ఫుల్లెర్టన్‌లో ఉంటున్న భారత సంతతికి చెందిన డాక్టర్ విజయ్ వాలి, డాక్టర్ జ్యోతిక వాలి దంపతులపై వారి ఇంటి సమీపంలోనే దాడి జరిగింది. ఇద్దరు దుండగులు వారి నుంచి విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ ఉదంతమంతా వారి ఇంటి వద్ద నున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ దోపిడీకి సంబంధించిన వివరాలను వారి కుమార్తె ఫేస్బుక్ పోస్ట్‌లో షేర్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లో.. ఒక ఆగంతకునికి డాక్టర్ విజయ్‌కు మధ్య వాగ్వాదం జరగడం.. అతను డాక్టర్ విజయ్‌ని బలవంతంగా నెట్టడం కనిపిస్తుంది. మీడియాకు అందిన వివరాల ప్రకారం విజయ్, అతని భార్య తమ ఇంటి ప్రాంగణంలోకి వచ్చాక, అతని భార్య జ్యోతిక కారులో నుంచి విలువైన వస్తువులను బయటకు తీశారు. ఇంతలో అక్కడికి వచ్చిన దుండుగుల్లో ఒకడు డాక్టర్ విజయ్‌పై దాడి చేయబోతుండగా, విజయ్ తన భర్యతో ఆ వస్తువులను దాచాలంటూ గట్టిగా అరిచి చెప్పాడు. భర్త మాటలు విన్నంతనే జ్యోతిక తన భర్తకు సహాయం చేయడానికి ప్రయత్నించగా, ఆమెపై కూడా ఆ ఇద్దరు దుండగులు దాడి చేసి, ఆమె వద్ద నుంచి విలువైన వస్తువులను దోచుకున్నారు. తనకు ఎదురైన అనుభవం గురించి జ్యోతిక మీడియాకు తెలియజేస్తూ తాను తన భర్తను కాపాడేందుకు ప్రయత్నిస్తుండగా ఒక ఆగంతకుడు తనపై దాడి చేసి, తన దగ్గరున్న పర్సు లాక్కున్నాడని తెలిపారు. తాను సహాయం కోసం పెద్దగా అరిచానని జ్యోతిక పేర్కొన్నారు. తన తల్లి నుంచి పర్సును లాక్కోవాలని ఓ దొంగ స్పానిష్‌లో తన సహచరుడికి సూచించాడని ఆ దంపతుల కుమార్తె డాక్టర్ ప్రియాంక వలీ ఫేస్బుక్ పోస్ట్‌లో వివరించారు. ఈ దోపిడీకి ముందు దొంగలు 25 కిలోమీటర్ల దూరం వరకు తమ తల్లిదండ్రుల కారును అనుసరించారని ప్రియాంక పేర్కొన్నారు. చోరీకి గురైన వస్తువులలో తమ కుటుంబ వారసత్వ నగలు ఉన్నాయని ఆమె తెలిపారు. వాటిని తమ పూర్వీకుల గుర్తుగా చూసుకుంటున్నామని ప్రియాంక పేర్కొన్నారు. కాగా బాధితుల పిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఫుల్లెర్టన్ పోలీసు అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: గ్రహశకలాలకు ‘గాలం’! -
కూతురు సంసారం చక్కదిద్దాలని.. అందరినీ ఆలయానికి పంపి, తిరిగి వచ్చేసరికి
బనశంకరి: బీరువాలో నిమ్మకాయ పెట్టి నగలు దోచుకెళ్లిన ఉదంతంపై యలహంక పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. అళ్లాలసంద్రకు చెందిన ఇందిరా అనే మహిళ కుమార్తె సంసారంలో గొడవలు వచ్చాయి. కుమార్తె పుట్టింటికి వచ్చింది. దీంతో తన కుమార్తె జీవితాన్ని చక్కదిద్దాలని హొసపేట సురేశ్ పాటిల్‌ను ఇందిరా ఆశ్రయించింది. అమావాస్యరోజున అందరినీ ఆలయానికి పంపి బీరువా తెరిచి రూ.5 లక్షల విలువచేసే బంగారు నగలు దోచుకుని బీరువాలో నిమ్మకాయపెట్టి పారిపోయాడు. దీనిపై కేసు నమోదైంది. చదవండి తప్పతాగి పాఠశాలకు వెళ్లి.. ఛీ, విద్యార్థుల ముందే బట్టలు విప్పి... -
ఎన్నారైను టెన్షన్ పెట్టిన నాలుగు గంటలు
ఢిల్లీ: ఏమరపాటులో చేసే పని.. ఒక్కోసారి తీవ్రపరిణామాలకు దారి తీస్తుంటుంది. తన కూతురి పెళ్లి కోసం నగలతో వచ్చిన ఓ ఎన్నారైకి అలాంటి పరిస్థితే ఎదురైంది. నాలుగు గంటల పాటు పోలీస్ స్టేషన్లో టెన్షన్.. టెన్షన్‌గా గడిపాడు ఆ పెద్దయాన. నిఖిలేష్ సిన్హా(50).. లండన్ నుంచి తన కూతురి వివాహం కోసం వచ్చారు. గ్రేటర్ నోయిడాలో ఓ హోటల్లో బస చేసిన ఆయన.. బుధవారం మధ్యాహ్నం సమయంలో ఊరికి వెళ్లేందుకు లగేజీతో ఓ క్యాబ్ బుక్ చేసుకుని బయల్దేరారు. అయితే.. తీరా గమ్యస్థానం చేరుకున్నాక ఆయన ఓ బ్యాగ్‌ను క్యాబ్‌లోనే మరిచిపోయి వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాతే ఆయన తలపట్టుకున్నారు. ఆ బ్యాగులో సుమారు కోటి రూపాయల విలువ చేసే నగలు ఉన్నాయట. దీంతో ఆలస్యం చేయకుండా ఆయన బిస్రాఖ్ పోలీసులను ఆశ్రయించాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు ఆ క్యాబ్ నిర్వహణ కార్యాలయానికి వెళ్లి.. నాలుగు గంటల్లో ఆ క్యాబ్ ఉన్న లొకేషన్ గుర్తించారు. తీరా.. ఘజియాబాద్ లాల్ కౌన్ వద్ద క్యాబ్‌ను పోలీసులు పట్టుకున్నారు. అయితే.. ఆ పెద్దాయన క్యాబ్‌లో బ్యాగ్ మరిచిపోయిన విషయం తనకు తెలియదని డ్రైవర్ పోలీసులతో చెప్పాడు. దీంతో నేరుగా క్యాబ్, డ్రైవర్‌తో సహా స్టేషన్‌కి చేరుకున్న పోలీసులు.. నిఖిలేష్ ముందే ఆ బ్యాగ్‌ను ఓపెన్ చేసి నగలను అప్పగించారు. పోలీసుల త్వరగతిన స్పందన ఎన్నారై నిఖిలేష్ సంతోషం వ్యక్తం చేసి.. క్యాబ్ డ్రైవర్‌పై పెట్టిన కేసును ఉపసంహరించుకున్నారు. అప్పటికి సమయం రాత్రి ఎనిమిది గంటలు అయ్యింది. ఇదీ చదవండి: మీరు దళితులు.. మీకు ఏం అమ్మం! -
కుటుంబ సభ్యులు గోవాకు.. పెద్ద కుమార్తె ఇంటికే కన్నం
చిలకలగూడ: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడనే నానుడిని తిరగరాశారు చిలకలగూడ పోలీసులు. కన్న ఇంటికే కన్నం వేసి బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేసిన కూతురితోపాటు ఆమెకు సహాయపడిన వ్యక్తిని రిమాండ్‌కు తరలించారు. రూ. 5.50 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. చిలకలగూడ సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. జామై ఉస్మానియా అంబర్‌నగర్‌కు చెందిన ఇఫ్తార్ రాణికి అయిదుగురు కుమార్తెలు. పెద్దకుమార్తె మేరీ అలియాస్ మెహర్‌బేగం ప్రేమ వివాహం చేసుకుని భర్త, పిల్లలతో కలిసి బ్రాహ్మణ బస్తీలో నివసిస్తున్నారు. ఇఫ్తార్‌రాణి తన మనవడి పుట్టినరోజు వేడుకలను గోవాలో ఘనంగా నిర్వహించాలని భావించి కుమార్తెలు, అల్లుళ్లు, వారి పిల్లలను ఆహ్వానించారు. పెద్ద కుమార్తె మేరీ అలియాస్ మెహర్‌బేగం గోవాకు రానని చెప్పడంతో ఇంటికి తాళం వేసి ఇఫ్తార్‌రాణి కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 3న గోవా వెళ్లారు. ఇదే అదనుగా భావించిన పెద్ద కుమార్తె కన్న వారింట్లో చోరీ చేసేందుకు పథకం వేసింది. రామ్‌నగర్‌కు చెందిన ఇబ్రహీముద్దీన్ ఫరూఖీ సహాయంతో ఇంటి తాళాలు పగులగొట్టి 10 తులాల బంగారు, 70 తులాల వెండి ఆభరణాలను చోరీ చేసింది. ఇంటి తలుపు తాళాలు పగులగొట్టి ఉన్నాయనే సమాచారం మేరకు గోవాలో ఉన్న ఇఫ్తార్‌రాణి తన బంధువు బర్ల శ్రీకాంత్‌తో ఈ నెల 5న పోలీసులకు ఫిర్యాదు చేయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫూటేజీలను పరిశీలించి పలు ఆధారాలు సేకరించి పెద్దకుమార్తె మేరీ అలియాస్ మెహర్‌బేగం నిందితురాలిగా గుర్తించారు. నిందితురాలు మెహర్బేగంతో పాటు ఆమెకు సహకరించిన ముషీరాబాద్ హరినగర్, రామ్‌నగర్‌కు చెందిన ఇబ్రహీముద్దీన్ ఫరూఖీను అరెస్ట్ చేసినట్లు సీఐ నరేష్ తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి చోరీ మిస్టరీని చేధించిన చిలకలగూడ సీఐ నరేష్, డీఎస్ఐ సాయికృష్ణ, క్రైం కానిస్టేబుళ్లు ప్రకాశ్, మజర్, వసీ, వినయ్, ఆంజనేయులు, నాగేశ్వరరావును నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్సింగన్వార్, గోపాలపురం ఏసీపీ సుధీర్‌లు అభినందించి ప్రోత్సాహకాలు ప్రకటించారు. -
నగలు మాయమైన కేసులో నిందితుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో ఈనెల 9న బ్యాగ్‌లో నగలు మాయమైన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 143 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. వీటి విలువ దాదాపు కోటి రూపాయలకు పైగానే ఉంటుందని పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు నిరంజన్‌తో పాటు నలుగురిని అదుపులోకి తీసుకోగా, మరొకరు పరారీలో ఉన్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు ఈ నెల 9న జూబ్లీహిల్స్‌లోని ప్రదీప్ వీఎస్ జ్యూవెల్లరి నుంచి బంగారు ఆభరణాలను తీసుకెళ్తుండగా బైక్ కింద పడి జ్యువెలరీ బ్యాగ్ కొట్టుకుపోయింది. దాదాపు మూడు కిలోమీటర్ల వరకు వరదలో కొట్టుకుపోగా అక్కడే ఉన్న గుడిసెల్లో నివసిస్తున్న నిరంజన్‌కి ఈ బ్యాగ్ దొరికింది.ఇదే అదునుగా భావించి బంధువులతో కలిసి నగలతో సహా నాగర్ కర్నూల్‌కు ఉడాయించారు. బ్యాగ్ మాత్రం అక్కడే వదిలిపెట్టారు. దీంతో సెల్‌ఫోన్ సిగ్నల్, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. (దీక్షిత్ హత్య : గొంతు నులిమి చంపాడు ) -
ఆటో డ్రైవర్ నిజాయితీ
చీరాల: పొట్టకూటి కోసం రోజూ ఆటో నడుపుతుం టాడు వేటపాలేనికి చెందిన తుపాకుల నారాయణ. ఎప్పటిలాగే ప్రయాణికులను ఎక్కించుకుని వారిని ఇంటి సమీపంలో వదిలి పెట్డాడు. ప్రయాణికులు దిగిన తర్వాత ఆటోలో చూడగా అందులో నగలుతో కూడిన బ్యాగును గమనించి నేరుగా చీరాల ఒన్‌టౌన్ పోలీసులకు అప్పగించాడు. అప్పటికే బ్యాగు ఆటోలో వదిలి మరచిపోయిన చీరాల హయ్యర్‌పేటకు చెందిన స్టీఫెన్కుమార్ ఒన్‌టౌన్ పోలీసులకు ఫిర్యా దు చేసి ఉన్నాడు. తాను హైదరాబాద్ నుంచి చీరాలలోని తన ఇంటికి వెళ్తుండగా ఆటోలో రూ.7లక్షల విలువైన బంగారు నగలు ఉన్న బ్యాగును ఆటోలో వదలి మరచిపోయినట్లు ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సీఐ సూర్యనారయణ, ఏఎస్ఐ రామబ్రహ్మంలు పట్టణంలోని సీసీ కెమెరాలను పరిశీ లిస్తుండగా ఆటో డైవర్ నారాయణ తనకు ఆటోలో దొరికిన నగల బ్యాగును పోలీసుల సమక్షంలో స్టీఫెన్కుమార్కు అందజేశారు. ఆటో డ్రైవర్ నిజాయితీని పోలీసులు అభినందించారు. -
ఆర్టీసీ కడప డిపోలోనే బంగారు ఆభరణాలు
ఐదు నెలలుగా గోప్యంగా ఉంచిన వైనం కడప అర్బన్ : ఏపీఎస్ఆర్టీసీ కడప డిపోలో ఐదు నెలలుగా ఓ ప్రయాణికునికి చెందిన దాదాపు 72 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.....కడప నుంచి అనంతపురం వెళ్లి వచ్చిన ఓ ఆర్టీసీ బస్సులో గుర్తు తెలియని వ్యక్తి సూట్‌కేస్‌ను మరిచిపోయాడు. ఆ సూట్‌కేసును బస్సు డ్రైవర్, కండక్టర్ డిపో అధికారులకు అప్పగించారు. ఈ సూట్‌కేసులో ఉన్న దుస్తులను, సూట్‌కేసును నెలరోజులు గడిచిన తర్వాత నిబంధనల మేరకు వేలం వేశారు. విలువైన బంగారు ఆభరణాలను మాత్రం సీజ్ చేసి తమ వద్దనే భద్రపరిచారు. సంఘటన జరిగిన రోజుగానీ, మరుసటిరోజుగానీ సూట్‌కేస్, ఆభరణాల గురించి పోలీసులకుగానీ, పత్రికలకుగానీ తెలుపకుండా గోప్యంగా ఉంచడం పలు ఆరోపణలకు తావిస్తోంది. ఈ విషయంపై విలేకరులు డిపో మేనేజర్ గిరిధర్‌రెడ్డిని వివరణ కోరగా బస్సుల్లో ఎవరైనా ప్రయాణికులు వస్తువులను పోగొట్టుకుంటే నెల రోజులపాటు అందుబాటులో ఉంచుతామన్నారు. తర్వాత వాటిని వేలం వేస్తామన్నారు. బంగారు వస్తువులకు సంబంధించి కమిటీ ద్వారా తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. -
బంగారు ఆభరణాల బ్యాగు మాయం
హైదరాబాద్ : నగరంలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన వ్యక్తి బంగారు ఆభరణాల బ్యాగు పోగొట్టుకున్నాడు. దీనిపై చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన నగేష్‌బాబు (48) నగరంలో సోమవారం ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చాడు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావన్ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. ఆటోలో లాడ్జి నుంచి సికింద్రాబాద్‌కు వెళుతున్న అతడు వెంట తెచ్చుకున్న 25 తులాల బంగారు ఆభరణాల బ్యాగు కనిపించకపోయేసరికి కంగారుతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.