jewellery dealer
-
ఘన్‌శ్యాందాస్ జువెల్స్ ఆస్తుల అటాచ్
సాక్షి, హైదరాబాద్: తప్పుడు బ్యాంకు గ్యారంటీ పత్రాలు, నకిలీ బ్యాంకు లేఖలతో బ్యాంకులో బం గారాన్ని కుదవపెట్టి రూ.90 కోట్ల రుణాన్ని దుర్వినియోగం చేసిన ఘన్‌శ్యాందాస్ జెమ్స్ అండ్ జువెల్స్ మేనేజింగ్ పార్టనర్ సంజయ్ అగర్వాల్ ఆస్తులపై ప్రొవిజనల్ అటాచ్మెంట్ చేస్తూ ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నాంపల్లి సెషన్స్ కోర్టులో మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 కింద ప్రాసిక్యూషన్ ఫిర్యాదు కూడా చేసింది. ఎస్బీఐలో ఉన్న 250 కిలోల బంగారాన్ని విడిపించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన తప్పుడు బ్యాంకు గ్యారంటీ పత్రాలను బెంగళూరుకు చెందిన ఘన్‌శ్యాందాస్ జెమ్స్ అండ్ జువెల్స్ భాగస్వాములు సమర్పించారు. దీనిపై సీబీఐ 2011 అక్టోబర్‌లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. సొమ్మును దారి మళ్లించి.. తమ మోసం వెలుగు చూడటంతో సంజయ్, అతని సోదరులు అజయ్‌కుమార్, వినయ్‌కుమార్.. అబిడ్స్‌లోని తమ దుకాణంలో ఉన్న బంగారు నిల్వలను స్థానిక మార్కెట్లో విక్రయించి నగదు రూపంలో సొమ్ము చేసుకున్నారు. ఈ నగదుతో 2012లో సంజయ్ తన భార్య పేరిట కొత్త సంస్థను ఏర్పాటు చేయడంతో పాటు తన సోదరులు, ఓ ఉద్యోగి పేరుపైనా మరో 3 సంస్థలను తెరిచారు. కుటుంబీకుల పేరు మీద అనేక ఖాతాలను తెరిచి లెక్కచూపని నగదుతో లావాదేవీలు నిర్వహించడంతో పాటు శ్రీకాంత్ గుప్తా అనే నకిలీ పేరుతో పాస్‌పోర్టును పొంది అనేకసార్లు విదేశాల్లో పర్యటించాడు. అక్కడా బ్యాంకు ఖాతాలు తెరిచి అక్రమ సొమ్మును దారి మళ్లించి తన వద్ద పనిచేసే ఉద్యోగి అవినాశ్ సోని పేరిట బినామీ ఆస్తులను కూడబెట్టాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 11న సంజయ్‌ను అరెస్టు చేసిన ఈడీ అతనితో పాటు అతని కుటుంబీకులకు సంబంధించిన రూ.9.5 కోట్ల విలువ చేసే 9 స్థిరాస్థులను అటాచ్ చేస్తూ ఈ నెల 11న ఉత్తర్వులు జారీ చేసింది. తెల్లాపూర్, శంషాబాద్‌లోని వ్యవసాయ భూమి, రాయదుర్గంలో ప్లాటు, కొంపల్లిలో విల్లా, జూబ్లిహిల్స్‌లో వేయి చదరపు గజాల భూమి ఈ జాబితాలో ఉన్నాయి. -
నగల షాపు యజమానిపై దాడి.. రూ.7.50 లక్షలు చోరి
టీ.నగర్: చెన్నై పెరియమేడులోని ఓ నగల దుకాణం యజమానిపై దాడిచేసి 35 సవర్ల బంగారు నగలు, రూ.7.50 లక్షల నగదు దోచుకున్న ఇద్దరు వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టాళంకు చెందిన సురాజ్ సావుకార్పేటలో జ్యువెలరీ షాపు నడుపుతున్నారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో అతను షాపుకు తాళం వేసి రూ.7.50 లక్షల నగదు, 35 సవర్ల బంగారు నగలతో మోటర్ బైక్‌లో ఇంటికి బయలుదేరాడు. అల్లికుళం కోర్టు సమీపాన పెరియమేడు పోలీసు స్టేషన్ వెనుక వెళ్తుండగా మరో బైక్ పై వెంబడించిన ఇద్దరు యువకులు సురాజ్‌ను కర్రలతో కొట్టి నగలు, నగదు బ్యాగ్‌తో ఉడాయించారు. సురాజ్ పెరియమేడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దంపతుల దారుణ హత్య – ఆస్తి తగాదాలో యువకుల దారుణం టీ.నగర్: ఆస్తి తగాదాలో దంపతులు దారుణహత్యకు గురయ్యారు. కృష్ణగిరి వీరప్పన్‌నగర్‌కు చెందిన పుహలేంది (55). కార్పెంటర్. ఇతని భార్య పప్పీరాణి (45). పుహలేందికి, అతని అన్న ఇలంగోవన్‌కు మధ్య ఆస్తి తగాదా ఉంది. గురువారం ఇలంగోవన్ కుమారుడు లోకేష్ (18), అతని స్నేహితుడు సతీష్ (18) పుహలేంది ఇంటికి వెళ్లి అతనితో తగాదా పడి కత్తులతో దాడి చేశారు. అడ్డుకోబోయిన భార్య పప్పీరాణి కూడా కత్తిపోట్లకు గురయ్యారు. దీంతో దంపతులు ఇద్దరూ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పుహలేందికి మద్దతుగా మాట్లాడిన పక్కింటి వ్యక్తి కరికాలన్, అతని భార్య సరసుకు కత్తిపోట్లకు గురై.. గాయపడ్డారు. యువకుడి హత్య: తిరునల్వేలి కోర్టు ఎదుట బుధవారం రాత్రి ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. తూత్తుకుడి రోడ్డులో కోర్టు ఎదురుగానున్న మైదానంలో యువకుడి మృతదేహం ఉన్నట్లు పాళయంకోట్టై పోలీసులకు గురువారం సమాచారం అందింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసన్ ఆధ్వర్యంలోని బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. ప్రాథమిక విచారణలో హతుడు పాళయంకోట్టై మనకావలంపిళ్లై నగర్‌కు చెందిన బాలమురుగన్ కుమారుడు మహారాజ (25)గా గుర్తించారు. -
10 కోట్ల నగదు, 6 కేజీల బంగారం
చెన్నై: చెన్నైలో మరోసారి భారీఎత్తున నగదు, బంగారం పట్టుబడ్డాయి. ఐటీ అధికారులు మంగళవారం నిర్వహించినదాడులో సుమారు 10కోట్ల పాత కరెన్సీ నోట్లను, 6 కేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక ఆభరణాల వ్యాపారి నుంచి వ ఆదాయ పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు కాగా నల్లధనం కబేరులు, హవాలా ఆపరేటర్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న దాడుల్లో ఐటీ శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారీ ఎత్తున పాత , కొత్త కరెన్సీ నోట్లను కిలోల కొద్దీ బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా సూరత్ కు కందిన కిషో భజియావాలా కుచెందిన లెక్కల్లో చూపని ఇప్పటివరకు చూపనిఆదాయం రూ 650 కోట్లకు చేరింది. మరోవైపు డిమానటైజేషన్ నేపథ్యంలో బ్యాంకుల్లో అక్రమ డిపాజిట్లను నిరోధించే లక్ష్యంగా ప్రభుత్వం రూ.5వేలకు పైన డిపాజిట్లన ఒకసారికి మాత్రమే పరిమితం చేసిన తెలిసిందే.