ప్రతీకాత్మక చిత్రం
టీ.నగర్: చెన్నై పెరియమేడులోని ఓ నగల దుకాణం యజమానిపై దాడిచేసి 35 సవర్ల బంగారు నగలు, రూ.7.50 లక్షల నగదు దోచుకున్న ఇద్దరు వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టాళంకు చెందిన సురాజ్ సావుకార్‌పేటలో జ్యువెలరీ షాపు నడుపుతున్నారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో అతను షాపుకు తాళం వేసి రూ.7.50 లక్షల నగదు, 35 సవర్ల బంగారు నగలతో మోటర్ బైక్‌లో ఇంటికి బయలుదేరాడు. అల్లికుళం కోర్టు సమీపాన పెరియమేడు పోలీసు స్టేషన్ వెనుక వెళ్తుండగా మరో బైక్ పై వెంబడించిన ఇద్దరు యువకులు సురాజ్‌ను కర్రలతో కొట్టి నగలు, నగదు బ్యాగ్‌తో ఉడాయించారు. సురాజ్ పెరియమేడు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దంపతుల దారుణ హత్య
– ఆస్తి తగాదాలో యువకుల దారుణం
టీ.నగర్: ఆస్తి తగాదాలో దంపతులు దారుణహత్యకు గురయ్యారు. కృష్ణగిరి వీరప్పన్‌నగర్‌కు చెందిన పుహలేంది (55). కార్పెంటర్. ఇతని భార్య పప్పీరాణి (45). పుహలేందికి, అతని అన్న ఇలంగోవన్‌కు మధ్య ఆస్తి తగాదా ఉంది. గురువారం ఇలంగోవన్ కుమారుడు లోకేష్ (18), అతని స్నేహితుడు సతీష్ (18) పుహలేంది ఇంటికి వెళ్లి అతనితో తగాదా పడి కత్తులతో దాడి చేశారు. అడ్డుకోబోయిన భార్య పప్పీరాణి కూడా కత్తిపోట్లకు గురయ్యారు. దీంతో దంపతులు ఇద్దరూ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పుహలేందికి మద్దతుగా మాట్లాడిన పక్కింటి వ్యక్తి కరికాలన్, అతని భార్య సరసుకు కత్తిపోట్లకు గురై.. గాయపడ్డారు.
యువకుడి హత్య:
తిరునల్వేలి కోర్టు ఎదుట బుధవారం రాత్రి ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. తూత్తుకుడి రోడ్డులో కోర్టు ఎదురుగానున్న మైదానంలో యువకుడి మృతదేహం ఉన్నట్లు పాళయంకోట్టై పోలీసులకు గురువారం సమాచారం అందింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసన్ ఆధ్వర్యంలోని బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. ప్రాథమిక విచారణలో హతుడు పాళయంకోట్టై మనకావలంపిళ్‌లై నగర్‌కు చెందిన బాలమురుగన్ కుమారుడు మహారాజ (25)గా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment