Jhansi Lakshmi
-
అవ్వాతాతల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది
-
సీఎం జగన్ కి నేను ఇవ్వబోయే గిఫ్ట్ : ఝాన్సీ లక్ష్మి
-
ఆంధ్రను గెలిపించిన ఝాన్సీ
సాక్షి, గుంటూరు: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న సీహెచ్ ఝాన్సీ లక్ష్మి బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే లీగ్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు శుభారంభం చేయడంలో కీలకపాత్ర పోషించింది. తొలుత బౌలింగ్‌లో 31 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన ఝాన్సీ లక్ష్మి ఆ తర్వాత బ్యాటింగ్‌లో సరిగ్గా 100 పరుగులు చేసి సెంచరీ సాధించింది. స్థానిక జేకేసీ కాలేజీ మైదానంలో పంజాబ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత పంజాబ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 174 పరుగులు చేసింది. కెప్టెన్ తానియా భాటియా (108 బంతుల్లో 66; 8 ఫోర్లు), పర్వీన్ ఖాన్ (105 బంతుల్లో 43; 4 ఫోర్లు) రాణించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 98 పరుగులు జత చేశారు. ఐదు పరుగుల తేడాలో తానియా, పర్వీన్‌లను ఔట్ చేసిన ఝాన్సీ లక్ష్మి పంజాబ్‌ను కట్టడి చేసింది. ఝాన్సీ లక్ష్మితోపాటు బౌలింగ్‌లో అంజలి శర్వాణి (2/33), పుష్పలత (2/20) కూడా ఆకట్టుకున్నారు. 175 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర 46.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి అధిగమించింది. ఓపెనర్ అనూష (22; 2 ఫోర్లు)తో కలిసి ఝాన్సీ లక్ష్మి (125 బంతుల్లో 100; 13 ఫోర్లు) తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించింది. 164 పరుగులవద్ద నాలుగో వికెట్ రూపంలో ఝాన్సీ లక్ష్మి ఔటైనా మిగతా పనిని హిమబిందు (4 నాటౌట్), పుష్పలత (10 నాటౌట్) పూర్తి చేశారు. పూనమ్ యాదవ్ 10–6–8–6 మూలపాడులో గోవాతో జరిగిన మ్యాచ్‌లో రైల్వేస్ 172 పరుగులతో ఘనవిజయం సాధించింది. రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత స్టార్ క్రికెటర్లు పూనమ్ రౌత్ (104; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిథాలీ రాజ్ (62; 6 ఫోర్లు) ధాటిగా ఆడటంతో తొలుత రైల్వేస్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసింది. అనంతరం గోవా 44.1 ఓవర్లలో 72 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ 10 ఓవర్లలో 6 మెయిడిన్లు వేసి కేవలం 8 పరుగులిచ్చి 6 వికెట్లు తీయడం విశేషం. చత్తీస్‌గఢ్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో మహారాష్ట్ర ఐదు వికెట్లతో నెగ్గింది. -
మహిళా మేలుకో..
రాయచోటి రూరల్ : ఈమె పేరు ఝాన్సీ లక్ష్మీ. రాయచోటి పురపాలక సంఘం కార్యాలయంలో జనన,మరణ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేతత్వం ఆమెది. అందుకోసం జిల్లా కేంద్రంలోని చైతన్య మహిళా సంఘంలో 16 ఏళ్ల క్రితం చేరింది. వరకట్న వేధింపులకు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా పోరాడుతోంది. మార్చి 8వ తేది మహిళా దినోత్సవం పురస్కరించుకుని సాక్షి ఆమెతో మాట్లాడింది. నేటి సమాజంలో మహిళ చేస్తున్న పోరాటాలు, ఎదురవుతున్న అడ్డంకులపై తీవ్రంగా స్పందించారు.మాటలకే పరమితమైన ప్రభుత్వాలపై పోరాడాలని, హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రశ్న : మార్చి 8న మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు ? ఝాన్సీ : 1910లో యూరప్‌లో మహిళల పని గంటలను తగ్గించాలంటూ చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకం. ఆ పోరాటంలో ఎంతో మంది మహిళలు ప్రాణాలు కూడా కోల్పోయారు. 1910 మార్చి 8వ తేదిన క్లారాజెట్కిన్ అనే ఉద్యమ నాయకురాలు అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపు నిచ్చింది. అప్పటి నుంచి పలు దేశాల్లో మార్చి 8న మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోంది. ప్రశ్న : నేటి సమాజంలో మహిళలు ఎటువంటి సమస్యలు ఎదుర్కుంటున్నారు ? ఝాన్సీ :పాఠశాల బాలిక నుంచి కళాశాలల విద్యార్థినుల వరకు, ఉద్యోగాలకు వెళ్లే మహిళలు ప్రతి నిత్యం ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కుంటున్నారు. ప్రేమించిన అమ్మాయి నాకే దక్కాలని, మోజు పడిన మహిళ తన సొంతం కావాలంటూ పలువురు ఆకతాయిలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బరితెగించి అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం . ప్రశ్న : ఆకతాయిలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారా ? ఝాన్సీ :ఎక్కడ తీసుకుంటున్నారు.. వాకపల్లి సంఘటనలో 11 మంది ఆదివాసీ మహిళలపై 21 మంది గ్రేహౌండ్స్ పోలీసులు అత్యాచారం చేస్తే, వారికి న్యాయం చేయాలని ఉద్యమాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అయేషా హత్యలో ఒక కాంగ్రెస్ నాయకుడి బంధువు హస్తం ఉందని తెలిసి చట్టం కూడా మూగబోయింది . స్త్రీకి అన్ని విషయాల్లో సమానత్వం ఉండాలని నాయకులు సమావేశాల్లో చెబుతుంటారు. అయితే అవి మాటలకే పరిమితం అవుతున్నాయి. కొన్ని సంధర్బాల్లో అధికారాల్లో ఉన్న పెద్దలు సైతం మహిⶠలను అగౌరవ పరస్తూ మాట్లాడుతున్నారు. ఇటువంటి వారు మహిళలకు ఏం న్యాయం చేస్తారు . ప్రశ్న : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాలపై మీరేమంటారు ? ఝాన్సీ :ప్రస్తుతం విస్తారంగా ఉన్న సోషల్ మీడియాలో కూడా బాలికలను, మహిళలను కించ పరిచే విధంగా వీడియోలు, ఫొటోలు ఉంటున్నాయి. దీని వల్ల కూడా యువత పక్కదారి పట్టేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. మహిళలపై, ముఖ్యంగా విద్యార్థినులపై దాడులకు పాల్పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రశ్న : మహిళలకు మీరిచ్చే సందేశం ? ఝాన్సీ :మహిళలు వంటింటికే పరిమితం కాకూడదు . తీవ్ర అన్యాయం చేస్తున్న ప్రభుత్వాలపై పోరాడాలి . హక్కుల కోసం, స్వేచ్ఛ సమానత్వం, సోషలిజం కోసం పోరాడి సాధించుకున్న శ్రామిక మహిళా పోరాటం స్పూర్తిగా తీసుకుని అన్ని రంగాల్లో స్త్రీ ముందుండాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఒక బలమైన మహిళా ఉద్యమాన్ని నిర్మించాలి. ఆకాశంలో సగం మనం ... పోరాటం చేద్దాం . ప్రశ్న : విద్యార్థినుల ఆత్మహత్యలకు కారణాలు ఏంటి ? ఝాన్సీ : దేశ వ్యాప్తంగా ..ముఖ్యంగా రాష్ట్రంలోని పలు కళాశాలల్లో, మన జిల్లాలోని చైతన్య , నారాయణ కళాశాలల విద్యార్థినులు కూడా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కళాశాలల యాజమాన్యంతో పాటు తల్లిదండ్రులు చదువుకోవాంటూ ఎక్కువ ఒత్తిడి తీసుకురావడం ఒక కారణం. విద్యార్థినులపై ఈవ్‌టీజింగ్‌తో పాటు లైంగిక వేధింపులు కూడా మరో కారణంగా తెలుస్తోంది. దీని వెనుక అసలు విషయాలు ఏం ఉన్నాయో విచారించి ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. దీంతో పాటు ప్రభుత్వానికి కొమ్ము కాచే ఆయా కళాశాలలపై చర్యలు తీసుకోరు. -
ఇలాంటి పుస్తకాలు మరిన్ని రావాలి
– విజయనిర్మల ‘‘తేనె మనసులు’ సినిమాతో నా కెరీర్ స్టార్టయ్యింది. ‘అగ్ని పరీక్ష’ సినిమా సూపర్‌హిట్ అయిన సందర్భంలో అనుకోని కారణాల వల్ల ఝాన్సీ పెళ్లికి వెళ్లలేకపోయాను. నా 75 సంవత్సరాల జీవితాన్ని పుస్తకరూపంలో తీసుకురావడం ఆనందంగా ఉంది. ‘నెంబర్‌వన్’ వంటి హిట్ చిత్రాన్ని నాకు అందించిన కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డికి థ్యాంక్స్’’ అని సూపర్ స్టార్ కృష్ణ అన్నారు. కృష్ణ వీరాభిమాని ఝాన్సీ లక్ష్మీ కుమారులు రవికృష్ణ, రామకృష్ణ.. కృష్ణ 75 సంవత్సరాల జీవిత విశేషాలతో ఒక పుస్తకం రూపొందించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం కృష్ణ, విజయనిర్మల స్వగృహంలో జరిగింది. తొలి సంచికను ఎస్వీ కృష్ణారెడ్డి ఆవిష్కరించి కృష్ణకు అందించారు. ‘‘ఇలాంటి పుస్తకాలు సంవత్సరానికి ఒకటి రావాలి. ఝాన్సీలక్ష్మీ తన అభిమానాన్ని చాటుకుంటూ గొప్ప పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయం. ఝాన్సీ లక్ష్మీ తన పిల్లలకు, మనవరాలికి కృష్ణగారి పేరు వచ్చేలా పెట్టుకోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు విజయ నిర్మల. ‘‘నా అభిమాన హీరో కృష్ణగారి 75 సంవత్సరాల జన్మదిన సంచిక పుస్తకాన్ని నా కుమారులు రూపొందించడం నా అదృష్టం’’ అన్నారు ఝాన్సీ లక్ష్మీ. ఈ కార్యక్రమంలో అచ్చిరెడ్డి, బాజ్జీ తదితరులు పాల్గొన్నారు. -
అధికారులకు బదిలీల ఫోబియా...
అనివార్యమే... అయినా అనువైన చోటుకోసం యత్నం ఎన్నికలయ్యాక మళ్లీ వచ్చేందుకు ముందస్తు ఒప్పందం! మూణాళ్ల ముచ్చటగా జెడ్పీ సీఈవో పోస్టు సాక్షి, మచిలీపట్నం : ఎన్నికల నేపథ్యంలో కొందరు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ అనివార్యమైంది. ఇదే సమయంలో జిల్లాను వదిలి వెళ్లలేక.. నిబంధనలను కాదని ఇక్కడే ఉండలేక వారు మధనపడుతున్నారు. గత్యంతరంలేని స్థితిలో ఎన్నికల తంతు ముగిశాక మళ్లీ జిల్లాకు వద్దామనుకునే లోపాయికారీ ఒప్పందాలతో వారు బదిలీకి సిద్ధపడుతున్నారు. ఇదే సమయంలో తమకు పొరుగు జిల్లాల్లోనూ పదిలమైన చోటు కోసం అన్వేషణ మొదలెట్టారు. ఎన్నికల బదిలీని తమకు అనుకూలమైన ప్రాంతానికి చేసుకునేలా రాజధాని స్థాయిలో కొందరు అధికారులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన ఏఎస్వో పద్మ బదిలీని నిలుపుదల చేసేందుకు ఒక కీలక అధికారి పట్టుబడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. అనేక వివాదాల నడుమ జెడ్పీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన సుబ్బారావు పరిస్థితి మూణ్ణాళ్ల ముచ్చటగానే మారిపోవడం గమనార్హం. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల నేపథ్యంలో జిల్లాలో మూడేళ్లు నిండిన ఉద్యోగులు, సొంత జిల్లా ఉద్యోగులకు బదిలీ తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఎంపీడీవో, తహ శీల్దార్, పోలీసుల బదిలీల ప్రక్రియను ఫిబ్రవరి 10వ తేదీలోగా పూర్తిచేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దీంతో ఇప్పటికే జిల్లాలో ఎన్నికల బదిలీలకు తెరలేచింది. కాగా, జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులుగా పనిచేస్తున్న కీలక అధికారులకు బదిలీ తప్పనిసరి అయ్యింది. దీంతో నందిగామ, మైలవరం, అవనిగడ్డ, తిరువూరు, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులుగా పనిచేస్తున్న డీఆర్డీఏ పీడీ కె.శివశంకర్, జడ్పీ సీఈవో బి.సుబ్బారావు, ఉడా భూసేకరణ విభాగాధికారిణి మనోరమా, పోలవరం ప్రొజెక్టు స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ఝాన్సీలక్ష్మి, డీఆర్డీఏ ఏపీడీ విజయకుమారిని బదిలీ చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. వీరంతా మూడున్నరేళ్లకుపైగా ఇక్కడే ఉండటం, అందులోనూ అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిండంతో బదిలీ అనివార్యమైంది. దీంతో పొరుగున్న ఉన్న పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో తమకు అనుకూలమైన చోటు కోసం వారి స్థాయిల్లో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కుర్చీలాటలో సుబ్బారావు గెలిచినా.... జెడ్పీలో జరిగిన కూర్చీలాటలో గెలిచి సీఈవో కుర్చీని అధిరోహించిన బి.సుబ్బారావు మూడు నెలలు తిరగకుండానే బదిలీకావడం చర్చనీయాంశమైంది. అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో గతంలో నూజివీడు ఆర్డీవోగా పనిచేసిన సుబ్బారావు గత ఏడాది నవంబర్ 19న జెడ్పీ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. అప్పటికే జెడ్పీ సీఈవో, డెప్యూటీ సీఈవో పోస్టుల భర్తీ నిబందనలకు విరుద్దంగా జరిగిందని ఇద్దరు ఉద్యోగులు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించిన సంగతి తెల్సిందే. సుబ్బారావు నియామకం చెల్లదని ట్రిబ్యూనల్ తీర్పు వస్తుందని ప్రతివాదులు ఎదురుచూస్తున్న తరుణంలో ఆయన ఇలా బదిలీ అయ్యారు. సీఈవోగా మూడు నెలల వ్యవధిలోనే ఆయనపై ఇలా బదిలీవేటు పడటంతో కుర్చీలాటలో గెలిచినా ఓడినట్టే అయ్యింది. పద్మ బదిలీ కాకుండా కీలక అధికారి ప్రయత్నాలు... జిల్లాలోని సివిల్ సప్లైస్ విభాగంలో పనిచేస్తున్న ఒక అధికారిణి బదిలీ చర్చనీయాంశమైంది. విజయవాడలో ఏఎస్వో-1(రూరల్)గా పనిచేస్తున్న కోమలి పద్మ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా పనిచేశారు. దీంతో ఆమెకు బదిలీ అనివార్యమని అధికారులు నిర్ధారించారు. ఇదే సమయంలో ఆమె బదిలీని నిలుపుదల చేసేందుకు కుటుంబ సన్నిహితుడు, కీలక అధికారి ఉన్నతస్థాయిలో వత్తిడి తెచ్చినట్టు సమాచారం. కోమలి పద్మకు శ్రీకాకుళం జిల్లాకు బదిలీ అయినట్టు చెబుతున్నారు. ఆ బదిలీని నిలుపుదల చేసేలా ఉన్నతస్థాయి ప్రయత్నాలు ఊపందుకున్నాయి.